15.10.2022
శనివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 39 వ, భాగమ్
అధ్యాయమ్
– 37
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
9440375411 & 814362674
బాల్కనీలో
పక్షులు
నాకు పిల్లులంటే చాలా ఇష్టం. మేము ఉన్న పాత ఇంటిలో అయిదు పిల్లులు ఉండేవి. అవి నాతోపాటే ఉంటుంన్నందువల్ల నేనే వాటి ఆలనా పాలనా చూస్తూ ఉండేదానిని. మేము ఇంకొక ఫ్లాట్ కి మారిపోయాము. అక్కడి సొసైటీవాళ్ళు పిల్లులను పెంచుకోవడానికి సమ్మతించలేదు. అందువల్ల నేను ఆ అయిదు పిల్లులను ఇంతకుముందు నేను ఉన్న పాత ఫ్లాట్ సొసైటీవాళ్ళకే ఇచ్చేసాను. పిల్లులను సాకడమే నాలక్ష్యం కాదు అని నా అభిప్రాయం. ఇక్కడ నేను కొత్తగా మారినచోట మా ప్రక్క ఫ్లాట్ వాళ్ళు బాల్కనీలో బయట పక్షులకు ఆహారము, నీరు ఉంచే ఫీడర్ ఏర్పాటు చేసుకున్నారు. దానిని బయట వ్రేలాడదీసి పక్షులకు ఆహారం నీరు ఉంచుతున్నారు.
అందువల్ల పక్షులు స్వేచ్చగా అక్కడికి వస్తూ ఉన్నాయి. మా కొత్త ఫ్లాట్ లో మొత్తం మూడు బాల్కనీలు ఉన్నాయి. నాకు కూడా ఆవిధంగా ఫీడర్ ను ఏర్పాటు చేసి పక్షులకు
ఆహారం, నీరు ఉంచాలనిపించింది. ఒక ఫీడర్ ను
కొనుక్కుని వచ్చి బాల్కనీలో వ్రేలాడదీసాను.
కాని ఎన్ని రోజులయినా ఒక్క పిట్ట కూడా రాలేదు. అపుడు నేను బాబాతో బాబా, పిల్లులే నాకు ముఖ్యం కాదు. కనీసం పక్షులయినా వచ్చి కిలకిలమంటూ నా బాల్కనీలోకి
వస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని ప్రార్ధించుకున్నాను.
ప్రతిరోజు
బాల్కనీలోకి వెళ్ళి చూసేదానిని. కాని ఎపుడూ
నిరాశే. ఆతరువాత నాకు షిరిడీ వెళ్ళి బాబాను
దర్శించుకుని నా కోరికను విన్నవించుకోవాలనిపించింది. బాబా నా
విన్నపాన్ని ఖచ్చితంగా తీరుస్తారని నా ప్రగాఢ నమ్మకం. నేను షిరిడీ వెళ్ళి ఆయనను ప్రార్ధించుకున్న తరువాత
నా కోరికను ఆయనతో చెప్పుకుని ఇంటికి తిరిగి వచ్చాను. షిరిడీనుంచి తిరిగి వచ్చిన రెండు రోజులకు ఉదయాన్నే
నాకు పక్షుల సందడి వినిపించింది. నాకు చాలా
సంతోషం కలిగింది. బాబా నా కోరికను తీర్చినందుకు
ఆయనకు నా కృతజ్ణతలు తెలుపుకున్నాను.
పూర్ణిమా
గాడ్గిల్
9766553739
కొంతమందికి ఒక సందేహం రావచ్చు. పక్షులు రానంత మాత్రాన బాబాను ప్రార్ధించుకోవాలా అని. సాయిమీద అచంచలమయిన విశ్వాసం ఉన్నవాళ్ళు ఏ చిన్న పనికయినా సాయిమీదనే ఆధార పడతారు. ఇక్కడ ఆమెకి ఎన్ని రోజులయినా పక్షులు రాకపోవడం వల్ల నిరాశ కలిగింది. బాబా కూడా ఆమెలో ఉన్న ఆరాటాన్ని గుర్తించారు. ఒకవేళ పక్షులు రాలేదని ఆమె మధ్యలోనే ఇక పక్షులు రావేమోలే అని తను ఏర్పాటు చేసిన ఫీడర్ ను అలాగే ఉంచేస్తుందా లేక తీసేస్తుందా అని పరీక్షించి కూడా ఉండవచ్చు. ఆమెలో సంకల్పం ఉంది. అందుకనే ఆమె షిరిడీ వెళ్ళి బాబాకు చెప్పుకోగానే బాబా ఆమె కోరికను తీర్చారు.
(రేపటి సంచికలో మరొక ఆసక్తికరమయిన అనుభవమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment