08.09..2022 గురువారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 22 వ, భాగమ్
అధ్యాయమ్
– 20
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
9440375411 & 8143626744
నన్ను
భక్తి మార్గంలోకి నడిపించిన సాయి
కొన్ని సంవత్సరాల క్రితం వార్తాపత్రికలో ఒక ప్రకటన వెలువడింది. “మీ పట్టణంలో ఏదయినా దేవాలయంలో సామాజిక సేవలు చేస్తూ ఉన్నట్లయితే మాకు ఆ గుడికి సంబంధించిన అన్ని వివరాలు తెలియచేయండి. దానిని మేము మా వార్తా పత్రికలో ప్రచురిస్తాము” ఇదీ ఆ ప్రకటన యొక్క సారాంశం. ఇది చదివిన తరువాత, ఆ వార్తా పత్రికను ఉజ్జ్వల గారికి చూపించడానికి వెంటనే ఆమె ఇంటికి వెళ్లాను.
ఉజ్జ్వల గారు వారి అమ్మగారు వారి సాయి మందిరంలో
జరిగేటటువంటి కార్యక్రమాలన్నింటి వివరాలు పూర్తిగా వివరించారు. ఆ వివరాలన్నీ ఆ వార్తాపత్రికవారిచ్చిన చిరునామాకు
పంపించాను. మరుసటి వారం బోర్కర్ గారి సాయిమందిరం
యొక్క వివరాలన్ని వార్తా పత్రికలో ప్రచురింపబడ్డాయి. అది చదివి, వారిద్దరూ ఎంతగానో సంతోషించారు.
మా
అమ్మమ్మగారు నా చిన్నతనంలో నన్ను ప్రతిరోజు సాయిమందిరానికి తీసుకుని వెడుతూ ఉండేవారు. నేను సాయి భక్తుడినవుతానని ఎపుడూ అనుకోలేదు. నేను ప్రతిరోజు సాయి సత్ చరిత్రలోని ఒక అధ్యాయాన్ని
పారాయణ చేయడం మొదలుపెట్టాను. మన జీవితంలోని
అన్ని చింతలను వదిలివేసి సాయి చరణాలకు సర్వశ్య శరణాగతి చేసుకోవాలనే సత్యాన్ని కొన్ని
రోజుల తరువాత గ్రహించుకున్నాను.
నేను
అనిరుధ్ధ బాపూ గారింటిలో జరిగే సత్సంగానికి వెడుతూ ఉండేదానిని. అక్కడ బాపూ గారు సాయిసత్ చరిత్రలో పరీక్షలు పెడుతున్నారని
తెలిసింది. నేను కూడా ఆయన నిర్వహిస్తున్న పరీక్షకు
తయారయ్యాను. నేను సాయి సత్ చరిత్రను చదువుతూ
అందులోని విషయాలను ఒక పుస్తకంలో రాసుకుంటూ ఉండేదానిని. బాపూగారు ఆచరణాత్మకంగా పరీక్ష పెడుతూ ఉండేవారు. ఆ పరీక్షలో కూడా నేను పాల్గొంటూ ఉండేదానిని. ఆ పరీక్షలకు నేను చాలా సార్లు సాయి సత్ చరిత్ర ఆధారంగా
పాల్గొన్నాను. మనం బాబా గురించిన వివరాలన్నీ
తెలుసుకోవాలనీ ఆయన చర్యల యొక్క అర్ధాలను గ్రహించుకోవాలన్నదే ఆ పరీక్షల ముఖ్యోద్దేశం. ఎంతో మంది యోగులు ఉన్నారు. వారి గురించిన పుస్తకాలన్నిటినీ చదివినట్లయితే మనకు
వారియొక్క జీవితం వేరు వేరు పరిస్థితులలో వారు చేసిన చర్యలయొక్క ఆంతర్యం ఏమిటన్నది
మనకు అవగాహన కలుగుతుంది. మనం వారినుంచి ఎన్నో
ముఖ్యమయిన విషయాలను నేర్చుకోగలుగుతాము. బాబా
తన భక్తులందరికీ ఎల్లపుడూ సరియైన పధ్ధతిలో మార్గాన్ని చూపేవారు. సాయి చేసిన ప్రతి చిన్న పని గురించి మనం బాగా ఆలోచించాలి. ఆయన ఆవిధంగా ఎందుకు చేసారు, దాని యొక్క అంతరార్ధం
ఏమిటన్నదాని గురించి కూడా మనం అర్ధం చేసుకోగలగాలి. చాలా సార్లు భక్తులు సాయిబాబాను తమ జీవితంలో ఎదురయే
సమస్యల గురించి ప్రశ్నిస్తూ ఉండేవారు. బాబా
వారి సమస్యలకు సమాధానాలు ఇస్తూ వారిని సంతృప్తి పరిచేవారు. యోగులు ఎల్లపుడూ తమ భక్తులను ప్రేమిస్తారు. అంతేకాదు తమ భక్తుల జీవితంలో సమస్యలు వచ్చినపుడు
వాటిని ఎదుర్కొనగలిగేలా మార్గాన్ని చూపేవారు.
మనమందరం
మన హృదయాంతరాళనుండి సాయిని ప్రార్ధించుకోవాలి.
సాయి యొక్క దయాసాగరం మనలని ఎపుడూ పతనం కానివ్వదు.
శ్రీమతి
మీనా పేట్
0 comments:
Post a Comment