27.07.2020 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిలీల పత్రికలో ప్రచురింపబడిన బాబా లీలను ఈ రోజు ప్రచురిస్తున్నాను.
తెలుగు అనువాదమ్ చేసి భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవి గారు పంపించారు.
సాయి
భక్తి అదృష్టవంతులకు మాత్రమే
సాయిభక్తి
మాకు మానాన్నగారి ద్వారా ఆశీర్వాద రూపంలో ప్రాప్తించింది. దానికి మేము ఎంతో అదృష్టవంతులమనే అనుకుంటాము. మాకు బాబా అనేకమైన అద్వితీయమైన అనుభవాలను కలిగిస్తున్నారు. దానిలో ఒకటి మచ్చుకు మీకు వివరిస్తున్నాను.
ఫిబ్రవరి
2010 వ.సంవత్సరంలో జరిగిన సంఘటన ఇది. మేమందరరం
కలసి దహను అనే ప్రదేశానికి పిక్నిక్ వెళ్లాము.
అక్కడ సముద్రంలో చాలా సేపు స్నానాలు చేస్తూ ఆడాము, చాలా ఆనందంగా గడిపాము. దానిఫలితంగా ఇంటికి వచ్చేసరికి దగ్గు, పడిశం, జ్వరం
పట్టుకున్నాయి. ఎన్నో మందులు వేసుకున్నా తగ్గలేదు.
(దహను సముద్ర తీరం)
(దహను ముంబాయినుండి 110 కి.మీ. దూరంలో ఉంది)
యాంటీబయాటిక్స్ వాడినా తగ్గలేదు. ఇక లాభం లేదని శ్రీ సాయి సత్ చరిత్ర పారాయణే మార్గం
అని భావించి అతి కష్టం మీదట సాయి పోతీ చదవడం మొదలుపెట్టాను. రెండు
రోజులు చదివాను. ముందు రోజు నాకు ఒక సంకేతం
వచ్చింది. బాబా ఇలాగే జబ్బులో ఉన్న ఒకతనిని
షిరిడీకి రమ్మన్నారు. అక్కడనే ఆయనకు ఆరోగ్యం
బాగయింది. ఇది చదివిన తరువాత బాబా నన్ను షిరిడీకి
రమ్మంటున్నారని భావించాను. అంతకముందు ఎన్నిసార్లు
వెడదామనుకున్నా గాని వెళ్లలేకపోయేదానిని. ఇక
టికెట్స్ చేసుకొని పవిత్రనగరం షిరిడీకి చేరుకొన్నాను. అక్కడ అడుగుపెట్టానో లేదో నా
దగ్గు మాయం అయినట్లయి మాయమైపోయింది. నా కూడా
ఎటువంటి మందులు కూడా తీసుకొనిపోలేదు. అక్కడికి
వెళ్ళిన తరువాత నాకు సాయిబాబా నవగురువారవ్రతం గురించి తెలిసింది. నేను కూడా ఈ వ్రతం చేయాలి అని అనుకున్నాను. అపుడు నారక్తంలో హిమోగ్లోబిన్ చాలా తగ్గిపోయింది. E.S.R (Erythrocyte Sedimentation Rate Test) ఎక్కువ అయింది. మా ఊరికి తిరిగివచ్చిన తరువాత ఏవిధమయిన మందులు వేసుకోలేదు. నేను నవగురువారవ్రతం మొదలుపెట్టాను. వ్రతం చక్కగా భక్తిపూర్వకంగా చేసుకున్నాను. అంతే 9 గురువారాలు బాబాను భక్తితో కొలిచాను. మళ్ళీ రక్త పరీక్ష చేయిస్తే నాకు హెమోగ్లోబిన్ శాతం
పెరిగింది. E S R తగ్గింది. అసలు నన్ను బాబా సముద్రం దగ్గరికి ఎందుకని పంపారు? ఎందుకు జబ్బు పడ్డాను. వ్రతం ఎందుకు చేసాను. బాబా ఎందుకు బాగుచేసారు. ఇవన్నీ గమనిస్తే పూర్వ జన్మ పాపం వ్యాధి రూపేణ పీడితం
అంటారు. పూర్వజన్మ పాపాన్ని కాస్తలోనే బాబా
దులిపేసారు. అందువల్లనే 108 అష్టోత్తరంలో ‘ఓమ్ కర్మధ్వంసినేనమః’ అని చదువుతాము. ఇపుడు చెప్పండి, అవునా కాదా?
మనీషా
రావదాణె, దహిసర్, ముంబాయి
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment