Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, April 18, 2016

శ్రీ సాయి పుష్పగిరి – జీవితమ్ -3 వ.భాగమ్

Posted by tyagaraju on 8:22 AM
Image result for images of saibanisa
    Image result for images of roses


18.04.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి బానిసగారికి బాబా వారు ప్రసాదించిన జీవితమ్ గురించి ఆధ్యాత్మిక సందేశాలను మరికొన్ని తెలుసుకుందాము.

Image result for images of saibanisa

శ్రీ సాయి పుష్పగిరి – జీవితమ్ -3 వ.భాగమ్

29.12.2001

                  Image result for images of man blessing another

21)  నిండు నూరు సంవత్సరాలు నీవు జీవించాలి అని ఇతరులు నిన్ను దీవించే విధంగా నీవు జీవించు.




31.12.2001

22)  అంతులేని జీవిత యాత్రలో రేపు అనే పదానికి అర్ధం లేదుప్రతి చిన్నవిషయం గురించి ఆలోచిస్తుంటే నీవు ముందుకు సాగలేవునీ ప్రయాణ వాహనాన్ని (శరీరాన్ని) మంచి స్థితిలో ఉంచుకుంటూ దారిలోని ఎగుడు దిగుడులను అధిగమిస్తూ, నీ శక్తియుక్తులను సద్వినియోగం చేసుకుంటూ ఓటమిలో కూడా గెలుపును చూడగలగటం అలవాటు చేసుకోజీవిత గమ్యం (భగవంతుని చేరటం) చేరి అంతులేని యాత్రను కొనసాగించు
                Image result for images of man and god



31.01.2002

23)   మనిషి జీవితంలోని కష్టాలకు ఎదుటివాడు కారణం అని ఆలోచించడం అవివేకముమన అజాగ్రత్తయే ముఖ్య కారణం అని గ్రహించడం వివేకము.
               Image result for images of sea

24)  సాగరానికి ఆటుపోట్లు ఉన్నట్లే మన జీవిత సాగరానికి కష్టాలు సుఖాలు ఉంటాయని గ్రహించిననాడు మన జీవితంలో సుఖదుఃఖాలకి తావే లేదు.

31.03.2002  

                            Image result for images of yogi

25) యోగి దృష్టిలో శాశ్వతపరమయిన ఆరోగ్యము భగవంతుడిచ్చిన వరముభోగి దృష్టిలో ఆరోగ్యము వైద్యుడిచ్చిన వరమునీ జీవితంలో ఆరోగ్యం కోసం మంచి మార్గములో పయనిస్తూ భగవంతుని ఆశ్రయించదలిచావాలేక చెడుమార్గంలో పయనిస్తూ వైద్యుడిని ఆశ్రయించదలిచావా అని నిర్ణయించుకోవలసింది నీవే.
               Image result for images of man in bad habits


29.04.2002



26) గత జీవితము, గత స్మృతులు పాడుపడిన రాజమహల్ వంటిదిఅందులో నీఆలోచనలు పనికిరాని గబ్బిలాలలాగ ఎగురుతూ ఉంటాయిఅందుచేత పనికిరాని గత జీవితము, గత స్మృతుల జోలికి పోవద్దునీ నిజ స్థితిలో జీవిస్తూ మంచి భవిష్యత్తు కోసం కృషి చేయి.

24.07.2002

27)   నీ చిన్ననాటి స్నేహాలు, స్నేహితులను గుర్తు చేసుకుంటూ వారితో కలిసి విందులు వినోదాలు సాగించేకన్నా సమాజంలో దిక్కు లేని అనాధపిల్లలకు నీ ప్రేమను పంచి నీ  చిన్నతనాన్ని గుర్తు  చేసుకోవటం నీవు నీ స్నేహితులకిచ్చే గౌరవము అని గుర్తించు.
                     Image result for images of orphans


16.01.2003

28) సాయి సాగరం ఒడ్డున ఇసుకలో నడిచేటప్పుడు జాగ్రత్తగా నడవటం నేర్చుకోఅసూయాపరులు సముద్రపు ఒడ్డున గోతులు త్రవ్వి ఉంచుతున్నారు.

 29)  ఒకసారి నీ జీవితము నీ గురువు పాదాలకు అర్పించిన పిదప, నీకు నీ జీవితములో జరిగే ప్రతి పని నీ గురువు ఇచ్చానుసారముగా జరుగుతున్నదని గ్రహించి, ఆ నిజాన్ని అంగీకరించిన నీ జీవితము ఉత్తమ జీవితముగా వెలుగొందుతుంది.
                       Image result for images of shirdi sai lotus feet

31.01.2004

 30)  జీవితంలో శత్రువుతో పోరాటము అనివార్యమయినపుడు యుధ్ధం చేయక తప్పదుఅప్పుడు నీ శక్తి యుక్తులను పూర్తిగా ఉపయోగించవలెనుశక్తి తగ్గిపోయినపుడు యుక్తిగా నీ శత్రువుని సంహరించాలి

(మరికొన్ని ఆధ్యాత్మిక సందేశాలు తరువాతి సంచికలో)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List