12.07.2020 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు
3 వ.భాగమ్
- సాయిదర్బార్, హైదరాబాద్
- సాయిబానిస
- సంకలనం
మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
- సమర్పణ
ఆత్రేయపురపు
త్యాగరాజు
16.02.2020 వైద్య
సేవలు
నేను షిరిడీలో శరీరముతో ఉన్న రోజులలో షిరిడీ గ్రామవాసులకు వైద్య సేవలు చేసేవాడిని.
వైద్యానికి
లొంగని రోగాలను నేను నా శరీరముమీదకు తీసుకొని నా భక్తులకు ఉపశమనము కలిగించేవాడిని.
ఈనాడు
నా భక్తులలో చాలామంది వైద్యులు ఉన్నారు.
వారు
అందరు కలిసి నా మందిరాలలో ఉచిత వైద్యశాలలు నిర్వహించారు.
నా
బీద భక్తులను ఆదుకొన్నచో నేను
చాలా సంతోషించెదను.
నా
డాక్టర్ భక్తులను సదా
కాపాడుతూ ఉంటాను.
కాపాడుతూ ఉంటాను.
17.02.2020 వివాహాలు – ముహూర్తాలు
వివాహాలకు
సుమూహూర్తాలు
నిర్ణయించటానికి
మంచి జ్యోతిషశాస్త్ర పండితులను సంప్రదించాలి.
మంచి
ముహూర్తములో
ఆ వివాహాలను తమ ఆత్మీయులతో కలిసి జరిపించాలి.
వివాహాలకు
ఆర్భాటాలకు పోరాదు.
వివాహాలలో
ఎంత నిరాడంబరత్వము ఉంటే అంతగా భగవంతుని ఆశీర్వచనాలు వధూవరులకు లభించుతాయి.
విశ్లేషణ
శ్రీ సాయి సత్ చరిత్రలోని వీరభద్రప్ప, గౌరి కళ్యాణము విషయములో బాబా లీలలు, చేసిన విషయాలు పైన చెప్పబడిన సందేశమును గుర్తు చేస్తాయి.
18.02.2020 స్వర్గీయులైన
తల్లిదండ్రుల
ఆబ్ధీకము
నీవు 2019 వ.సంవత్సరము శ్రావణ మాసములో నీ తండ్రి కీ.శే.రావాడ వెంకటరావు గారికి ఆభ్దికము పెట్టినావు.
ఆ
రోజున నీవు నన్ను భోజనానికి పిలవకపోయినా నేను నీ మిత్రుడు స్వర్గీయ సర్దార్ జీ అయిన అలువాలియా రూపంలోను మరియు నీ
పినతండ్రి
స్వర్గీయ శ్రీ ఉపాధ్యాయుల సోమయాజులుగారి రూపంలోను అదృశ్యరూపాలలో వచ్చి భోజనము చేసి వెళ్ళినాను.
నీవు
నీ తండ్రిగారి ఫోటో చూపించి నీ తండ్రిని నాకు పరిచయం చేయసాగావు.
నాకు
నవ్వు వచ్చినది.
నీ
తండ్రి గురించి వివరాలు అన్నీ నాకు తెలుసు.
ఈ
రోజున నీ తండ్రి ఎక్కడ జన్మించినది నేను నీకు చూపించగలను.
నాకు
సంతోషము కలిగించిన విషయం నీవు నీకు జన్మనిచ్చిన నీ తండ్రిని మరిచిపోలేదు.
మరియు
నిన్ను పెంచి పోషించి విద్యాబుధ్ధులు నేర్పించిన నీ పినతండ్రి కీ.శే.ఉపాధ్యాయుల పేరేశ్వర సోమయాగులు గారిని మరిచిపోలేదు.
నీవు
నా భక్తులకు ఈ పుస్తకము ద్వారా తెలియజేయవలసిన విషయము “గతించిన మీ తల్లిడండ్రులకు ప్రతి సంవత్సరము ఆబ్ధీకము పెట్టండి.”
విశ్లేషణ :
శ్రీ సాయి సత్ చరిత్రలోని భగవంతరావు క్షీరసాగర్ కధను గుర్తు చేసుకుందాము.
అతడు
తన తండ్రికి ఆబ్ధీకము పెట్టడము మానివేసినపుడు వానిని షిరిడీకి పిలిచి చివాట్లు పెట్టి వానిచేత వాని తండ్రికి షిరిడీలో ఆబ్ధీకము పెట్టించెను.
(మరలా వచ్చే గురువారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
(మరలా వచ్చే గురువారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment