Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, April 25, 2017

శ్రీసాయి లీలా తరంగిణి –30 వ.భాగమ్

Posted by tyagaraju on 9:05 AM
       Image result for images of shirdi sainath
           Image result for images of rose hd
25.04.2017  మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి –30  వ.భాగమ్
రచనః  శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
      Image result for images of bharammani
(మూల రచన :  తెలుగు.   ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త మాత్రుడుః  ఆత్రేయపురపు త్యాగరాజు
 కె.పి. ఆర్. దివ్య ప్రభాస్ ఎన్ క్లేవ్, ఫ్లట్ 102, లోటస్ బ్లాక్,
నిజాంపేట, హైదరాబాద్
Mail id  :  tyagaraju.a@gmail.ocm
ఫోన్ : & వాట్స్ ఆప్  : 9440375411
                            8143626744

ప్రత్యక్ష దర్శనమ్
1992వ. సంవత్సరం మార్చి 2వ.తారీకున నాభర్త ధ్యానంలో బాబాని ప్రత్యేకించి ఒక ముఖ్యమయిన కోరిక కోరుకొన్నారు.  ధ్యానంలో బాబాని ఇలా వేడుకొన్నారు.


“బాబా నువ్వు నాకు ప్రత్యక్షంగా దర్శనమివ్వాలి.  ఇదే నా ప్రధానమయిన కోరిక.  నాకు వ్యక్తిగతంగా నీతో మాట్లాడాలని కోరికగా ఉంది.” అని వేడుకొన్నారు.  అంతేకాదు, “బాబా నువ్వు నాకు ఎప్పుడూ ధ్యానంలోను, స్వప్నాలలోను మాత్రమే దర్శనమిస్తున్నావు.  ఇప్పుడు మాత్రం నాకు నువ్వు సశరీరంగా దర్శనమివ్వాలి” అని తన మనసులోని మాటను బాబాకు విన్నవించుకున్నారు.
           Image result for images of shirdi sainath
అప్పుడు బాబా” వెఱ్ఱివాడా! నేనెవ్వరో నువ్వు గ్రహించలేకున్నావు.  నేనెవరో తెలుసా నీకు?  నానిజ స్వరూపాన్ని నీకు చూపించినట్లయితే నాప్రకాశవంతమయిన వెలుగుకు నీకళ్ళు చెదిరిపోతాయి.  నువ్వు గ్రుడ్డివాడివయిపోతావు.  గ్రుడ్డివాడివి అవడమే కాదు పిచ్చివాడివి కూడా అయిపోతావు.  నువ్వు అత్యాశకుపోయి కోరరాని, అయోగ్యమయిన కోరికలను కోరుతున్నావు.  నేనెక్కడో ఉన్నానని ఎందుకనుకుంటున్నావు నువ్వు?  నేను నీ హృదయంలోనే లేనా?  వెతుకు, వెతుకు, వెతుకు, నేను నీహృదయంలోనే కనిపిస్తాను.  నీమనసులోకి ఎటువంటి అసాధ్యమయిన అవాస్తవమయిన ఆలోచనలను రానీయకు.  దానివల్ల నీవు అపవిత్రుడవయిపోతావు.  ఈ సకల విశ్వానికంతటికి ప్రకాశవంతమయిన వెలుగును నేనేనని నువ్వు గ్రహించుకోవాలి.  నాభక్తులకు కోరికలనేవే లేకుండా చేయడానికే నా ఈ అవతారం.  నేను నీకు ప్రసాదించిన సందేశాల ద్వారా నువ్వు గ్రహించినది ఇదేనా?  ఇతరులకు మార్గదర్శకుడివిగా దారి చూపించాల్సిన నువ్వే ఈ విధంగా దిగజారిపోతే ఎలాగ?  కమలంలో ఆశీనుడనయి ఈ చరాచర విశ్వాన్నంతటిని సృష్టించిన సృష్టికర్తయిన బ్రహ్మను నేనేనని తెలుసుకో.  

                Image result for images of shirdisaibaba looking angrily
అటువంటి నన్ను నువ్వెలా చూడగలననుకొంటున్నావు?  నీమనసులో కలిగే ప్రేరణలను అదుపులో ఉంచుకో.  ఆ విషయం గ్రహించుకో.  నాయందు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంచుకో.  బాగా సాధన చెయ్యి.  దానివల్ల నీలో జనించిన అసంబధ్ధమయిన కోరికలన్నీ తుడిచిపుట్టుకునిపోతాయి.  మొట్టమొదటగా సాధన చెయ్యి.  ఆ తరువాతనే మిగిలిన విషయాలు.  సాధకునికి కావలసినది అత్యంత ముఖ్యమయినది ప్రాధమిక ధర్మం, నిస్వార్ధం.  సాధన ద్వారా నిన్ను నువ్వు తెలుసుకో.  జీవితం యొక్క  లక్ష్యం ప్రేమించడం  అన్నది తెలుసుకో.  అప్పుడే  దాని గురించి నువ్వు తెలుసుకోగలవు.  నీసాధన ద్వారా సంపూర్ణమయిన పరమ సుఖాన్ని పొందడానికి ప్రయత్నించు.  జీవితం అనేది ఒక సంగీతంలాంటిది.  బాగా సాధన చేసి చక్కగా పాడగలగాలి.  భక్తికి ముఖ్యంగా కావలసినవి నీతినియమాలు, నిర్మలత్వము.  సాధకునికి త్యాగము, సేవ ఆదర్శంగా ఉండాలి.  కోరికలు లేని వ్యక్తి సర్వస్వతంత్రుడు.  సులభంగా మోక్షాన్ని సాధించగలడు. నాయోగా రహస్యం ఇదే.  నువ్వు నన్ను శరణాగతి వేడుకొంటే నేనే నీకు ప్రకటితమవుతాను.  అసాధ్యమయిన అవాంఛనీయమయిన కోరికలను సాధించుకోవటం కోసం కష్టాలని కోరి కొనితెచ్చుకోకు”.
   ఆ ఉపదేశాలను అదికూడా బాబా స్వయంగా చెబుతుండగా నేను ఆలకించానంటే నేనెంతో అదృష్టవంతుడినని భావించాను.  కాని నా 76 సంవత్సరాల జీవితంలో,   ఉపదేశాలకి  వాటిని ఆచరణలో పెట్టడానికి చాలా వ్యత్యాసం ఉందని గ్రహించాను.  ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టకుండా, నీతి సూత్రాలు, ఉపదేశాలు బోధించినట్లుగా ఉంటుంది.  వాడికి ఆకలి ఏమి తీరుతుంది?  ఉపదేశాలు వినడానికి చాలా ఇంపుగానే ఉంటాయి. కాని, కావలసిన శక్తి, బలం భగవంతుడు ఇవ్వకపోతే ఆచరణలో పెట్టడం చాలా కష్టం” అన్నారు నాభర్త.

నాభర్త ఇంకా ఇలా అనుకున్నారు, “బాబా!  నాకు ఏమయినా కానీ, నేను మాత్రం నిన్ను ప్రత్యక్షంగా దర్శించుకోవాలన్నదే నాకోరిక.  దానిని సాధించుకోవటానికి ఏంజరిగినా ఎదుర్కోవడానికి నేను సిధ్ధంగా ఉన్నాను.  నాలక్ష్యాన్ని సిధ్ధింపచేసుకోవటానికి నువ్వు నన్ను తిట్టె తిట్లను, నిందలను నీ ఆశీర్వాదాలుగా భావిస్తాను.  బాబా నీ దీవెనలతో వచ్చే గురువారం నుండి, నేను దీక్షలో కూర్చుంటాను.  నేను ఈదీక్ష ప్రారంభించడం కూడా బాబా ప్రేరణతోనే జరుగుతోందని భావిస్తాను.”

నాభర్త బాబాని ఇంకా ఇలా అభ్యర్ధించారు. “నేను కళ్ళుమూసుకుని ధ్యానం చేయను.  కళ్ళు తెరచుకునే నా సద్గురువు నామాన్ని జపిస్తూ ఉంటాను.  బాబా దర్శనం ఇవ్వనంతవరకు నేను ద్రవాహారం తప్ప ఎటువంటి ఘన పదార్ధాన్ని స్వీకరించను.  అప్పటికీ ఆయన నన్ను కరుణించకపోయినట్లయితే అయిదవరోజునుండి నేను ద్రవాహారాన్ని కూడా స్వీకరించను.  ఒకవేళ నేను పాత్ముడినే అయితే, నన్ను నీలో ఐక్యం చేసుకోమని నిన్ను ప్రార్ధిస్తున్నాను.  ఇది నేను తీసుకున్న కఠోర నిర్ణయం.  ఇది తిరుగులేనిది.  నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు.  బాబా తప్ప నానిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు.  నా ఆలోచనలలోను, భావాలలోను స్వచ్చత ఉండేటట్లు అనుగ్రహించు.”

నాభర్త ఈవిధంగా చేసుకున్న వేడుకోలుకి బాబా చివాట్లు పెట్టారు. “నువ్వు మూర్ఖులలోకెల్లా మూర్ఖుడివి. ఏమి?  నన్ను బెదిరిస్తున్నావా?  నీ ఉద్దేశ్యమేమిటి?”
                   Image result for images of bharam umamaheswararao
బాబా చేత చివాట్లు తిన్న తరువాత నాభర్త బాబాని ఇలా ప్రార్ధించారు.  “బాబా దయచేసి నన్ను మన్నించు.  నీముందు నేనెంత?  నేనొక అల్ప ప్రాణిని.  నాసద్గురువయిన నా భగవంతుడిని నేనెలా బెదిరించగలను? నాయందు దయ చూపమని, నీపాదాలను శరణంటి నాశిరసువంచి ప్రార్ధించుకొంటున్నాను.”
                     
అపుడు బాబా నాభర్తకి అభయమిస్తూ “సరే.  నువ్వు దీక్షలో ఉన్న సమయమంతా నాతోనే సన్నిహితంగా ఉంటే నీకోరిక నెరవేరుతుంది.  నా నామస్మరణే చేస్తూ ఉండు.  మనసులో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకు.  నాయందే దృష్టిని నిలిపి నన్నే చింతన చేస్తూ ఉండు.  నువ్వు నాసమీపానికి ఎంతవరకు వస్తావన్నదానికి ఇది నేను నీకు పెట్టే పరీక్ష.  భక్తి అనే ఆధ్యాత్మిక సాగరంలో నిమగ్నమయి ఉండు.  నీకు  సంపూర్ణమయిన విశ్వాసం, సంకల్ప బలం ఉంటే నీలక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించగలవు.  నేనెవరినయినా నాభక్తునిగా స్వీకరిస్తే వారిని నేనెన్నడూ ఉపేక్షించను.”

అయిదు రోజులయినా బాబా మావారికి దర్శన భాగ్యం కలిగించలేదు.  అందుచేత నాభర్త ద్రవాహారం తీసుకోవడం కూడా మానేశారు.  బాబా సజీవంగా దర్శనమిస్తే తప్ప తాను దీక్ష విరమించేది లేదని ధృఢ నిశ్చయంతో పంతంపట్టి ధ్యానంలో కూర్చున్నారు.
          Image result for images of shirdi sainath
12వ.రోజున బాబా ఒక భిక్షువు రూపంలో నాభర్తకి దర్శనాన్ని అనుగ్రహించారు.  దీక్షలో ఉన్న ఈ పన్నెండు రోజుల్లోను నాభర్త అయిదు రోజులు ఘనాహారం గాని, ఆరవరోజునుండి ద్రవాహారాన్ని గాని తీసుకోలేదు.  12వ.రోజున బాబా నాభర్తకి తమ దివ్యదర్శనాన్ని అనుగ్రహించారు. 

శ్రీసాయిబాబా తమ కృపా దృష్టిని నాభర్తపై ఏవిధంగా ప్రసరించారో మీకందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను.  పరిపూర్ణమయిన విశ్వాసం, సంకల్పబలం ఉన్న తన భక్తులను ఎప్పుడూ ఉపేక్షించనని బాబా అన్న మాటలు నాభర్త విషయంలో ఋజువయింది.
 (సద్గురు మాతాజీ కృష్ణప్రియ గారి గురించి తెలుసుకోవాలని ఉందని సాయిభక్తులందరూ ఎదురు చూస్తున్నట్లుగా తెలిసింది.  ఆవిడ గురించి రేపు అనువాదం ప్రారంభిస్తాను.  వీలయితే రేపు గాని మరుసటి రోజు గాని ప్రచురిస్తాను.)


(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List