16.04.2026
గురువారమ్
ఓం సాయి
శ్రీ సాయి జయయయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయిలీల ద్వైమాస పత్రిక జనవరి, ఫిబ్రవరి, 2026 సంచికలో ప్రచురింపబడిన బాబా లీలలు.
(నవంబరు, డిసెంబరు, 2025 సంచికలో ప్రచురింపబడినవాటికి కొనసాగింపు)
శ్రీ
సాయి మహరాజ్ ప్రసాదించిన అధ్బుత అనుభవాలు
శ్రీ
సాయిబాబా వారి పవిత్రమయిన ఊదీ యదార్ధ సంఘటనల ఆధారంగా జరిగిన ఆధ్యాత్మిక గాధ.
శ్రీ
సాయిమహరాజ్ ప్రసాదించిన అధ్భుత అనుభవాలు… 11 వ.భాగమ్
మరాఠీ
నుండి ఆంగ్లానువాదం.. షంషాద్ మీర్జా
తెలుగు
అనువాదం .. ఆత్రేయపురపు త్యాగరాజు,
నిజాంపేట,
హైదరాబాద్,
ఫోన్
-- 9440375411 & 81436267
ఈ మెయిల్..
tyagaraju.a@gmail.com
శ్రీ
సాయిబాబా వారి పవిత్రమయిన ఊదీ – మాహాత్మ్యమ్
శస్త్ర
చికిత్స లేకుండా బాధిస్తున్న వ్రణం నయమగుట
శ్రీ
సాయిబాబా వారి అనుగ్రహమ్ ఎటువంటిదో నిరూపించే దివ్యమయిన లీలలు లెక్కలేనన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ఎటువంటి కల్పిత కధలు కాదు. ఆయన ఉన్నారనడానికి సజీవ సాక్ష్యాలు. మానవ ప్రయత్నాలు ఏమీ పనిచేయనపుడు గురువుయందు మనకు
ఉన్న నమ్మకం మాత్రమే పని చేస్తుందనే విషయం అటువంటి సంఘటనలు గుర్తు చేస్తూ ఉంటాయి.
అటువంటి ఒక సంఘటన మాకుటుంబంలో జరిగింది. మా తమ్ముడికి చేతిమీద వ్రణం ఏర్పడి చాలా బాధ పడుతున్నాడు.
(బహుశ 1971 సం.లో అనుకుంటాను. నేను
డిగ్రీ చదివే రోజులలో నా కుడిచేతి మీద చిటికెన వేలు క్రింద (ముంజేతికి పైన) వ్రణం లేచి బాగా బాధ పెట్టసాగింది. చేయి కిందకి దించితే విపరీతమయిన సలుపు. అలాగే కొన్ని రోజులు బాధపడి చివరికీ డాక్టరు దగ్గరికి
వెళ్లాను. డా. రెబెక్కా ఆపరేషన్ చేసారు. చిన్న గాటు పెట్టగానే వ్రణం పగిలి సలుపు బాధ మొత్తం
తగ్గిపోయాయి. ఆపరేషన్ కి ఎనిమిది రూపాయలు. అప్పట్లో నాకు అంతగా దైవభక్తి లేదు బాబా అంటె తెలీదు. ఇది ఎందుకు చెప్పానంటే చేతిమీద లేచిన వ్రణం ఎంత
సలుపు పెడుతుందో చెప్పడానికి. త్యాగరాజు)
మేము గ్రామంలో ఉన్నపుడు మా తమ్ముడి చేతిమీద వ్రణం లేచింది. దానివల్ల చేయి బాగా వాచిపోయి విపరీతంగా సలపడం మొదలయింది. గ్రామంలో దొరికే మందులన్నీ వాడాడు కాని ఎటువంటి
ఫలితం కనిపించలేదు. ఆ తరువాత మేము ఉంటున్న
అంధేరీకి వచ్చాడు నేను మాతమ్ముడిని వైద్యుడి
దగ్గరకు తీసుకువెళ్లాను.
వారు
మా తమ్ముడి చేయిని బాగా పరీక్షించి, శస్త్రచికిత్స చేయడం ఒక్కటే మార్గమని అన్నారు. శస్త్ర చికిత్స అనగానే మాలో ఒక విధమయిన భయం ఆవహించింది. మా తమ్ముడి బాధ ఇంకా ఎక్కువయింది.
ఆ సమయంలో
నాకు బాబాగారి ఊదీ గుర్తుకు వచ్చింది. మా అన్నయ్య
కూడా అదే విషయం చెప్పడంతో నేను ఊదీని నీటిలో కలిపి ఆరోజు రాత్రి మాతమ్ముడి చేతిమీద
లేచిన వ్రణం మీద రాసాను.
ఊదీ నీటిని
రాయగానే ఆశ్చర్యకరంగా చేతిలో వణుకు మొదలయింది.
రాత్రంతా మా తమ్ముడికి నిద్ర పట్టలేదు.
ఉదయం అయినా గాని చేతిమీద ఉన్న వ్రణం పగలలేదు. మా అన్నయ్య మరొకసారి ప్రయత్నిద్దామన్నాడు.
“మళ్ళీ
ఊదీ రాయి” అన్నాడు. “ఒకవేళ వ్రణం పగలకపోయినట్లయితే
వైద్యుడి దగ్గరకు తీసుకువెడదాము”
ఎటువంటి
మార్పు కనపడలేదు. ఆఖరికి మా అన్నయ్య మాతమ్ముడితో
చేతులు శుభ్రంగా కడుక్కో. మనం వైద్యుడి దగ్గరకు
వెడదాము” అన్నాడు.
అంతే
…. మా తమ్ముడు చేతులు కడుగుకోవడం మొదలు పెట్టగానే అధ్భుతం జరిగింది. హటాత్తుగా చేతిమీదనున్న వ్రణం తనంతతానుగా పగిలిపోయింది. వెంటనే సలుపు బాధ తగ్గిపోయాయి. కొద్ది రోజులలోనే శస్త్ర చికిత్స అవసరమే లేకుండా
పూర్తిగా తగ్గిపోయింది.
ఈ సంఘటన
బాబా ఉదీ యొక్క శక్తి ఎంతటిదో మరొకసారి ఋజువు చేసింది. మందు కాదు వైడ్యుడి కత్తికోత కాదు, సద్గురువు యొక్క
అనుగ్రహమే ఉపశమనాన్ని కలిగించింది. నిజం చెప్పాలంటే
ఊదీ వట్టి బూడిద కాదు. అది అదృశ్యంగా ఉన్న
బాబాగారి శక్తి. ఆ శక్తే మన శరీరానికి మనసుకి
ఉపశమనాన్ని కలిగిస్తుంది.
సాయిభక్తుడు
శ్రీ
సాయిలీల సం. 8 భాద్రపదం
(ఇంకా
ఉంది. మరుసటి సంచికలో)








0 comments:
Post a Comment