16.12.2020 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస
గ్రంధము – 14 వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో
రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ, శుక్రవారమ్, అక్టోబరు, 18, 1985
నా డైరీలో వ్రాసుకున్న విషయాలు
30 సంవత్సరాలకు పైగా తాను ఇక్కడే పనిచేస్తున్నానని శివనేశన్ స్వామి చెప్పారు. చావడిలోను, సంస్థానం వారికి ఉచితంగా సేవచేస్తున్నానని అన్నారు. ఆయన తనను తాను ఒక సాధువుగా చెప్పుకొన్నారు. అంతే కాక ఇక్కడ ఉన్నవారందరూ కూడా ఆయనను ఆవిధంగానే గౌరవిస్తారు. బషీర్ బాబా ఇక్కడికి వచ్చినపుడు శివనేశన్ స్వామి ఆయనను కలుసుకొన్నారు. బషీర్ బాబా గురించి ఆయనకు కాస్త మాత్రమే తెలుసు. సాయిబాబాను దర్శించుకున్న వెంటనే తనకు ప్రత్యేకంగా శక్తులు, సిధ్ధులు లభించాయని బషీర్ బాబా చెప్పుకొన్నారు. కాని ఆయన తనకు లభించిన శక్తులను, సిధ్ధులను అహంభావంతో తన స్వప్రయోజనాలకోసం అనగా ధన సంపాదనకు, కొంతభూమిని కొనడానికి దుర్వినియోగం చేసి ఉండవచ్చని అన్నారు.
అందువల్ల తొందరలోనే బషీర్ బాబా తనకు
సంప్రాప్తించిన శక్తులన్నిటినీ నశింపచేసుకొని అప్రతిష్టపాలయి తన ఆధ్యాత్మిక అపరిపక్వతను
చాటుకొన్నారని చెప్పారు.. బషీర్ బాబా హైదరాబాద్ నుండి వచ్చారని అక్కడ ఆ ప్రాంతంలో ఆయనకు ఎంతోమంది భక్తులున్నారని
చెప్పారు. బషీర్ బాబా
మరణించిన సంవత్సరం తనకు సరిగా గుర్తులేదని, బహుశ 1982
లో గాని 1983 లో గాని మరణించి ఉండవచ్చని అన్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు నన్ను మరలా చావడి దగ్గరకు రమ్మన్నారు. అప్పుడు ఇంకా ఎక్కువసేపు మాట్లాడుకోవచ్చని
అన్నారు. ఆయనను కలుసుకునే
ముందు ఉదయం గం.9.30 కి నేను మహల్సాపతి కుమారునితో మాట్లాడవచ్చనుకున్నాను.
బషీర్ బాబా గురించి తెలిసిన విషయాలు
నన్ను చాలా నిరాశపరిచాయి. మరొక
ముఖ్యమయిన, ప్రసిధ్ధులయిన
వ్యక్తి గురించి నేను పూర్తిగా పరిశోధన చేయాలి. అయనే అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలోని
సత్యసాయిబాబా. ఆయన అవతారానికి
షిరిడీసాయిబాబాకు సంబంధం ఉందని కొంతమంది అభిప్రాయం.
పుట్టపర్తిలో ప్రముఖులయిన ఈ గురువు 1940 వ.సంవత్సరంనుండి తాను షిరిడీ సాయినని, తిరిగి జన్మించానని ప్రకటించుకున్నారు. ఆయన తన 13వ.ఏట తానే సాయిబాబా అని చెప్పగానే వారి కుటుంబంవారందరే కాకుండా ఆనాటి భక్తులు
కూడా చాలా ఆశ్ఛర్యపోయారు. నాకు తెలుసున్నంత వరకు ఆయన ఎప్పుడూ షిరిడికి వెళ్ళలేదు. కాని ఆయన ఒకసారి మాత్రం సతీ గోదావరి
మాతను దర్శించుకున్నారని మాత్రం చదివాను.
షిరిడీలో బప్పా బాబాగారితో ఆయన ఇంటిలో
సమావేశం. ఉదయం 9 నుండి 10.30 వరకు...
లక్ష్మణ్ రత్నపార్కే కుమారుడు బప్పాబాబా
గారితో మొట్టమొదటి సంభాషణ. ఆయన ఆ గ్రామ పూజారి, జ్యోతిష్కుడు. మాధవరావు దేశ్ పాండె(శ్యామా) కు మేనమామ.
శ్రీసాయిలీల పత్రికలో ప్రచురింపబడిన
సమాచారం ప్రకారం బప్పాబాబా 1886వ.సంవత్సరంలో జన్మించారు. అందుచేత నేను ఆయనను ఇంటర్వ్యూ చేసిననాటికి
ఆయనకు 99 సంవత్సరాల వయసుండవచ్చు. సాయిబాబా మహాసమాధి చెందిన
1918 వ.సంవత్సరం తనకు 24 ఏండ్లని బప్పాబాబా చెప్పారు.
ఆయన చెప్పినదే నిజమయితే ఆయన 1894 వ.సంవత్సరంలో జన్మించి ఉండాలి.
1985 వ.సం.లో ఆయన
వయస్సు 91 సంవత్సరాలు.
ప్రశ్న --- సాయిబాబాతో మీతండ్రిగారికి ఉన్న సంబంధం ఏమిటో వివరిస్తారా?
జవాబు --- మానాన్నగారు లక్ష్మణరత్నపార్కే గారు వెనుకటి రోజుల్లో ఎప్పుడు సాయిబాబా పూజ
చేస్తుండెవారు. బాబా
సమాధిచెందిన తరువాత మరుసటి రోజు యదయాన్నే బాబా మానాన్నగారికి స్వప్నంలో దర్శనమిచ్చారు. బాబా మానాన్నగారిని లేవమని,
తనకు ఆరతి ఇమ్మని చెప్పారు.
బాబా అన్నమాటలు, “నేను మరణించాననుకుని
(బాపూసాహెబ్) జోగ్ రాడు. నేను లేనని అనుకోకు. వెళ్ళి ఆరతి ఇవ్వు” అన్నారు. మానాన్నగారు
ఆవిధంగానే ఆరతి ఇచ్చారు.
ప్రశ్న --- సాయిబాబా గురించిన మీజ్ఞాపకాలను వివరిస్తారా?
జవాబు --- బాబా సమాధి చెందినపుడు నాకు 24 సంవత్సరాలు. సాయిబాబా చేతులు చాలా పొడవుగా ఉండేవి. ఆయన చేతి వ్రేళ్ళు ఆయన మోకాళ్లను దాటి ఉండేవి. ఆవిధంగా ఉన్నవాటిని హిందీలో జానుబాహు అంటారు.
బాబా భక్తులకు ఆశీర్వాదాలను, దీవెనలు ఇచ్చేవారు. ఒక్కోసారి ఆయన తన స్వహస్తాలతో భక్తుల నుదుటిమీద ఊదీని రాసేవారు. బాబా బీదవారికి డబ్బు పంచిపెట్టేవారు. వారికి భోజనం కూడా పెట్టేవారు. భక్తులు తనకు సమర్పించిన దక్షిణను ఆయన తిరిగి బీదవారికి పంచిపెట్టేసేవారు. ద్వారకామాయిలో బాబా తనే స్వయంగా ఎక్కువ మొత్తంలో వంటచేసి బీదవారందరికీ అన్నదానం చేసేవారు.
ఒక్కోసారి
ఆయన ద్వారకామాయిలోనే భోజనాలు పెట్టేవారు.
ద్వారకామాయిలో తిరగలిలో గోధుమలు విసిరేవారు. బాబా నన్ను ఎంతో ప్రేమగా చూసేవారు. ఆయన నాకు ఎన్నోనాణాలను ఇస్తూ ఉండేవారు. డబ్బు, నాణాలను
ఆయన నాకుమాత్రమే కాక చాలామందికి ఇచ్చేవారు. బాబా నాకు ప్రసాదించిన ధనాన్ని నేను
నా అవసరాలకి ఖర్చు చేసేవాడిని. ప్రస్తుతానికి నాదగ్గర ఈ నాణెం ఒక్కటె మిగిలింది. దీనిని నేను ఆయన జ్ఞాపకార్ధంగా ఎంతో
భద్రంగా దాచుకొన్నాను. అక్టోబరు, 15, 1918 లో బాబా సమాధి చెందినపుడు నేను ద్వారకామాయిలో
బాబా దగ్గరేఉన్నాను.
ప్రశ్న --- ఆసమయంలో ఏమి జరిగింది?
జవాబు --- ఆరోజు మంగళవారం. బాబా మధ్యాహ్నం గం.2.30 కు సమాధి చెందారు. శరీరాన్ని విడిచి వెళ్ళేముందు బాబా
ఒకరిని పిలిచి తాంబూలం తెమ్మన్నారు.
ఆయన తాంబూలాన్ని నములుతూ కాసిని మంచినీళ్ళు త్రాగారు. ఆతరువాత కొద్ది నిమిషాలలోనే సమాధి
చెందారు. ఆసమయంలో మాధవ ఫాంస్లే బాబాకు మంచినీళ్ళు ఇచ్చాడు.
బాబా కాసిని నీళ్ళు త్రాగి వాంతి చేసుకొన్నారు. ఆ తరువాత ఆయన సమాధి చెందారు. ఆయన తన దేహాన్ని వీడేముందు లక్ష్మీబాయి
షిండెకి తొమ్మిది రూపాయినాణాలను ఇవ్వడం చూసాను. లక్ష్మీబాయి ఎల్లప్పుడు బాబాతోనే
ఉండేది. ఆమె బాబాకు
ఆహారం తినిపించేది. బాబా
సమాధి చెందిన సమయంలో ద్వారకామాయిలో బయాజీపాటిల్ అని ఒకామె ఉంది. బాబా తన శరీరాన్ని ఆమె ఒడిలో తొడలమీద
వాల్చి ప్రాణాలు వదిలారు. తనకు మరణం ఆసన్నమవుతున్నదని గ్రహించి బాబా ద్వారకామాయిలో ఉన్న భక్తులందరినీ
దీక్షిత్ వాడాకు వెళ్ళి భోజనం చేయమని చెప్పారు. బాబా తనకు డా.పిళ్ళేని చూడాలని ఉండని చెప్పి నన్ను ఆయనను తీసుకురమ్మని చెప్పారు. నేను బాబా చెప్పినట్లుగానే డా.పిళ్ళేని వెంటబెట్టుకుని వచ్చేసరికి బాబా మరణించారు.
(Foot Note by Antonio Rigopoulous... నేను భగవాన్ శ్రీసత్యసాయిబాబా గారి గురించి నారాయణ కస్తూరి గారు వ్రాసిన పుస్తకం చదివాను. అందులో నేను చదివిన విషయం…
నాలుగు సంవత్సరాల క్రితం (1957 లో) బాబా హైదరాబాద్ లో ఉన్నపుడు ఆయనను గోదావరిమాత ఆశ్రమానికి రమ్మని ఆహ్వానించారు. భక్తురాళ్ళు అందరూ ఆయనను వేదాశీర్వచనాలతోను, పూర్ణకుంభంతోను స్వాగతం పలికారు. ఆయనకు పూజలు సలిపారు. వారు తమకు ప్రశాంతి నిలయం దర్శించుకోవాలని ఉందని అన్నారు. అప్పుడు బాబా తాను అన్నిచోట్లా ఉన్నట్లే సాకోరీలో కూడా ఉన్నానని చెప్పారు. అందుచేత మీరు సాకోరీలోనే ఉండండి అని ఆయన వారితో అన్నారు.)
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పనమస్తు)
0 comments:
Post a Comment