09.08.2013 శుక్రవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఫ్రియమైన సాయిబంధువులారా! నేటితో "పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి" పూర్తి అవుతున్నది..సాయి బా ని స గారు తన కుమారునికి వ్రాసిన ఉత్తరాలలోని సాయి తత్వాన్ని మీరందరు చక్కగా చదివి అర్ధం చేసుకున్నారని తలుస్తాను...సాయి.బా.ని.స. గారు ఆచరించినట్లుగా మనందరమూ శ్రీసాయి సత్ చరిత్ర నిత్యపారాయణ చేసినట్లయితే సర్వ శుభములు కలుగుతాయని మనకందరకూ బాగా అర్ధమయింది..ఈ అధ్యాయము చదివిన వెంటనే శ్రీసాయి సత్ చరిత్రలోని 51వ.అధ్యాయము చివరిలో నున్న ఫలశ్రితిని ఒక్కసారి చదవండి..శ్రీ సాయి సత్ చరిత్ర పారాయణ వల్ల కలిగే లాబాలు కానివ్వండి, ఉపయోగాలు కానివ్వండి మీకే అర్ధమవుతుంది..
ఇంతకుముందు శ్రీసాయితో మధుర క్షణాలు ప్రచురించాను...రేపటినుండి మిగిలిన భాగాలను ప్రచురిస్తున్నాను..చదివి ఆనందించండి..శ్రీసాయిని మనసారా మదిలో నిలుపుకొనండి.
ఓం సాయిరాం
ముందుగా శ్రీవిష్ణు సహస్రనామం 82వ.శ్లోకం, తాత్పర్యం
శ్లోకం : చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః |
చతురాత్మా చతుర్బావశ్చతుర్వేద విదేకపాత్ ||
తాత్పర్యం : పరమాత్మ నాలుగు మూర్తులుగా లేక దశలుగా సృష్టిని వ్యక్తము చేయువాడు. ఒకటి పరావాక్కు, రెండు పశ్యంతీవాక్కు, మూడు మధ్యమావాక్కు, నాలుగు వైఖరీవాక్కు, పరమాత్మ నాలుగు వాక్కులు కలవాడు.
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 51వ.అధ్యాయము (ఆఖరి అధ్యాయం)
విశాఖపట్నం
22.02.1992
ప్రియమైన చక్రపాణి,
శ్రీసాయిబాబా జీవిత చరిత్రములోని విశేషాలు, నా జీవితముపై శ్రీసాయి సత్ చరిత్ర ప్రభావమును తెలియచేస్తు నీకు వ్రాసిన ఉత్తరాలలో యిది ఆఖరి ఉత్తరము. ఈఉత్తరము చదివేముందు 51వ.అధ్యాయము చదివి శ్రీసాయిని పూర్తిగా అర్ధము చేసుకో.
ఈనిత్య పారాయణ ఫలాలను నేను పొందినాను. ఆఫలాలు నీకు ఎంతో మేలు చేసినవి. నీవు నీతోటివారు కూడా ఆఫలము మహత్యమును అనుభవించాలి అని మనసార కోరుచున్నాను. ఈజన్మ అంతా శ్రీసాయి యిచ్చిన బాధ్యతలు నిర్వర్తించే సన్యాసి (బా.ని.స.) గా గడపాలని కోరుకొంటున్నాను. శ్రీసాయి సత్ చరిత్రలో ఫలశృతి వివరింపబడినది. నేను 51వ. అధ్యాయము నిత్యపారాయణ చేసిన రోజున శ్రీసాయి ప్రసాదించిన ఫలాలు.
1) గుంటూరులో 51వ.అధ్యాయము చదివిన సమయములో అమెరికానుండి టెలిఫోన్ లో నా అన్నదాత శ్రీవారణాశి సూర్యారావుగారి ఆశీర్వచనాలు పొందినాను.
2) కొరియా దేశములో 51వ. అధ్యాయము చదివిన రోజు రాత్రి శ్రీసాయి బౌధ్ధ భిక్షువు రూపములో వెండి డాలరును నాకు బహూకరించినారు.
3) 27.06.91 నాడు 51వ.అధ్యాయము చదివినరోజున నీకు ఎం.సె.ట్. లో 1331వ ర్యాంక్ వచ్చినది.
4) 14.08.91 నాడు 51వ.అధ్యాయము చదివినరోజున నీవు వాసవి యింజనీరింగు కాలేజీలో చేరినావు.
5) 23.03.91 నాడు 51వ.అధ్యాయము చదివినరోజున నాకొరియా దేశముయాత్ర కాగితాలుపై పైఅధికార్లు సంతకాలు చేసినారు.
6) ఈరోజు అంటే 22.02.92నాడు 51వ.అధ్యాయము చదివినాను. శ్రీసాయి నాకుమార్తె వివాహము 10.05.92 ఆదివారము ఉదయము 6.58 నిమిషాలుకు జరుగును అని ముహూర్తము నిశ్చయించినారు.
శ్రీసాయి జీవితచరిత్ర నిత్యపారాయణ ఫలాలను నేను అనుభవించినాను. ఈఉత్తరాలును శ్రధ్ధ - సహనముతో చదివిన ప్రతి ఒక్కరు శ్రీసాయి ఆశీర్వచనములు పొందగలరు.
శ్రీసాయి సేవలో
నీతండ్రి
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణిసాయి సమాప్తం
0 comments:
Post a Comment