02.06.2020 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మనం సాయి భక్తులలో ఒకరయిన దామూ అన్నా కాసార్ గారి గురించి పూర్తిగా తెలుసుకుందాము.
ఈ సమాచార సేకరణ shirdisaitrust.org చెన్నై వారినుండి గ్రహింపబడినది.
సాయిలీల - మరాఠీ రచయిత్రి - శ్రీమతి ముగ్ధా దివాద్కర్
ఆంగ్లానువాదమ్ - శ్రీ సుధీర్
తెలుగు అనువాదమ్ ః ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
దామూ అన్నా – నానాసాహెబ్ రాస్నే - 1 వ.భాగమ్
బాబాను మొదటినుంచి భక్తితో సేవించిన భక్తులలో దామోదర్ అనే దామూ అన్నా సావల్ రామ్ రాసనే ఒకరు.
వారి కుటుంబంలోనివారందరూ సదాచార పరాయణులు.
సత్పురుషుల ఆత్మకధలను రచించే మహీపతిబువా తహ్రబద్ కర్ ఆయన తాతగారికి గురువయితే
భానుదాస్
మహరాజ్ ఆయన తండ్రికి గురువు.
స్వభావసిధ్ధంగానే దాము చాలా మర్యాదస్తుడు.
అతను ఆర్ధికంగా చితికిపోయిన ఉన్న పరిస్థితులలో
అహ్మద్ నగర్ లో గాజులవ్యాపారం ప్రారంభించాడు. ఆ వ్యాపారంలో తొందరలోనే బాగా సంపాదించాడు.
జీవితంలో
ఆయనకు అన్నీ సమకూరినప్పటికీ ఒక్కటే మనోవ్యధ ఆయనని కృంగదీస్తూ
ఉండేది. దానికి
కారణం పుత్రసంతానం లేకపోవడమే.
మొదటి
భార్యకి పుత్రసంతానం కలగకపోవడం వల్ల రెండవ వివాహం చేసుకున్నాడు.
ఆయినా
లాభం లేకపోయింది.
పుత్రసంతానం కలగాలంటే సాధు సత్పురుషులను సేవించి వారి ఆశీర్వాదాలు పొందాల్సిందేనని భావించాడు.
తన
గ్రహస్థితులు
ఎలా ఉన్నాయో పరీక్షించుకోవడానికి ఎంతోమంది జ్యోతిష్కులను సంప్రదించాడు.
జ్యోతిష్కులు
ఆయన జాతకాన్ని పరిశీలించి పుత్రస్థానంలో దుష్టగ్రహమైన
కేతువు ఉండటం వల్ల గురుగ్రహం ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నదని చెప్పారు.
దాని
ఫలితంగా జాతకంలో పుత్రుడు జన్మించే యోగం లేదని తేల్చి చెప్పారు.
ఈవిధంగా
లెక్కలేనంతమంది
జ్యోతిష్కులను
సంప్రదించడంవల్ల
రాస్నేకి జ్యోతిష్యంలో తనకి తానె అధ్భుతమయిన
జ్ఞానాన్ని సంపాదించాడు.
ఇలా ఉండగా రాస్నే కుటుంబానికి పరిచయస్థుడయిన శ్రీ గోవిందరావు సప్ కర్ (మాధవరావు దేశ్ పాండె మామగారు) రాస్నేతో శ్రీసాయిబాబాను దర్శించుకుని ఆయన సలహా తీసుకోమని చెప్పారు.
1892వ.సంవత్సరంలో ఒకసారి దామూ అన్న ఒకపని నిమిత్తం నీమ్ గావ్ వెళ్ళాల్సివచ్చింది. అక్కడే ఆయనకి సాయిబాబా గురించి పూర్తి సమాచారం తెలిసింది. నీమ్ గావ్ నుంచి షిరిడీ ఒకటిన్నర మైళ్ల దూరంలోనే ఉండటం వల్ల రాస్నే సాయిబాబా దర్శనం చేసుకోవడానికి షిరిడీ వెళ్ళారు.
దామూ అన్నా గురుదత్తాత్రేయునికి, శంకరుడికి భక్తుడు.
ఎన్నో
పుణ్యక్షేత్రాలకి
వెళ్ళాడు, తీర్ధయాత్రలు
చేసాడు. అందువలననే
బాబా దర్శనం చేసుకోగానే ఆయనకి తిరుగులేని భక్తుడయాడు.
తనకి
పుత్రసంతానం
కలగాలనే ఒకే ఒక కోరికతో అతను షిరిడీ వెళ్లడం తటస్థించింది.
అతను
బాబాను మొట్టమొదటగా కలుసుకోగానే బాబా “నీకోరిక నెరవేరుతుంది” అన్నారు.
అహ్మద్ నగర్ షిరిడీకి దగ్గరలోనే ఉండటంవల్ల దామూసేఠ్ తరచుగా షిరిడీ వెళ్లడం మొదలుపెట్టాడు.
మొట్టమొదట్లో
బాబా అతనిని షిరిడీలో ఉండటానికి అనుమతించలేదు.
అయినాగాని,
దామూ అన్నా నిరంతరం బాబాగురించే ఆలోచిస్తూ ఉండటంవల్ల అతని కళ్ళముందు బాబారూపమే కనిపించసాగింది.
షిరిడీలో
బాబా తనను ఎక్కువకాలం ఉండనీయనందుకు అతను బాధపడుతూ ఉండేవాడు.
ఇటువంటి పరిస్థితులలో అతని సోదరి మరణించింది.
దానితో
అతను చాలా కృంగిపోయాడు. అశుచిరోజులలోనే బాబా
అతనిని షిరిడీకి పిలిపించారు.
అతనిని
ద్వారకామాయి
మెట్లెక్కి పైకి రమ్మన్నారు.
అతనికి
మంచిమాటలు చెప్పి ఓదార్చారు.
అప్పాకులకర్ణి ఇంటికి
వెళ్ళి, చందనం బొట్టు పెట్టుకుని బొబ్బట్లు తినమని ఆదేశించారు.
అశుచిరోజులలో
ఈవిధంగా చేయడం ఆచారానికి విరుధ్ధమయినప్పటికి, బాబా మీద తనకున్న ధృఢమయిన భక్తివల్ల బాబా చెప్పినట్లే చేసాడు.
ఆరు ఏడు సంవత్సరాలు గడిచిపోయాయి.
కాని
రాస్నేకు పుత్రసంతానం కలుగుతుందనే కోరిక ఏమాత్రం తీరే సూచనలు ఏమీ కనిపించటంలేదు.
అది
1898 – 99 సంవత్సరం. రాస్నే
బంధువు ఒకరు అతనిని బుజ్జగిస్తూ మూడవవివాహం చేసుకోమని, లేకపోతే సోదరుని కొడుకుని దత్తత తీసుకొమ్మని సలహా ఇచ్చాడు.
ఇక ఈ సమస్యకి పరిష్కారం చూపించమని బాబాకే నివేదిద్దామనే ఉద్దేశ్యంతో షిరిడీకి ప్రయాణమయ్యాడు.
అదే సమయంలో రాలే అనే మామలతదారు గోవానుంచి దివ్యమయిన మామిడిపండ్ల
బుట్టని పంపించాడు.
దానిని
మాధవరావు దేశ్ పాండే పేరుమీద పంపిస్తూ ఆపండ్లని బాబాకు బహుమతిగా ఇమ్మని కోరాడు.
బుట్టను తెరవగానే తియ్యటి సువాసననలను వెదజల్లుతూ బంగారు రంగులో మెరిసిపోతున్న మాంఛి మామిడిపండ్లు కనిపించాయి.
అవి మొత్తం 300 దాకా ఉన్నాయి. బాబా అన్నిటినీ పరీక్షించి 8 పండ్లను వేరుగా ఉంచారు. వాటిని మాధవరావు చేతిలో పెడుతూ వాటిని కొళంబాలో ఉంచమని చెప్పారు. “ఇవి దామ్యా కోసం” అన్నారు బాబా.
అవి మొత్తం 300 దాకా ఉన్నాయి. బాబా అన్నిటినీ పరీక్షించి 8 పండ్లను వేరుగా ఉంచారు. వాటిని మాధవరావు చేతిలో పెడుతూ వాటిని కొళంబాలో ఉంచమని చెప్పారు. “ఇవి దామ్యా కోసం” అన్నారు బాబా.
బాబాకు
పిల్లలంటే ఎంతో ఇష్టం. పిల్లలందరినీ తన చుట్టూ
చేర్చుకుని వారికి మిఠాయిలు, ప్రసాదం పంచిపెడుతూ ఉండేవారు. బాబాకు, పిల్లలకు మధ్య ఈవిధంగా అనుబంధం ఏర్పడి ఆటలాడుకుంటూ
ఉండటం, బాబా మంచితనం వీటిని అలుసుగా తీసుకుని పిల్లలు ఒక్కొక్కసారి తినేపదార్ధాలను
ఆయనకు తెలియకుండా ఎత్తుకుపోతూ ఉండేవారు. వారు
చేసే పిల్ల చేష్టలకు బాబా వారినేమీ అనేవారు కాదు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment