Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, January 9, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1974 - (4)

Posted by tyagaraju on 5:27 PM

10.01.2012 మంగళవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1974 నాలుగవ భాగాన్ని చదువుకుందాము.


సాయి.బా.ని.స. డైరీ - 1974

25.01.1994

నిన్నటిరోజునుండి తిరిగి శ్రీ సాయి సత్ చరిత్ర తెలుగు నిత్యపారాయణ ప్రారంభించినాను. శుభ సందర్భములో శ్రీ సాయిని ఆశీర్వదించమని వేడుకొన్నాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి చెప్పిన మాటలు (1) నీ యింటి ఆడపిల్ల (కూతురు) ఎప్పటికైన బయట యింటికి వెళ్ళవలసిన పిల్లయే. అలాగే నీ యింటికి వచ్చే నీ కోడలు కూడ బయట యింటి పిల్లయే. అందుచేత వాళ్ళ కళ్ళలో నీరు రానీయకు.

(2) జీవితములో కొడుకు పుట్టినాడు అని సంబరము పడిపోకు.

జీవితము విజయవంతముగా ముగుస్తుంది అని నమ్మకము ఏముంది. అందుచేత జీవితములో కొడుకు అయిన కూతురు అయిన ఒక్కటే అనే నమ్మకము పెంచుకో. (3) శ్రీ సాయి సత్ చరిత్ర అనే పొలంలో తిరిగి యింకొకసారి పంట పండించటానికి కొబ్బరికాయ . పొలం పనులు ప్రారంభించినావు. నీకు నా ఆశీర్వచనాలు.

30.01.1994

నిన్నటి రోజు ప్రశాంతముగా గడచినది. రాత్రి శ్రీ సాయికి నమస్కరించి - సాయినాధ - "నీవు మానవ రూపములో యున్న రోజులలోని విశేషాలు చెప్పు తండ్రీ" అని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యాలు (1) శ్రీ సాయి భక్తుల యింట ఆరోజులలో ఎవరైన కొత్త చొక్క ధరించినపుడు (అంటే జన్మించినపుడు) పాత చొక్క పేరిట (అంటే గత జన్మ) అన్నదానము చేసేవారు.


ఈరోజులలో ఎవరు అన్నదానము చేయటములేదు. (2) యిరుగుపొరుగు వారు ఒకరికి ఒకరు సహాయము చేసుకొనేవారు ఆరోజులలో. ఈరోజులలో ఎవడికీ పక్కవాడి ధ్యాస లేదు. (3) రోజులలో రైళ్ళ రాకపోకలు చాలా తక్కువగా ఉండేవి. రోజులలో రైళ్ళ హడావిడి ఎక్కువగా యున్నాయి. (4) ఆనాటి ప్రజలు నోటిమాటతో ఆస్తులు కాపాడుకొనేవారు. ఈరోజులలో అంతా మోసమే.

01.02.1994

నిన్నటి రోజున ఆఫీసులో జరిగిన సంఘటన నా మనసును కలచి వేసినది. అన్యాయము పెరిగిపోయి న్యాయాన్ని అణచి వేస్తున్నది. నేను ఏమి చేయలేని స్తితిలో ఉండిపోయి దీనికి పరిష్కారము లేదా అని శ్రీ సాయిని ప్రశ్నించి నిద్రపోయినాను. శ్రీ సాయి నిన్నరాత్రికలలో యిచ్చిన సమాధానము కొంత వరకు మనసుకు ఊరట కలిగించినది. వాటి వివరాలు :

1. బయట జరుగుతున్న అన్ని విషయాలలోను కలుగ చేసుకోవద్దు.

2) తల్లి తన పిల్లలను కాపాడుకొనే విధముగా నేను నా పిల్లలను కాపాడుకొంటాను.

ఉదయము 7. 30 నిమిషాలకు నిత్యపారాయణ చేయటానికి శ్రీ సాయి సత్ చరిత్ర తీసినాను. ఈరోజు పారాయణ చేయవలసిన 9 . అధ్యాయములో మాటలు (84 . పేజీ 8 . లైను) "తల్లి ప్రేమ గల బాబా యాజ్ఞను జ్ఞప్తికి తెచ్చుకొనెను" మరియు రాత్రి కలలో శ్రీ సాయి అన్నమాటలు శ్రీ సాయిపై నా నమ్మకాన్ని ఎక్కువ చేసినవి.

02.02.1994

నిన్నటి రోజున నాజీవితములో నాకు అన్యాయము చేసిన వ్యక్తులు తారసపడినారు. వారిని మరచిపోవటానికి సలహా యివ్వమని శ్రీ సాయిని వేడుకొన్నాను. శ్రీ సాయి కలలో యిచ్చిన సలహాలు.

1) సూర్యభగవానుడికే తప్పలేదు గ్రహణముబాధ. గ్రహణము తర్వాత సూర్యభగవానుడు ప్రకాశించటము మానలేదే --

2) మనము మనకు సాయము చేసిన వ్యక్తులను జ్ఞాపకము ఉంచుకోవటము లేదు. మరి మనకు అన్యాయము చేసిన వ్యక్తులను జ్ఞాపకము ఉంచుకోవటములో అర్థము లేదు. అందుచేత వారిని మర్చిపో.

3) యితరులతో గొడవలు పడరాదు అనే ఆలోచన నీలో అనుక్షణము గుర్తు ఉండాలి. అటువంటప్పుడు నీకు అన్యాయము చేసే వ్యక్తులు చాలా తక్కువ మంది యుంటారు.

సలహాలు నా మనసుకు సంతోషము కలిగించినవి. వీటిని జీవితములో ఆచరించాలి అని నిర్ణయించుకొన్నాను.

03.02.1994

నిన్న రాత్రికలలో శ్రీ సాయి యిచ్చిన సనదేశము . "నీ కన్నీరును దీపపు ప్రమిదలోనింపి నీ అనుభవాలును ఒత్తిగా చేసి, శ్రీ సాయిపై భక్తితో వెలిగించి, వెలుగులో నిన్ను నీవు తెలుసుకో." సందేశము నా మనసులో చెరగని ముద్ర వేసినది.

(యింకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు




Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List