23.01.2013 బుధవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ విష్ణుసహస్ర నామం 27వ. శ్లోకం, తాత్పర్యము
శ్లోకం: అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టశ్శిష్టకృచ్చుచిః
సిధ్ధార్ధస్సిద్ధ సంకల్ప సిధ్ధిదః సిధ్ధి సాధనః ||
తాత్పర్యము : భవవంతుని సంఖ్యలకతీతునిగా, కొలతలకు అందని ఆత్మ రూపునిగా, ప్రత్యేకత గలవానిగా, జీవులయందు ప్రత్యేకత కల్గించువానిగా, నిర్మలమయినవారిలో నిర్మలత్వముగా, ధ్యానము చేయుము. ప్రయోజనము సిధ్ధించిన వాడగుటచే తన సంకల్పము సిధ్ధింపబడెను. మరియు సిధ్ధికి కారణమైనవానిగా అట్లు సిధ్ధించు మార్గము కూడా తానే అయిన వానిగా, ధ్యానము చేయుము.
కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 4
కాకా సాహెబ్ కూడా భక్తి
పరాయణుడు. ఆయన ఎంతో ప్రావీణ్యం
కలవాడు. ఆధ్యాత్మికం గురించి బాగా
తెలుసుకోవాలనే ఉత్సుకత ఉండేది. నానా
సాహెబ్ కూడా ఎంతో పాండిత్యం ఉన్నవాడు.
ఆయన
ఏదీ కూడా అర్ధం లేకుండా మాట్లాడే వ్యక్తి కాడు.
నానా సాహెబ్ మాటలు విన్న తరువాత కాకా సాహెబ్ హృదయంలో బాబా మీద క్రొత్తగా
ప్రేమ ఉద్భవించింది. భక్తి భావం పెరగడం
మొదలయి, మాయ (మోహం) తొలగిపోవడం
మొదలయింది. అప్పటికప్పుడే బాబాని కలుసుకుందామని నిర్ణయించుకొన్నాడు.
1910 వ. సంవత్సరంలో కాకా
సాహెబ్ ఎలక్క్షన్ పని మీద అహ్మద్ నగర్ కి వెళ్ళవలసి వచ్చింది. ఆయన సర్దార్ మిరికర్ గారి యింటిలో బస
చేశారు. సాయి భక్తులందరికీ మిరికర్ గారి గురించి బాగా తెలుసు మిరికర్ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా బాబా
మీద పూర్తి నమ్మకం ఉంది. ఆరోజులలో గుఱ్ఱపు పందాలు ప్రజాదరణలో ఉన్నాయి. ప్రజలందరూ కూడా గుఱ్ఱపు పందాలను చూడటానికి చాలా
ఆసక్తిని కనపర్చేవారు. సర్దార్ మిరికర్
గారు కూడా కాకాసాహెబ్ తో గుఱ్ఱపు పందాలకి వెళ్ళారు. ఆక్కడ వారు కోపర్ గావ్ మామలతదారయిన సర్దారు
మిరికర్ గారిని కలుసుకొన్నారు. సర్దార్
మిరికర్, బాలా సాహెబ్ మిరికర్ గారు
యిద్దరూ అన్నదమ్ముల పిల్లలు. ఈలోపులో నానా ఫాన్సే, అప్పా గాడ్రే యిద్దరూ కూడా వచ్చారు. అందరూ కలిసి బాబా లీలలను ఒకరికొకరు చెప్పుకోవడం
ప్రారంభించారు.
"బాబాకు అంకిత
భక్తుడయిన మాధవరావు దేశ్ పాండే అహ్మద్ నగర్ లో ఉన్నారు" అని నానా ఫాన్సే
చెప్పారు. గుఱ్ఱపు పందాలనుంచి వచ్చిన
తరువాత మిరికర్ గారు మాధవరావుని తీసుకొని రమ్మని తన సేవకుడిని పంపారు. ఆయన రాగానే కాకా సాహెబ్ గారు ఎంతో ఆనందంతో
ప్రేమగా మాధవరావుగారిని కౌగలించుకొన్నారు.
మాధవరావుగారు ".బాబా
దయ వల్ల మా అత్తగారి ఆరోగ్యం బాగుంది.
బాబా దర్శనం వల్ల వచ్చే అధిక లాభం మాట అటుంచి నేనిక్కడ వుండే అవసరం
లేదు. నేను ఈ రోజు రాత్రి రైలుకు
బయలుదేరతాను " అన్నారు. షిరిడీ,
కోపర్ గావ్ కి ఎక్కువ దూరంలో లేదని కాకా సాహెబ్
భావించారు. ఎన్నికలకు సంబంధించిన పని
ఏరోజైనా చేసుకోవచ్చు. మాధవరావు గారిని
కలుసుకునే బంగారంలాంటి అవకాశం నాకు లబించబోతోంది.
దీనిని నేను వదులుకోకూడదని కాకా సాహెబ్ భావించారు. వారు రాత్రి 10.గంటలకు అహ్మద్ నగర్ లో రైలు ఎక్కి కోపర్ గావ్ లో రైలు
దిగేటప్పటికి ప్లాట్ ఫారం మీద నానా సాహెబ్ చందోర్కర్ గారు ఉన్నారు.
"పిచ్చుకకు దారం కట్టి లాగినట్లుగా సాయిబాబా తన భక్తులని లాగుతారని నేను
చెప్పలేదా" అని నానా సాహెబ్ గారు అన్నారు.
ముగ్గురూ కూడా ఆనందంలో
మునిగి పోయి దత్తాత్రేయులవారిని దర్శించుకొని షిరిడీ వెళ్ళడానికి టాంగా
మాట్లాడుకున్నారు.
కాకా సాహెబ్ ద్వారకామాయిలోనికి
అడుగు పెట్టగానే శ్రీసాయిబాబా "ఓ! స్వాగతం లంగ్డా కాకా" అన్నారు.
శ్రీసాయిబాబా ఆయనను 'లంగ్డాకాకా' అని పిలవడం
మొదలుపెట్టినప్పటినుండీ షిరిడీలోని మిగతావారు కూడా ఆయనను కాకాసాహెబ్ అని
పిలవనారంభించారు.
కాకా సాహెబ్ శ్రీసాయిబాబా
దర్శనంతో అమితానందభరితుడై కాన్వాస్ మీద గీచిన చిత్రంలా నిశ్చలంగా ఉండిపోయాడు.
(కాకా సాహెబ్ మొదటగా షిరిడీ నవంబరు 2, 1909 న దర్శించారు)
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment