Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, August 1, 2020

రుద్రాద్యాయం యొక్క ప్రభావమ్ – శ్రీ సాయి సత్ చరిత్ర 11వ.అధ్యాయమ్ 4 వ.భాగమ్

Posted by tyagaraju on 7:19 AM

       Saibaba Trust Shirdi's tweet - "*श्री साईबाबा ...
               Download Roses Are Blue - Blue Rose Png Hd - Full Size PNG Image ...
01.082020  శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
రుద్రాద్యాయం యొక్క ప్రభావమ్ – 
శ్రీ సాయి సత్ చరిత్ర 11.అధ్యాయమ్ 4 .భాగమ్
శ్రీమతిమాధురి అంబేలాల్ దాంగ్ గారి అనుభవమ్ (అంధేరీ వెస్ట్, ముంబాయి)  సాయిలీల ద్వైమాసపత్రిక మార్చ్ఏప్రిల్ 2019 సంచికలో ప్రచురింపబడింది. 
శ్రీ సాయి సత్ చరిత్రలోని 11.అధ్యాయానికి, అనుభవానికి సంగ్రహంగా వివరణ మరాఠీ లో వ్రాసినవారు శ్రీమతి ప్రియంవద ప్రకాష్ కరాండే. వడలా వెస్ట్, ముంబాయి
ఆంగ్లానువాదమ్ --- శ్రీమతి మీనల్ తుషార్ దేశ్ పాండే
తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు,
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్.  9440375411  &  8143626744
మైల్ .డి.  tyagaraju.a@gmail.com

తను కోరుకొన్న కల నెరవేరినందుకు తనూజ ఆనందంతో పరవశించిపోయింది.  అపుడు మా అమ్మాయి నాతోఅమ్మా, నాకు విదేశీ విమానాలను నడిపే కంపెనీలలో పని చేయడం ఇష్టం లేదు.  నాకు దేశీయ విమానాలు నడిపే సంస్థలలోనే ఉద్యోగం చేయాలని ఉంది.” అని చెప్పింది.  నిర్ణయంతో జెట్ ఎయిర్ వేస్ లో ఉద్యోగానికి ఎంతో పట్టుదలతో రెండు మూడు సార్లు ప్రయత్నం చేసింది.  



కానిఖాళీలు లేవుఅని చెప్పి ప్రతిసారి ఉద్యోగంకోసం పెట్టిన దరఖాస్తులని తిరస్కరిస్తూ వచ్చారు.  ఇక ఉద్యోగం రాకపోయేసరికి చాలా నిరాశకు గురయ్యింది.  ఇది కాకపోతే మరొక కంపెనీలో ఉద్యోగ ప్రయత్నం చేసి చూడమని మా అమ్మాయికి ప్రోత్సాహమిచ్చాను.  ఉద్యోగానికి కావలసిన అర్హతలు అన్నీ ఉన్నా గాని సంవత్సరం ఏకంపెనీ నుంచి ఉద్యోగానికి పిలుపు రాలేదు.  ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాకపోవడంతో అయిష్టంగానే తల్ వాల్ కర్ లో జిమ్ ట్రైనర్ గా ఉద్యోగం ప్రారంభించింది.

మా అమ్మాయి పరిస్థితి చూసి నాకు చాలా బాధకలిగింది.  మా కుటుంబంలోనివారందరము సాయిబాబా భక్తులం.  ప్రతిరోజూ బాబానిబాబా మా అమ్మాయిని అటువంటి నిరాశా నిస్పృహలతో చూడలేకపోతున్నాను.  దయ ఉంచి ఆమె పైలట్ కావలన్న కోరికను నెరవేర్చు అని నిన్ను వేడుకొంటున్నాను.  ఉద్యోగం కోసం ఎంతో శ్రమిస్తోంది.  కాని ఫలితం దక్కటల్లేదు.  నువ్వు మాత్రమే సహాయం చేయగలవు.  ఆమెకు ఒక దారి చూపించి ఉద్యోగ ప్రయత్నంలో విజయం సాధించేలా చూడుఅని ప్రార్ధించుకున్నాను.

ప్రతిరోజు మా అమ్మాయి తనూజ కోసం ఎంతో భక్తిశ్రధ్ధలతో బాబాని ప్రార్ధించుకుంటూ ఉన్నాను.  ఇటువంటి పరిస్థితులలో ఆయన తప్ప మరెవరూ సహాయం చేయరు.  రోజులు గడుస్తూ ఉన్నాయి.  ఒకరోజు షిరిడీ సాయి సంస్థానం వారి సాయిలీల పత్రిక చదువుతున్నాను.  అందులో ఒక భక్తుడు తనకు కలిగిన అనుభవాన్ని రాసాడు.  తనకు ఉద్యోగం రాని పరిస్థితులలో శ్రీ సాయి సత్ చరిత్రలోని 11 .ధ్యాయాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా చదివిన తరువాత త్వరలోనే తను అనుకున్న ఉద్యోగం లభించిందని, ఆవిధంగా బాబా తన కోరికను తీర్చారని వివరించాడు.

ఆభక్తుడు వ్రాసిన అనుభవాన్ని చదివి విషయం మా అమ్మాయికి తప్పకుండా చెప్పాలనిపించింది.  తనూజా, నువ్వు కూడా శ్రధ్ధతో ప్రతిరోజు 11 .అధ్యాయాన్ని పారాయణ చెయ్యి.  తొందరలోనే నీవు కోరుకొన్న ఉద్యోగం వస్తుంది.  నీకోరిక నెరవేరుతుందిఅని చెప్పాను.  అలాగే వెంటనే నువ్వు చెప్పినట్లే చేస్తాను, అని చెప్పి, కాని, నాకు మరాఠీ చదవడం సరిగ్గ రాదు మరెలాగా?” అంది.

దాని గురించి బెంగ పెట్టుకోకు, నీ శక్త్యానుసారం చదువు.  సాయిబాబా నీలోని ఉద్దేశ్యాన్ని, దీక్షని గమనిస్తారు.  నీలో ఉన్న శ్రధ్ధను, నమ్మకాన్ని, నీ సంకల్పాన్ని గమనిస్తారు.  నీ సంకల్పబలమే ముఖ్యం.” అని చెప్పాను.
                  om sai ram 🙏🙏 #saisatcharitra #sai #saibaba #saranam #sainath ...
మా అమ్మాయి ఆవారంలోనే గురువారంనాడు 11 .ధ్యాయాన్ని చదవడం మొదలుపెట్టడానికి నిర్ణయించుకుంది.  గురువారమునాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి, బాబాను మస్ఫూర్తిగా ప్రార్ధించుకుని అగరువత్తులు వెలిగించింది.  ప్రతిరోజు 11 .అధ్యాయాన్ని చదవడం ప్రారంభించింది.  రెండు వారాల తరువాత మూడవ గురువారము నాడు జెట్ ఎయిర్ వేస్ వాళ్ల దగ్గరనుండి పరీక్షకు రమ్మని ఉత్తరం వచ్చింది.  వారు పెట్టిన పరీక్షలో విజయం సాధించింది.  తను పరీక్ష పాసయిన రోజు కూడా గురువారం.  దాని ఫలితంగా ఆమెకు జెట్ ఎయిర్ వేస్ లో తనుకోరుకున్న ఉద్యోగం లభించింది.  తను మొట్టమొదటగా ఉద్యోగంలో ప్రవేశించిన రోజు కూడా గురువారమే.  ఇది ఆమె జీవితంలో మరచిపోలేని అధ్బుతమయిన బాబా చూపించిన లీల.  బాబా తన ప్రక్కనే ఉండి ఆమెకు ఇంత చక్కని అనుభవాన్ని కలిగించారు.  ఆరోజునుండి మా అమ్మాయికి సాయిబాబా మీద తిరుగులేని భక్తి ఏర్పడింది.

11..అధ్యాయం పారాయణ చేసిన ఫలితం వల్లనే సాయిబాబా తాను ఇంకా జీవించి ఉన్నాననే విషయాన్ని మరొకసారి నిరూపణ చేసారు.
                 My Harships Ended By Reading Shri Sai Satcharitra - Sai Devotee ...
పారాయణ ప్రభావం వల్లనే తనూజకి ఎప్పటినుంచో తను కోరుకొన్న కల నిజమయింది.  శ్రీసాయి సత్ చరిత్రలోని 11 .అధ్యాయం యొక్క శక్తి అటువంటిది.  శ్రీసాయినాధ్ మహరాహాజ్ కి మేమెంతో ఋణపడిఉన్నాము.  బాబాకు కోటి కోటి ప్రణామాలు.
(సమాప్తం)
(రేపటి సంచికలో మరొక ఆసక్తికరమయిన విషయమ్)
           &
(శ్రీ సాయిసాగరం నుండి వెలికితీసిన ఆణిముత్యాలు తరువాయి భాగమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List