Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, January 2, 2012

సాయి.బా.ని.స. డైరీ

Posted by tyagaraju on 4:51 PM








03.01.2012 మంగళవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాసీస్సులు

ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1993 22 వ.భాగాన్ని చదువుకుందాము

సాయి.బా.ని.స. డైరీ - 1993


ఇందులో సాయి.బా.ని.స. గారు కలలో బాబా మీద ఖవ్వాలి పాటను వింటున్నట్లుగా చెప్పారు. దానిమీద బాబాఖవ్వాలి పాట లింకును కూడా మీకు అందిస్తున్నాను. ఆకలకు తగినట్లుగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఇవ్వడం జరిగింది. సునో అనే మాటతో ఉన్న ఖవాలి కోసం గూగుల్ లో వెతికాను, సునో అనే మాటతో పాట ఉందిగాని, అది ఖవ్వాలీ కాదు, పైగా అది కూడా ఉషారుగా పాడుతున్నట్లుగా లేకపోవడంవల్ల దాని లింక్ ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఇచ్చిన ఖవ్వాలీ కూడా విని ఆనందించండి. లింక్ తీసి చొపీ చేసి మరొక విండోలో ఓపెన్ చేసి చూడండి.


సాయి.బా.ని.స. డైరీ - 1993

21.11.1993

నిన్నటిరోజున కుటుంబ సభ్యులతో గొడవలు మనసుకు చాలా చికాకు కలిగించినది. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి నా మనసుకు ప్రశాంతత కలిగించమని వేడుకొన్నాను. శ్రీ సాయి ప్రసాదించిన దృశ్యము నా మనసులోని చికాకులు తొలగించినది.

అది ఒక బీదల బస్తి. అక్కడ హిందువులు ముస్లిములు కలసి కవ్వాలి పాడుతున్నారు. కవ్వాలి పాటలో శ్రీ సాయిబాబా లీలలు పాడుతున్నారు సాయి భక్తులు. పాటలు వింటూ ఉంటే మనసుకు ప్రశాంతత కలిగినది. ముస్లిం భక్తుడు "సునో సాయిబాబా" అనే పాట పాడుతుంటే నాకు యింకొకసారి ఆపాట వినాలని అనిపించినది. పాట తిరిగి పాడమని కోరినాను. ముస్లిం భక్తుడు 10 రూపాయలు దక్షిణ కోరినాడు. నేను సంతోషముగా యిచ్చినాను. భక్తుడు కవ్వాలి పాడుతుంటే నేను తన్మయత్వము చెందినాను. పాటలు పాడటము పూర్తి అయిన తర్వాత యింటి యజమానురాలు బయటకు వచ్చి సాయిబాబాకు పూజ చేసిన తర్వాత నన్ను పిలిచి పంతులుగారు మీ పంచాంగము పెట్టుకోవటానికి సంచి ఉపయోగపడుతుంది అని బుజానికి వేసుకొనే సంచి దానము చేసినది. నేను సంతోషముగా స్వీకరించినాను. నిద్రనుండి మెలుకువ వచ్చినది. స్వప్నము గురించి ఆలోచించినాను. శ్రీ సాయి మాత (యింటి యజమానురాలు) నాకు జోలి ఇచ్చినది. అందులో పంచాంగము (కాలమును నిర్ణయించి పంచ అంగాలు) పెట్టుకోమని చెప్పినది. జరుగుతున్న కాలాన్ని శ్రీ సాయి యిచ్చిన జోలిలో వేయటము నా కర్తవ్యము అని నిర్ణయించుకొన్నాను. జోలినుండి శ్రీ సాయి యిచ్చే ఫలాలు స్వీకరించదలచినాను.

http://mmusicz.com/video/6XEHnr4JQtg/Sai_Baba_Qawwali.html

26.11.1993

నిన్నటిరోజున జీవితములో కుటుంబ సభ్యులకు నేను చాలా సహాయము చేసినాను అనే భావన . వారు ఎవరు నాపై విశ్వాసము చూపటములేదు అనే బాధతో, శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను. శ్రీ సాయి చూపిన దృశ్యాలు కనువిప్పు కలిగించినవి. శ్రీ సాయి నా బంధువులకు నేను చేసిన సహాయము, నా మితృలకు నేను చేసిన సహాయము తిరిగి వారు నా వైపు కన్నెత్తి చూడకపోవటము చూపించి యిచ్చిన సందేశము నా మనసులో నిలిచిపోయినది. సందేశము వివరాలు :

జీవితము అనే పడవ ప్రయాణములో భార్య తెరచాపవంటిది. గాలి వాలు బాగా యున్నపుడు మాత్రమే తెరచాప ఎగరవేయాలి. లేకపోతే పడవ ప్రయాణానికి తెరచాప అడ్డుగా యండే ప్రమాదము ఉంది" "విశ్వాసము అనే పదానికి అర్థము లేదు. విశ్వాసము మాటలతో చెబితే చాలదు. విశ్వాసము చేతలలోఉండాలి".

30.11.1993

నిన్నటిరోజున బేగంపేటలో ఉన్న శివుని ఆలయానికి వెళ్ళినాను. అక్కడి పూజా వ్యవహారాలు నాకు నచ్చలేదు. శ్రీ సాయికి నమస్కరించి పూజా వ్యవహారాలుపై సందేశము ప్రసాదించమని కోరినాను. శ్రీ సాయి ప్రసాదించిన దృశ్యము వివరాలు, సందేశము వివరాలు


(1) ధనవంతులు శివుని ఆలయానికి వచ్చి బాగా డబ్బు ఖర్చు చేసి పూజలు చేసుకొని యింటికి వెళ్ళేటప్పుడు శివుని గుడినుండి విభూతి తీసుకొని వెళ్ళుతున్నారు.

(2) కొందరు మధ్య తరగతి కుటుంబీకులు అప్పు చేసి శివాలయానికి వచ్చి గొప్పలకు పోతు పూజలు చేయించుకొని యింటికి వెళ్ళేటప్పుడు శివుని గుడినుండి విభూతి తీసుకొని వెళ్ళుతున్నారు.

(3) మరికొందరు తమ నిజస్థితిని గుర్తించి తమ దగ్గర ఉన్న ధనముతోనే మట్టితో శివుని లింగము చేసుకొని యింటిలోని పొయ్యిలోని బూడిదను విభూతిగా భావించి పూజ చేసుకొంటున్నారు.

ఈవిధమైన దృశ్యాలు చూపి శ్రీ సాయి యిచ్చిన సందేశము "భగవంతుని విధముగా పూజించిన పరవాలేదు కాని పూజ అనంతరము భగవంతుని అనుగ్రహము సంపాదించాలి అంతేగాని అప్పు యిచ్చినవాడి బాధను మాత్రము కాదు".

(యింకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు




Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List