Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, September 10, 2017

బాబా పటంనుండి పవిత్ర జలమ్

Posted by tyagaraju on 8:26 AM
      Image result for images of shirdisaibaba photo
     Image result for images of rose hd

10.09.2017 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి సురేష్ గారు వాట్స్ యాప్ గ్రూప్ సభ్యులలో ఒకరయిన శ్రీ రాంబాబు గారి అనుభవాన్ని పంపించారు.  ఈ అధ్భుతమయిన అనుభవాన్ని బాబా వారి మహిమను యధాతధంగా ప్రచురిస్తున్నాను.  బాబా ఊదే కాదు ఆయన పటం నుంచి చెమటలాగ కారిన నీరు కూడా పవిత్రమయినది మహిమ కలది అని నిరూపించే సంఘటన.  అది ఆయన చమట కాదు పవిత్రమయిన జలమ్.
                                     ----------
బాబా పటంనుండి పవిత్ర జలమ్
   Image result for images of water coming from shirdi sai baba photo
మన షిర్డీ సాయిబాబా whatsapp గ్రూప్ సభ్యులు A. రాంబాబు గారి అనుభవం సాయి.

ఓం శ్రీ సాయినాథాయ నమః సాయిమా బంధువులు అందరికి నమస్కారం.. 

నాకు 15 ఏండ్ల వయస్సు నుండి మడమ నొప్పి మొదలు అయింది. మొదట పెద్దగా పట్టించుకోలేదు. కానీ, కొన్ని సంవత్సరాలు తర్వాత, అంటే నాకు 20 యేండ్లు వచ్చేసరికి, కుడి కాలు మడమ దగ్గర ఎముక పెరగటం మొదలై, నొప్పి కూడా ఎక్కువ కావొచ్చింది


               Image result for images of back of leg sole
ఇంగ్లీష్ మెడిసిన్స్, హోమియో మెడిసిన్స్ అన్నీ  వాడాను. కానీ అవి తాత్కాలికంగా ఫలితం ఇచ్చాయి కానీ, శాశ్వత పరిష్కారం చూపలేక పోయాయి. కొంతమంది డాక్టర్స్ కాలికి ఆపరేషన్ చేయాలన్నారు. భయంతో చేయించుకోలేదు. విసుగొచ్చి మందులు వాడటం కూడా ఆపేసాను. తర్వాత నాకు పెళ్లి అయింది. పిల్లలు పుట్టారు. ఆనందంగా ఉన్నా గాని, నా జీవితంలో శారీరక బాధ నుండి మాత్రం విముక్తి కాలేక పోయాను. అటువంటి సమయంలో ఒక విచిత్రమైన, అద్భుత విషయం నా జీవితంలో జరిగింది. మాది నెల్లూరు పట్టణం. మా పొరుగున శివయ్యగారు సాయిబాబా గారికి పరమ భక్తులు. వారి ఇంటిలో ఎప్పుడూ సత్సంగాలు, భజనలు జరుగుతూ ఉండేవి. కానీ, నేను పెద్దగా పట్టించుకునే వాడిని కాదు. నేను ఒకరోజు సెలవులో ఉండి, మా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ వున్నాను. ఇంతలో నా ఇద్దరు మేనకోడళ్లు నా వద్దకు వచ్చి, శివయ్య గారి ఇంట్లో సాయిబాబా గారి పటంనుంచి చెమట లాగా పట్టి, నీళ్ళు కారుతున్నాయి. అందరూ వచ్చి చూసి పోతున్నారు, కొంత మంది నీటిని తీర్ధం లాగా, కొంత మంది మెడిసిన్ లాగా వాడుతున్నారు అని చెప్పారు
           Image result for images of water coming from shirdi sai baba photo

నా మేనకోడళ్లు ఇద్దరూ చెప్పిన విషయం నేను ఖండించాను. బాబాకి నేను దణ్ణం పెడతాను కానీ, పటం నుండి నీరు కారటం, నీటిని మందు లాగా వాడటం మూఢ భక్తి అని వారిద్దరితో వాదించాను. కానీ, వారు ఇద్దరూ ఒక్కసారి వచ్చి చూడమని, నీటిని నా కాలి నొప్పికి మందులా వాడమని చెప్పారు. ఒకవేళ నొప్పి తగ్గకపోతే, మేము కూడా మాది మూఢభక్తి అని ఒప్పుకుంటాం అని చెప్పారు. ఒకవేళ నొప్పి తగ్గితే, ఆటోమేటిక్ గా నువ్వు బాబా పరమ భక్తుడిగా మారుతావు అని నాతో ఛాలెంజ్ చేశారు. నేను ఒప్పుకుని ఆరోజు సాయంత్రం మా పొరుగున ఉన్న శివయ్య గారి ఇంటికి వెళ్ళాను. అప్పుడే వారి ఇంట్లో సాయంత్రం ఆరతి అయింది. రోజుకి చిన్న గ్లాస్ నీళ్లు మాత్రమే ఫోటో నుండి వస్తాయి అని చెప్పారు. నేను తీక్షణంగా బాబా గారి ఫోటోని నిశితంగా పరిశీలించగా, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నీరు చెమట పట్టినట్లు వస్తోంది
               Image result for images of water coming from shirdi sai baba photo

నేను ఆరతి కండ్లకు ఆద్దుకుని కింద కూర్చున్నాను. నా చిన్న మేనకోడలు బాబా గారి ఫోటో నుండి కారిన నీటిని రెండు చేతులతో అంటించుకుని, నా మడమకు బాగా పూసింది. తరువాత తిరిగి ఇంటికి వచ్చేసాం. నా ఉద్యోగ నిమిత్తం కడపకి వచ్చేసాను. వచ్చినప్పటి నుండి ఎందుకో గాని మానసికంగా, శారీరకంగా ఏదో ప్రశాంతత. ఒక వారం తర్వాత, నా మేన కోడళ్లు ఫోన్ లో పలకరించారు నొప్పి ఎలా ఉంది అని. అప్పుడు గమనించుకున్నాను నాకు నొప్పి తగ్గిపోయింది అని.


ఏమని చెప్పను నా సంతోషం? నా భావాలు? నొప్పి తగ్గింది అన్న సంతోషం కన్నా,బాబా నన్ను తన బిడ్డగా అక్కున చేర్చుకున్నందుకు నాకు ఎంతో సంతోషం కలిగింది. అమ్మ తన బిడ్డ కష్టంలో ఉంటే ఏమైనా చేస్తుంది. తన చెమట నీరుని నా కాలికి పట్టించుకుంటే, అమ్మలా కోపగించకుండా,నొప్పి తగ్గించేలా చేసారు. అందుకే రోజు నుండి, క్షణం నుండి నాకు బాబా గారు సాయిమా అయ్యారు. పెరిగిన కాలి ఎముక అలాగే వుంది కానీ, ఈరోజు వరకు ఉన్న మడమ నొప్పి మళ్లీ రాలేదు. దీనికి కారణం అయిన నా ఇద్దరు మేనకోడళ్లు చల్లగా ఉండాలని, సాయిమా దీవెనలు వారిపై, ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.


...ఓం శ్రీ సాయి నాథాయ నమః

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment