Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, September 30, 2016

బాబా మీయింటికి కూడా వచ్చి ఉండవచ్చు

Posted by tyagaraju on 8:26 AM
 Image result for images of baba begging
    Image result for images of rose hd

30.09.2016 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబా మీయింటికి కూడా వచ్చి ఉండవచ్చు

నిన్న అనగా 29.09.2016 తేదీన ప్రచురించిన దీనజనోధ్ధరణ 2వ.భాగంలో అధ్యాయం - 38 ఓ.వి. 17,18 లలో బాబా చెప్పిన మాటలు ఒక్కసారి చదవండి..."సమయా సమయాలలో అతిధులు వచ్చినపుడు వారిని అన్నదానంతో సుఖపెట్టడం గృహస్తుల ధర్మం............."

 10.01.2011 నాడు బాబా లీల ఒకటి ప్రచురించాను.  అది అందరూ చదివి ఉండకపోవచ్చు.  ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మరలా ప్రచురిస్తున్నాను.  అప్పట్లో ఇది శ్రీమతి ప్రియాంకా రౌతేలా గారి బ్లాగులో (www.shirdisaideva.com) ఆమె స్వయంగా పోస్ట్ చేశారు.  దాని అనువాదమ్ ఈ సంధర్భంగా మరలా ప్రచురిస్తున్నాను చదవండి.



బాబా మీయింటికి కూడా వచ్చి ఉండవచ్చు

10.01.2011 సోమవారం    
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
సాయి బంధువులారా మీకందరికీ సాయి అనుగ్రహం లభించాలని బాబాని వేడుకుంటున్నాను.
బాబా లీలలు ప్రతిరోజు వ్రాసే భాగ్యాన్ని నాకు, చదివే అదృష్టాన్ని మీకు కలగచేసినందులకు మనం బాబాకు యెల్లప్పుడు కృతజ్ఞలమై ఉండాలి. సాధ్యమైనంతవరకు తెలుగులోకి తర్జుమా చేస్తున్నాను. ఒకవేళ తెలియక పొరపాట్లు యేమయినా ఉంటే దయచేసి తెలియపర్చండి.
మనకు సాధారణంగా ఒక అలవాటు ఉంది. అపరహ్ణంవేళ యెవరు వచ్చినా భిక్ష వెయ్యకూడదు అని. ఒకవేళ అపరాహ్ణంవేళ బాబాగారు భిక్షకుని రూపంలో వచ్చి ఉండవచ్చు
***************************************************
ఈ బాబా లీల శ్రీమతి ప్రియాంకా రౌతేలా గారు తమ బ్లాగ్ లో పోస్ట్ చేసినది. దానియొక్క అనువాదం ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాను.
మన అందరికీ కూడా బాబా గారి దర్శనం కావాలనే కోరిక ఉంటుంది. మన సద్గురు సాయినాధుని అనుగ్రహం కోసం మనం యెన్నోవిధాలయిన పూజలు వ్రతాలు అన్నీకూడా మనకు తెలిసినంతలో చక్కగా చేస్తాము. కాని బాబాగారు మన ఇంటికి యేదోరూపంలో వచ్చారనే సంగతి మనం గ్రహించలేము. బిక్షకుని రూపం కావచ్చు, సాధువు రూపంలో కావచ్చు, శునకం లేక పక్షి రూపంలో నైనా వచ్చిఉండవచ్చు. కాని మనం మానవమాత్రులంకదా అందుచేత గుర్తించలేము. నేను కొంతమందిని గమనించాను. వారు యేమంటారంటే, బాబాగారు నాకు దర్శనం ఇవ్వలేదు, నాప్రార్థనలకి జవాబు ఇవ్వలేదు, బాబాగారు నామీద కోపగించారా? ఇటువంటి నిందలకు అంతుండదు. కాని మనం ఆత్మ విమర్శ చేసుకోవడం మర్చిపోతాము. నా మనసులోఉన్న ఇదే విషయం మీద ఒక భక్తురాలియొక్క అనుభవాన్ని మీకు చెపుతాను.
ఇది చాలా, హృదయానికి హత్తుకునే నిజంగా జరిగిన సంఘటన.
Image result for images of baba begging

ఆగస్టులొ ఢిల్లీనుంచి మా కజిన్ వచ్చాడు. ఆమరునాడు మేము ఉంటున్న సిటీలోనే తన స్నేహితుడిని కలవాలనుకున్నాడు. తన స్నేహితుడి ఇంటికి నన్నుకూడా తోడుగా రమ్మనమని అడిగాడు. నాకు ఇష్టం లేకపోయినా తన కోరికని కాదనలేకపోయాను. అతనింటికి వెళ్ళగానే నాకు ఆఇంటిలో ఒక విధమయిన నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లు అనిపించింది. ఆ నెగటివ్ ఫోర్స్ వల్ల నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. 5 నిమిషాల తరువాత అతని తల్లి 70 సం.వయస్సు ఉన్న విధవావిడ వచ్చింది. వారింటికి వెళ్ళడం నాకు ఇదే మొదటిసారి కాబట్టి మాటలాడటనికి యేమీలేక ఊరికే కూర్చున్నాను. హటాత్తుగా ఆమె మా అమ్మాయి పేరు ఆడిగింది. మా అమ్మాయి పేరు "సాయినా" అని చెప్పాను. మరలా ఆమె ప్రశ్నించక ముందే, నేను సాయి భక్తురాలిని అందుచేత ముందర సాయి అని వచ్చేటట్లు పేరు పెట్టానని చేప్పాను. బాబా వలననే మా అమ్మాయి రక్షింపబడింది అని చెప్పాను. నేను మాట్లాడుతున్నానే గాని యేదో తెలియని శక్తి నన్ను బయటికి ఆ ఇంటిలోనించి వెళ్ళిపొమ్మని చెపుతున్నట్లుగా అనిపించింది. కాని అక్కడే కూర్చుని మా కజిన్ అతని స్నేహితుల సంభషణలను వింటూ కూర్చున్నాను. అతని తల్లి నావయిపే దీక్షగా చూడడం గమనించాను. నేను ఆ ఇంటిలో నాలుగువయిపులా పరికించి చూడడం మొదలుపెట్టాను. హటాత్తుగా నా దృష్టి ఫ్రిజ్ మీద అంటించిన బాబా స్టికర్ మీద పడింది. నాకు బాగుందనిపించింది. మా కజిన్ స్నేహితుడిని మీరు బాబా భక్తులా అని అడిగాను. నా ప్రశ్న వినగానే అతని తల్లి తాము యెంతటి దురదృష్టవంతులో చెప్పింది. బాబా గారు తమ ఇంటికి వచ్చినా గుర్తించలేకపోయాము. అప్పటినుంచి చాలా కష్టాలు పడుతున్నామని చెప్పింది. ఇదివినగానే యేమి జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి నాలో పెరిగింది. జరిగినదంతా చెప్పమని ఆంటీని అడిగాను. 6 నెలలక్రితం ఒక ఫకీర్ మధ్యాహ్నం ఒంటిగంటవేళ వచ్చి యేమయిన ఆహారం పెట్టమని అడిగాడు. గడచిన 2 -3 రోజులనుంచీ యేమీ తిండి తినలేదని చెప్పాడు. ఆమె అతను చెప్పినదేమీ పట్టించుకోకుండా నిర్దయగా వెళ్ళిపొమ్మని చెప్పింది. కాని ఆ ఫకీరు బిక్ష అడుగుతూ అక్కడే నుంచున్నాడు. ఆ ఫకీరు, వెళ్ళిపొయేటప్పుడు, ఇంక యెవరింటికీ కూడా బిక్షకు వెళ్ళకపోవడం గమనించింది. ఆరోజునుంచి వారికి ప్రతీరోజు కష్టాలు మొదలయ్యాయి. ఇలా రోజులు, వారాలు, నెలలు గడిచిపోయాయి. ఒకరోజున ఒక ముసలి ఫకీరు వచ్చి ఆంటీతో, బాబా గారు మీఇంటికి, మీ బాధలు, కర్మలూ అన్నీ పోగట్టటానికి వచ్చారు అని బాబా గారు వచ్చిన నెల తేదీ, సమయం అన్నీ చెప్పారు. కాని మీరు చాలా దురదృష్టవంతులు, ఆయనని గుర్తించలేదు అని చెప్పాడు. ఆంటీ మరోమాట మాట్లాడకముందే ఆఫకీరు మాయమయ్యాడు. ఆంటీ మ్రాన్ పడిపోయింది. ఇక వేరేదారి లేక ఆమె బాబాని క్షమించమని ప్రార్థించి, మరలా తిరిగిరమ్మని వేడుకుంది.

ఇదంతా చెప్పి ఆంటీ చిన్నపిల్లలా యేడవడం మొదలుపెట్టింది. నేను ఆమెని ఓదార్చడానికి ప్రయత్నించాను. కాని లాభం లేకపోయింది. ఆఖరిగా ఆమెకు ఊదీ పాకెట్ ఇచ్చి బీదవారికి అన్నదానం చేయమని చెప్పాను.

ఓర్పు, సహనంతో ఉండండి, బాబాగారు మరలా వస్తారు అని ఓదార్చాను. కాని ఆమె కన్నీటిని ఆపడం నాకు సాధ్యం కాలేదు. వాళ్ళబ్బాయికి నా బాబా బ్లాగ్ గురించి తెలుసు కనక, భిక్షకు యెవరు వచ్చినా లేదు పొమ్మని కసిరి కొట్టకుండ ఈ విషయమంతా బ్లాగ్లో పోస్ట్ చెయ్యమని చెప్పాడు. అతని తల్లి ఇప్పటికీ ఆఫకీర్ మరలా వస్తాడని బయట కుర్చీ వేసుకుని యెదురుచూస్తు ఉందిట.

అందుచేత మీఇంటికి యెవరు వచ్చినా సరే కసిరి కొట్టవద్దు. ఇవ్వడం ఇస్టం లేకపోతే మర్యాదగా వెళ్ళిపొమ్మని చెప్పండి. బాబాగారు యేరూపంలోనయినా రావచ్చు. బాబా గారు చెప్పినదిదే.

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు





Kindly Bookmark and Share it:

2 comments:

Balaji Rao Kona on October 1, 2016 at 6:59 PM said...

సాయి సచ్ఛరిత మహిమాన్వితము. మా అందరకీ సాయి లీలలు,భక్తుల అనుభవాలు పోస్ట్ చేస్తున్న వారందరకీ పేరు పేరున ధన్యవాదములు
మీ
కోన బాలాజీ బాజీ రావు
నెల్లూరు.

Balaji Rao Kona on October 1, 2016 at 7:00 PM said...

సాయి సచ్ఛరిత మహిమాన్వితము. మా అందరకీ సాయి లీలలు,భక్తుల అనుభవాలు పోస్ట్ చేస్తున్న వారందరకీ పేరు పేరున ధన్యవాదములు
మీ
కోన బాలాజీ బాజీ రావు
నెల్లూరు.

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List