Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, April 2, 2017

శ్రీసాయి లీలా తరంగిణి –10 వ.భాగమ్

Posted by tyagaraju on 5:51 AM
      Image result for images of shirdi sai smiling
            Image result for images of rose hd
02.04.2017 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి –10 వ.భాగమ్
రచనః  శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు

    Image result for images of bharammani

(మూల రచన :  తెలుగు.   ఆంగ్లంలోకి అనుబదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త మాత్రుడుః  ఆత్రేయపురపు త్యాగరాజు
ఆల్ ఖైల్ గేట్,  దుబాయి

బాబా ప్రత్యక్ష దర్శనం

1986 వ.సంవత్సరం వేసవికాలం రోజులు. హైదరాబాదులో మా యింటిలో ఉన్నాము. ఒకరోజు నాభర్త మూత్రవిసర్జనకై తెల్లవారు ఝామున మూడు గంటలకు లేచారు.  గదిలోనుంచి డ్రాయింగ్ రూములోకి వచ్చారు.  


రాగానే సోఫాలో తెల్లని దుస్తులు ధరించిన ఒక వ్యక్తి సోఫాలో కూర్చుని ఉండటం కనిపించింది.       నాభర్త కంగారుగా “ఎవరది” అని గట్టిగా అడిగారు.  మెల్లగా సోఫా దగ్గరకు వెళ్ళారు.  సోఫాలో సాయిబాబా కూర్చుని ఉండటం స్పష్టంగా కనిపించింది.  ఒక్క సెకను లోపే సాయిబాబా అదృశ్యమయ్యారు.
                      Image result for images of shirdi saibaba sitting in sofa
నా భర్త వేసిన కేక విని మేమంతా డ్రాయింగు రూములోకి వచ్చాము.  నాభర్త ఎంతో సంతోషంగా కనిపించారు.  ఆయన మొహం బ్రహ్మండమయిన సంతోషంతో వెలిగిపోతోంది.  తన పూర్వజన్మ సుకృతం వల్ల తనకు బాబా ప్రత్యక్ష దర్శనం ఇచ్చారని ఎంతో సంతోషంగా చెప్పారు.

బాబా సోపాలో కూర్చున చోట శాలువాతో కప్పిఉంచాము.  అక్కడ బాబావారి పెద్ద సైజు ఫోటోని ఉంచాము.  మేము ఆ డ్రాయింగు రూములోకి వెళ్ళినప్పుడెల్లా అనవసర విషయాలను ఏమీ మాట్లాడుకునేవారము కాము.  బాబా అక్కడ కూర్చుని మమ్మల్ని గమనిస్తూనే ఉన్నరనే భావంతో ఉండేవాళ్ళము.  మా కులదైవంగా బాబా మాయింట్లోనే నివాసం ఉన్నారని భావిస్తూ ఉంటాము.
                                            ***
సాయిబాబా లీలలు అధ్భుతమైనవి, అనంతమైనవి
       
              Image result for images of sivanesan swamiji
              Image result for mallige flower photos
హైదరాబాదులో ఉంటున్న ఒక సాయి భక్తుని ఇంటిలో నాభర్త, శ్రీ శివనేశన్ స్వామీజీవారి ఫోటో చూశారు.  ఆఫోటో నాభర్తకు చాలా నచ్చింది.    అపుడా భక్తుడు ఫోటోముందు చీటీలు వేసాడు. బాబా ఆఫోటోను మాకు ఇమ్మని తమ అనుమతిని ప్రసాదించారు. బాబా అనుమతితో అతను ఆ ఫోటోను నా భర్తకు ఇచ్చాడు.  మేము శ్రీశివనేశన్ స్వామీజి వారి ఫోటోను ఎంతో సంతోషంతో మా యింటికి తీసుకుని వచ్చాము.  నాలుగు రోజుల తరువాత మాకు ఫోటో ఇచ్చిన సాయి భక్తుడు మాఇంటికి వచ్చి “మీకు స్వామీజీ  ఫొటో ఇచ్చినప్పటినుండి మాయింట్లో కష్టాలు మొదలయ్యాయి.  ఇంట్లోనే కాదు ఆఫీసులో కూడా సమస్యలుగా ఉంది.  నాకు మనశ్శాంతి లేకుండా పోయింది.  దయచేసి నాఫొటో నాకు తిరిగి ఇచ్చేయండి” అని వేడుకున్నాడు.  మేమేమీ అభ్యంతరం చెప్పకుండా ఆయన ఫొటో అతనికి ఇచ్చేశాము.  ఆతరువాత శ్రీశివనేశన స్వామీజీ వారి  ఫొటో కొందామని ఎంతో ప్రయత్నించాము.  షిరిడీలో కూడా ఆయన ఫొటో దొరకలేదు.  శ్రీస్వామీజీగారికి తన ఫొటో మావద్ద ఉండటం ఇష్టం ఉండచ్చు, లేకపోవచ్చు అని ఆలోచిస్తూ ఆ విషయాన్ని అయిష్టంగానే అంతటితో వదిలేశాము.

ఒక వారం తరువాత నాభర్త ఇంటిలో ఉన్న పాత పుస్తకాలన్నిటినీ ఒక పెట్టెలో సద్దుతున్నారు.  పుస్తకాల మధ్యలో శ్రీశివనేశన్ స్వామీజీ గారి ఫొటో కనిపించింది.  ఇంతకు ముందు మేమా ఫోటో చూడలేదు.  ఆఫొటో ఆ పుస్తకాల మధ్యలోకి ఎలా వచ్చిందో మాకర్ధం కాలేదు.  ఆ ఫోటో బస్ట్ సైజు వరకు ఎన్ లార్గ్ చేయబడి ఉంది.  ఆ ఫొటోలో స్వామీజీ చిరునవ్వుతో ఉన్నారు.  ఆఫొటో చూసి మాకెంతో సంతోషం కలిగింది.  ఈ విధంగా బాబా మా కోరికను నెరవేర్చారు.  మనఃస్ఫూర్తిగా ఆయనకు మాప్రణామాలు అర్పించుకున్నాము.

కొద్ది రోజుల తరువాత మేము షిరిడీ వెళ్ళినపుడు శ్రీ శివనేశన్ స్వామీజీ గారికి ఆఫొటో చూపించాము.  మీ అనుగ్రహం వల్లనే మాకు మీ ఫొటో లభించిందని సంతొషంతో చెప్పాము.  అప్పుడు స్వామీజీ “అటువంటి ఫొటో ఎవరైనా తీసారేమో నాకు తెలీదు.  నేనా ఫొటోని ఎప్పుడూ చూడలేదు.  ఇదంతా సాయిబాబా చూపించిన లీల” అన్నారు. మరుసటి రోజు చావడిలో ఉండగా ఢిల్లీనుండి కుమారి వందన అనే ఆమె వచ్చింది.  ఆమె శివనేశన్ స్వామీజి వద్దకు వచ్చి తనకు ఎవరో తెలియని వాళ్ళు  ఆయన ఫోటో బహుమానంగా ఇచ్చారని చెప్పింది.  

                     Image result for images of sivanesan swamiji

మేము మాదగ్గర ఉన్న స్వామీజీ ఫొటో చూపించాము.  ఆమె ఫొటో చూసి ఇది వేరే ఫోజులో ఉందని చెప్పింది.  భక్తులందరికీ వేరు వేరు  రకాల భంగిమలతో ఉన్న ఫొటోలు ఎలా వచ్చాయి.  ఇదంతా బాబా చూపించిన లీల.

1997 వ. సంవత్సరంలో మేము షిరిడీ వెళ్ళాము.  శ్రీసాయిబాబా వారిని దర్శించుకున్న తరువాత శ్రీశివనేశన్ స్వామీజీవారి సమాధి వద్దకు వెళ్ళాము.  ఆయన సమాధి చూడగానే మేము దుఃఖాన్ని ఆపుకోలేకపోయాము.  ఆయన తన ప్రేమతో మమ్మల్ని కట్టిపడేశారు.  ఆయన సమక్షంలో మా హృదయాలు ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోయేవి.  మా శ్రేయోభిలాషులలో ఒకరైన ఆయన లేని లోటు మాకు తీవ్రమయిన బాధను మిగిల్చింది.  ఆయన సమాధి మీద సుందరమయిన ఫొటో ఉంది.  కొంతసేపు అక్కడే ఉన్న తరువాత తిరిగి వచ్చేశాము.  తరువాత ఒక పుస్తకాల షాపు వద్దకు వెళ్ళి అక్కడ షాపు ముందు నుంచున్నాము.  ఆ పుస్తకాల షాపతనితో మాకు పరిచయంలేదు.  అతను శ్రీశివనేశన్ స్వామీజీ వారి లామినేషన్ చేయబడ్డ కలర్ ఫొటో ఇచ్చాడు.

                Image result for images of sivanesan swamiji

** ఆ ఫొటో సరిగ్గ మేము స్వామీజీ సమాధి మీద చూసిన ఫొటోలాగే ఉంది. ఏమాత్రం తేడా లేదు.  ఆఫొటో చూడగానే మాకు అత్యంతానందం కలిగింది.  ఆసంతోషంలో ఆఫొటోకు తగిన వెల ఇద్దామని షాపతనికి డబ్బివ్వబోయాము.  కాని అతను డబ్బు తీసుకోవడానికి అంగీకరించలేదు.  “నాదగ్గిర ఈ ఫొటో ఒక్కటె ఉంది.  దీనిని మీకివ్వాలనిపించింది.  అందుకనే ఇచ్చాను” అన్నాడు.  అంతకు ముందు మాకసలు స్వామీజీ ఫొటో కోసం ప్రయత్నిద్దామనే ఆలోచలే కలగలేదు.  అటువంటిది ఆయన సమాధిని దర్శించుకున్న తరువాత ఈ ఫొటో లభించడం ఆయన అనుగ్రహమే.  ఈ సంతోషకరమయిన సంఘటన మా గుండెల్లో బలమయిన ముద్ర వేసింది.  మా ఆనందానికి అవధులు లేవు.

మేము షిరిడీ వెళ్ళినప్పుడెల్లా బాబాను దర్శించుకున్నంతనే గతించిన మాతల్లిదండ్రులను చూస్తున్నంతగా సంతోషం కలిగేది.  అదే విధంగా శ్రీశివనేశన్ స్వామీజిని దర్శించుకున్నపుడు ఆయన చూపే ప్రేమాభిమానాలు, ఆయన మమ్మల్ని సాదరంగా ఆహ్వానించడం, ఇవన్నీ మేము మా అన్నయ్య సమక్షంలో ఉన్నంతగా ఆనందాన్ని కలిగించేవి.

అనుకోకుండా విచిత్రంగా మాకు లభించిన శ్రీశివనేశన్ స్వామీజీవారి ఫోటోని మేము మాపూజా మందిరంలో ఉంచుకున్నాము.

ఆఫొటోను చూసినప్పుడేల్లా మాకు “నేనెక్కడికో వెళ్ళిపోయాననుకోవద్దు. విచార  పడవద్దు.  నేనెపుడూ మీతోనే ఉన్నాను” అని చెబుతున్నట్లుగ ఉండేది.  ఈ విధంగా మాకు ఆయన నుండి చాలా శక్తివంతమయిన అండ మాకు ఉన్నదనే భావం కలుగుతూ ఉండేది.  అంతేకాదు, ప్రతి విషయంలోను ఆయన మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారనే అనుభూతి కలుగుతూ ఉండేది.  ఆకాశం యొక్క అంచులను కనుగొనవచ్చునేమో, సముద్రపు లోతును కొలవచ్చేమో గాని శ్రీశివనేశన్ స్వామీజీ లాంటి మహాపురుషులు దయతో ప్రసాదించే లీలలను ఊహించలేము. 
                                     ************

** బహుశ 2008 లేక 2009 వ.సంవత్సరం కావచ్చు.  అప్పట్లో నేను స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న రోజులలో ఎస్.బి.ఐ. లైఫ్ ఇన్స్యూరెన్స్ ఫెసిలిటేటర్ గా ఉన్నాను.  ఆ సందర్భంగా పాలసీలు చేయించడానికి బయటి ఊళ్ళకి కూడా వెడుతూ ఉండేవాడిని. ఆసందర్భంలో ఒక రోజు నరసాపురం నుండి ఆకివీడు వెళ్ళాను.  తిరుగు ప్రయాణంలో ఆకివీడు బస్ స్టాండులో బెంచీమీద కూర్చుని నరసాపురం వెళ్ళే బస్సు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను.  ఇంతలో భీమవరం వెళ్ళే బస్సు వచ్చింది.  ఆ బస్సులోనుండి డ్రైవరు దిగాడు.  అతను కంట్రోలర్ వద్ద రికార్డులో సంతకం చేయడానికి వెడుతున్నాడు. అతను  నాముందునుంచి నన్ను దాటుకుని నాలుగు అడుగులు వెళ్ళాడు.  వెళ్ళినవాడు మళ్ళి వెనక్కు నా దగ్గరకు వచ్చాడు.  తన జేబులోనుంచి శ్రీ రమణ మహర్షులవారి ఫోటో తీసి నా చేతులో పెట్టి వెళ్ళిపోయాడు.  
                    
                        Image result for images of bhagavan ramana maharshi

అతనెవరో నాకు తెలీదు.  నేనెవరో అతనికి తెలీదు.  మరి శ్రీరమణమహర్షుల వారి ఫోటో (అరుణాచలం) నాకెందుకిచ్చినట్లు?  మహాపురుషుల లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి.  ఆయన ఫోటోని భద్రంగా ఉంచుకున్నాను.

సాయిరామ్  (త్యాగరాజు)

(రేపటి సంచికలో బాబా పరోక్షంగా ఇచ్చిన ఆదేశం)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List