23.06.2020 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన
సందేహాలు –
బాబా సమాధానాలు – 10 (6)
బాబా సమాధానాలు – 10 (6)
గురుభక్తి 6 వ.భాగమ్
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్. 9440375411 & 8143626744
మైల్ ఐ.డి.
tyagaraju.a@gmail.com
మంచి చెడులను గూర్చి ఆలోచించక, గురువుయొక్క ఆజ్ఞను పాటించవలెను.
గురువుయొక్క ఆజ్ఞను పాటించుచు రాత్రింబవళ్ళు దాసునివలె చరించవలెను.
గురుగీత శ్లో. 141
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.23 గురుభక్తిని పరీక్షించుట … ఎవరో ఒక మేకను మసీదుకు తీసుకువచ్చారు. ఆ సమయంలో అక్కడ మాలేగాం ఫకీరు పీర్ మహమ్మద్ ఉరఫ్ బడేబాబా, శ్యామా మొదలయినవారున్నారు. బాబా వారిని ఒక్కొక్కరిని పిలిచి
మసీదుకు తేబడిన మేకను చంపమని ఆజ్ఞాపించారు. కాని బాబా మాటను వారిద్దరూ పాటించలేకపోయారు. ఆ తరువాత కాకాసాహెబ్ దీక్షిత్ వంతు వచ్చింది. దీక్షిత్ మరొక మాట మాట్లాడకుండా సాఠెవాడాకు పోయి కత్తిని తీసుకువచ్చాడు. కత్తిని పైకెత్తి మేకను చంపడానికి
బాబా ఆజ్ఞకోసం ఎదురు చూస్తూ సిధ్ధంగా ఉన్నాడు.
అప్పుడు బాబా “ఏమి ఆలోచించుచుంటివి? నరుకుము “ అన్నారు. అతని చేతిలో ఉన్న కత్తి మేకపై పడుటకు సిధ్ధముగా నుండగా బాబా “ఎంతటి కఠినాత్ముడవు? బ్రాహ్మణుడవయి మేకను చెంపెదవా?” అన్నారు.
అప్పుడు దీక్షిత్ కత్తిని క్రిందబెట్టి బాబాతో “నీ అమృతమువంటి పలుకే మాకు చట్టము. మాకింకొక చట్టమేమియు తెలియదు. నిన్నే యెల్లప్పుడు జ్ఞప్తియంధుంచుకొనెదము. మీరూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ యాజ్ఞలు పాటింతుము. అది ఉచితమా? కాదా? యనునది మాకు తెలియదు. దానిని మేము విచారించము. అది సరియైనదా కాదా? యని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించుటయే మావిధి, మా ధర్మము”.)
అప్పుడు బాబా “ఏమి ఆలోచించుచుంటివి? నరుకుము “ అన్నారు. అతని చేతిలో ఉన్న కత్తి మేకపై పడుటకు సిధ్ధముగా నుండగా బాబా “ఎంతటి కఠినాత్ముడవు? బ్రాహ్మణుడవయి మేకను చెంపెదవా?” అన్నారు.
అప్పుడు దీక్షిత్ కత్తిని క్రిందబెట్టి బాబాతో “నీ అమృతమువంటి పలుకే మాకు చట్టము. మాకింకొక చట్టమేమియు తెలియదు. నిన్నే యెల్లప్పుడు జ్ఞప్తియంధుంచుకొనెదము. మీరూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ యాజ్ఞలు పాటింతుము. అది ఉచితమా? కాదా? యనునది మాకు తెలియదు. దానిని మేము విచారించము. అది సరియైనదా కాదా? యని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించుటయే మావిధి, మా ధర్మము”.)
(శ్రీ సాయి సత్ చరిత్ర అ. 38 బాబా ఒక్కొక్కసారి తన భక్తులను పరీక్షించుచుండెడివారు. దీనికొక ఉదాహరణము.
ఒక ఏకాదశినాడు దాదాకేల్కరుకు కొన్ని
రూపాయలిచ్చి కొరాల్బాకు పోయి మాంసము కొని తెమ్మనెను.
ఇతడు సనాతనాచారపరాయణుడగు బ్రాహ్మణుడును ఆచారవంతుడును. సద్గురువుకు ధనము, ధాన్యము, వస్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదనియు,
కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞను పాటించుటే యనియు, గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటయే యనియు, ఇదియే నిజమైన
దక్షిణ యనియు, దీనివల్లనే గురువు సంతుష్టి
చెందెదరనియు అతనికి తెలియును. కనుక దాదా కేల్కరు దుస్తులు ధరించి బజారుకు బయలుదేరెను. కాని బాబా అతనిని వెంటనే పిలచి తానే
స్వయముగా పోవలదనియు నింకెవరినైన పంపుమనెను.”)
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.23 గురువులకేమి కావలెనో గుర్తించి, వెంటనే వారాజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురుని యాజ్ఞానుసారము ఆలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు. మూడవ రకమువారు అడుగడుగునకు తప్పులు చేయుచు గురుని ఆజ్ఞను వాయిదా వేసెదరు. శిష్యులకు ధృడమైన నమ్మకముండవలెను. తోడుగా బుధ్ధి కుశలత యోరిమి యున్నచో అట్టివారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు.)
సద్గురువు యొక్క పాదాలను వినయంతో చేరుకోవాలి. మనలను ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతూ ఉండే ఆ సద్గురువుయొక్క పరమ పవిత్రమయిన పాదాలకు మోకరిల్లి సర్వశ్య శరణాగతి వేడాలి. ఆయన పాదసేవనానికి జీవితాన్ని అంకితం చేయాలి.
( శ్రీ సాయి సత్ చరిత్ర అ. 4 త్రివేణీ ప్రయాగల స్నానఫలము వారి పాదసేవ వలననే కలుగుచుండెడిది. వారి పాదోదకము మాకోరికలను నశింపజేయుచుండెడిది. వారి యాజ్ఞ మాకు వేదవాక్కుగా నుండెడిది.)
(శ్రీ సాయి సత్ చరిత్ర అ. 24 మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించినగాని, మన ప్రయత్నమందు జయమును పొందము. మన మహంకారరహితుల మయినచో, మన జయము నిశ్చయము)
జ్ఞానప్రదాత యగు గురుదేవుడే మంగళకరుడైన శివుడని చెప్పబడినాడు. శుభకరుడైన మహేశ్వరుడే గురువుగా స్మరింపబడి యున్నాడు. ఏ అజ్ఞాని భేదభావమును కలిగి యుండునో అట్టివాడు గురుతల్పగతుడు పొందు గతిని పొందుచున్నాడు.
గురుగీత శ్లో. 20
శివుని పూజించువాడైనను, విష్ణుదేవుని పూజించువాడైనను గురువు అనుగ్రహము లేనిదే సర్వసాధనలు నిష్పలమగును. ఆత్మజ్ఞానము
లభించదు.
గురుగీత శ్లో.
192
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.28 ఒక మకరసంక్రాంతినాడు మేఘుడు బాబా శరీరమునకు చందనము పూసి గంగానదీ జలముతో నభిషేకము చేయదలంచెను. శివునికభిషేకమిష్టము గనుక, తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసి తీరవలెనని పట్టుబట్టెను. బాబా సమ్మతించి క్రిందికి దిగి పీటపయి కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనెను. “ఓ మేఘా! ఈ చిన్న యుపకారము చేసి పెట్టుము. శరీరమునకు తల ముఖ్యము. కావున తలపైనే నీళ్ళు పోయుము. శరీరమంతటిపై పోసినట్లగును” అట్లనే యని మేఘశ్యాముడొప్పుకొని, నీళ్ళకుండను పైకెత్తి తలపై పోయ యత్నించెను. కాని భక్తిపారవశ్యమున ‘హర హర గంగే, హర హర గంగే ’ యనుచు శరీరమంతటిపై నీళ్ళు పోసెను. కుండనొక ప్రక్కకు బెట్టి బాబావయిపు జూచెను. వాని యాశ్చర్యానందములకు మేరలేదు. బాబా తల మాత్రమే తడిసి, శరీరమంతయు పొడిగా నుండెను.
ఒకనాడు వేకువజామున మేఘుడు శయ్యపయి పండుకొని కండ్లు మూసుకొని యున్నప్పటికి లోపల ధ్యానము చేయుచు బాబా రూపమును జూచెను. బాబా తనపై యక్షతలు చల్లి “మేఘా! త్రిశూలమును గీయుము” అని చెప్పి అదృశ్యుడయ్యెను.” బాబా కనిపించలేదు గాని, యక్షతలక్కడక్కడ పడియుండెను. బాబా వద్దకు పోయి, చూచిన దృశ్యమును గూర్చి చెప్పి త్రిశూలమును గీయుటకాజ్ఞ నిమ్మనెను. బాబా ఇట్లనెను. “నా మాటలు వినలేదా? త్రిశూలమును గీయమంటిని. అది దృశ్యము కాదు. స్వయముగా వచ్చి నేనే చెప్పితిని. నామాటలు పొల్లుగావు. అర్ధవంతములు” మేఘుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటమువద్ద గోడపై త్రిశూలమును ఎఱ్ఱరంగుతో గీసెను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను. అప్పుడే మేఘుడు కూడ అచ్చటకు వచ్చెను. బాబా ఇట్లనెను. “చూడు శంకరుడు వచ్చినాడు జాగ్రత్తగా పూజింపుము”. మేఘుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగము వచ్చుట జూచి యాశ్చర్యపడెను. వాడాలో కాకాసాహెబు దీక్షిత్ స్నానము చేసి సాయిని తలంచుకొనుచుండగా తన మనోదృష్టియందు లింగము వచ్చుట గాంచెను. అతడాశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి, బాబా తనకు లింగము కానుకగా నిచ్చెనని చూపెను. దీక్షిత్ దానిని జూచి సరిగా నది తన ధ్యానములో కనపడినదానివలె నున్నదని సంతసించెను. కొద్ది రోజులలో త్రిశూలమును వ్రాయుట పూర్తికాగా బాబా, మేఘశ్యాముడు పూజచేయుచున్న పెద్దపటము వద్ద లింగమును ప్రతిష్టించెను. మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి గనుక త్రిశూలమును వ్రాయించి, లింగమును ప్రతిష్టించుట ద్వారా బాబా వానియందుండు నమ్మకమును స్థిరపరచెను.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment