Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, May 21, 2017

ఈనాటి సమాజములో మానవత్వము ఇంకా బ్రతికేఉంది - 4

Posted by tyagaraju on 5:38 AM
Image result for images of shirdi saibaba 3d












Image result for images of rose hd














ఈనాటి సమాజములో

మానవత్వము ఇంకా బ్రతికేఉంది

(శ్రీసాయిబానిస నిజ జీవితములోని అనుభవాలు)

సేకరణ : ఆత్రేయపురపు త్యాగరాజు



4.  తల్లిడండ్రుల ఆకలిబాధ తీర్చటానికి ఆరాటపడుతున్న
     కన్నెపిల్ల దీనగాధ

సంఘటన 1992.సంవత్సరం ఆగస్టు నెలలో జరిగిందితారీకు గుర్తు లేదుసాయంత్రం మోండా మార్కెట్ వీధిలో ఉన్న శ్రీసాయి మందిరంలో హారతి పూర్తి చేసుకొని సికిందరాబాద్ స్టేషన్ చేరడానికి క్లాక్ టవర్ పార్కు దగ్గరకు వచ్చి కొంతసేపు విశ్రాంతి కోసం అక్కడి బెంచీమీద కూర్చొన్నాను.  


సమయంలో ఓబాలిక (వయస్సు సుమారు 15 సంవత్సరాలు ఉంటుంది) వచ్చి నాప్రక్కన కూర్చుందినేను ఆమెను ఎక్కడ చదువుతున్నావు అని అడిగానుఆమె కొంతసేపు తర్వాత నాతో మాట్లాడుతు తాను 5.తరగతి వరకు చదివి మానేసానని చెప్పిందిఆమెది తూర్పుగోదావరి జిల్లా అని తన తండ్రి రిక్షా తొక్కుతాడని తన తల్లి కూలిపని చేసుకొంటుంది అని చెప్పిందితాను తన తల్లిదండ్రుల ఆదేశానుసారం హైదరాబాద్ లోని తమ బంధువుల ఇంటికి చేరుకొన్నానని చెప్పిందిఒక్క 500 రూపాయలు ఇస్తే తాను నాతో రాత్రి అంతా గడుపుతానని చెప్పిందిఅప్పుడు అర్ధమైంది ఆబాలిక ఎంత పొరబాటు చేస్తున్నదిసాయిమందిరంలో హారతి పూర్తి చేసుకొని ఈపార్కుకు చేరుకొంటే ఇక్కడ ఈసమస్య ఎదురవటం నాకు బాధ కలిగించినా అధైర్యపడకుండా ఆమెతో మాట్లాడుతూ ఆమె ఎంచుకొన్న మార్గము తప్పు అని ఆమెకు నచ్చ చెప్పాను

         

నేను ఆమెకు ఇటువంటి మార్గములో ప్రయాణం చేసిన ఆరోగ్యము నశించి ఎయిడ్స్ వ్యాధిపాలు అవుతావు జాగ్రత్త అని హెచ్చరించానునామాటలకు ఆమె మనసు గాయపడి ఉండవచ్చుఆమె కన్నీరు పెట్టుకుంది. ఏమి చేయాలి అని ఆలోచిస్తూ తిరిగి కాకినాడకు రైలులో వెళ్ళిపోయి తన తల్లితో కలసి కూలి పని చేసుకొంటూ సంతోషముగా గడపమని చెప్పి టిక్కెట్టు నిమిత్తం 200 రూపాయలు ఆమెకు ఇచ్చానుఆమె సిగ్గుపడుతూ ఆడబ్బు తీసుకొని తన తల్లితో కూలిపని చేసుకొని బ్రతుకుతాను అని మాట ఇచ్చింది సమయంలో ఆమె కళ్ళలో ఆశాజ్యోతిని చూసానునేను చేసింది తప్పా లేక సరిఅయినదా నాకు తెలీదు సమయంలో ఆమె పతనం కాకూడదు అనే భావనతో నేను అలాగ చేసాను అనే తృప్తి మిగిలిందిఆమె నాకు నమస్కరించి వెళ్ళిపోయిందినేను నాఇంటికి చేరుకొన్నానునేను మానవతా దృష్టితో ఈపని చేసానుమానవతాదేవత యొక్క ఆశీర్వచనాలు నాపై ఉంటాయి అనే భావనతో తృప్తిగా నిద్రపోయాను.

ఈనాటికీ నేను ఈసంఘటన గుర్తు చేసుకొన్నప్పుడు నాకు శ్రీసాయి సత్ చరిత్రలో 49.అధ్యాయములోని నానాసాహెబ్ చందోర్కర్ కు జరిగిన సంఘటన గుర్తు చేసుకొంటాను.

ఒక భక్తుడు సకుటుంబముగా ద్వారకామాయికి వచ్చి బాబాదర్శనము చేసుకొన్నాడుఆసమయంలో నానా సాహెబ్ చందోర్కర్ బాబా ప్రక్కనే కూర్చొని ఉన్నాడు.

ఆవచ్చిన కుటుంబములోని ఒక స్త్రీ బాబా ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఒక్క క్షణం తన మేలిముసుగును తీసిందిఅధ్భుతమైన ఆమె సౌందర్యానికి నానాసాహెబ్ కు మనసు చలించి అతని మనసులో ఆమెను మరలా మరలా చూడాలనే కోరిక జనించింది.  


అపుడు బాబా తన సటకాతో నానాను మెల్లగా తట్టి అందం భగవంతుని సృష్టిమనసులో ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా కళ్ళతో చూసి ఆనందించవలసినదేనీకు చెందనిదాని కోసం నీవు ఆశపడకూడదు అని అన్నారుబాబా నానా సాహెబ్ చందోర్కర్ కు చెప్పిన మాటలు నాకూ వర్తించుతాయి అని భావించానునేను ఆబాలిక విషయంలో చేసినది సరిఅయినదే అని భావించి తృప్తిచెందానుమానవతా దృష్టితో నేను ఆబాలికను ఆమె తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళమని సలహా ఇచ్చాను అని భావించి ఆసంఘటనను మర్చిపోయాను.

  19.05.2017    తారీకున ప్రచురించిన మద్రాసులోని పెళ్ళిమండపము – 

ఎంగిలి బ్రతుకులు చదివే ఉంటారు.  సాయిబానిసగారికి ఆసంఘటన 

1990వ. సంవత్సరంలో జరిగింది.  అనగా 26 సంవత్సరాల క్రితమే ఆయన 

తన అనుభవం దృష్ట్యా పెళ్ళిళ్ళల్లో ఎంత ఆహారం వృధా అవుతున్నదో 

చెప్పారు.  ఈ నాడు (21.05.2017) ఈనాడు వార్తా పత్రిక చూడండి.  

ప్రధాన హెడ్ లైన్ “ తినేదెంత -  పారేసేదెంత”  వేడుకల్లో లెక్కకు మించిన 

వంటకాలు….

                  
         Image result for images of wastage of food in marriages
          Image result for images of wastage of food in marriages





కనీసం ఇప్పటికయినా మనమందరం ఆర్భాటాలకు, హోదాలకు విలువ 


ఇవ్వకుండా ఆహారానికి తగిన విలువ ఇస్తే భగవంతుడు సంతోషిస్తాడు.  


వృధాగా పడవేసే బదులు అన్నార్తులను ఆదుకుంటె భగవంతుని 

అనుగ్రహం మనమీద ఎల్లప్పుడూ ఉంటుంది.  వివాహ శుభ కార్యాలలో ఏమి వంటాకాలు వండి వడ్డిస్తున్నారు (మగ పెళ్ళివారు గాని,  ఆడపెళ్ళివారు గాని  ఇరుపక్షాలవారు ఆహార పదార్ధాలను వృధా చేయరాదు అనే మాట మీద నిలబడాలి) అనేదానిమీద భేషజాలకు పోకుండా, మానవత్వానికి విలువ ఇస్తే అంతకన్నా విందు భోజనం మరొకటి ఉండదు.  ఎంత ధనం వృధాగా పోతూఉందో మన సాయి భక్తులందరం గుర్తించి దానికనుగుణంగా నడచుకుంటే మిగిలినవారికి ఆదర్శప్రాయులమవుతాము.  త్యాగరాజు

(రేపటి సంచికలో మరొక మానవత్వమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List