22.06.2026 సోమవారమ్
ఓమ్ సాయి
శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్రచురింపబడిన బాబాలీలలు.
(నవంబరు, డిసెంబర్, 2025, సంచికలో ప్రచురింపబడినవాటికి కొనసాగింపు)
శ్రీ
సాయిమహరాజ్ ప్రసాదించిన అధ్బుత అనుభవాలు … 13 వ.భాగమ్
మరాఠీనుండి
ఆంగ్లానువాదం … షంషాద్ మీర్జా
తెలుగు
అనువాదం … ఆత్రేయపురపు త్యాగరాజు,
నిజాంపేట,
హైదరాబాద్
ఫోన్
--- 9440375411 & 8143626744
ఈ మెయిల్
… tyagaraju.a@gmail.com
శ్రీ
సాయిబాబావారి పవిత్రమయిన ఊదీ – మాహాత్మ్యమ్
నమ్మకము ముందు ఓడిన డిఫ్తీరియా - 2 చివరి భాగమ్
ఆస్పత్రిలో
డా.ఖనోల్కర్ గారు పాప గొతును పరీక్షించి వ్యాధి నిర్ధారణను ధృవీకరించారు. ఆయన ముఖంలో ఆందోళన కనిపించింది. “వెంటనే పాపకి యాంటీ టాక్సిన్” ఇంజక్షన్ ఇవ్వండి
అని అధికార స్వరంతో ఆదేశించారు.
అయితే
ఒక సమస్య వచ్చి పడింది. ఆ ఇంజక్షన్ కనక ఆస్పత్రిలో
ఇచ్చినట్లయితే, పాపని వెంటనే ఆర్ధర్ రోడ్ లో ఉన్న అంటువ్యాధుల ఆస్పత్రికి తరలించాల్సి
ఉంటుంది. పాపయొక్క చిన్న వయసు, సున్నిత స్వభావాన్ని
దృష్టిలో పెట్టుకుని, అటువంటి భయానక పరిస్థితిలో కుటుంబ సభ్యులనుండి పాపని వేరుగా ఉంచినట్లయితే
పాపయొక్క మనోధర్యం మరింతగా బలహీన పడవచ్చు.








