07.09..2022
బుధవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 21 వ, భాగమ్
అధ్యాయమ్
–19
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
9440375411 & 8143626744
సాయికృప
వల్ల విదేశీ ప్రయాణం
ఆగస్టు 1 వ.తేదీ 1999 వ.సంవత్సరం. మా అబ్బాయి పోవయ్ ఇన్శ్ టిట్యుట్ లో ఐ.ఐ.టి. పూర్తి చేసాడు.. ఇక ఎం.ఎస్. చేయడానికి అమెరికా వెళ్ళేందుకు సిధ్ధమవుతున్నాడు. వెళ్ళేముందు మా కులదేవతయిన శాంతా దుర్గాదేవిని దర్శించుకోవడానికి గోవా వెళ్లడానికి నిర్ణయించుకున్నాము. అందువల్ల 4 వ.తారీకున బయలుదేరి 6 వ. తేదీకి తిరిగివచ్చిన తరువాత అమెరికా ప్రయాణానికి తయారవచ్చని భావించాము. క్షేమంగా గోవాకి చేరుకున్నాము.
(శాంతా దుర్గాదేవి , గోవా)
అమ్మవారికి పూజ చేయించుకుని, గోవాలో ప్రసిధ్ధి చెందిన
వాటిని కొనుక్కుని బయలుదేరాము. తిరుగు ప్రయాణంలో
అనుకోకుండా పెద్ద అవరోధం. ఒకచోట కొండచరియ విరిగి
పడటం వల్ల రోడ్డు మూసుకుపోయింది. విపరీతంగా
వర్షాలు కూడా పడుతూ ఉండటంవల్ల రెండు రోజులు రోడ్డు మీదనే ఉన్నాము. మేము 9 వ.తారీకుకల్లా ముంబాయిలో ఉండాలి. అరోజున కాలేజీలో కార్యక్రమాలున్నాయి. అదేరోజు రాత్రి 12 గంటలకు విమానంలో బయలుదేరాలి,
మమ్మల్ని ఎలాగయినా 9 వ.తారీకు ఉదయానికల్లా బొంబాయి చేర్చు బాబా అని బాబాని ప్రార్ధించుకున్నాము. కాని ఆరోజు ఇంటికి చేరుకునేటప్పటికి ఆలశ్యమయింది. ఇంటికి చేరుకున్న వెంటనే కాలేజీకి వెళ్ళాము. సాయంత్రం ఇంటికి వచ్చి విమానాశ్రయానికి వెళ్ళడానికి
తయారవుతూ ఉన్నాము. అప్పటికే ఆలశ్యమయి రాత్రి
గం.9.30 అయింది. ఆరోజు ట్రాన్స్ పోర్ట్ వాళ్ళు
సమ్మె చేస్తూ ఉండటం వల్ల టాక్శీలు ఏమీ దొరకలేదు. కాని మా అబ్బాయి ప్రశాంత్ స్నేహితులు ఎంతో సహాయం
చేసారు. ఎలాగయితేనేమి విమానాశ్రయానికి చేరుకున్నాము. ప్రశాంత్ క్షేమంగా అమెరికా చేరుకున్నాడు. అక్కడ అతని స్నేహితులు విమానాశ్రయానికి వచ్చి మా
అబ్బాయిని కూడా తీసుకువెళ్లారు. క్షేమంగా అమెరికా
చేరుకున్నందుకు మేము హాయిగా ఊపిరి పీల్చుకున్నాము.
అంతా
సాయికృప వల్లనే సాధ్యమయింది.
షీతల్
పీ
9833896950
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment