04.01.2012 బుధవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాసీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1993 23 వ. భాగాన్ని చదువుకుందాము
సాయి.బా.ని.స. డైరీ - 1993
నిన్నటిరోజున కుటుంబ సభ్యులతో నేను ధన సంపాదన, ధనము ఖర్చు విషయాలలో గొడవలు పడినాను. నేను అందరి కోరికలు తీర్చిన వారు సంతోషముగా లేరు. నేను జీవితములో సంపాదించిన ధనము కుటుంబ సభ్యుల బాధ్యతలు పూర్తిచేయటానికే ఖర్చు చేసినాను. అయినా యింకా డబ్బు కావాలని వారు కోరడములో నా మనసుకు చికాకు కలిగించినది. ఈ చికాకులను మనసునుండి తొలగించమని శ్రీ సాయిని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యము నా మనసుకు శాంతి కలిగించినది. అది ఒక పోలీసు స్టేషన్. పోలీసు వాడు దారినిపోయే ఓ అమాయకుడిని తెచ్చి పోలీసు స్టేషన్ లో కూర్చుండబెట్టి అతన్ని లాఠీతో కొడుతు అతని దగ్గరనుండి డబ్బు గుంజుతున్నాడు. అదే పోలీసు కానిస్టేబుల్ కొంచము సేపు తర్వాత పోలీసు ఇన్స్పెక్టర్ వేషములో వచ్చి ఆ అమాయకుడిని కొడుతు డబ్బు గుంజుతున్నాడు. ఆ పోలీసు కానిస్టేబుల్ ఆ విధముగా వేషాలు మార్చుతు ఆ అమాయకుడిని బాధించుతు డబ్బు గుంజుతున్న సమయములో ఒకసారి సరిగా వేషము మార్చలేకపోవటము ఆ అమాయకుడు గుర్తించినాడు. ఆ అమాయకుడు తనకు జరుగుతున్న మోసమును గుర్తించి ఆ పోలీసు కానిస్టేబుల్ మీద తిరగబడినాడు. ఆ సమయములో పోలీసు స్టేషన్ బయట ఉన్న ప్రజలు ఈ సంఘటనకు విరగబడి నవ్వుతారు. నేను కూడ ఈ సంఘటన చూసి నవ్వుతాను. నిద్రనుండి మెలుకువ వచ్చినది. శ్రీ సాయి ఈ విధమైన దృశ్యము ద్వారా నా కన్నులు తెరిపించి ఎవరైన అనవసరముగా నిన్ను మోసము చేస్తు నీనుండి ధనము గుంజుతుంటే ధైర్యముగా తిరగబడటము మంచిది అనే భావము కలిగించినారు.
05.12.1993 నిన్నటిరోజున యితరులకు ఏవిధముగా సహాయము చేయాలి. సహాయము చేసిన తర్వాత ఎవరినుండి ఏమి కోరాలి అనే ఆలోచనలతో శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను. శ్రీ సాయి చూపించిన దృశ్యము నన్ను చాలా ఆశ్చర్యములో ముంచి వేసినది. "అది చక్కటి పచ్చని పొలము. ఆ పొలములో రైతులు నాగలితో దున్నటములేదు. కాని మంచి పంటలు పండుతున్నాయి.
యింత మంచి పంటలు పండటానికి కారణము ఏమిటి అని ఆలోచించుతు ఆ పొలములో కాలు పెట్టినాను. ఆ పొలములో వానపాములు చక్కగా బ్రతుకుతు ఆ పొలము యజమానికి అంటే రైతుకు చాలా సహాయము చేస్తున్నాయి.
శ్రీ సాయి యిచ్చిన సందేశము "నీవు భూమిలో వానపాములాగ బ్రతుకుతు రైతుకు మంచి పంటపండించటానికి సహాయము పడాలి" అన్నారు శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో.
06.12.1993 నిన్నటిరాత్రి శ్రీ సాయికి నమస్కరించి నా ఆధ్యాత్మిక రంగానికి మంచి సలహా యివ్వమని కోరి నిద్రపోయినాను. శ్రీ సాయి చూపిన దృశ్యాలు నాగత జీవితమునకు సంబంధించినవి. వాటి గురించి చాల సేపు ఆలోచించి తిరిగి నిద్రపోయినాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో వచ్చి నా చేతికి ఒక కత్తిని యిచ్చి గుఱ్ఱము ఎక్కి ఆఖరి పవిత్ర యుధ్ధము చేయమని ఆదేశించుతారు. నాలాగనే కొంతమంది కవచము ధరించి, కత్తి చేత బట్టుకొని, గుఱ్ఱము ఎక్కి యుధ్ధము చేస్తున్నారు. నిద్రనుండి మెలుకువ వచ్చినది. ఈ దృశ్యమునకు నేను గ్రహించిన అర్ధము. యింక జీవితములో సంసారబంధాలు, స్నేహ బంధాలు విడనాడి భక్తి అనే కత్తిని చేత పట్టుకొని, భగవంతుని అనుగ్రహము అనె గుఱ్ఱము ఎక్కి పవిత్ర ఆధ్యాత్మిక యుధ్ధము చేయాలి.
08.12.1993
నిన్నటిరోజు అంత మనసులో చాల చికాకులు కలిగినవి. నా బంధువులతో ఏవిధముగా మసలుకోవాలి ముందు జాత్రత్తగా సలహాలు యివ్వమని శ్రీ సాయిని కోరినాను. శ్రీ సాయి రాత్రి కలలో ఓ అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అంటారు. నీ జీవితానికి ఆగస్టు 15 పండగ జరిగినది. యింక నీ బంధువులు గురించి ఎక్కువగా ఆలోచించకు. వారితో ఎక్కువగా మాట్లాడకు. విశాఖపట్నము వెళ్ళి నీపని చేసుకొని వెంటనే తిరిగిరా. నాకు మెలుకువ వచ్చినది. శ్రీ సాయికి నమస్కరించినాను.
(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment