Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, August 29, 2017

పంచభూతాలపై ఆధిపత్యమ్

Posted by tyagaraju on 9:12 AM
     Image result for images of shirdisaibaba and krishna
      Image result for images of rose

29.08.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
పంచ భూతాలపై ఆధిపత్యమ్
రోజు మరొక అధ్భుతమైన సాయిబాబా శక్తిని తెలుసుకుందాముశ్రీసాయి సత్ చరిత్ర పారాయణ చేసేవారందరికీ బాబావారికి దైవాంశ శక్తులు, అంతే కాక ప్రకృతిని కూడా శాసించగలిగే శక్తి ఉన్నాయని తెలుసుబాబా తాను జీవించి ఉన్న రోజులలోనే కాదు, మహాసమాధి చెందిన తరువాత కూడా ఆవిధంగానే తన శక్తిని చూపించి తానింకా మన మధ్యనే ఉన్నారన్నదానికి సజీవ సాక్ష్యమే ఇప్పుడు మనం తెలుసుకోబేయే అధ్బుతమైన లీల.
ఇది సాయిలీల మాసపత్రిక నవంబరు 1974 .సంవత్సరంలో ప్రచురింపబడింది.
 
                                 -------------
ఆయన ఆజ్ఞ ప్రకారమే గాలులు వీస్తున్నాయిఆయన ఆజ్ఞ ప్రకారమే సూర్యుడు ఉదయిస్తున్నాడుఆయన ఆజ్ఞానుసారమే అగ్ని, చంద్రుడు ప్రకాశిస్తున్నారుఅయిదవదయిన మృత్యువు తనపని తాను చేసుకునిపోతుంది.

శ్రీమద్భాగవతమ్ దశమ స్కంధమ్ 19 .అధ్యాయాన్ని ఒక్క సారి మననం చేసుకుందాము.
ఒకసారి శ్రీకృష్ణ బలరాములు గోపబాలురు ఆవులని, పశువులని మేపడానికి అడవిలోకి వెళ్ళారు.  
                      Image result for images of krishna in forest

ఆవులు, పశువులు పచ్చిగడ్డి మేస్తూ దారి తప్పి దూరంగా ఉన్న ఇషికావనము అనే అడవిలోకి వెళ్ళిపోయాయిఅవిఎక్కడికి పోయాయో తెలియక అడవంతా గాలించి ఆఖరికి వాటిని వెదకిపట్టుకొని అన్నిటినీ ఒక చోటకు చేర్చారు అడవిలో ఎండిపోయిన చెట్లున్నాయిఅవి ఒకదానికొకటి రుద్దుకోవడం వల్ల అగ్ని పుట్టిందిఆవిధంగా కార్చిచ్చు అడవంతా వ్యాపించిందికృష్ణబలరాములు, గోపబాలురతో సహా ఆవులను పశువులను అగ్ని చుట్టుముట్టిందిఆవులు భయంతో అరుస్తున్నాయిగోపబాలురందరూ కృష్ణుడిని తమందరినీ రక్షించమని వేడుకొన్నారుకృష్ణుడు అందరినీ ఒక్కసారి కళ్ళుమూసుకోమని చెప్పగా అందరూ ఆవిధంగా చేశారు.
               Image result for images of krishna in forest

పంచభూతములను సృష్టించిన పరమాత్మ ఆపంచ భూతములలో ఒకటయిన అగ్నిని నోరుతెరచి తన యోగశక్తితో తనలోకి లాక్కున్నాడు.  దావానలం అంతా కృష్ణుని నోటిలోకి వెళ్ళిపోయింది.
సృష్టికర్త పంచభూతాలమీద ఆధిపత్యం వహించి వాటిని తన అదుపులో ఉంచుకుంటాడంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు

పూజనీయులైన శ్రీ బి.వి.నరసింహస్వామీజీ గారు తాను వ్రాసిన  లైఫ్ ఆఫ్ సాయిబాబా రెండవభాగం పుస్తకం ముందుమాటలో విధంగా శ్రీ కృష్ణుడు చేసిన అద్భుతం రచయితనే కాదు ఎంతోమందికి దిగ్భ్రమను కలిగించింది తరువాత సాయిబాబా చెప్పినది చేసినది విన్నతరువాత, ఆయన చేసిన అధ్భుతాలను చూసిన తరువాత అందరి భ్రమలు తొలగిపోయాయిఅని వ్రాసారుపంచభూతాలపై ఆధిపత్యం సంభవమేనా అని భక్తితత్పరుడయిన స్వామీజీలాంటి మహావ్యక్తిత్వం కలిగినటువంటి ఆయనకే దిగ్భ్రమను కలిగించిందంటే, ఇక సందేహాస్పదులైనవారికి,  నాస్తికులకి శ్రీకృష్ణపరమాత్మ చేసిన అధ్భుతాన్ని నమ్మశక్యంగా లేదని వాదిస్తారువేదవ్యాసమహాముని దానిని కల్పించి వ్రాసిన కట్టుకధ అని కొట్టిపారేస్తారుఇపుడు పైన వివరించిన చమత్కారం యదార్ధమని మనం నమ్మడానికి  శ్రీసాయిబాబా చూపించిన శక్తి ద్వారా మనం నిర్ధారించుకోవచ్చు.

ఒకరోజున ధునిలో మంటలు బాగా ప్రజ్వరిల్లుతూ మంటలు బాగా పైపైకి ఎగసిపడుతూ ఉన్నాయి మంటలు మసీదు పైకప్పును తాకుతున్నయిద్వారకామాయిలో కూర్చున్న భక్తులందరూ ఏమిచేయాలో పాలుపోక భయాందోళనలతో ఉన్నారుసర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడయిన బాబాని ఆజ్వాలలను అణచివేయమని భక్తులందరూ వేడుకోనవసరం లేదు.  బాబాకు అంతా తెలుసు.  ఆసమయంలో బాబా అతీంద్రియ స్థితిలో ఉన్నారుభక్తులందరిలోని భయాందోళనలను గమనించి సాధారణ స్థితిలోకి వచ్చారువెంటనే ధుని దగ్గరకు వెళ్ళి తన సటకాతో స్థంభంప్రక్కనున్న  మీద కొడుతూతగ్గు, తగ్గు, శాంతించు అని అగ్నిని శాసించారువెంటనే ఆయన ఆజ్ఞ ప్రకారం ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచం కొంచం చొప్పున మంటలు తగ్గిపోయి ధుని యధాప్రకారంగా మండసాగింది.

పైన ఉదహరించిన సంఘటనపై వ్యాఖ్యానిస్తూ హేమాద్రిపంత్ శ్రీసాయి సత్చరిత్రలో ఈవిధంగా అంటారు. “భగవంతుని అవతారమయిన ఈయనే మన సాయితనకు శరణాగతులయినవారినెవరినయినా సరే ఆయన అనుగ్రహిస్తారు.   భయంకరమయిన అడవిలో కార్చిచ్చులో చిక్కుకున్న గోపబాలురను ఆవులను పశువులను శ్రీకృష్ణప్రరమాత్మ ఏవిధంగా రక్షించాడో ఆవిధంగానే సాయిబాబా తన భక్తులను రక్షించారని హేమాడ్ పంత్ వ్యాఖ్యానించారు

ఒక వేసవికాలంలో మిట్టమధ్యాహ్నంవేళ షిరిడీలో ప్రమాదవశాత్తు ఒక గడ్డివామికి నిప్పంటుకుందిదానికి ప్రక్కల యింకా చాలా గడ్డిమేటులున్నాయిగాలి బాబా విపరీతంగా వీస్తూ ఉందిఆగాలికి నిప్పురవ్వలు ఎగిరి మిగిలినవాటిమీద పడితే అన్నీ ఒక్కసారిగా అంటుకుని బూడిద కుప్పగా మారే ప్రమాదం ఉందిఒక గ్రామస్థుడు పరుగుపరుగున ద్వారకామాయికి వెళ్ళి తమను, పాడిపంటలను కాపాడమని అర్ధించాడుబాబా వెంటనే మండుతున్న గడ్డిమేటు దగ్గరకు వెళ్ళి దాని చుట్టూరా నీటిని వలయాకారంగా చల్లి గడ్డిమేటు మాత్రమే తగలబడి మిగిలినవి మాత్రం అంటుకోకుండా ఉంటాయి” అని అగ్నిని శాసించారు. బాబా ఆజ్ఞాపించిన ప్రకారం అది ఒక్కటే తగలబడి అంతగాలి వీస్తున్నా దగ్గరలోనే ఉన్న మిగిలినవన్నీ సురక్షితంగా ఉన్నాయి.

బాబా తరచుగా భక్తులందరికీ పరమాన్నం గాని పులావు గాని స్వయంగా వండి వడ్డించేవారుఆయనే స్వయంగా వంట చేసేవారుఅది సరిగా ఉడికిందా లేదా అన్నది చూడటానికి అన్నం ఉడుకుతున్న గుండిగలో తన చేతిని పెట్టి కలియత్రిప్పేవారు.  
          Image result for images of baba cooking
అయినా బాబా చేయి ఆవిపరీతమయిన వేడికి ఎప్పుడూ కాలలేదుదీనిని బట్టే బాబాకు అగ్నిమీద వాటి స్వభావాలమీద అదుపు ఉన్నదని మనకు రూఢిగా తెలుస్తుంది.

సందర్భంగా శ్రీసాయి శరణానందస్వామి (వామనరావు పి.పటేల్) బాబా వారి అతీంద్రియ శక్తులను గురించి ;శ్రీసాయి ది సూపర్ మాన్అనే పుస్తకంలో వ్రాసిన విషయాలను గుర్తుతెచ్చుకోవడం ఎంతో సముచితంగా ఉంటుందిసాయిబాబా భగవంతునికన్న విభిన్నమయిన అవతారపురుషుడు. ఆయన మనతోటే కలిసి జీవిస్తారు, మనతోనే కలిసి సంచరిస్తారుభగవంతునిలాగే ఆయనలోను అతీంద్రియ శక్తులు ఉన్నాయికాని ఆయన వాటిని అవసరమయినపుడు ఉపయోగించినా గాని, అవి తనకు సహజమే అన్నట్లుండేవారుఅంతేగాని తానేదొ అధ్భుతాలను చేస్తున్నానని ఎప్పుడూ ప్రకటించుకోలేదు.

సెంట్ మాథ్యూ అధ్యాయం 8 శ్లో. 24 – 27 లలో , “ఓడలో జీసస్ క్రైస్ట్ నిద్రిస్తున్న సమయంలో పెద్ద తుపాను సంభవించిందిసముద్రంలో లేచిన అలలకి వీచే గాలులకి ఓడ విపరీతంగా అటూ ఇటూ ఊగడం మొదలుపెట్టిందిఅప్పుడు ఆయన భక్తులందరూ తమను ఆ గండంనుండి గట్టెక్కించమని జీసస్ ను వేడుకున్నారుఅపుడు జీసస్ వీస్తున్న గాలులని సముద్రాన్ని గద్దించడంతోనే ప్రశాంత వాతావరణం ఏర్పడిందిఅపుడందరూ ఆయనని ఎటువంటి అధ్భుతమయిన మానవుడు? ప్రచండమయిన గాలులు అల్లకల్లోలంగా ఉన్న సముద్రం ఆయనకు విధేయులుగా ఉంటాయిఅని శ్లాఘించారు.

అదేవిధంగా శ్రీసాయిబాబా 1914 .సంవత్సరంలో తన దైవాంశ  శక్తులతో భయంకరమయిన తుఫానును అదుపు చేసారుశ్రీసాయిబాబా యిప్పటికీ తన భక్తులను కాపాడటానికి తన అత్యద్భుతమయిన శక్తులను ప్రదర్శిస్తూనే ఉన్నారుదానికి సజీవ సాక్ష్యం ఇపుడు తెలుసుకోబోయే యదార్ధ సంఘటన.

1951 .సంవత్సరంలో నేను కైకలూరులో స్టేషనరీ సబ్ మేజస్త్రేట్ గా పనిచేస్తున్నాను ఊరిలో ఒక సంస్కృత పాఠశాల ఉందినాకు సంస్కృత భాష అంటే ఎంతో అభిమానంఅందువల్లనే నేను ఆపాఠశాల కార్యక్రమాలలో చాలా సన్నిహితంగా పాల్గొంటూ ఉండేవాడినిఒకసారి 1951 .సంవత్సరంలో నాతో సంప్రదించిన తరువాత ఉపాధ్యాయులందరూ అక్టోబరు 13, 14  తేదీలలో ఒక సాహితీ సమావేశాన్ని ఏర్పాటు చేసారు.  10.10.1951 బాబా మహాసమాధి రోజున వెంట్రప్రగడ లోని సాయిమందిరానికి వెళ్లాను.  11.10.1951 అక్కడినుంచి వచ్చేముందు, సాహితీ సమావేశం జయప్రదంగా జరిగేటట్లుగా అనుగ్రహించమని బాబాను మనసారా ప్రార్ధించుకున్నాను
                 Image result for images of viswanatha satyanarayana
కవి సామ్రాట్, పద్మభూషణ్, కళాప్రపూర్ణ, జ్ఞానపీఠ అవార్ఢు గ్రహీత శ్రీవిశ్వనాధ సత్యనారాయణ గారు, పండిత పెనుమత్స సత్యనారాయణరాజు గారు, యింకా కొంతమంది ప్రముఖ పండితులను ఆసమావేశానికి ఆహ్వానించారుసమావేశానికి వారందరూ హాజరయ్యారు.

13.10.1951 ఉదయం మా సమావేశ ప్రారంభోత్సవ కార్యక్రమం మొదలయిందిసాయంత్రం మూడు గంటలకి మరలా సమావేశ కార్యక్రమం ప్రారంభించాముకార్యక్రమం మొదలయిన వెంటనే పెనుగాలి, వర్షపు జల్లులు మొదలయ్యాయిఆకాశమంతా దట్టమయిన మబ్బులు పట్టి భీతావహంగా ఉందివిపరీతంగా వీస్తున్న గాలికి పందిరి ఎగిరిపోతుందేమోనన్నంత భయంకరంగా ఉందినాకు చాలా భయం వేసి   పెనుగాలి, వర్షాన్నుండి కాపాడమని బాబాని మనసులోనే ప్రార్ధించుకున్నానుఆవిధంగా ప్రార్ధించుకున్న వెంటనే వీస్తున్న గాలి, వాన చినుకులు ఆగిపోయాయిమేము అనుకున్న ప్రకారం సమావేశం ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా జరిగిందిఅంతా పూర్తయిన తరువాత మేము ఇంటికి తిరిగి వచ్చాముఇంటి ముందరంతా చాలా బురదగాను, బాగా తడిగాను ఉందిఏమయిందని ఇంట్లోనివాళ్ళని అడిగానుసాయంకాలం 4 గంటలకి కుండపోతవాన వచ్చిందని, దానివల్ల ప్రక్కనున్న కాలువలు పొంగి ప్రవహించాయని చెప్పారుచుట్టుప్రక్కలంతా నీటితో నిండిపోయిందని చెప్పారుఆతరువాత ఇంకా అడిగినమీదట మా సమావేశం జరిగిన చోటునుంచి రెండు ఫర్లాంగుల వరకు విపరీతమయిన ఈదురు గాలులతోపాటు కుండపోత వర్షం కురిసిందని తెలిసిందిమేము సమావేశం ఏర్పాటుచేసుకున్న ప్రదేశంనుంచి దానికి కొంతదూరం వరకు గాలి గాని వాన గాని లేదంటే అదంతా సాయినాధుని కృపవల్లనేఇది బాబా మహాసమాధి చెందిన 33 సంవత్సరాల తరువాత జరిగిన సంఘటన.
దీనిని బట్టి బాబా చెప్పిన వచనాలు నిత్యసత్యాలని నేటికీ ఋజువు చేస్తున్నాయి.
నా సమాధినుండియే నేనన్ని కార్యక్రమాలను నిర్వర్తిస్తాను.
నేను మహాసమాధి చెందినా మీరు నన్నెపుడు ఎక్కడ తలచుకున్న తలచుకున్న క్షణంలోనే మీముందు ఉంటాను.
ప్రేమతో నా భక్తుడు పిలిచిన వెంటనే నేను ప్రత్యక్షమవుతాను.
నేను ప్రయాణించడానికి నాకు ఎటువంటి వాహనములు అవసరము లేదు.
దీనిని బట్టి సాయియే శ్రీకృష్ణుడు అనీ ఆయన సర్వదేవతా స్వరూపుడని అర్ధం చేసుకోవచ్చుభగవంతుడనేవాడు ఒక్కడేఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల మనం మన సాయిమాతకు బిడ్డలమయ్యామునిరంతరం ఆయన రక్షణలో ఉన్నామునిరంతరం మనంసాయినామాన్ని జపిస్తూ సదా ఆయనను మన మదిలో నిలుపుకుందాము.

                                         పి.వి.సత్యనారాయణ శాస్త్రి, బి..
                                                రిటైర్డ్ తహసీల్ దార్
                                              కృష్ణలంక, విజయవాడ

(సర్వం శ్రీసాయినాధార్పనమస్తు)





Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List