Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, September 1, 2019

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 20 వ.భాగమ్

Posted by tyagaraju on 8:50 AM
     Image result for images of shirdisaibaba and lord ganesha
      Image result for images of lotus flower

01.09.2019  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 20 .భాగమ్
సాయిబంధువులందరికి వినాయకచవితి శుభాకాంక్షలు
Image result for images of shirdisaibaba and lord ganesha

సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న    
అమూల్యమయిన సాయి సందేశాలు
Image result for images of sai banisa
సంకలనమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,  హైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

ఫోన్స్ & వాట్స్ ఆప్  :  9440375411  &  8143626744

12.08.2019  -  సాయిబానిసగారికి బాబాగారు తెలిపిన అభినందనలు

11.08.2019 నాడు బాబాగారి ఆదేశానుసారముగా సాయిబానిస గారు శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి కార్యక్రమము పూర్తి చేసినారు.  12.08.2019 నాడు ఉదయము బాబాగారు సాయిబానిస గారికి ఇచ్చిన చక్కని అనుభూతిని మీకు తెలియజేస్తాను.     …………   త్యాగరాజు

సాయిబానిసగారు సికిందరాబాదులోని మిలటరీ పెరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న సైనిక కవాతు చూడటానికి వెళ్ళారు.  ప్రజలమధ్య సాయిబానిసగారు తన తెల్లని లుంగీ, తెల్లని చొక్కా, భుజాన తెల్లని జోలి వేసుకొని నిలబడ్డారు.  మిలటరీ కవాతులో భారత సైన్యాధికారి ఫీల్డ్ మార్షల్ మానెక్ షా గారు జీపులో నిలబడి సైనికవందనము స్వీకరించసాగారు.  జీపు ప్రజల వద్దకు వచ్చినపుడు మానెక్ షా గారు జీపు దిగి ప్రజలందరికి అభివాదము చేసి, సాయిబానిసగారి వద్దకు వచ్చి అభివాదము చేసి, తనతోపాటు మధ్యాహ్న భోజనమునకు రమ్మని ఆహ్వానించారు. 


తన ప్రక్కన ఉన్న ఇద్దరు మిలటరీ ఆఫీసర్లను పిలిచి, సాయిబానిసగారిని గౌరవపూర్వకముగా మధ్యాహ్న భోజనానికి తన అతిధి గృహానికి తీసుకురమ్మని ఆదేశించారు.  మిలటరీ కవాతు పూర్తయినది.  సమయము మధ్యాహ్నము 12 గంటలు.  ఇద్దరు మిలటరీ ఆఫీసర్లు సాయిబానిసగారి వద్దకు వచ్చి, వారిని గౌరవపూర్వకముగా తమ కారులో ముఖ్య సైనికాధికారి (ఫీల్డ్ మార్షల్)  గారు విడిది చేసిన అతిధి గృహానికి తీసుకుని వెళ్ళారు.  అప్పటికే ఫీల్డ్ మార్షల్ గారు , ఆ అతిధి గృహములో సాయిబానిసగారి రాక కోసం ఎదురు చూడసాగారు.  మిలటరీ ఆఫీసర్లు సాయిబానిసగారిని ఫీల్డ్ మార్షల్ గారి ముందు నిలబెట్టారు. ఆయన తెల్లటి పైజామా, లాల్చీ వేసుకుని ఉన్నారు.  సాయిబానిస గారిని కౌగలించుకుని వారిని తన అతిధి గృహములోని వరండాలొకి తీసుకుని వెళ్ళి, అక్కడ ఉన్న సోఫాలో కూర్చుండబెట్టారు. ఫీల్డ్ మార్షల్ గారు అక్కడ ఉన్న మిలటరీ ఆఫీసర్లకు ద్రాక్షరసము, ఖర్జూరపు పళ్ళు తీసుకురమ్మని ఆదేశించారు.  వారు ఉభయులూ ద్రాక్షరసము త్రాగుతూ తియ్యటి ఖర్జూరపు పళ్ళు తింటూ 1918 నాటి షిరిడీ ముచ్చట్లు చెప్పుకోసాగారు.  సమయము ఒంటిగంట ప్రాంతములో ఇద్దరూ భోజనము నిమిత్తము భోజనశాలకు వెళ్ళారు.  భోజన శాలలో రెండు వైపులా మిలటరీ ఆఫీసర్లు భోజనానికి ఉపక్రమించారు.  హాలు మధ్య భాగములో ఒక టేబులు వద్ద రెండు కుర్చీలు ఉన్నాయి.  ఫీల్డ్ మార్షల్ గారికి, సాయిబానిసగారికి శాఖాహార భోజనము వడ్డించారు.  ఆయన తాను భోజనము చేస్తు సాయిబానిసగారికి కొసరి కొసరి వడ్డించారు.  భోజనానంతరము చేతులు కడుగుకొన్న తరువాత ప్రక్కనే ఉన్న హాలులో మిలటరీ ఆఫీసర్లు సాయిబానిసగారిని, ఫీల్డ్ మార్షల్ గారిని తీసుకుని వెళ్ళారు.  అక్కడ ఆయన సాయిబానిసగారిని తన తోటి ఆఫీసర్లకు వీరు షిరిడీనుంచి వచ్చిన నా ప్రాణ స్నేహితులుఅని పరిచయం చేసారు.  ఆ తరువాత ఫీల్డ్ మార్షల్ గారు ఒక జరీ శాలువాను తెప్పించి, సాయిబానిసగారి భుజము మీద కప్పుతూ ఇన్ని దినాలు నువ్వు నాతో ‘శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి  కార్యక్రమమును నిర్వహించావు.  ఈ కార్యక్రమము నేను జన్మజన్మలకూ మర్చిపోలేను.  ఈ శాలువాను నీవు జాగ్రత్తగా కాపాడుకో.  నీవు నాతో ఎప్పుడయినా మాట్లాడవచ్చును.  నేను తిరిగి ఇప్పుడు షిరిడీ వెళ్ళిపోతున్నాను.  నిన్ను నీ ఇంటికి నా మిలటరీ ఆఫీసర్లు దిగబెడతారు.  ఇక నీవు నీ శేష జీవితమును నా నామస్మరణ చేస్తూ నీ నేత్రాలలో చూపు సరిగా లేకపోయినా, సదా నన్ను నీ మనో నేత్రంతో చూడు అని చెప్పి సాయిబానిసగారి పాదాలకు నమస్కరించారు.

సాయిబానిసగారు ఆశ్చర్యపోయి తిరిగి ఫీల్డ్ మార్షల్  గారి పాదాలకు నమస్కరించారు.

ఆ ఆనందముతో సాయిబానిసగారికి నిద్రనుండి మెలకువ వచ్చింది.

ఇది ఎంత చక్కటి అనుభూతి అని తలచి సాయిబానిసగారు తన ఇంటిలోని షిరిడీ సాయిబాబా పటానికి నమస్కరించారు.

29.08.2019  --  ఫలశృతి

శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి 53 అధ్యాయాలుగా పూర్తి అవుతుందని భావించాము.  కాని, బాబా ఆలోచనలు ఏవిధంగా ఉంటాయో మనం గ్రహించలేము.  సాయిబానిసగారికి ఒక కంటికి చూపు పూర్తిగా పోయినందువల్ల, మరొక కంటికి ఎక్కువగా దృష్టిలోపం ఉండటం వల్ల, బాబా ఆయనను ఇంకా కష్టపెట్టదలచుకోలేదు.  అందువల్ల 19 అధ్యాయాలతోనే ఈ శ్రీ షిరిడీసాయితో ముఖా ముఖి ముగించవలసి రావడమ్ ప్రతివారం చదువుతున్న సాయిభక్తులందరికీ ఎంతో నిరాశను కలిగించింది.  ఇంకా కొనసాగి ఉంటే సాయి సత్ చరిత్రలో మనకు తెలియని విషయాలు మరెన్నో మనకి బాబా ద్వారా తెలిసి ఉండేవి.

ఇక ఈ ఫలశృతిలో ఇంతవరకు బాబా మనకు తెలియని విషయాలు ఏమేమి చెప్పారో మరొక్కసారి సింహావలోకనం చేసుకుందాము.

**ఈ షిరిడి సాయితో ముఖాముఖి కి ముగింపు వాక్యాలను బాబా నాచేత వ్రాయించడానికి అనుమతిని ప్రసాదించినందుకు బాబాకు ఋణగ్రస్థుడినని భావిస్తూ…..   త్యాగరాజు

(వచ్చేవారమ్ ఫలశృతి ముగింపు)

       శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి కి ప్రేరణ మరాఠీ భాషలో 
              శ్రీ హేమాడ్ పంత్ వ్రాసిన శ్రీ సాయి సత్ చరిత్ర
    శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి లో బాబా చెప్పిన విషయాలు



బాబా తనను పెంచి పెద్దచేసిన  తల్లిదండ్రుల గురించిన వివరాలను తెలియజేసారు. 
Image result for images of shirdisaibaba grinding wheat

బాబా ద్వారకామాయిలో తిరగలిలో గోధుమ పిండిని విసిరి ఆ పిండిని బీడువారిన పొలాలలో చల్లించేవాడినని చెప్పారు.  ఆ తరవాత వర్షాలు పడినపుడు బీడువారిన ఆ భూములు పచ్చని పంటలతో బాగా పండి రైతులు సంతోషించేవారు.  వారు సంతోషంతో ఇచ్చిన పంటను తిరిగి, తాను భీదవారికి పంచేవాడినని చెప్పారు బాబా.

ద్వారకామామాయిలో బాబా ప్రతిరోజు భక్తులనుండి వసూలు చేసే దక్షిణ ఏవిధంగా ఖర్చు చేస్తున్నదీ కనిపెట్టడానికి బ్రిటిష్ వారు గూఢచారులను పంపుతూ ఉండేవారు.  ఆవిధంగా వచ్చినవారిలో మౌలిద్దీన్ తంబోలీ ఒకడు.  అతనిలో మానసిక పరివర్తన తీసుకురావడానికి బాబా అతనితో కుస్తీ పోటీలో కావాలని ఓడిపోయారు.

బాబా తన భక్తులను కాపాడుకునేందుకు వారి మొండివ్యాధులను తాను స్వీకరించేవారు.  ఆ తరువాత తన శరీరమును శుధ్ధి చేసుకునేందుకే బాబా ఖండ యోగము, ధౌతీ మొదలయిన ప్రక్రియలను చేసేవారు.

బాబా తనకు, బడేబాబాకు మధ్య ఉన్న అనుబంధము గురించి వివరంగా చెప్పారు.  బడేబాబా వెనుకటి జన్మలో తన భక్తుడని ఒక జమీందారు గారి ఇంటిలో వంటపని చేసేవాడని చెప్పారు.  అతను అందరికీ వంటలు చేసి పెట్టేవాడు.  ఆఖరిలో అతను తినడానికి ఏమీ ఉండేది కాదు.  ఆకలితోనే బాబా నామస్మరణ చేసుకుంటూ జీవితాన్ని గడిపాడు.  తరువాతి జన్మలో ద్వారకామాయికి వచ్చాడు.  అందువల్ల అతనిని బాబా తన ప్రక్కనే కూర్చుండబెట్టుకుని భోజనము పెట్టి రూ.55/- దక్షిణ ఇచ్చేవారు.

భీమాజీ పాటిల్ కు కలలో దర్శనమిచ్చి, వీపుపై కొట్టిన బెత్తము దెబ్బలకు అతని ఊపిరితిత్తులలో ఉన్న క్షయవ్యాధి క్రిములు చనిపోయాయి.  ఆవిధంగా విచిత్రమయిన చికిత్స చేసి భీమాజీ పాటిల్ క్షయరోగాన్ని రూపు మాపారు.

బాలాగణపతి మలేరియా వ్యాధి నివారణకు అతనితో నల్లకుక్కకు పెరుగన్నము తినిపించారు.  బాలాగణపతి కర్మను బాబా నల్లకుక్క రూపంలో అనుభవించారు.

రతన్ జీ షాపూర్ జీ వాడియా తన పొలాలలో కనిపించిన ప్రతిపామునూ చంపించుతూ ఉండేవాడు.  ఆ పాప కర్మ ఫలితంగా అతనికి పుట్టిన ఆడపిల్లలలో కొంతమంది చనిపోయారు.  రతన్ జీ, మౌలానా సాహెబ్ ను దర్శించుకున్నపుడు ఆయన అతనిని నాగశాపాన్నుండి విముక్తుడిని చేసి బాబా వద్దకు పంపించాడు.  బాబా అరటిపండును ఎంగిలి చేసి అతని చేత బలవంతంగా తినిపించి, అతనికి పుత్రసంతానాన్ని అనుగ్రహించారు.

ద్వారకామాయిలోని రెండు బల్లులు వెనుకటి జన్మలో అక్కాచెల్లెళ్ళు.  ఆ జన్మలో వారు తమ ఇంటిగోడ మీద ప్రాకుతున్న బల్లులని ఇద్దరూ కొట్టి చంపారు.  ఆ పాప కర్మ ఫలితమే ఈ జన్మలో వారికి బల్లి జన్మ కలిగింది.
Image result for images of two lizards on wall

పన్నెండు వందల సంవత్సరాల క్రితము ఆదిశంకరాచార్యులవారు, నేను ఇద్దరమూ ఒక గురువు వద్ద శిష్యరికము చేసాము అని బాబా చెప్పారు.

ఉపవాసము గురించి నేనిచ్చే సలహా -  ఉపవాసము చేయడం వల్ల మిగిలిన భోజన పదార్ధాలను బీదవారికి, అనారోగ్యంతో ఉన్నవారికి పంచిపెట్టేట్లయితే నీవు చేసే ఉపవాసాన్ని నేను అంగీకరిస్తాను అన్నారు బాబా.

నా అనుగ్రహము కావాలనుకొనే నా భక్తులు కులమతాలకతీతంగా మానవత్వము అనే మతమును స్వీకరించాలి.

ఎంత ధనము ఉన్నా తినడానికి భోజనము దొరకని స్థితిలో ఎవరయినా ఎంగిలి రొట్టే పెట్టినా దానిని దైవప్రసాదంగా భావించి తినవలెను.

శ్యామాను ఒక దుష్టశక్తి పాము రూపంలో వచ్చి కాటేసింది.  బాబా శ్యామాను పట్టి బాధించుచున్న ఆ దుష్టశక్తిని దిగు, దిగు, వెడలిపోఅని ఆదేశించి తరిమివేశారు.

ప్రతిభక్తునికి తన ఇష్టము వచ్చిన రీతిలో నన్ను సేవించుకొనవచ్చును.  ఎవరి విధానము వారిది.  ఇందులో ఇతర భక్తుల జోక్యము ఉండరాదు అని ఉపదేశించారు.

గృహస్థ ధర్మంలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి భగవంతునికి పూజ చేయాలి.  వారిని తాను సదా ఆశీర్వదిస్తాను అని బాబా చెప్పారు.

మీరు ఎక్కడ ఉన్నా మరచిపోకుండా మీ తల్లిదండ్రులు పేరిట ఆబ్ధికము చేసి బీదలకు అన్నదానము చేసినట్లయితే అటువంటివాటికి నేను తప్పకుండా వచ్చి భోజనము చేస్తాను అని మాట ఇచ్చారు బాబా.
Image result for images of garg muni

శ్రీకృష్ణపరమాత్ములవారు నాయజమాని.  శ్రీకృష్ణుని బాల్యంలో వారికి కృష్ణఅని నామకరణం చేసిన గర్గమునిని నేను.  ఈ కలియుగంలో షిరిడీ సాయిగా అవతరించాను.  ధులియా కోర్టులో నావయసు లక్షల సంవత్సరాలు, నాది దైవ కులము అని చెప్పాను.

అందుచేత లక్షల సంవత్సరాల క్రితం బాబా గర్గముని.  
(వచ్చే వారం ఫలశృతి ముగింపు)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)









Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List