01.12.2012 శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయితో మధురక్షణాలు - 9 వ.భాగము
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామ స్తోత్రం 12వ. శ్లోకం, తాత్పర్యం
శ్లోకం: వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితః సమః
అమోఘః పుండరీకాక్షో వృష కర్మా వృషా కృతిః ||
సృష్టియందలి సంపదగానూ, ఆసంపదను గోరు మనస్సుగనూ, సత్యముగను, ధర్మముగానూ, సామ్యము గలవానిగను, చక్కగా కొలువబడువానిగనూ, సముడుగనూ, వ్యర్ధముకానివానిగను, పద్మము వంటి కన్నులు కలవానిగనూ, వర్షము కలిగించువానిగనూ, వర్షమే తానైనవానిగనూ ధ్యానము చేయవలయును.
శ్రీసాయితో మధుర క్షణాలు 8వ.భాగములో పేరు చెప్పడానికిష్టపడని బాబా భక్తులు చెప్పిన లీలలలో 4 వ. లీల.
బాబాగారు జీవించి ఉన్న రోజులలో జరిగిన సంఘటనలలో ఒక సంఘటనను మహదీ బువా గారు ఈ క్రింది విధంగా వివరించారు.
చైనా బజార్ లో గొప్ప సంపన్నుడు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. అతనికి వ్యసనాలు బాగా ఎక్కువ. ఆ యువకుడు బాగా అత్యాస గల వడ్డీ వ్యాపారులవద్ద అప్పులు చేశాడు. ఆ వడ్డీ వ్యాపారులు ఇతని వద్ద ఉన్నదంతా లాగేసుకొని, వారు తాము ఇచ్చిన అప్పుకంటే అత్యంత అధిక మొత్తాలకి బాగా ఎక్కువ వడ్డీకి ప్రామిసరీ నోట్లు వ్రాయించుకొన్నారు. ఆ యువకుడు హీన స్థితికి దిగజారాడు. ఆ దౌర్భాగ్య స్థితి మరియు దివాల పరిస్థితినుండి బయటపడటానికి షిరిడీ వెళ్ళి సాయిబాబా ఆశీర్వాదములు తీసుకొమ్మని సలహా ఇచ్చారు. అతను షిరిడీ మసీదుకు వెళ్ళినప్పుడు, బాబాఆగ్రహంతో , డబ్బు ఇవ్వడానికి బదులు, కఱ్ఱ తీసుకొని అతని వెనకాల పరుగెత్తి అతనిని కొట్టి ఇలా అన్నారు " సగ్లా పైసా పనిన్ తక్లా పూడె జా మీ ఎతో" (నీ డబ్బునంతా నీటిలోకి విసిరి వేశావు. నువ్వు వెళ్ళు, నేను వస్తాను, నీకంటే ముందు నేనక్కడ ఉంటాను). ఆయువకుడు నిరుత్సాహంతో అణగారిపోయి బొంబాయికి తిరిగి వచ్చాడు. కాని అతను తన ఇంటిని సమీపించగానే తన ఇంటిలో జరుగుతున్నదానిని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. తనకు అప్పు ఇచ్చిన ఒక వడ్డీవ్యాపారి అక్కడ ఉన్నాడు. బాబా ఆ వడ్డీవ్యాపారితో "నువ్వు మళ్ళి ఈ అప్పుతీసుకున్నవాడి దగ్గరకు వచ్చావంటే నీ మెడ విరిచేస్తాను" అంటూ ఆవడ్డీ వ్యాపారిని బెదిరిస్తూ కనిపించారు. అతని వద్ద తాకట్టుపెట్టిన నగలు, పత్రాలన్నిటినీ వ్యసనపరుడైన ఋణగ్రస్తునికి తిరిగి ఇచ్చివేయమని ఆజ్ఞాపించారు. తీసుకున్న అప్పుమొత్తం ముట్టినట్లుగా కూడా పత్రం రాసి యిమ్మని వత్తిడి చేశారు. వ్యసనపరుడయిన యువకుడు బాబాని చూడగలిగాడు, కాని ఆ వడ్డివ్యాపారి ఒక దెయ్యాన్ని చూశాడు. ఏమయినప్పటికీ ఆ వడ్డివ్యాపారి భయంకరమైన దెయ్యాన్ని చూసి, తనను బలవంతపెట్టడంతో భయంతో అతను చెప్పినట్లే చేశాడు. అతను తన వద్ద తాకట్టు పెట్టిన నగలన్నిటినీ , పత్రాలనూ, తిరిగి ఇచ్చివేసి, అప్పుమొత్తం తీరిపోయినట్లుగా దస్తావేజు కూడా రాసి ఇచ్చాడు. బాబా వ్స్యనపరుడయిన యువకుడి వైపు తిరిగి "నేను నిన్ను విడిచిపెట్టేశాననుకున్నావు. కాని ఎవరయితే నన్ను శరణు వేడుతారో వారిని నేనెప్పుడు విడిచిపెట్టను (మాలా కోనీ శరణ్ ఘెయున్ ఆలె, త్యానా మీ కెవ్హం సొడ్నర్ నహీ)
శ్రీ బీ.వీ.నరసిం హస్వామీజీ గారి వివరణ
బొంబాయిలో నివసిస్తున్న ఈ నిజమైన భక్తుని నేను చూశాను. అతను చెప్పినదంతా నిజమని నేను నమ్ముతున్నాను.
సౌజన్యం:
సాఇ సుధ
మార్చ్ 1950
సాయిసుధ
ఏప్రిల్, 1950
(యింకా మరికొన్ని మధురక్షణాలు .....)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment