Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, March 27, 2016

శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మికం – 10 వ. భాగమ్

Posted by tyagaraju on 8:33 AM
Image result for images of shirdi sai baba in flower garden
     Image result for images of rose garden

27.03.2016 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబానిసకు సాయిబాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని.
Image result for images of saibanisa

శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మికం – 10 వ. భాగమ్

11.11.2010

91.  మనము ప్రాపంచిక రంగములో రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నపుడు దారి తప్పిపోయినా రోడ్డు మీద బాటసారుల సాయంతో తిరిగి మనం నడక ప్రారంభించిన స్థలానికి చేరుకోగలముఅదే ఆధ్యాత్మిక రంగంలో మనము దారి తప్పిపోయినచో యోగుల దగ్గరికి వెళ్ళినపుడు వారు మనం గమ్యం చేరడానికి సరియైన మార్గం చూపిస్తారు.   
                             Image result for images of yogi and disciple



22.11.2010

92.  ఇటుకలు, సిమ్మెంటుతో పూజామందిరం నిర్మించడం కన్నా నీమనసులో దేవాలయాన్ని నిర్మించుఅందువలననే దేహమే దేవాలయం అన్నారు.  
                                         Image result for images of hanuman with srirama in his heart



03.12.2010

93.  ఆకాశం శ్రీసాయి అయినపుడు (సాయి సర్వాంతర్యామి) సాయి భక్తులు భూమివంటివారు
                                                                                                                                                                      సాయి బానిస

13.12.2010

94.  నా  సేవలో నీ కోర్కెలను నెరవేర్చుకొనడానికి ఇతరుల దగ్గిరకు వెళ్ళవద్దునేను నాభక్తుల సేవను గుర్తించి వారిని అనుగ్రహిస్తాను.   

17.12.2010

95.  మూగజీవులకు ఆహారం పెడుతున్నపుడు వాటి యజమానుల  జాతి,కుల తారతమ్యాలు చూడవద్దుమూగ జీవులకు ఆహారం పెడుతున్నపుడు వాటిలోని తారతమ్యాలు చూడవద్దుమూగ జీవులకు ప్రేమతో ఆహారం పెట్టు.  
                              
                                 Image result for images of shirdisaibaba in sky and devotees

28.12.2010

96.  తల్లి ఆవు తన దూడ ఎన్ని దూడల మధ్య ఉన్నా గుర్తించగలదుఅలాగే శ్రీసాయి తన భక్తులు ఎన్ని వేల మంది మధ్య ఉన్నా గుర్తించగలరు.
                                                                                                                                                                                  సాయిబానిస
                    Image result for images of shirdisaibaba in sky and devotees


02.01.2011

97.  యుధ్ధాలు చేసి, విజయాలు సాధించిన యోధుడు (అశోకుడువంటివారు) కూడా ఆఖరికి వైరాగ్యంతో ప్రశాంత జీవితం కోసం అన్నిటినీ వదలుకొని దూరంగా వెళ్ళిపోయాడు.  

15.03.2011

98.  ప్రతివాడు జీవితంలో అందము ఆనందమె కోరతాడుకాని వికారంతో ఉన్న ఆకారాన్ని కోరడుఅదే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వ్యక్తి రెండింటినీ సమ దృష్టితో చూస్తాడు.

18.03.2011

99.  ఈశావాస్యోపనిషత్తును పనిపిల్ల ద్వారా దాసగణుకు తెలియచేశారు బాబానాకు అదే పనిపిల్లతో సాయిపూజలో కులమతాలు అడ్డం కావు అని తెలియచేశారు బాబా
                                                                                                                                                                              --- సాయిబానిస

31.03.2011

100.  అయస్కాంతము ప్రాపంచిక జీవితంలో ఉపయోగపడే ఇనుమును ఆకర్షించునుఅలాగే నీలోని మంచితనం అనే అయస్కాంతము ఆధ్యాత్మిక జీవితంలో భగవంతుని కృపను ఆకర్షిస్తుంది.  

(మరిలొన్ని సందేశాలు తరువాతి సంచికలో)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List