26.07.2020 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 7 వ.భాగమ్
- సాయిదర్బార్, హైదరాబాద్
- సాయిబానిస
- సంకలనం
మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
- సమర్పణ
ఆత్రేయపురపు
త్యాగరాజు
14. త్రాగుడుకు బానిస అయినవాని కధ
26.02.2020 బుధవారమ్
మనిషి
జివితములో ధన సంపాదన సరిగ్గ లేక త్రాగుడుకు బానిస అయినవాని కధ నీకు చెబుతాను.
నీవు పనిచేసిన కంపెనీలో నీ దగ్గర పనిచేసిన ఓ కార్మికుడు, వాని పేరు నరసింగరావు. వాని కధ ఇప్పుడు చెబుతాను విను. అతడు స్వతహాగా మంచివాడు అయినా మద్యం త్రాగుడుకు బానిస అయి పనికి సరిగా రాక రోజంతా త్రాగుతూ భార్యపిల్లలను బాధపెడుతూ ఉండేవాడు.
నీవు వానిని మందలించి తిరిగి డ్యూటీకి రమ్మని ఆదేశమిచ్చినావు. అతను నీపై గౌరవముతో డ్యూటీకి వచ్చినా త్రాగుడును వదలలేక ధన సంపాదన సరిగా లేక చాలా కష్టాలు పడుతూ ఉండేవాడు. నీవు 2000 సంవత్సరములో నీ కంపెనీనుండి పదవీవిరమణ చేసిన తరువాత నరసింగరావు రోజంతా త్రాగుతు పనికి రాకుండా జీవితాన్ని గడుపుతూ ఆఖరికి 2003 వ.సంవత్సరములో పచ్చకామెర్ల వ్యాధితో బాధపడి కన్నుమూసినాడు. నా భక్తులను త్రాగుడుజోలికి వెళ్లవద్దని సలహా ఇస్తాను.
15. సర్వమత ప్రార్ధనలు
27.02.2020 గురువారమ్
నీవు ఏమత సాంప్రదాయములో నన్ను ప్రార్ధించినా నేను పలుకుతాను. అన్ని మతాల సారాంశం చెప్పేది భగవంతుడు ఒక్కడే. వానికి అనేకరూపాలు, అనేక నామాలు ఉన్నాయి. నిన్ను ఇప్పుడు నీ జన్మస్థలమునకు ప్రక్కనేయున్న ఆదుఱ్ఱు గ్రామానికి తీసుకొని వెడతాను. ఆ గ్రామములో నీ బంధువు శ్రీ సోమయాజులు ఘనాపాటి, శ్రీకామేశ్వర సిధ్ధాంతి, శ్రీ భాస్కర్ అవధాని ఆధ్వర్యములో జరుగుతున్న మహారుద్రాభిషేకములో పాల్గొని పరమశివునికి రుద్రాభిషేకము చేసుకొనిరా. ఆ తర్వాత నీ ముస్లిం స్నేహితుడు రెహమాన్ దగ్గరకు తీసుకొని వెడతాను. అతను పవిత్ర ఖురాన్ నుండి కల్మాను చదివి వినిపించుతాడు. ఆ తర్వాత నిన్ను నేను నీ స్నేహితుడు జ్ఞాని మోహిందర్ సింగ్ దగ్గరకు తీసుకొని వెడతాను. అతను నీకు పవిత్ర గురుగ్రంధం నుండి గురువాణి వినిపించుతాడు.
ఆతర్వాత నిన్ను నీ స్నేహితుడు పాస్టర్ రతన్ రాజ్ దగ్గరకు తీసుకొని వెడతాను. అతను పవిత్ర బైబిల్ గ్రంధమునుండి సువార్త వాణిని నీకు వినిపించుతాడు.
నీవు నా ఆదేశానుసారము సనాతన ధర్మము, ఇస్లామ్ ధర్మము, క్రైస్తవ ధర్మము, శిఖ్ ధర్మము ప్రకారము జరిగే దైవ ప్రార్ధనల్లో పాల్గొని నా వద్దకురా. అప్పుడు నీకు భగవంతుని తత్త్వము తెలుస్తుంది. నీకు నా ఆశీర్వచనాలు ఎల్లప్పుడు ఉంటాయి.
16. తీరని కోరికలు
28.02.2020 శుక్రవారము
వృధ్ధాప్యములో తీరని కోరికలు తీర్చుకోవడం అంటే ఎడారిలో దాహము తీర్చుకోవడానికి ఎండమావుల వెంట పరిగెట్టడమువంటిది. ఎండమావులవెంట ఎంత పరిగెత్తిన దాహము తీరదు. ఈ పరిగెత్తే సమయములో నీవు అలసట చెంది ఎడారిలో నేలమిద పడిపోయి ప్రాణాలు పోగొట్టుకొంటావు. అందుచేత నీవు నీ వృధ్దాప్యములో తీరని కోరికలు గురించి ఆలోచించకుండా ప్రశాంతముగా జీవించుతు నీవు నీ గమ్యము చేరుకో.
(మరలా వచ్చే గురువారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment