Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, December 20, 2011

Posted by tyagaraju on 5:19 PM

21.12.2011 బుధవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబా వారి శుభాసీస్సులు

ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ 1993 13 వ భాగాన్ని చదువుకుందాము.

సాయి.బా.ని.స. డైరీ - 1993


24.08.1993 మంగళవారము

నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి నిజమైన సాయి భక్తునికి ఉండవలసిన లక్షణాలు చెప్పమని వేడుకొన్నాను. శ్రీ సాయి ఇచ్చిన సూచనలు ::

1) ఎవరైతే పదిమిందిలోను తిరుగుతూ వారి ఆహార వ్యవహారాలను గౌరవించుతూ వారి మనసును నొప్పించకుండ సాయి చెప్పిన పధ్ధతిలో తమ జీవితాన్ని నడిపించగలిగినవాడు.

2) కుష్ఠు రోగముతో బాధపడుతున్న వ్యక్తి ప్రక్కన కూర్చుని ఏవిధమైన చికాకు లేదుండ భోజనము చేయగలవాడు నిజమైన సాయి భక్తుడు.

26.08.1993 గురువారము

జీవితములో సుఖ శాంతులు పొందాలంటే శ్రీ సాయి ఇచ్చిన సలహాలు ::

1) నీవు ధనవంతుడివి అయిన నీవు ఉండే యిల్లు నిరాడంబరముగా ఉండాలి.

2) కుటుంబ సభ్యులు అందరు కలసి రోజుకు ఒకసారి అయిన భగవంతుని పూజ ప్రసాదము స్వీకరించాలి.

3) భోజనము మితముగా చేయాలి.

4) పరస్త్రీల పొందు కోరకూడదు.

5) ఆస్థి పాస్థులు ఎక్కువగా యుండరాదు.

6) నేలమీద నిద్రపోవటానికి అలవాటు పడియుండాలి.

7) యితరుల సొమ్మును (ఆస్థిపాస్థులు) ఆశించరాదు.

8) ప్రాశాంత వాతావరణములో గృహము నిర్మించాలి.

9) పగ, వైషమ్యాలకు దూరంగా ఉండాలి. అంటే ఎక్కువ మందితో స్నేహాలు, బంధుత్వాలు యుండరారు.

10) నీ గొప్ప కోసము ప్రతివాడికి నీ చిరునామా యివ్వరాదు.

11) అన్ని కష్ఠాలకు మూలమైన మత్తు పానీయాలకు దూరముగా యుండాలి..

12) మన గురువు మీద తిరుగులేని విశ్వాసము యుంచి, వారి బోధలు ప్రకారము నడచుకోవాలి.

13) జీవితములో దుబారగా డబ్బు ఖర్చు పెట్టరాదు. నిరాడంబర జీవితము గడుపుతూ అందరికి ఆదర్శవంతుడివి కావాలి.

31.08.1993 మంగళవారము

శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో యిచ్చిన సందేశాలు.

1) నీవు కష్ఠాలలో ఉన్నపుడు ముఖము చాటు చేసుకొని తిరగనవసరము లేదు. కనీసము ఒకరిద్దరితో మనసు విప్పి మాట్లాడుకొని నీ మనసులోని భారాన్ని తొలగించుకో. 2) అందమైన పక్షి ఆకాశములో ఎగురుతూ ఉంటే చాలా అందముగా కనబడుతుంది.

అదే పక్షి చెట్టుమీద విరిగిన కాలితో కుంటుతూ కూర్చ్చున్నపుడు నీ మనసుకు ఏమని అనిపించుతుంది, ఒక్కసారి ఆలోచిందు.

ప్రతివాడిని దూరము నుండి చూస్తే అతను కులాసాగ చీకు చింత లేకుండ యున్నట్లే కనబడతాడు. అందుచేత ఎదుటివానిని దగ్గరనుండి చూసి అతని గురించి మాట్లాడాలి.

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List