Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, December 14, 2020

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 13 వ.భాగమ్

Posted by tyagaraju on 6:41 AM

 




14.12.2020  సోమవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 13 .భాగమ్

(రచయితశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీ, శుక్రవారమ్, అక్టోబరు, 18, 1985

నా డైరీలో వ్రాసుకున్న విషయాలు

12.45 P.M.  రోజు నేను స్థానికంగా నివసిస్తున్న ఒక గ్రామస్థుడిని కలుసుకొని మాట్లాడాను.  ఆయనకు 87 సంవత్సరాల వయసు.  సాయిబాబా సమాధి చెందిననాటికి ఆయన వయస్సు 24 సంవత్సరాలు.  ఆయన పేరు బప్పాబాబా.   ఆయనతో నా సంభాషణ ఎంతో ఉపయుక్తంగా జరిగింది.  సాయిబాబా ఆయనకు ఇచ్చిన నాణాన్ని నాకు చూపించారు.  దానిని ఆయన బాబా జ్ఞాపకార్ధంగా వెలకట్టలేని సంపదగా భద్రపరచుకొన్నారు.


ఆతరువాత నేను లక్ష్మీబాయి షిండె గృహానికి వెళ్ళాను.  ఆవిడ 1963 .సంవత్సరంలో మరణించారు.  ఆమె సమాధి ఆమె ఇంటిబయటనే నిర్మించారు.  సాయిబాబా ఆమెకు ప్రసాదించిన తొమ్మిది నాణాలను చూసే భాగ్యం కలిగింది.  బాబా తాను కొద్ది నిమిషాలలో సమాధి చెందుతారనగా వాటిని ఆమెకు ప్రసాదించారు.  తొమ్మిది నాణాలు నవవిధ భక్తులకి ప్రతీక  అవి శ్రవణం, కీర్తనం, స్మరణ, పాదసేవ, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, చివరిది ఆత్మనివేదనం.  ఇవే నవవిధ భక్తులు.  ఆనాణాలు  నాలో  ప్రగాఢమయిన ముద్ర వేసాయి.  


నాకు ప్రధాన దుబాసీగా వ్యవహరించిన స్వామి శేఖర రావుతో గ్రంధాలయంలో అన్ని విషయాలు మాట్లాడాను.  మా ఇద్దరి సంభాషణ చాలా బాగా జరిగింది.  మొత్తానికి సాయిబాబావారు అక్టోబరు, 1918 లో మహాసమాధి చెందడానికి ముందు ఆయనను ప్రత్యక్షంగా కలుసుకున్న/పరస్పరం ఆయనతో మెలగినవారు  ఏడుగురు ఉన్నారని, వారిని కలుసుకుని మాట్లాడగనని అనిపించింది.  ఆరుగురు షిరిడీలో ఉన్నారు, మరొకాయన స్వామి రామ్ బాబా బొంబాయిలో ఉన్నారు.

మధ్యాహ్నం మంచి భోజనం చేసాను.  నేను వేసుకున్న ప్రణాళిక ప్రకారం చేయవలసిన పనులు చాలా ఒత్తిడి కలిగించడం వల్ల కాస్తంత అలసట కలిగింది.  రోజు మధ్యాహ్నం ది పిల్ గ్రిమ్స్ ఇన్ హోటల్ కు వెళ్ళి అందులో ఉండటానికి గదులు ఏమన్నా ఉన్నాయేమో  అడగాలి.  నా దగ్గర ఉన్న డాలర్ లను కూడా రూపాయలలోకి మార్చుకోవాలి.  బలదేవ్ గ్రిమె మేనల్లుడు అందులో పని చేస్తున్నాడు.

భారతదేశంలోను ప్రపంచవ్యాప్తంగాను, సాయితత్త్వ ప్రచారం గురించి మరిన్ని వివరాలు సేకరించడానికి సంస్థానానికి వెళ్లాను.  సాయిబాబా గురించి మరికొన్ని పుస్తకాలు, సాయిలీల మాసపత్రిక పాతసంచికలు అధ్యయనం చేయడానికి బహుశ వారు నాకు సహాయం చేయవచ్చు.  వారికి తెలుసున్న విషయాలన్నీ నాతో పంచుకోవడానికి నాకు సహకరిస్తారనే నా ఆశ.

6.35  P.M.  రోజు మధ్యాహ్నం చాలా విషయాలు తెలిసాయి.  1984 .సంవత్సరంలో ప్రచురింపపబడిన సాయి మందిర్స్ & సాయి ఇన్ స్టి ట్యూషన్స్ డైరెక్టరీ ఇచ్చారు.  ( డైరీని హైదరాబాద్ లో ఉన్న షిరిడీ సాయి మిషన్ వారు ప్రచురించారు.  దీనికి అధ్యక్షులు శ్రీ ఎమ్.రంగాచారి).  భారతదేశంలో షిరిడీ సాయిబాబా భక్తి కేంద్రాలు సుమారు 150 ఉన్నాయి.  యూరప్ లోని లండన్ లో ఒకే ఒక కేంద్రం ఉంది.  ఆఫ్రికాలోను, ఘనా, ఇంకా నేపాల్, సిక్కిమ్, భూటాన్ లలో కూడా కొన్ని ఉన్నాయని అంటారు.  సాయిభక్తులు ఎంతో మంది ఉన్నారని,  అలాగే భక్తికేంద్రాలు చాలా ఉన్నాయని అందులోను భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయని సంస్థానం వారు చెప్పారు. 

బహుశా లండన్ లో ఉన్న ఏకైక కేంద్రం అది ఒక్కటే అన్న విషయం నిజమే అయి ఉండవచ్చు.  ఆకేంద్రాన్ని అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులు నిర్వహిస్తున్నారని చెప్పారు.  (ఇదే విధంగా ఘనాలో కూడా సాయిబాబా కేంద్రం నిర్వహింపబడుతూ  ఉంది.)

ఆవిధంగా సాయిబాబా భారతదేశమంతా ముఖ్యంగా మహారాష్ట్రలోను, ఆంద్రప్రదేశ్ ఇంకా దక్షిణాది రాష్ట్రాలలో బాగా ప్రజాదరణ పొందినప్పటికీ వాస్తవానికి భారతదేశం వెలుపల ఆయన గురించి అంతగా ఎవరికీ తెలియదు.

సంస్థానంవారు శ్రీనారాయణ బాబా (జన్మించిన సం. 1936) గురించి కొంత సమాచారం ఇచ్చారు.  ఆయన సాయిబాబాకు వారసునిగా గాని మాధ్యమంగా గాని ఎటువంటి ప్రామాణికం లేదని చెప్పారు.

సాయిబాబాకు వారసులు గాని, హక్కుదారులు గాని, ఎవరూ లేరని సంస్థానం వారు మళ్ళీ మళ్ళీ చెప్పారు.  ఏమయినప్పటికీ వారికి ఆయన కార్యకలాపాలన్నీ తెలుసు.  ఆయన సాయిభక్తుల చిన్న బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.   ప్రధానంగా జరిగే ఉత్సవాల సమయంలో ఆయన చాలా కష్టపడి తన శిష్యులతో కలిసి షిరిడీకి వచ్చేవారు.  ఉదాహరణకి 1985.సంవత్సరంలో ఆయన నవంబరు, 16 శనివారం నుండి 19.తేదీ మంగళవారం వరకు  షిరిడీ యాత్ర ఏర్పాటు చేసారు.   ఆయన శిష్యులు ఆయనను ఒక సాయిభక్తునిగానే భావించేవారు.  వారు ఆయనకు ఒక బాబాగా గౌరవం ఇచ్చేవారు అంతే తప్ప 1959 నుండిఆయనను సాయిబాబాకు, ప్రజానీకానికి మధ్య ఒక మధ్యవర్తిగా మాత్రం ఎటువంటి ప్రత్యేకత ఇవ్వలేదు.  ఇది నిజంకాదు అని వారంటారు కాని వారికి ఆయన మీద  నమ్మకం లేదు అంతే.

ఇక 1942.సంవత్సరంలో జన్మించిన బషీర్ బాబా విషయానికి వస్తే ఆయన 1980.సంవత్సర ప్రాంతంలో మరణించారు.  ఖచ్చితమయిన తేదీ తెలియదని సంస్థానం వారు చెప్పారు.  సమాచారం సేకరించిన తరువాత కొద్ది రోజులలో నాకు చెబుతానన్నారు.  ఆయన కనీసం సంవత్సరానికి ఒక్కసారయిన తన అనుచరులతో కలిసి షిరిడీ వస్తూ ఉంటారని చెప్పారు.  శ్రీనారాయణ బాబాలాగానే బషీర్ బాబాను కూడా  ఒక సాయిభక్తుని గానే వారంతా పరిగణిస్తారు తప్ప అంతకుమించి ఆయనకు ఎటువంటి గౌరవం ఇవ్వరు.  తానే సాయిబాబా అనీ తిరిగి జన్మించానని ఆయన చెప్పినా గాని ఇక్కడ ఎవ్వరూ ఆయన మాటకి విలువ ఇవ్వలేదని చాలా స్థిరంగా చెప్పారు.  ఆయన గురించి మరికొంత సమాచారం చావడి వద్ద నివసిస్తున్న శివనేశన్ స్వామీజీ ఇస్తారని చెప్పారు.  వెంటనే నేను ఆయనను కలుసుకోవడానికి వెళ్ళాను.

(శ్రీ నారాయణ బాబా తన 16 మంది శిష్యబృందంతో ఆగస్టు 1981 .సంవత్సరంలో సాయిబాబా తత్త్వప్రచారం నిమిత్తం అమెరికా –యూరప్ యాత్ర నిర్వహించారు.  ఆగస్టు 28- 29, 1981 లో ఆయన వెనిస్ నగరానికి వచ్చారునాకు ఆయనను కలుసుకొనే అవకాశం కలిగింది.   సందర్భంగా ఆయన నాకు శ్రీసాయివాణి ప్రత్యేకసంచికను (వాల్యూమ్ 18-19 జూలై – ఆగస్టు 1981) ఇచ్చారు).

(ఇంకా ఉంది)

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


 

 


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List