13.10.2022 బుధవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 38 వ, భాగమ్
అధ్యాయమ్
– 36
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
9440375411 & 814362674
నా అరచేతిలో వేపాకులు…
బాబాకు
అన్నీ అవగతమే. మన మనసులోని విషయాలు, మన ఆలోచనలు
సమస్తం బాబాకు తెలుసు. డా.గావంకర్ గారి మరణం
తర్వాత కూడా నేను ప్రతీ సంవత్సరం కోజగిరి పూర్ణిమ జరుపుకోవడానికి ఇప్పటికీ షిరిడీ వెడుతూ
ఉన్నాను. నేను ముంబాయిలో ఉన్నపుడు ఆయనతో కలిసి
ప్రతిసంవత్సరం కోజగిరి పూర్ణిమకు వెళ్ళేవాడిని.
పూనాకి వచ్చేసిన తరువాత నేను ఒక్కడినే షిరిడీకి వెడుతున్నాను.
కోజగిరి
పూర్ణిమ తరువాత మూడవరోజున అంటే సెప్టెంబరు 5 వ.తారీకున స్నానం చేసిన తరువాత బాబా దర్శనానికి వెళ్ళాను. బాబాను దర్శించుకోవడానికి ముందుగా మూడు పధ్ధతులలో
చేసుకోవాలి. మొట్టమొదట పాదుకా దర్శనం, తరువాత
ద్వారకామాయి ఆతరువాత సమాధి దర్శనం చేసుకోవాలి.
నేను వేపచెట్టుకు ప్రదక్షిణం చేస్తున్నపుడు అక్కడ ప్రతివాళ్ళు చెట్టుక్రింద
రాలి పడిన వేపాకులను భక్తితో ఏరుకుంటున్నారు.
ఆవిధంగా ఎందుకు చేస్తున్నారని అక్కడ ఉన్న ఒకమ్మాయిని అడిగాను. “సాయిబాబా వారి గురువు ఇదే చెట్టుక్రింద తపస్సు
చేసుకున్నారనీ, బాబాకూడా ఇక్కడె తపమాచరించారు.
అందువల్లనే ఈ వేపచెట్టుకు అంతటి పవిత్రత” అని చెప్పింది.
నాకు
కూడా ఒక్క ఆకునయినా ఏరుకోవాలనిపించింది. కాని
దొరకలేదు. ఆతరువాత నేను ద్వారకామాయికి వెళ్ళి
చివరగా సమాధిని దర్శించుకున్నాను. సమాధి దర్శనం
అయిన తరువాత కొంతసేపు అక్కడే ఉండి బాబాషింపీ గారి మునిమనవడయిన మిరేన్ గారి ఇంటికి వెళ్లాను. మిరేన్ గారు మాకు కుటుంబ స్నేహితులు. మిరేన్ గారి అబ్బాయి మాకు ఒక ప్లాస్టిక్ సంచీ ఇచ్చాడు. అందులో బాబా ఊదీ, వేపాకులు ఉన్నాయి. వాటిని చూడగానే నా కళ్ళల్లో ఆనందభాష్పాలు కారాయి. ఎన్నో సార్లు నేను మిరేన్ గారి ఇంటికి వెళ్ళాను
గాని, ఎప్పుడూ వాళ్ళు నాకు ఊదీ గాని, వేపాకులను గాని ఇవ్వలేదు. ఈ రోజు నేను నామనఃస్ఫూర్తిగా నాకు వేపాకులు కావాలని
తలుచుకోగానే బాబా నామనసు తెలుసుకుని నా కోరికను తీర్చారు.
శ్రీమతి
అల్కా రిష్వద్కర్
(సర్వం
శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment