12.11.2016 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు శ్రీషిరిడీ సాయి వైభవంలో ఒక వైభవాన్ని తెలుసుకుందాము.
శ్రీ
షిరిడీ సాయి వైభవమ్
బాబా
పవిత్రం చేసిన రూపాయి
మనకు
శ్రీసాయి సత్ చరిత్ర 29వ.అధ్యాయంలో డా.విర్ హాటేకు బాబా ఇచ్చిన రూపాయ గురించిన ప్రస్తావన
వస్తుంది. దాని గురించి మరికొంత వివరణ.
కాప్టెన్
హాటేకు బాబా అంటే ప్రగాఢమయిన భక్తి. అతను షిరిడీలో కొంత కాలమున్న తరువాత గ్వాలియర్ కి
తిరిగి వచ్చాడు.
ఒకరోజు గ్వాలియర్ లోనే ఉండే సావల్ రామ్ అనే అతను హాటే వద్దకు ఎంతో ఆందోళనపడుతూ వచ్చి తన కొడుకు కనపడటంలేదని చెప్పాడు. అప్పుడు డా.హాటే, “షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకో. నీ కొడుకు తప్పక దొరుకుతాడు” అని చెప్పాడు. సావల్ రామ్ అలాగే చేసుకుంటానని చెప్పాడు. ఆ తరువాత కొంత కాలానికి అతని కొడుకు వద్దనుంచి ఉత్తరం వచ్చింది. అందులో “తాను ఈజిప్ట్ లో ఉన్నానని, తల్లిదండ్రులు కోపగిస్తారనే ఉద్దేశ్యంతో ముందు చెప్పకుండా రహస్యంగా సైన్యంలో చేరానని” వ్రాసాడు. ఇప్పుడు తాను భారతదేశానికి తిరిగి వస్తున్నానని రాసాడు. సావల్ రామ్ ఆనందానికి అవధులు లేవు. కాని షిరిడి వెళ్ళలేదు. సావల్ రామ్ భార్యతో కలిసి కొడుకును తీసుకుని రావడానికి బొంబాయి వెళ్ళాడు.

కొడుకును
చూడగానే సావల్ రామ్ చాలా ఖిన్నుడయ్యాడు. కొడుకు
చిక్కి శల్యమై తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు.
వెంటనే వైద్యం చేయించడానికి కొడుకును వెంటబెట్టుకుని గ్వాలియర్ వచ్చాడు. ఈ విషయాన్నంతా డా.హాటేకి చెప్పాడు. వైద్యం చేస్తున్న వైద్యుడు సావల్ రామ్ ని బాగా చీవాట్లు
పెట్టాడు. “నువ్వు నీ మాటను నిలబెట్టుకోలేదు.
ముందర కొడుకుని షిరిడీ తీసుకొని వెళ్ళి బాబా దర్శనం చేయించు. అబ్బాయి ఆరోగ్యవంతుడవుతాడు” అన్నాడు. భార్యాభర్తలిద్దరూ కొడుకుతో షిరిడీకి ప్రయాణమయ్యారు. వారు బయలుదేరబోతుండగా డా.హాటే, సావల్ రామ్ కి ఒక రూపాయినిచ్చి, “ఈ రూపాయను బాబా
చేతిలో పెట్టు. తిరిగి ఆరూపాయను తీసుకురావడం
మర్చిపోకు” అని మరీ మరీ చెప్పాడు. బాబావారు
ఆ రూపాయను తాకి పవిత్రం చేసిన తరువాత దానిని తన పూజా మందిరంలో పెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో
ఇచ్చాడు.
సావల్
రామ్ కుటుంబమంతా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకున్న తరువాత తిరిగి గ్వాలియర్ చేరుకున్నారు. డా.హాటే ని కలుసుకుని తన కుమారుడు కోలుకుంటున్నాడని
చెప్పాడు. బాబా గారి నుంచి తిరిగి తీసుకున్న
రూపాయను కూడా ఇచ్చాడు. డా.హాటే ఆ రూపాయను తీసుకున్నాడు,
కాని అది తాను ఇచ్చిన రూపాయ కాదని చెప్పాడు.
చాలా నిరాశకు గురయ్యాడు. మళ్ళీ తిరిగి
షిరిడీ వెళ్ళి బాబానుంచి తాను ఇచ్చిన రూపాయను తిరిగి తీసుకురమ్మని సావల్ రామ్ తో చెప్పాడు. సావల్ రామ్ ఇంటికి వచ్చి భార్యతో జరిగినదంతా చెప్పాడు. అప్పుడామె లోపలికి వెళ్ళి తాను భద్రంగా దాచిన డా.హాటే
ఇచ్చిన రూపాయను తీసుకుని వచ్చింది. ఆ మరుసటి
రోజు సావల్ రామ్, డా.హాటేకు ఆ రూపాయను అందచేశాడు.
బాబా తాకి పవిత్రం చేసిన ఆరూపాయను ప్రసాదంగా అందుకున్న డా.హాటే ఎంతో ఆనందాన్ని
పొందాడు. రూపాయ ఇవ్వడంలో జరిగిన పొరపాటును
వివరించి సావల్ రామ్ క్షమాపణ కోరాడు. జరిగిన
విషయం విని డా.హాటే తృప్తి చెందాడు.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment