11.07.2020 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబా
ఎవరినీ తన శిష్యులుగా చేసుకోలేదు,
ఆయనకు
వారసులు కూడా లేరు.
ఈ
సమాచారమ్
shirdisaisevatrust.org చెన్నై
వారినుండి గ్రహింపబడినది.
(సాయిలీల పత్రిక నవంబరు, డిసెంబరు 1983 సంచికలో పునర్ముద్రితం.)
తెలుగు అనువాదం --
ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట,
హైదరాబాద్
ఫోన్. 9440375411 ,
8143626744
సాయిబాబాకు వారసులు గాని శిష్యులు గాని లేరు – 3 వ.భాగమ్
(రచయిత కీ.శే. డి. శంకరయ్య)
( ఈ వ్యాసాన్ని shirdisaisevatrust.org నుండి యధాతధంగా అనువాదం చేసి ప్రచురిస్తున్నాను. అందువల్ల ఇందులో తెలియపరచబడిన అభిప్రాయాలన్నీ శ్రీ శంకరయ్యగారివేనని గ్రహించవలెను.)
బాబా ఒక ఫకిరులాగ ప్రతిరోజు అయిదారిండ్లలో భిక్ష స్వీకరించి జీవించారు.
అన్నం,
కూరలవంటివాటిని
జోలెలో వేయించుకుని, ద్రపదార్ధాలను ఒక తంబిరేలు డబ్బాలో పోయించుకునేవారు.
వాటినన్నిటిని ఒక
కొళంబాలో వేసి ఉంచేవారు.
పిల్లులు,
కుక్కలు, కాకులు అందులోని పదార్ధాలను యధేచ్చగా తింటూ ఉండేవి.
ఆయన
వేటినీ తరిమివేసేవారు కాదు.
బాబా కోరితే ఎన్నో మధురపదార్ధాలను ఇవ్వడానికి భక్తులెందరో ఉన్నాగాని, బాబా తను భిక్షద్వారా స్వీకరించినదానినే ఎక్కువగా ఇష్టపడేవారు.
ఆయన
ఈ సాంప్రదాయాన్ని తను మహాసమాధి చెందేవరకు ఆచరించారు.
ఇపుడు
తాము సాయి అవతారాలమని చెప్పుకు తిరిగేవారు గాని, వారి శిష్యులు గాని, తమ ఆహారం కోసం బాబా ఆచరించినట్లుగా ఆచరిస్తున్నారా?
భిక్షద్వారా
స్వీకరించిన
ఆహారాన్ని కాకాపోయినా కనీసం జంతువులు ముట్టిన ఆహారాన్నయినా వారు స్వీకరిస్తారా అని నా అనుమానం.
బాబా
శయనించే పధ్ధతి కూడా ఎంత సామాన్యంగా ఉంటుందో గమనించండి.
ఆయన
నాలుగు మూరల పొడవు, ఒక జానెడు వెడల్పుగల చెక్క బల్లపైనే పడుకునేవారు.
మసీదు
దూలాలకి చినిగిన పాతగుడ్డల పీలికలతో దానిని కట్టి, దానిపై పడుకొనేవారు.
ఆ
బల్ల నాలుగు మూలలందు నాలుగు దీపపు ప్రమిదలు ఉంచేవారు.
బాబా
ఆ బల్లపైకి ఎలా ఎక్కేవారో ఎలా దిగేవారో ఎవరికీ తెలియదు.
బాబా
కాకాసాహెబ్ తో “ఎవరయితే కండ్లు తెరచి నిద్రించగలరో వారే ఆవిధముగా చేయగలరు” అన్నారు.
ఆవింత
చూడటానికి భక్తులంతా గుమిగూడి వస్తూండటంతో బాబా ఆబల్లను విరిచిపారేశారు.
ఇపుడు
సాయి అవతారాలమని చెప్పుకొనేవారు కనీసం మెత్తని పరుపుల మీదనయినా కండ్లు తెరచుకొని నిద్రించగలరా?
బాబా ఏనాడూ కాషాయ వస్త్రాలకి మొగ్గుచూపలేదు.
ఆయన
తెల్లటి దుస్తులనే ధరించేవారు.
ఈనాటి
బాబాలు సిల్కు కాషాయాంబరాలను ధరిస్తున్నారు.
బహుశ
వారు తాము బాహ్యంగా ఒక బాబాలాగ గుర్తింపు పొందాలనే భావనతో అయి ఉండవచ్చు.
అందువల్లనే
‘కనిపించే శరీరం కాదు యోగిలాగ ఉండవలసినది, మానసికంగా ఒక యోగిలాగ ఉండాలని’ ఒక నానుడి.
బాబాకు
అణిమాది అష్టసిధ్దులూ అన్నీవచ్చు.
యోగాభ్యాసి
కూడా . కాని
ఆయన వాటినెపుడు తన గొప్పతనాన్ని చూపించడం కోసం గాని, ప్రజలను ఆకర్షించడానికి గాని ఉపయోగించలేదు.
ఆయన
తన ప్రేగులను బయటకు తీసు శుభ్రపరచి చెట్టుకి ఆరబెట్టేవారు.
ఖండయోగం
చేసేవారు. ఈవిధంగా
ఆయన తన శరీరాన్ని శుధ్ధిచేసుకొనేవారు.
ఇపుడు
చాలామంది బాబాలు రోజ్ వాటర్ తో స్నానం చేస్తూ తమ శరీరాలను శుభ్ర పరచుకొంటున్నారు.
ధ్యానం, జపతపాలు చేసినట్లయితే భగవదనుగ్రహం వల్ల సిధ్ధులు లభిస్తాయని మనకు తెలుసు.
నిజమైన
సాధువు ఎపుడూ ఇటువంటి శక్తుల గురించి తాపత్రయ పడడు.
వాటిని
లక్ష్యపెట్టడు. సాధుకుడికి
ఆధ్యాత్మికంగా
పురోగతి సాధించడానికి ఇవన్నీ అడ్డంకులని స్వామి వివేకానంద హెచ్చరించారు.
కొంతమంది
బాబాలు గాని గురువులు గాని ఇటువంటి శక్తులకి దాసోహమయ్యి తమ శక్తులను ప్రదర్శిస్తారే గాని తాము ఆధ్యాత్మికంగా ఎదగలేరు, తమ శిష్యులని కూడా ఉన్నత స్థితికి తీసుకుని వెళ్లలేరు.
సాయిబాబా
తన భక్తుల కొరకు వేటినీ సృష్టించి ఇవ్వలేదు.
బహుశ
అందువల్లనే బాబాను పరీక్షించడానికి శాస్త్రవేత్తలుగాని, ఇంద్రజాలికులుగాని, నాస్తికులు గాని ఎవరూ సవాలు చేయలేకపోయారు.
కొంతమంది హిందువులు బాబాని చూడగానే ఆయన ఒక ముస్లిమ్ అనే భావనతో శిరసు వంచి నమస్కరించడానికి తటపటాయించేవారు.
అదే
విధంగా కొంతమంది మహమ్మదీయులు బాబా హిందూమతాచారాల ప్రకారం పూజలు చేస్తూ మసీదుయొక్క
పవిత్రతను
చెడగొడుతున్నారని
భావించేవారు. బాబా
మీద ఇదొక్కటే విమర్శ ఉండేది.
కాని
ఎవరూ కుడా బాబాని సవాలు చేయలేదు.
ఎవరికయితె సందేహాలు, పరిమితులు ఉన్నాయో వారంతా బాబాను చూడగానే ఆయన పాదాలనాశ్రయించారు.
ఒక
రామభక్తుడు బాబాలో రాముడిని దర్శిస్తే,
విఠలుని భక్తుడు సాయిలో విఠలుని రూపాన్ని దర్శించాడు. ఇదే బాబాలో ఉన్న శక్తి.
(చివరి భాగమ్ సోమవారమ్)
(రేపటి సంచికలో ఆణిముత్యాలు 3వ.భాగమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment