Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, August 3, 2020

రాజపరివారంపై బాబా అనుగ్రహమ్

Posted by tyagaraju on 8:11 AM

Your Sai Baba Answers Ask Sai Baba, Solves your problems, Get Your ...
Deep Red Rose, HD Png Download - 1600x1442(#1762106) - PngFind

03.08.2020  సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి 
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబా లీలలు అనంతం... ఆయన తత్త్వాన్ని అర్ధం చేసుకోవడమ్ అంత సులభం కాదు.  బాబా ఎవరిని ఏవిధంగా అనుగ్రహిస్తారో మనమెవరం ముందుగా గ్రహించలేము.  ఆయన చర్యలు, ఉపదేశాలు, మాటలు నిగూఢంగా ఉంటాయి.  ఆయన అనుగ్రహం ఉన్నవాళ్ళు వాటియొక్క అర్ధాన్ని గ్రహించుకోగలరు.  ఇక ఈ రోజు ప్రచురిస్తున్న బాబా లీలలను చదవండి....ఓమ్ సాయిరామ్


సాయిలీల మాసపత్రికలో ప్రచురింపబడిన బాబా లీలను తెలుగులో అనువాదం చేసి భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవిగారు పంపించారు.


రాజపరివారంపై బాబా అనుగ్రహమ్
మరాఠీ వంశానికి చెందిన చంద్రజీ రాజె మామగారయిన గోవా రాజవంశానికి చెందిన సర్దార్ రాణెగారికి అయుదుగురు కుమార్తెలు.  తన కుమార్తెల వివాహం గురించే ఆయన ఎప్పుడూ చింతిస్తూ ఉండేవారు.  ఆకాలంలో ఆయన సాయిబాబావారి కీర్తి ప్రతిష్టలను విన్నారు. 


షిరిడీ వెళ్ళి బాబాకు తన కుమార్తెల వివాహం గురించి తను పడే తపనను విన్నవించుకుందామనుకున్నారు.  ఆరోజుల్లో ప్రజలు తమ కష్టాలను తొలగించుకోవడానికి ఏమార్గం లేకపోతే షిరిడీకి ప్రయాణమయి బాబాను దర్శించుకునేవారు. (బాలగంగాధర తిలక్ మనదేశ స్వరాజ్యం కోసం, ఇంకా రాజవంశీయులు కూడా బాబానే ఆశ్రయించేవారు).  గోవానుండి రాజపరివారం షిరిడీకి చేరుకొన్నారు.  ఆయన ద్వారకామాయిలో బాబా దర్శనానికి వచ్చారు.  అపుడు బాబా ధునిముందు కూర్చొని ఏదో ఆలోచనలో ఉన్నారు.  దృశ్యం చూసిన గోవా రాజుగారికి శరీరం రోమాంచితమయింది.  మూర్తీభవించిన దైవత్వం అంతా అక్కడే ఉన్నట్లనిపించింది.  కాని బాబా రాజుగారివైపు చూస్తూ ఎందుకు వచ్చావు ఇక్కడికి?  ఇపుడే వెళ్ళిపో అని కోపంగా అంటు చేయి బైటకు వెళ్ళే మార్గంవైపు చూపించారు.

సాయిబాబా, సర్దార్ రాణాగారిని వెంటనే షిరిడీ వదిలిపెట్టి పొమ్మని ఆదేశమిచ్చారు.  బాబా కోపంతో అన్నమాటలు విన్న గోవారాజుగారు మ్రాన్పడిపోయారు.  బాబా తనను అలా ఎందుకని అన్నారో అర్ధం కాలేదు.  తన కుమార్తెల వివాహం విషయమై తన బాధను చెప్పుకోవడానికి వస్తే ఈవిధంగా జరుగుతోందేమిటి అనుకున్నారు.  ఆయన ఆశీర్వాదం తీసుకుందామనుకుంటే వెంటనే షిరిడీ వదిలి వెళ్ళిపొమ్మంటున్నారు.  అసలు తను ఏవిషయం గురించి వచ్చాడో నోరు తెరచి చెప్పలేదు.  ఇలా అనుకుంటూ దుఃఖంతో షిరిడీవదలిపెట్టి గోవాకి తిరుగు ప్రయాణమవడానికి సిధ్ధపడ్దాడు.  అయినా అంతదూరం గోవానుండి వచ్చాను కదా కనీసం బాబాకు దూరంనుంచయినా ఒకనమస్కారం పెట్టుకుని వెడదామనుకొని సాష్టాంగనమస్కారం చేసారు.  అపుడు బాబా అల్లా నీమనసులో ఉన్న కోరిక తీరుస్తాడు.  వెంటనే వెళ్ళిపో అన్నారు.

అక్కడ గోవాలో రాజుగారి రాజమహల్ లో గ్వాలియర్ రాజుగారి మంత్రి,  గోవా రాజకుమార్తెకు తన యువరాజు మాధవరావు షిండే కోసం పెళ్ళి ప్రస్తావన గురించి అడగడానికి వచ్చి ఉన్నాడు.  గోవా రాజుగారు షిరిడీ వెళ్లారని తెలిసి ఆయన వచ్చేవరకు ఉండాలనే నిర్ణయంతో ఎదురు చూస్తూ ఉన్నాడు.  సమయంలోనే గోవా రాజుగారు షిరిడీనుంచి తిరిగి వచ్చారు.  తన కుమార్తెకు , మాధవరావు షిండేతో వివాహవిషయం మాట్లాడటానికి గ్వాలియర్ రాజుగారి మంత్రి వచ్చారనే విషయం తెలిసి చాలా ఆనందపడ్డాడు.  అపుడు అర్ధమయింది బాబా తనను వెంటనే షిరిడీ విడిచి ఎందుకని వెళ్ళిపొమ్మన్నారో.  బాబా త్రికాల జ్ఞానాన్ని గ్రహించుకొని రాజుగారు ఆశ్చర్య చకితుడయారు.

గ్వాలియర్ మంత్రి తన రాజకుమారుని కోసం గోవా రాజుగారి రెండవకుమార్తెను ఎంపిక చేసాడు.  ఆమె పేరు జగరాబాయి.  పెద్దకుమార్తెకు వివాహం చేయకుండా రెండవకుమార్తెకు ముందర వివాహం చేసినట్లయితే రాజవంశానికే అప్రతిష్ట వస్తుందని,పెద్దకుమార్తెను ఎవరు చేసుకుంటారని గోవారాజుగారికి బెంగపట్టుకుంది.

అపుడు గోవారాజుగారు మరలా బాబానే మనసులో ప్రార్ధించుకున్నారు.  ధర్మసంకటంనుండి నువ్వే కాపాడాలి బాబా అని వేడుకొన్నారు.  నువ్వు నీ కుమార్తెలనందరిని గ్వాలియర్ లో జరిగే వివాహానికి తీసుకొనివెళ్ళు.  అంతా అదే సద్దుకుంటుందిఅని బాబా వాణి వినిపించింది.

ఇక భారమంతా బాబాదేనని భావించి, తన అయిదుగురు కుమార్తెలతోను, బంధుమిత్రులతోను కలిసి గ్వాలియర్ చేరుకొన్నారు.  మాధవరావు షిండె, గజరాబాయిల వివాహం చాలా వైభవంగా జరిగింది.  ఆయన పెద్దకుమార్తెను సర్దార్ షిలోత్ తోను, మూడవ కుమార్తెకు చంద్రోజీ రాజ్ తోను, నాలుగవ కుమార్తెకు సర్దార్ గజర్ తోను, అయిదవ కుమార్తెకు సర్దార్ మహత్ లతో వివాహాలు జరిగాయి.
ఒక్క కూతురి వివాహం చేయాలని వెళ్ళిన రాజుగారు అయిదుగురి కుమార్తెల వివాహం చేసి వచ్చారంటే సాయిబాబా కృపా కటాక్షమే అని మనసా వాచా కర్మణా నమ్మారు.  రోజులు గడిచే కొద్దీ గోవా రాజపరివారం, గ్వాలియర్ రాజపరివారం బాబాకు పరమ భక్తులయారు.  అందరూ షిరిడీకి వెడుతూ ఉండేవారు.  బాబా దర్శనం చేసుకునే వారు.  సర్దార్ రాణేకి మూడవ కూతురు లక్ష్మీబాయి.  వారి తొమ్మిదవ వంశం రఘుజీకి నాన్నమ్మ అవుతుంది.  ఈ వంశపరంపరవారు ఎలా బాబా భక్తులు అయ్యరనే విషయాలన్ని స్వయంగా వారి తొమ్మిదవ వంశానికి చెందిన రఘుజీ ద్వారా తెలిసాయి.
సుదాకర్ లాడ్
రాయగడ్

మహాపారాయణ గ్రూపులోని ఒక భక్తురాలి అనుభవాన్ని భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవిగారు ఆంగ్లంలో పంపించారు.
తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్

నా పేరు స్వాతి టాండన్నేను మహాపారాయణ గ్రూపులో ఉన్నానునా సంఖ్య 4837.  నేను మహాపారాయణ గ్రూపులో ఆగస్టు 2019 .సంవత్సరంలో ప్రవేశించానుమా వదిన గాను మహాపారాయణ గ్రూపులో నన్ను చేర్పించారునన్ను చేర్పించిన తరువాత ఆమె గ్రూపునుండి నిష్క్రమించిందిఅప్పటినుండి నేను నాకు ఇవ్వబడిన అధ్యాయాలను పారాయణ చేస్తూ ఉన్నాను. మహాపారాయణ ద్వారా నాకు కలిగిన అనుభవాన్ని వివరిస్తాను.


క్రితం సంవత్సరం నాకు మూడవ నెలలోనే గర్భస్రావం అయిందిక్రిందటి సంవత్సరం అక్టోబర్ నుండి మరలా సంతానం కోసం ప్రయత్నిద్దామనుకున్నా గాని ఫలితాలు ఆశాజనకంగా రాలేదుఅండాలు ఫలదీకరణ చెందడంలేదని చెప్పారుజ్యోతిష్యం తెలుసున్న నా స్నేహితురాలికి విషయం చెప్పానునేను చెప్పినదంతా విని ఆమె నాకు రెండు సంవత్సరాల వరకు సంతానం కలగదని చెప్పింది.

ఆమె చెప్పిన విషయాన్నే పదే పదే ఆలోచిస్తూ ఉండటంతో నాలో చాలా ఆందోళన కలిగిందిఇక బాబా మీదనే పూర్తి విశ్వాసం ఉంచి మహాపారాయణ ద్వారా అధ్యాయాల్ని పారాయణ చేయసాగానుఆశ్చర్యం అధ్భుతం ఏమిటంటే సెప్టెంబరు, 2019 లో నేను గర్భం దాల్చానుబాబా ఆశీస్వాద బలంవల్లనే నాకు సంతాన యోగం కలిగిందిబాబా నాకోరికను నెరవేర్చారుబాబా నువ్వు ఎల్లప్పుడు నాతోనే ఉండమని నిన్ను వేడుకొంటున్నానుశ్రి సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List