Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, April 5, 2017

శ్రీసాయి లీలా తరంగిణి –13 వ.భాగమ్

Posted by tyagaraju on 5:47 AM
Image result for images of shirdi sai baba with lord rama
       Image result for images of small roses

05.04.2017 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి –13 వ.భాగమ్
రచనః  శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
          Image result for images of bharam mani


(మూల రచన :  తెలుగు.   ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త మాత్రుడుః  ఆత్రేయపురపు త్యాగరాజు
ఆల్ ఖైల్ గేట్,  దుబాయి
Email :  tyagaraju.a@gmail.com
Watts app.No.  9440375411

నమ్మశక్యం గాని సాయి లీల

సాయి భక్తులందరికి మనవి : నిన్న అనగా 04.04.2017 న ప్రచురించిన “శ్రీ సాయిబాబా చేసిన అద్భుత వైద్యం”  లో బాబాకు అభిషేకం చేస్తున్న ఫోటో పెట్టాను.  అది కిచెన్ లో స్టీలు సింకులో బాబా విగ్రహాన్ని వుంచి అభిషేకం చేస్తున్నట్లుగా ఉందని ఒక సాయి భక్తురాలు మైల్ పంపించారు.  నేను కూడా ఈ రోజు పరీక్షగా చూశాను. ఆ ఫోటో సరిగ్గా ఆవిధంగానే ఉంది. నిన్న నేను సరిగా గమనించలేదు.  మాములుగా పూజా గదిలో ఒక పెద్ద స్టీలు పాత్రలో ఉంచి అభిషేకం చేస్తున్నట్లుగా భావించాను.  పెద్దగా గమనించలేకపోయాను.  జరిగిన పొరబాటును సరిదిద్దుకుని ఆ ఫోటోను తొలగించి వేరే ఫోటోను పెట్టాను.  పొరబాటును నా దృష్టికి తీసుకువచ్చిన సాయి భక్తురాలికి ధన్యావాదాలు, బాబాకు క్షమాపణలు తెలుపుకుంటున్నాను.


ఇక 03.04.2017 వ. తేదీన ప్రచురించిన “బాబా ఇచ్చిన ఆదేశం” లో మాతాజీ కృష్టప్రియ గారి గురించిన ప్రస్తావన వచ్చింది.  ఒక సాయి భక్తురాలు కృష్ణప్రియ గారి గురించి కూడా తెలియచేయమన్నారు.  నేను బాబా ఇచ్చిన ఆదేశంలోనే ఆవిడ గురించి సమగ్ర సమాచారం ఇద్దామని మూడు పేజీలు అనువాదం చేసాను.  కాని ఆవిడ గురించి పూర్తిగా ఇవ్వకుండా కాస్త సమాచారం ఇవ్వడానికి మనసొప్పలేదు. ఆవిడ గురించి  ఏది వదలివేద్దామన్నా ఏ చిన్న విషయం వదలబుద్ది కాలేదు.  అందుచేత ఆ ప్రయత్నం విరమించుకున్నాను.  వీలు వెంబడి త్వరలోనే పూర్తి సమాచారం మాతాజీ కృష్ణప్రియగారి గురించి ప్రచురిస్తాను.  ఆవిడ గురించి సమాచారాన్ని కోరిన సాయిభక్తురాలికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

మాతాజి కృష్ణప్రియగారి గురించిన పూర్తి సమాచారం కోసం ఈ లింకు లో చదవండి.  తెలుగులో కావాలని కోరుకునేవాళ్ళు నాకు మైల్ చేయండి. పైన నా మైల్ ఐడి ఇచ్చాను.   ఎంతమంది కావాలనుకుంటున్నారని కాకుండా ఒక్కరు కోరినా సరే తెలుగులో అనువాదం చేసి అందిస్తాను. 
ఓమ్ సాయిరామ్….

ఇపుడు నమ్మశక్యం కాని సాయి లీలను గురించి తెలుసుకుందాము.

1986 వ.సంవత్సరంలో మేము షిరిడీ వెళ్ళాము.  మేము సాధారణంగా ఒక చిన్న శాండల్ ఉడ్ పెట్టెలో, దాన ధర్మాలకి, ఇంకా కొన్ని చిల్లర ఖర్చులకోసం వినియోగించడానికి అందులో కొంత డబ్బు విడిగా వేసి ఉంచుతూ ఉంటాము. 
                  
              Image result for images of small sandalwood box

అందులో రూ.395 లకు పైగా ఉన్నాయి.  ఆపెట్టెను మాకూడా షిరిడీకి తీసుకుని వెళ్ళాము.  మేము షిరిడీలో నాలుగు రోజులున్నాము.  అయిదవ రోజున మా తిరుగు ప్రయాణం.  శాండల్ ఉడ్ పెట్టెలో మిగిలిన మొత్తాన్ని సమాధి మందిరంలో ఉన్న హుండీలో వేద్దామనుకున్నాము. కాని ఆపెట్టెను తీసుకునివెళ్ళడం మర్చిపోయాము. సమాధి మందిరానికి వెళ్ళిన తరువాత గుర్తుకు వచ్చింది పెట్టె తీసుకునిరాలేదని. అంత చిన్న మొత్తం కోసం మళ్ళీ వెనక్కి రూముకు వెళ్ళి ఆపెట్టెని తీసుకురావడానికి బద్ధకించాము.  ఆ పెట్టెలో మహా ఉంటే ఇరవై రూపాయలు ఉండవచ్చు దానికి రెట్టింపు అనగా నలభై రూపాయలు షిరిడీ సంస్థానంవారు జరిపే అన్నదాన కార్యక్రమం వినియోగం కోసం హుండీలో వేసేద్దామని నిర్ణయించుకున్నారు నాభర్త. 
            Image result for images of hindi in shirdi sai sansthan

హైదరాబాదుకి తిరిగి వచ్చిన తరువాత ఆ శాండల్ ఉడ్ పెట్టిని మా పూజాగదిలో ఉంచాము.

కొద్ది రోజుల తరువాత బాబా నాభర్తకి కలలో దర్శనమిచ్చి ఇలా అన్నారు “ఈరోజు గురువారం.  నువ్వు ఆలస్యం చేస్తే ఈ రోజు నువ్వు అభిషేకం చేయలేవు” 

బాబా మావారికి ఆవిధంగా చెప్పడంతో నాకు కాస్త భయం వేసింది.  వెంటనే నేను మా అక్కచెల్లెళ్ళకి, ఇంకా సాయి భక్తులు శ్రీడి.శంకరయ్యగారికి, శ్రీ యూసఫ్ ఆలీ ఖాన్ గారికి అందరికీ మావారికి వచ్చిన కల గురించి ఫోన్ చేసి చెప్పాను. 

నా భర్త హాలులో కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉన్నారు.  పది నిమిషాల తరువాత శ్రీయూసఫ్ ఆలీ ఖాన్ గారు హాలులోకి వచ్చి చూసేటప్పటికి నాభర్త స్పృహలేకుండా ఉన్నారు.  యూసఫ్ గారు నా భర్తకన్నా శరీరాకృతిలో చాలా సన్నగా, చిన్నగా ఉంటారు.  అటువంటిది ఆయన నాభర్తను తన రెండు చేతులతో ఎత్తుకుని తన భుజాలమీద పెట్టుకున్నారు.  మా చెల్లెలు ఆయనని మంచంమీద పడుకోబెట్టండి అని ఎన్నిమార్లు చెప్పినా వినిపించుకోకుండా మా పూజా గదిలో నేలమీద పడుకోబెట్టారు.  యూసఫ్ గారు ఉద్రేకంతో వణుకుతూ నాభర్త ప్రక్కనే కూర్చున్నారు.  ఆయన బిగ్గరగా ఖురాన్ లోని పవిత్రమయిన శ్లోకాలని చదవసాగారు. 
                   
                      Image result for images of quran

అంతకుముందు జరిగిన సంఘటనలు గుర్తుండటం వల్ల డాక్టర్స్ ఆయనను వెంటనే ఆస్పత్రిలో చేర్పించమని చెప్పారు.  వెంటనే మేము మాకు దగ్గరలోనే ఉన్న శ్రీరామ్ నగర్ కాలనీలోని నర్సింగ్ హోమ్ లో చేర్పించాము.  నర్సింగ్ హోమ్ కి మాబంధువులు, స్నేహితులు అందరూ వచ్చారు.

ఆరోజు రాత్రి నర్శింగ్ హోమ్ లో నాభర్త నిద్రపోతూ ఉన్నారు.  బెంగుళూరు ఆల్ ఇండియా సాయి స్పిరిట్యువల్ సెంటర్ వ్యవస్థాపకులయిన శ్రీరాధాకృష్ణ స్వామీజీ నాభర్తకి కలలో కనిపించి “నువ్వు నన్ను గుర్తించావా” అని ప్రశ్నించారు.
               
                     Image result for images of sri radha krishna swamiji
                                     Image result for images of sri radha krishna swamiji
అపుడు నాభర్త, “ఇంతకుముందు మిమ్మల్ని కలుసుకోలేదు.  కాని మీఫొటో చూశాను.  మీరు శ్రీరాధాకృష్ణ స్వామీజీ గారనే అని నా నమ్మకం” అన్నారు.

శ్రీస్వామీజీ గారు అవునన్నట్లుగా తల ఊపి, మరలా ఇలా అడిగారు. “షిరిడీలో బీదల అన్నదానానికి ఇద్దామని అట్టే పెట్టిన డబ్బును దానికోసం ఇవ్వకుండా తిరిగి ఇంటికి తీసుకుని వచ్చావెందుకు”

అపుడు నాభర్త, “షిరిడీలో డబ్బు ఉన్న శాండల్ ఉడ్ పెట్టెను తీసుకునివెళ్ళడం మర్చిపోయాను.  అందుకనే దానికన్నా రెట్టింపు సొమ్ము ఇచ్చాను” అని సమాధానమిచ్చారు.
స్వామీజీ “ అసలు పెట్టెలో డబ్బు ఎంత ఉందో లెక్కించకుండానే ఉన్నదానికన్నా రెట్టింపు డబ్బు ఇచ్చానని ఎలా అనుకుంటున్నావు?  నువ్వు బాబా సొమ్ము తీసుకుంటే దానికన్న పదిరెట్లు నువ్వు  ఆయనకి చెల్లింవలసి వచ్చేలాగ  చేస్తారు ఆయన” అన్నారు.

జరిగినదానికి నాభర్త పశ్చాత్తాపపడుతుండగానే కల కరిగిపోయి మెలకువ వచ్చింది.

మరునాడు నర్శింగ్ హోమ్ లో శ్రీసాయిబాబా నాభర్తకు దర్శనమిచ్చి, “ఇక నీకు కొన్ని జన్మలు మాత్రమే ఉన్నాయి” అని చెప్పారు.

మూడవ రోజున నర్శింగ్ హోమ్ నుంచి డిస్చార్జి అయ్యారు.  మా చెల్లెలు శ్రీమతి కుసుమ, నేను ఇద్దరం కలిసి శాండల్ ఉడ్ పెట్టెలో ఉన్న డబ్బు లెక్కిస్తే రూ.26-65 పైసలు ఉన్నాయి.  కాని సాయంత్రం శ్రీయూసఫ్ ఆలీఖాన్ గారు లెక్కిస్తే రూ.31-65 పైసలు ఉన్నాయి.  అయిదురూపాయలు తేడా ఎందుకు వచ్చిందో అర్ధం కాక ఆయన మళ్ళీ లెక్కపెట్టారు.  ఈసారి లెక్క చూస్తే రూ.32-65 పైసలున్నాయి.  శ్రీసాయిబాబావారి అనంతమయిన సంపదను ఎవరు లెక్కించగలరు అని.  ఇదంతా బాబా చూపించిన అధ్భుతమయిన చమత్కారమని అప్పుడు మాకనిపించింది.

యూసఫ్ ఆలీ ఖాన్ గారు చాలా సన్నగా ఉంటారు.  పైగా బరువయిన పనులకు కూడా అలవాటుపడ్డ శరీరం కాదు ఆయనది.  అటువంటి ఆయన తన రెండు చేతులతో నాభర్తని ఎత్తుకుని వెళ్లడం మాకందరికీ చాలా ఆశ్చర్యం కలిగించిన సంఘటన.

ఆవిధంగా నాభర్తని తన రెండు చేతులతో ఎత్తుకున్నది బాబాయే అని నాకర్ధమయింది.  ప్రతి చిన్నచిన్న విషయాలకి కూడా బాబాని సహాయం కోరడం నాకు బాధనిపించింది.


(రేపటి సంచికలో ధ్యానంలో బాబా సందేశాలు)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List