14.11.2020 శనివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
దీపావళి
శుభాకాంక్షలు
ఈ
రోజు ఒక చిన్న లీల ప్రచురిస్తున్నాను. బాబా
వారు దేహధారిగా ఉన్న రోజులలో చూపించిన అధ్బుతమయిన చమత్కారమ్. తాను షిరిడీలోనే కాదు సర్వాంతర్యామిననే విషయాన్ని
ఋజువు చేస్తూ చూపించిన అధ్భుతమయిన లీల.
షిరిడీసాయి
ట్రస్ట్. ఆర్గ్. నుండి గ్రహింపబడినది….
తెలుగు
అనువాదమ్ .. ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట
సర్వాంతర్యామి
కాకాసాహెబ్
సోదరుడు రాజారామ్ దీక్షిత్ నాగపూర్ లో నివాసం ఉంటున్నారు. వృధ్ధాప్యం వల్ల ఆయనకు ఆరోగ్యం క్షీణించింది. ఆసమయంలో కాకాసాహెబ్ షిరిడీలో ఉన్నాడు. అందుచేత రాజారామ్ తన ఆరోగ్యం గురించి తెలుపుతూ కాకాసాహెబ్
కు ఉత్తరం వ్రాసారు. ఆ ఉత్తరం చివరలో “ ఇటువంటి విపత్కర పరిస్థితిలో నువ్వు నాగపూర్
లోనే ఉన్నట్లయితే నాకెంతో సహాయంగా ఉండేవాడివి.
అందుచేత ఈ ఉత్తరం అందినవెంటనే షిరిడినుంచి బయలుదేరి రా” అని రాసారు.
ఎప్పటిలాగానే
ఉత్తరం అందినవెంటనే దానిని తీసుకుని బాబా వద్దకు వెళ్లాడు. బాబా అంతర్యామి కాబట్టి కాకా సాహెబ్ తో “రాజారామ్
కి ముసలితనం వస్తున్నది. వృధ్ధాప్యం వల్ల అనారోగ్య
సమస్యలు రావడం సహజమే. నువ్వు అక్కడికి వెళ్ళినందువల్ల
ప్రయోజనం ఏమిటి? వెళ్లి వాడాలో కూర్చో, మీ అందరికోసమే నేనిక్కడ కూర్చొని ఉన్నాను. కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు” అన్నారు.
షిరిడిలో
బాబాకు, కాకాసాహెబ్ కు మధ్య ఈ సంభాషణ జరుగుతున్న సమయంలో, నాగపూర్ లో రాజారామ్ గారి
ఇంటి ఆవరణలోకి ఒక ఫకీరు వచ్చాడు. అతను కాషాయ
దుస్తులు ధరించి ఉన్నాడు. ఆ ఫకీరు “నేను షిరిడీ
సాయిబాబా సేవకుడిని” అన్నాడు.
బాబా
పేరు వినగానే ఇంటిలోనివారందరూ ఆ ఫకీరును లోపలికి రమ్మని ఆహ్వానించారు. ఆ ఫకీరు గుప్పిటనిండా ఊదీని తీసు సాయిబాబా ప్రసాదం
అని రాజారామ్ కి ఇచ్చాడు. బాబా పేరు చెప్పి
రాజారామ్ కొంత ఊదీని నోటిలో వేసుకొన్నారు.
ఊదీని నోటిలో వేసుకున్న కొద్ది నిమిషాలలోనే ఆయన అనారోగ్యసమస్యలు అన్నీ నయమయిపోయాయి.
ఈ
సంఘటన గురించి అంతా వివరంగా కాకాసాహెబ్ కు ఉత్తరం వ్రాసారు. “సాయిబాబా తన సేవకుని చేత పంపించిన ఊదీని సేవించిన
వెంటనే నా భాధలన్నీ నయమయ్యాయి. ఇపుడు నేను
బాగానే ఉన్నాను. నీవు రావలసిన అవసరం లేదు”
(సర్వం
శ్రీసాయినాధార్పనమస్తు)
0 comments:
Post a Comment