Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, January 22, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (11)

Posted by tyagaraju on 8:45 AM

22.01.2012 ఆదివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1994 11 వ.భాగాన్ని చదువుకుందాము.

సాయి.బా.ని.. డైరీ - 1994 (11)

21.03.1994

నిన్నటి రాత్రి శ్రీ సాయికి నమస్కరించి - "బాబా నాకు ఆజ్మీరులోని దర్గాను దర్శించటానికి - రణతంబోరులో శ్రీ గణేష్ మహరాజ్ ని దర్శించటానికి అనుమతిని ఆశీర్వచనాలను ప్రసాదించు" అని వేడుకొన్నాను.

రాత్రి కలలో శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అన్నారు. " శిష్యుడు మంచి గురువు కోసము ప్రయత్నాలు చేసే విధముగానే తనకు మంచి శిష్యుడు కావాలి అనే ఉద్దేశముతో గురువు ప్రయత్నాలు చేస్తాడు. యిరువురి ప్రయత్నాల ఫలితమే గురు శిష్యుల అనుబంధము. మన యిద్దరి అనుబంధము అటువంటిదే. నీవు ఊరు వెళ్ళిరా" - మాటలును శ్రీ సాయి ఆశీర్వచనాలుగాను, అనుమతిగాను స్వీకరించినాను.

29.03.1994

నిన్నటి రోజున ఆజ్మీరు, రణతంబోరు యాత్రలు ముగించుకొని తిరుగు ప్రయాణములో కోట చేరుకొన్నాను. రాత్రి శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను. కలలో శ్రీ సాయి ఒక విచిత్రమైన దృశ్యాన్ని ప్రసాదించినారు. వాటి వివరాలు "నేను చనిపోయినాను. ఎన్.ఎఫ్.సీ. లోని ఒక ఆఫీసరు శ్రీ సీ.ఆర్.పీ. శెట్టి తన మనుషులను తీసుకొనివచ్చి నా శరీరాన్ని స్మశానమునకు తీసుకొని వెళ్ళి దహనము చేయసాగినారు. దూరమునుండి శ్రీ సాయిని పోలిన సన్యాసి రెండు రాగి కానులను మంటలలో వేసినారు. నేను మంటలనుండి లేచి కూర్చున్నాను. అక్కడ గుమిగూడిన వారు అందరు నేను తిరిగి బ్రతకటము గురించి వింతగా మాట్లాడసాగినారు. నేను తిరిగి ఆఫీసుకు వచ్చినాను. నాకు అందరు మితృలుగా కనిపించసాగినారు. శతృవులు ఎవరు లేరు. నాలో గొప్పవారు, బీదవారు అనే భావన లేదు. నాలో శ్రీ సాయి శక్తి ఆవహించినది." విధమైన కలకు రాత్రి భయపడిన మాట వాస్థవం. సాయి నామము స్మరించుతు రాత్రి అంత గడపినాను.

02.04.1994

నిన్నటి రోజు క్రైస్థవుల "గుడ్ ఫ్రైడే". సందేశము ప్రసాదించమని శ్రీ సాయికి నమస్కరించి నిద్ర పోయినాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో కలలో దర్శనము యిచ్చి అన్నారు. "నీలో ఉన్న పరమత సహనము మంచిదే. యితర మతస్తుల గురించి వివరాలు - యితర మతాలుకు సంభంధించిన విషయాలు తెలుసుకోవలసిన అవసరము లేదు. అన్ని మతాలు భగవంతుని చేరటానికి వేరు వేరు మార్గాలు మాత్రమే. అందుచేత నీవు నమ్ముకొన్న మత సాంప్రదాయాలను చక్కగా పాటించి భగవంతుని అనుగ్రహము సంపాదించు" - విధమైన మాటలు అన్న తర్వాత శ్రీ సాయి చూపించిన దృశ్యము నాలో చాలా ఆలోచనలు రేకెత్తించినవి. నేను క్రైవస్తవుల యింటికి వెళ్ళి అక్కడవారిని క్రైస్తవ మతము గురించి వివరాలు అడుగుతాను. వారు నన్ను అపార్ధము చేసుకొని వారి మతములోనికి మారమని సలహా యిస్తారు. నా యింటిలో నా అక్క, చెల్లెలు, నా తమ్ముడు నేను మతము మార్పిడి చేసుకొంటున్నానని నన్ను అవహేళన చేయసాగినారు. నేను ఏదో తెలుసుకోవాలి అనే తపనతో అనవసరముగా మానసిక వ్యధను కొని తెచ్చుకొన్నాను. నేను మానవత్వము, దైవత్వము పేరిట ఏదో తెలియని ప్రయోగాలు చేసిన అది సంఘానికి మేలు చేకూర్చటమునకు బదులు కీడు చేస్తుంది అని గ్రహించినాను.

04.04.1994

నిన్నటి రోజున శ్రీ సాయి భక్తులు గురించి మరియు శ్రీ సాయి తత్వ ప్రచారకుల గురించి, శ్రీ సాయికి అంకిత భక్తులము అని చెప్పుకొనే వారి గురించి ఆలోచించి, శ్రీ సాయి భక్తులను సరి అయిన మార్గములో నడిపించమని శ్రీ శిరిడీ సాయినాధుని వేడుకొని నిద్రపోయినాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో యిచ్చిన సందేశాలు.

1. శ్రీ సాయికి అంకిత భక్తులము అని చెప్పుకొనే ప్రతి కిరాణా దుకాణము వాడి దగ్గరకు వెళ్ళి వారి బొధలు వినవద్దు. శ్రీ హేమాద్రి పంతు వ్రాసిన శ్రీ సాయి సత్ చరిత్రను మాత్రమే నమ్ముకో.

2. సాయి బంధువులు సాయి తత్వము గురించి తమ స్నేహితుల దగ్గర మాట్లాడవద్దు. శ్రీ సాయి తత్వమును, శ్రీ సాయి లీలా అమృతము శ్రీ సాయి బంధువులతో మాత్రమే పంచుకోవలెను.

3. తెల్లని పంచకళ్యాణి గుఱ్ఱాన్ని (భగవంతుని అనుగ్రహాన్ని) సమాజము అభివృధ్ధికి ఉపయోగించాలి కాని వ్యక్తిగత ప్రయోజనాలకు (స్వామీజీల స్వంత ప్రయోజనాలకు) ఉపయోగించరాదు.

(యింకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List