Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, August 2, 2020

బాబాకు తపాలా బంట్రోతు

Posted by tyagaraju on 7:44 AM
Shirdi Sai Kutumbam - Posts | Facebook

           Twilight Light Orange Rose | FiftyFlowers.com | Orange roses ...
02.08.2020 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు అధ్భుతమయిన రెండు బాబా లీలలను ప్రచురిస్తున్నాను. 
మనం ఒక పనిని నిర్వహించడానికి నిర్ణయించుకున్నపుడు ఆ పనిని శ్రధ్ధతో అంకిత భావంతో చెయ్యాలి.  అపుడే మనం చేసే పనికి ఫలితం లభిస్తుంది.  ఇక్కడ బాబా విషయంలో ఒకామె తను చేయవలసిన పని మర్చిపోవడం, బాబా గుర్తు చేయడం అంతా అధ్భుతంగా అనిపిస్తుంది. ఈ రెండు లీలలను భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవిగారు ఆంగ్లంలో పంపించారు.
తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,  హైదరాబాద్
 బాబాకు తపాలా బంట్రోతు

న్యూజత్ సర్దార్ ఆలీ అనే సాయిభక్తురాలు షిరిడీకి కాస్త దూరంలోఉన్న ఊరిలోనే నివసిస్తూ ఉంటారు.  ఆమె సాయిభక్తులకు ఎంతగానో సేవ చేస్తున్నారు.  ఆమె ప్రతి నెల షిరిడీకి వెళ్ళి సాయిభక్తులు బాబాకు సమర్పించే కోరికల ఉత్తరాలను తీసుకునివెడుతూ ఉంటారు. 



ద్వారకామాయిలో బాబా కూర్చునే ప్రదేశంలో ఆ ఉత్తరాలన్నిటిని బయటినుండే లోపలకు వేస్తూ ఉంటారట. కాసేపు ద్వారకామాయిలో కూర్చుంటారట. ఆ తరువాత చూస్తే బాబా వాటిని చదివినట్లుగా ఆ ఉత్తరాలు బయట పడి ఉంటాయట. 
           This is Dwarakamayi of ours on which you are sitting. | Sai Baba ...
ఆమె ప్రతినెల షిరిడీ వెళ్ళి ద్వారకామాయిలో సాయిభక్తులు ఇచ్చిన కోరికల ఉత్తరాలను బాబాకు సమర్పిస్తూ ఉంటారు.  ఒకవేళ ఆమె వెళ్ళేలోపు ఎవరయిన మైల్స్ ద్వారా పంపడం మరచినా,  ఆమెకు సందేశాలను పంపిస్తారని, ఆమె వాటిని ప్రింట్ తీసి బాబాకు సమర్పిస్తూ ఉంటారని శ్రీమతి మాధవిగారు వివరించారు.  ఈ విధంగా ఆమె సాయిభక్తులకు ఎంతో సేవ చేస్తున్నారు.  ఈ మధ్య కరోనా కారణంగా వెళ్ళటంలేదని తెలియచేసారు.
 ఈ విషయం భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవిగారు వివరించారు. 

సాయిబంధువులందరికీ ఓమ్ సాయిరామ్

సాయిబాబాతో నాకు కలిగిన అధ్భుతమయిన అనుభవాన్ని మీకందరికి వివరిస్తాను.

సాయిభక్తులెందరో సాయిబాబా తమ ప్రార్ధనలకు స్పందించారని చెబుతూ ఉంటారు.  నేను సాయి భక్తులు తమతమ కోరికలను బాబాకు విన్నవించుకుంటూ వ్రాసే ఉత్తరాల కోసం  ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. నమ్మండి నమ్మకపొండి, ఇది మాత్రం యదార్ధం.   మొట్టమొదట్లో నేను షిరిడీకి వెడుతున్నపుడు   సాయిభక్తులు బాబాకు తమ ప్రార్ధనలు ఏమని చెప్పమన్నారో, వారు తమ తరపున నా ద్వారా బాబాకు     ఏమని విన్నవించమన్నారో నాకు గుర్తుండేవి కావు. 

అందువల్ల వారి కోరికలన్నిటిని కాగితం మీద వ్రాసి ఇమ్మని, వాటిని ద్వారకామాయిలో బాబావద్ద సమర్పిస్తానని చెప్పాను.

ఆవిధంగా నాద్వారా బాబాకు ఉత్తరాలను పంపించినవారంతా తమ జీవితాలలో మార్పు వచ్చిందని బాబా తమ ప్రార్ధనలకు స్పందించారని చెప్పి ఎప్పుడూ ఉత్తరాలను పంపిస్తూ ఉంటామని చెప్పేవారు.  ఆవిధంగా నాలుగయిదు సార్లు ద్వారకామాయికి ఉత్తరాలను ట్టుకొనివెళ్ళాను. ఒకరోజు శేజ్ ఆరతి అయిన తరువాత బాగా అలసిపోయాను.  బాగా అలసిపోవడంతో నిద్రపట్టేసింది.  సరిగ్గ రాత్రి గం. 11.55 ని. కి బాబా నన్ను లేపి నా ఉత్తరాలు పట్టుకురాఅన్నారు.  ( స్వరం ఇంకా నా చెవులలో మార్మోగుతూనే ఉంది).  వెంటనే లేచి మొహం కడుగుకొని ఉత్తరాలు తీసుకొని ద్వారకామాయికి పరుగెత్తాను.

అప్పుడు నాకు అర్ధమయింది బాబా నన్ను తనకి,  సాయిభక్తులకి మధ్య తపాలా బంట్రోతుగా సేవ చేసే భాగ్యాన్ని కలుగచేసారని. విధంగా సేవ చేయడం నేనెంతో గౌరవంగా భావిస్తాను.  విధంగా నేను సాయిభక్తులందరినీ తమ ఉత్తరాలని మైల్స్ ద్వారా పంపించమని అడుగుతూ ఉంటాను. 

విషయం మీ స్నేహితులకు, మీరు అభిమానించేవారికి కూడా చెప్పి  నా మైల్ .డి. కి పంపించమని చెప్పండి.  నేను వారి ఉత్తరాలను కూడా బాబాకు సమర్పించే భాగ్యం కలిగినందుకు నాకెంతో సంతోషంగా ఉంటుంది.
నేనందరికీ సవినయంగా మనవి చేసుకొనేదేమంటే ప్రతివారు తమతమ కోరికలని, ప్రార్ధనలని/బాబాకు కృతజ్ఞతా భావంతో వ్రాసే ఉత్తరాలని/బాబాపై తమ ప్రేమను వ్యక్తీకరించే ఉత్తరాలని నాద్వారా బాబాకు సమర్పించదలచినట్లయితే నా మైల్ డి కి పంపించండి.

బాబా ఎల్లప్పుడూ మీరు రాసే ఉత్తరాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు.
నా మైల్ ఐ.డి
ఇపుడు మీకు నేను మరొక అధ్బుతమయిన చమత్కారాన్ని వివరిస్తాను.  బాబా ఎప్పుడు అనుమతి ఇస్తే అప్పుడు షిరిడీ వెడుతూ నాతోపాటుగా సాయిభక్తులు పంపించిన ప్రార్ధనల ఉత్తరాలను కూడా తీసుకొనివెడుతూ ఉంటాను.
నేను, 2019వ.సంవత్సరం, సెప్టెంబరు 29.తారీకున షిరిడీలో ఉంటాననీ, భక్తులు ఎవరయినా తమతమ కోరికలను వారి వినతులను పంపించమని కోరుతూ ప్రేయర్ రిక్వెస్ట్ గ్రూపులో పోస్టు చేసాను.  గ్రూపులోని ఒక భక్తురాలు సెప్టెంబరు 10.తారీకున నాకు ఫోన్ చేసి తను బాబాకి ఒక ఉత్తరం పంపించదలచుకున్నానని చెప్పి  నా మైల్ . డి. అడిగింది. 
ఆమె నాకు ఫోన్ చేయడం ఇదే మొదటిసారి కావడం వల్ల నాకామె ఎవరో గుర్తు లేదు.

రెండురోజుల క్రితం నాకొక కల వచ్చింది. ఆ కలలో  ఒక భక్తురాలినుండి ఒక సందేశం వచ్చింది. కలలో ఛాట్ విండొలో ఆమెపేరు కూడా స్పష్టంగా కనిపించింది.  నా కాంటాక్ట్ లిస్ట్ లో పెట్టుకున్న పేరులలో సరిగ్గా అదే పేరు ఉంది.

కాని ఆమె పంపిన సందేశం గుర్తులేదు.  ఉదయం లేవగానే నాకు ఆ కల గుర్తుంది.  కాని ఆ కల ఒక సాయిభక్తురాలికి సంబంధించినదని, ఆమె బాబాకు ప్రార్ధన  పంపించమని ఇచ్చిన సందేశం మాత్రం నేను తిరిగి గుర్తుకు తెచ్చుకోలేకపోయాను.  నేనెప్పుడూ బాబాకు తీసుకువెళ్ళే కోరికల పత్రాలగురించే ఆలోచిస్తూ ఉండటం వల్లనే ఆవిధంగా కల వచ్చిఉంటుందని దానిని నేనంతగా పట్టించుకోలేదు.

రోజు నేను మాధిమందిరంలో బాబాకు సమర్పించడానికి, సాయిభక్తులు తమ కోరికలను తెలుపుకుంటూ పంపినవారి పేరులన్నింటినీ ఒక కాగితం మీద రాసుకుంటున్నాను.  అలా రాస్తూ ఒక భక్తురాలి ఛాట్ విండో తెరిచి చాలా ఆశ్చర్య పోయాను.

ఈమె పేరుతోనే ఉన్న ఛాట్ విండోనే నేను కలలో చూసాను.  క్షణకాలం నాకు మాటలు రాలేదు.  ఆమె తన ప్రార్ధనల ఉత్తరాన్ని ఇంకా పంపించలేదు.

నువ్వు కూడా నీ ప్రార్ధన ఉత్తరాన్ని నాకు పంపించు అని నేనామెను అడగాలనుకుంటున్నదేమో అనుకున్నాను.  నిజంగా నేనెంతగానో సంతోషించాను.  బాబా తనకి, తన భక్తులకి మధ్య నన్నొక తపాలా బంట్రోతుగా ఎన్నుకున్నందుకు నా శరీరమంతా రోమాలు నిక్కపొడుకుకున్నాయి.  ఒక విధమయిన ఉద్వేగంతో నేను నిజంగానే బాబాకు ఉత్తరాలను చేరవేసే తపాలా బంట్రోతుననే విషయాన్ని గుర్తుకు తెస్తూ ఉంటుంది.
బాబాకు సమర్పించడానికి ఉత్తరాలను మైల్ ద్వారా పంపిస్తున్న సాయిభక్తులందరికి నేనెంతో ఋణపడి ఉన్నాను.  కారణమేమంటే మీవల్లనే నాకు ఈవిధంగా బాబా సేవచేసే భాగ్యం కలిగింది.
(శ్రీ సాయిసాగరంలోనుండి వెలికితీసిన ఆణిముత్యాలు - 9వ.భాగమ్ ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా చదవండి.
www.teluguvarisaidarbar.blogspot.com

http://teluguvarisaidarbar.blogspot.com/2020/08/9.html#more)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List