06.01.2012 శుక్రవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి ఆపద్భాందవుడు
ఈ రోజు బంగళూరు నించి సాయి భక్తురాలు విజయ గారు పంపిన బాబా లీలని ప్రచురిస్తున్నాను. ఈ లీలలో బాబా మీద ఆమెకు ఎంతటి ఢృఢమైన భక్తి, నమ్మకము, విశ్వాసం ఉందో మనకి అర్థమవుతుంది. బాబా తన భక్తులనెప్పుడు ప్రమాదాల బారిన పడకుండా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. బాబా లీల విజయగారు పంపిన మాటలలోనే. ఆయన మీద మనకు అచంచలమైన విశ్వాసం ఉంటే ఆయన మనవెంటే ఉంటూ మన రక్షణ చూస్తూ ఏదో ఒక రూపంలో అనుక్షణం మనలని కాపాడుతూ ఉంటారు.
ఓం సాయిరాం
సాయికి తెలియనిదంటూ ఏమి లేదు సర్వాంతర్యామి, భక్తులకి కామధేనువు వంటివారు. బాబాని ఒకసారి తలుచుకుంటే చాలు ....ప్రతిక్షణం మనవెంటే వుంటూ కాపాడుతారు..కావలసినది భక్తితో కూడిన ప్రేమ..బాబా కి ఏమయినా సమర్పించాలని మనం అనుకొని మరచిపోతే గుర్తు తెప్పించి మరీ వసూలుచేసుకుంటారు....అలాంటిది ఒక లీల నా జీవితం లో జరిగింది..నేను హైదరాబాదులో వున్నపుడు అది రైనీ సీజన్... ఎందుకో నా మనసులో బాబాకి స్వీట్ కారన్ పెట్టాలని అనిపించింది..సాయంత్రము బాగా వర్షం పడుటోంది..సిటీ మొత్తం రోడ్డులన్ని వర్షపు నీటితో నిండిపోయిఉన్నాయి...
ఆశ్చర్యకరమైన విషయం ఎమిటంటే స్వీట్ కారన్ బండి చాల చోట్ల వుండేవి కాని ఆ రోజు ఒక్కటి కూడా కనిపించలేదు....బాబా ఈరోజు నన్ను పరీక్షించదలచారేమో....ఒక్క బండి కూడా లేదు..నేను మొండిగా ఈ రోజు ఎలాగయిన బాబాకి స్వీట్ కారన్ పెట్టాల్సిందే అని వర్షం లో తడుస్తూ తిరగసాగాను. ..అలా చాలా సేపు తిరిగాక ఒక బండి కనిపించింది....
నేను వెళ్ళి స్వీట్ కారన్ తీసుకున్నాక మళ్ళీ తిరిగి వచ్చే దారిలో నాకు రోడ్డు కనిపించడం లేదు..ఎలాగా అని బాబా ని తలుచుకుంటున్నాను....వేరే దారి నుంచి వెడదామని ఒక అడుగు ముందుకు వేయాలని అనుకున్నాను. అంతలోనే ఒకతను గట్టిగా పిలుస్తూ మీరు అటు వెళ్ళద్దు అని అరిచాడు...నేను వెంటనే వెనక్కి వచ్చేసాను..తరువాత రోజు అక్కడ చూసినప్పుడు మట్టితో కూడిన గొయ్యి ఉంది ...బాబానే నాకు సహాయం చేసారు..లేకపోతే నేను పడిపోయేదాన్ని ఆ వర్షపు నీటిలో....బాబా కరుణ ఎప్పుడూ మా మీద ఇలాగే వుండాలని వేడుకుంటున్నా.....
విజయ
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment