Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, September 4, 2017

నాజీవితంలో బాబా చూపించిన లీలలు, నన్ను సాయి ప్రచారకునిగా మార్చుట

Posted by tyagaraju on 9:32 AM
     Image result for images of shirdisai

    Image result for images of rose hd

04.09.2017 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మరొక అధ్బుతమైన సాయి లీలను గురించి ప్రచురిస్తున్నాను.  ఈ లీల సాయిలీల ద్వైమాసపత్రిక సెప్టెంబరు – అక్టోబరు 2013 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.  ఇంతకు ముందు దీనిని ప్రచురించానో లేదో గుర్తు లేదు.  చదివిన తరువాత ఎప్పుడో చదివినట్లు గుర్తు.  అయినా మరలా అనువాదం చేసి ప్రచురిస్తున్నాను.

నాజీవితంలో బాబా చూపించిన లీలలు, నన్ను సాయి ప్రచారకునిగా మార్చుట

బెంగళూరు నివాసి శ్రీకాంత్ శర్మ 1980 వ.సంవత్సరంలో ఆస్త్మా తో చాలా విపరీతంగా బాధపడుతూ ఉండేవాడు.  శ్వాస సరిగా ఆడకపోవడంవల్ల ప్రతిరోజూ డెరిఫిల్లిన్ రిటార్డ్ టాబ్లెట్స్  మూడు వేసుకుంటే గాని ఉపశమనంగా ఉండేది కాదు.  అతను ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు.  వారి కుటుంబం ఆర్ధికపరంగా అంత ఉన్నతమయినది కాదు.


అతని ఆఫీసులో రాజేష్ అనే అతను పని చేస్తున్నాడు.  అతను అందరినీ ‘సాయిరామ్’ అని పలకరిస్తూ ఉంటాడు.  శ్రీకాంత్ కి సాయిబాబా గురించి ఏమీ తెలియకపోవడం వల్ల అతనావిధంగా అందరినీ ‘సాయిరామ్’ అని సంబోధిస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉండేది.  ఒకసారి రాజేష్, శ్రీకాంత్ తో,  షిరిడివచ్చి సాయిబాబా దర్శనం చేసుకోమని సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పాడు.  షిరిడీకి వెళ్ళిరావడానికి రూ.1,500/- ఖర్చవుతుంది.  తనవద్ద అంత డబ్బులేకపోవడం వల్ల షిరిడీకి రాలేనని మృదువుగానే తిరస్కరించాడు.  కాని రాజేష్ అతని స్నేహితుడు ప్రవీణ్ యిద్దరూ శ్రీకాంత్ ని వదలి షిరిడీ వెళ్ళడానికిష్టం లేక, ఖర్చంతా మేము పెట్టుకుంటాము నువ్వు తరవాత యిద్దువుగాని అని అతనిని రమ్మని నచ్చచెప్పారు.

ముగ్గురూ జూన్, 7, 1989 న షిరిడీ చేరుకున్నారు.  శ్రీకాంత్ సమాధిమందిరంలోకి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాడు.  బాబా దర్శనం చేసుకోగానే అతను అనిర్వచనీయమయిన అనుభూతికి లోనయ్యాడు.  దర్శనం అయినతరువాత జూన్, 11, 1989 రోజునె తిరుగు ప్రయాణమవుతున్నారు.  అపుడు ఒక అధ్బుతమయిన సంఘటన జరిగింది.  రాత్రి 2 గంటలకి శ్రీకాంత్ కి ఆస్త్మా వల్ల శ్వాస సరిగా ఆడక చాలా ఇబ్బంది పడసాగాడు.  వెంటనే ప్రవీణ్ అతని నోటిలో ఊదీ వేసి సాయితారక మంత్రమయిన ‘ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి’ అని జపించుకుంటూ ఉండమని చెప్పాడు.  ఊదీ సేవించిన కొంతసేపటికి అతని కన్నులు మూతపడి ప్రశాంతంగా నిద్రపోయాడు.  ఉదయం లేచిన వెంటనే తనకి శ్వాస ఆడటంలో ఎటువంటి సమస్య లేదనే విషయాన్ని గుర్తించి, మందులుకూడా వేసుకోలేదు.  శ్వాసలో ఎపుడయినా సమస్య ఏర్పడితే బాబా ఊదీని నోటిలో వేసుకుని బాబా నామస్మరణ చేసుకునేవాడు.  ఆరోజునుండి నేటివరకు బాబా దయవల్ల మందులు వేసుకునే అవసరమే రాలేదు.

బాబాను దర్శించుకున్న మొట్టమొదటిరోనునుంచే బాబాకు భక్తుడిగా మారిపోయాడు.  అందరితోను బాబా లీలలను పంచుకుంటూ ఉండేవాడు.

రాజేష్ బెంగళూరు రాజాజీనగర్ లో శ్రీద్వారకామాయి సేవా ట్రస్ట్ ని ఏర్పాటు చేశాడు.  సాయిబాబావారి విగ్రహం, పాదుకలను కొని తేవడానికి జూలై, 20, 2009 వ.సంవత్సరంలో షిరిడీకి వెడదామని తోడుగా శ్రీకాంత్ ని కూడా రమ్మన్నాడు.  కాని తనకు జ్వరంగాను, ఒళ్ళునొప్పులుగాను ఉందని అంతేకాకుండా ప్రయాణానికి సరిపడా డబ్బుకూడా లేదని అంచేత   రాలేనని చెప్పాడు శ్రీకాంత్.  ప్రయాణానికయ్యే ఖర్చు తనే పెట్టుకుంటాననీ ఎటువంటి బెంగపెట్టుకోకుండా రమ్మని బ్రతిమాలాడు.  శ్రీకాంత్ కాస్త మెత్తబడి సరేనన్నాడు.

రాజేష్ మరొక సాయిభక్తుడయిన వేణుగోపాల్ ని కూడా రమ్మన్నాడు.  వేణుగోపాల్ బాబా ముందు చీటీలు వేసి బాబా అనుమతి తీసుకుని బయలుదేరతానని చెప్పాడు.  ఆవిధంగా బాబా ముందు చీటీలు వేసి బాబా అనుమతి తీసుకున్నాడు.  వెంటనే రాజేష్ స్టేషన్ కి వెళ్ళి షిరిడీకి రిజర్వేషన్ చేయించాడు.  షిరిడీ వెళ్ళడానికి కర్నాటక ఎక్స్ ప్రెస్ వెయిటింగ్ లిస్ట్ 137, 138, 139 వచ్చింది.  తిరిగు ప్రయాణంలో ఉదయన్ ఎక్స్ ప్రెస్ కి పూనానుండి కన్ఫర్మ్ డ్, టికెట్స్ వచ్చాయి. 

జూలై 22, 2009 వ.సంవత్సరంలో శ్రీకాంత్ 5.45 కి స్టేషన్ కి వెళ్ళి ఛార్టు చూస్తే వెయిటింగ్ లిస్ట్ 17,18,19 వచ్చాయి.  అంటే వారు ముగ్గురూ జనరల్ బోగీలో వెళ్లవలసిందే తప్ప స్లీపర్ బెర్తులు మాత్రం రావు.  వెయిటింగ్ లిస్టు చూడగానే శ్రీకాంత్ కి నీరసం వచ్చేసింది.  రాజేష్ కి ఫోన్ చేసి చెప్పాడు.  అప్పటికి రాజేష్, వేణుగోపాల్ ఇద్దరూ షిరిడీ వెళ్ళేముందు బాబా దర్శనం చేసుకోవడానికి రాజాజీనగర్ సాయిబాబా మందిరంలో ఉన్నారు.  నువ్వేమీ ఖంగారు పడకు మేమిద్దరం 15 నిమిషాలలో స్టేషన్ కివచ్చేస్తాము అని రాజేష్ చెప్పాడు.  వారు కూడా వచ్చిన వెంటనె మరలా టి సి ని అడిగారు.  వెయిటింగ లిస్ట్ లో ఎటువంటి మార్పు లేదు. రైలు చాలా రద్దీగా ఉంది నేనేమీ చేయలేనని చెప్పాడు టి.సి.  ప్రక్క బోగీ దగ్గరనుంచున్న మరొక టి సీ ని చూపించి అతనిని అడగమని చెప్పాడు.

వెంటనే ముగ్గురూ అతను చెప్పిన టిసీ దగ్గరకు వెళ్ళి మూడు బెర్తులు కావాలని ప్రాధేయపడ్డారు.  నేను ఏసహాయం చేయలేను అని చెప్పి ఆ టి సి ఎస్.4 బోగీలో ఎక్కండి అక్కడికి నేను వస్తాను అని చెప్పాడు.  ఎస్ 4 బోగీ దగ్గరకు వెళ్లబోతూ శ్రీకాంత్ మరలా టి సీ దగ్గరకు వెళ్ళి తాము సాయిబాబా దర్శనానికి షిరిడీ వెడుతున్నామని ముగ్గురికీ బెర్తులు యిప్పించమని అడిగాడు.  షిరిడీకి వెడుతున్నామన్న విషయం విన్న వెంటనే ముగ్గురిని ఎస్ 4 లో 41,42,43 బెర్తులు తీసుకోమని చెప్పాడు.  రైలు సరిగ్గ 7.20 కి బయలుదేరింది.  కాని ఆ టి సి మరలా ఆబోగీలోకి రాలేదు.  కాని ఆతరువాత  వచ్చిన టి సి వారి టికెట్స్ చూసినా గాని అందులో అతనికి ఎటువంటి తేడా కనిపించలేదు.  టికేట్స్ చూసి వెళ్ళిపోయాడు.

ముగ్గురూ షిరిడీ చేరుకుని చక్కగా బాబా దర్శనం చేసుకున్నారు.  జూలై, 24, 2009 న షాపులో ద్వారకామాయి సాయిబాబా విగ్రహం, పాదుకలు కొని సమాధిమందిరం, ద్వారకామాయి, చావడిలలో వాటికి పూజ చేయించారు.  రాత్రి 2.30 కి గదికి తిరిగి వచ్చారు.  అప్పటికే రాజేష్ మొబైల్ లో అతని అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్యనుంచి వచ్చిన 15  మిస్డ్ కాల్స్ ఉన్నాయి.  రాజేష్ వెంటనే యింటికి ఫోన్ చేసాడు. తల్లికి బాగాలేదనీ, చాలా ప్రమాదకరంగా ఉండటంతో I C U లో పెట్టారని చెప్పారు.  డాక్టర్ లు కూడా ఆవిడ బ్రతుకుతుందనే ఆశలేదని ఆవిడకు మందులు కూడా పనిచేయడం లేదని చెప్పారని అన్నారు.

ఆవిడ అంతిమ క్షణాలు దగ్గరపడటంతో అందరూ ఆమె చుట్టూ చేరారు.  రాజేష్ ని వెంటనే బయలుదేరి వచ్చేయమని చెప్పారు.  కాని ఫ్లైట్ లో వెళ్ళాలన్నా మరుసటిరోజు మధ్యాహ్నం 1.30 కి గాని లేదు. రైలు రిజర్వేషన్ మరుసటి రోజుకు ఉంది.  ఇక బస్సులో వెళ్ళడం తప్ప మరొక మార్గం లేదు.  రాజేష్ ఆరోజు సాయంత్రం 4 గంటల బస్సుకు బయలుదేరి మర్నాడు పొద్దున్న 11 గంటలకు బెంగళూరు చేరుకున్నాడు.

బెంగళూరు వెళ్లగానే ఆస్పత్రికి వెళ్ళి తల్లి నుదుట సాయిబాబా ఊదీని రాసాడు.  ఆతరువాత ఆవిడని ఎండోస్కోపీకి తీసుకుని వెళ్ళారు.  కొంతసేపటి తరువాత రిపోర్ట్స్ వచ్చాయి.  అన్నీ నెగెటివ్ గానే ఉన్నాయి.  అంతకు ముందు చాలా హెచ్చుస్థాయిలో ఉన్న సుగరుకి మందులు పనిచేయడం ప్రారంభించాయి.  జూలై 30, 2009 న.ఆవిడని ఆస్పత్రినుండి డిశ్చార్జి చేశారు.

సంవత్సరం గడిచే కొద్దీ సాయిలీలలను ప్రచారం చేస్తూ సాయిసేవ చేయసాగాడు శ్రీకాంత్.  అతను తన స్నేహితుడు, మునిరెడ్డితో కలిసి బాబా ఆశీర్వాదంతో సెప్టెంబరు 28, 2009 విజయదశమి మధ్యాహ్నం 2.30 కి సరిగా బాబా మహాసమాధి అయిన సమయానికి www.saiamrithadhara.com అనే పోర్టల్ ని ప్రారంభించాడు.

బాబా మహాసమాధి శతాబ్ధి ఉత్సవాలు 2018వ.సంవత్సరం దసరా రోజులలో జరుగుతున్న సందర్భంగా, బాబా గురించి మరింత సమగ్ర సమాచారంతో ఒక పోర్టల్ ను ఏర్పాటు చేయడానికి శ్రీకాంత్ చాలా శ్రమిస్తున్నాడు.

కన్నడభాష మాట్లాడే సాయిభక్తుల కోసం నవంబరు, 15, 2009వ.సంవత్సరంలో www.saiamrithavani.blogspot.in బ్లాగును కూడా ప్రారంభించాడు.  ఎంతో పట్టుదలతోను, ఉత్సాహంతోను శ్రీకాంత్ ఆబ్లాగులో ఎప్పటికప్పుడు ప్రచురణలు చేస్తూ ఉన్నాడు.

2012వ.సంవత్సరంలో అతను పదిరూపాయల వెలతో పాకెట్ సైజ్ లో ‘షిర్దీగైడ్’ అనే పుస్తకాన్ని ప్రచురించాడు.  ఇందులో బాబావారి ఏకాదశ సూత్రాలు, షిరిడిలో దర్శనీయ స్థలాలు, శ్రీసాయి సంస్థాన్ గురించిన సమాచారంతో సహా అన్నీ పొందుపరిచారు.

2013వ.సంవత్సరం గురుపూర్ణిమనాడు కన్నడభాషలో ‘శ్రీషిరిడీసాయిబాబా సమగ్ర కైపిడి’, ‘శ్రీషిరిడీ సాయినాధ సగుణోపాసన’ అనే పుస్తకాలను సాయిభక్తులకొరకు ప్రచురించారు.

శ్రీకాంత్ శర్మ
బెంగళూరు వారు చెప్పగా
ఆంగ్లంలో వ్రాసిన వారు షంషాద్ ఆలీ బేగ్

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)






Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List