12.10.2022 బుధవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 37 వ, భాగమ్
అధ్యాయమ్
– 35
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
9440375411 & 814362674
సాయి
నెరవేర్చిన కోరిక….
నాకు 1982 వ.సం. లో వివాహమయింది. వివాహమయిన తరువాత నా భార్య కవిత షిరిడీ వెడదామని కోరింది. ఆమె కోరిక ప్రకారం ఇద్దరం షిరిడీకి వెళ్ళాము. ఆ రోజుల్లో షిరిడీకి నేరుగా రైలు సౌకర్యం లేదు. బస్సులు కూడా అంతంత మాత్రమే. అందువల్ల మేము మన్మాడ్ ఎక్స్ప్రెస్ లో మన్మాడ్ చేరుకుని అక్కడినుండి బస్సులో ఉదయం 7 గంటలకి షిరిడీ చేరుకున్నాము. నేను షిరిడీకి రావడం అదే మొదటిసారి. మా సామానులు భద్రపరచుకోవడానికి ఒక లాకర్ తీసుకున్నాము.
బయట కామన్ బాత్ రూములో స్నానాలు చేసి బాబాను దర్శించుకోవడానికి
క్యూలో నుంచున్నాము. ఉదయం పది గంటలకి బాబాను
దర్శించుకున్నాము. బాబాని దర్శించుకున్నందుకు
నాకెంతో ఆనందం కలిగింది. రాత్రంతా సరిగ నిద్ర
లేకపోవడంతో నాకు చాలా బడలికగా ఉంది. నా భార్య
11 గంటలకే బాబా గారి అన్న ప్రసాదం తిన్న తరువాత బొంబాయికి తిరిగి వెడదామంది. నేను సరే అన్నాను. కాని మరలా వచ్చినపుడు సౌకర్యవంతంగా
ఉండే బస చూసుకుని ప్రశంతంగా బాబాని దర్శించుకోవచ్చని అనుకున్నాము.
కాని,
ఈ యాత్ర తరువాత మరలా షిరిడీకి వెళ్ళే అవకాశం నాకు కలగలేదు. రెండు మూడు సార్లు షిరిడీకి వెడదామని అనుకున్నాను. కాని ఏదో ఒక కారణాంతరాల వల్ల వెళ్లలేకపోయాను. ఆవిధంగా 18 సంవత్సరాలపాటు బాబా నన్ను షిరిడీకి రావటానికి
అనుమతి ప్రాసాదించలేదు. ఈ మధ్య కాలంలో నా భార్య
రెండు సార్లు షిరిడికి వెళ్ళి వచ్చింది.
కాని బాబా నన్ను మాత్రం అనుమతించలేదు.
18 సంవత్సరాల తరువాత నాకు బ్రాంచి మేనేజరుగా షిరిడీలో ఉన్న హెడ్ క్వార్టర్స్
కి బదిలీ అయింది. నాకు ఉండటానికి ప్రత్యేకించి
ఒక బంగళా ఇచ్చారు. నేను బంగళా బయట తోటలో కూర్చుని
సమాధి మందిరం వెపు చూస్తూ ఉంటే నేను నా భార్యతో మొట్టమొదటిసారి షిరిడి వెళ్ళినపుడు
అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. “మరలా షిరిడీకి
వచ్చినపుడు మనం మంచి సౌకర్యంగా ఉండే వసతి చూసుకుందాము”. 18 సంవత్సరాల తరువాత బాబా నన్ను
షిరిడీకి లాక్కుని వచ్చి ప్రత్యేకించి నాకు ఒక బంగళాను ఏర్పాటు చేసారు. మేము షిరిడీలో మూడు సంవత్సరాలున్నాము. ఈ మూడు సంవత్సరాలలో నేను సంగీతం, కవిత్వం, నేర్చుకున్నాను. నేను షిరిడిలో నా గురువుగారయిన మాతా నీలతాయి కర్వేని
కూడా కలుసుకున్నాను.
వినాయక్
షిండే
(సర్వం
శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment