08.11.2016 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిపాద రేణువు (మూర్తిగారి) అనుభవాలు - 5
ఇంక
మా రెండవ అమ్మాయి పరిస్థితి
- ఆమె తన PG 2005 మొదట్లో పూర్తి చేసుకుని (13) మా అబ్బాయి లాంటి
వాళ్ళ కజిన్ అన్నయ్య (అమెరికా
లోనే ఉంటాడు) ద్వారా అమెరికా లో ఉద్యోగం సంపాదించుకుని
(అదీ బాబా దయ వల్లనే
- కాని ఆమె ఒప్పుకోదు ఈ
వాదనకి) అమెరికా వెళ్ళిపోయింది.(14) ఆమె
ఆర్ధిక పరిస్థితికి ఏమి లోటు లేదు. [ఇక్కడ
మీకు ఒక విషయం అర్ధమయ్యే
ఉంటుంది - ఎవరి ప్రారబ్ధం వాళ్ళు
అనుభవిస్తున్నారు. మా పెద్దమ్మాయికి కష్టాలు
రాసిపెట్టి ఉన్నాయి, చిన్న అమ్మాయికి
సుఖాలు రాసి పెట్టి ఉన్నాయి
వాళ్ళ వాళ్ళ పూర్వ జన్మల
కర్మ ఫలితాల వల్ల].
2005కి
ఆమె వయసు 25 సంవత్సరాలు. ఆమె
కనీసం ఒక సంవత్సరమైనా ఉద్యోగం
చేస్తేనే కాని పెళ్లి చేసుకోనంది.
సరే అన్నాము. కాని
తర్వాత కూడా పెళ్లి ప్రయత్నాలు
ఎన్ని చేస్తున్నా ఏవి ఫలించడం లేదు.
2010 లో మాత్రమే ఆమె వివాహం ఇక్కడి
ఉద్యోగస్తుడి తోనే జరిగింది.(15) కాని
అతను పరమ చాదస్తుడని, శాడిస్ట్
అని, తల్లి చాటు బిడ్డడు
అని పెళ్లి అయిన తర్వాతే తెలిసింది.(16) ఈ
విషయం ఆ తల్లి కొడుకులు
ఇద్దరూ చాల
చాకచక్యంగ
దాచి పెట్టేరు. పెళ్లి అయిన తర్వాత ఆ
విషయాలు త్వరగానే బయట పడ్డాయి.(17) మా
బాధ ఇంక చెప్పనలవి కాదు.
ఒక 6 నెలలలోనే ఆమె పెళ్లి పెటాకులయింది.(18) ఆమె
విడాకులకి అప్లై చేసి 3 సంవత్సరాల
తర్వాత పొందింది.(19) ఈ లోపున ఆ
రెండవ అల్లుడు ఆమెని ఎన్ని విధాల
అడ్డు పడాలో అన్ని విధాల
అడ్డు పడ్డాడు. [ఇక్కడ
కూడా మీరు ఒక విషయం
అర్ధం చేసుకుని ఉండాలి - ఆమె జాతక చక్ర
ఫలాల ప్రకారం (అంటే ఆమె ప్రారబ్ధం
ప్రకారం) ఆమెకు అన్నీ జరుగుతున్నాయి,
కాని బాబా వేటిని అడ్డు
పెట్టడం లేదు, ఎందుకంటే ఆమె
బాబా భక్తురాలయి ఉండి బాబా మీద
ఆధారపడకుండా తన అన్నయ్య మీద,
తన ఉద్యోగం (ప్రతిభ) మీద ఆధారపడింది.] ఆమెకి
ఆర్ధికంగా బాబా అవసరం లేదు. కాని
బాబాని నమ్ముకుని, ఆయన చెప్పినట్టు విని
ఉంటే ఆమెకి విడాకులు త్వరగా
వచ్చి ఉండేవి, రెండవ వివాహం కూడా
త్వరగా జరిగి ఉండేది కూడా. ఎవరి
తల రాత వారిది. (ఇక్కడ ఇంకొకటి గమనించాలి
- ఆమె అమెరికాలో ఉద్యోగం చేస్తున్నా ఆమె నుంచి ఎటువంటి
ధన సహాయం కాని, ఆమె
మాకు ఎంతో కొంత ఇవ్వాల్సిన
బాధ్యత తన మీద ఉన్నదని
ఆమెకి గుర్తు చేయడం కాని మేము
చేయలేదు.(20) అలాగే
ఆమె కూడా మాకు ఏమి
పంపించడం లేదు. ఆమె ఇక్కడకి
(హైదరాబాద్ కి) వచ్చినప్పుడు ఏమైనా
కొంటే వద్దన లేదు. అయినా తన పెళ్ళికి
(90%) ఖర్చు తనే పెట్టుకున్నది.)
ఆమెకి యింకా ఏ సంబంధమూ
కుదర లేదు. [ఆమె వివాహం ఈ
మధ్యనే (ఏప్రిల్ 30 న) జరిగింది అక్కడి
వ్యక్తి తోనే]. ఆమె
పరిస్థితి ఇది. ఇంక
చిత్రమైన సంగతి ఏంటంటే - బాబా
చేసిన, చేస్తున్న లీల ఏమిటంటే(21) - మాకు
వచ్చే పెన్షన్ డబ్బులతో మా పెద్ద అమ్మాయికి
సపోర్ట్ చేయిస్తున్నారు; మా చిన్న అమ్మాయి
నుంచి మాకు ఎటువంటి ధన
సహాయం లేకుండా చేస్తున్నారు. మమ్మలిని
మాత్రం అనుక్షణం కాపాడుతున్నారు.(22)
ఈ
మధ్యనే జరిగిన లీల (23) గురించి మీకు చెబుతాను.
క్రితం జూలై లో బాబా
నాకు ఒక విలువైన సలహా
ఇచ్చాడు - ఏమిటంటే - నువ్వు 3 నెలలో ఈ ఇంటిని
(మా సొంత flat) ఖాళీ చేసి వేరే
ఇంటికి వెళ్ళు. పెద్ద ప్రమాదం పొంచి
ఉంది అని. నా
భార్యకు ఇష్టం లేదు ఆ
ఇల్లు మారడం. కాని బాబా హెచ్చరికని
తేలికగా తీసుకోలేక పోయింది. అంతే, వేరే ఇల్లు
చూసుకుని సెప్టెంబర్ లో ఖాళీ చేసేసాము. అక్టోబర్
లో నా అప్పుల వాళ్ళలో
ఒక (బహుశా పెద్ద) అప్పుల
వాడు తన బలగాన్ని ఇంటి
మీదకి పంపించాడు ఆ ఇల్లు స్వాధీనం
చేసుకోవడానికి. కాని
ఆ ఫ్లాట్స్ లో మా ఫ్లాట్
పక్కనే ఉన్న మా శ్రేయోభిలాషి చేత, బాబా అక్కడ అడ్డు
పెట్టించాడు. పాపం
మా కోసం ఆయన కొంత
టెన్షన్ అనుభవించాల్సి వచ్చింది. ఆయన వాళ్ళని ధైర్యం
గానే ఎదుర్కొన్నాడు. కాని
మాకు బాబా రక్షణ ఈ
విధంగా చేస్తున్నాడు. (24) సరే
ఆ ఇంటిని ఇంక అమ్మేస్తాం బాబా
అని చెప్పేను. సరే
అన్నాడు. [తర్వాత
ఫిబ్రవరి లో ఆ ఇంటిని
అమ్మేసి, వేరే చోట (దూరంగా
దమ్మాయిగూడ లో) independent house ఇప్పించేడు బాబా. (34)]
బాబా చేసిన అద్భుతాలలో ఇంకొక అద్భుతం - మాకు ఒక కొడుకుకాని కొడుకుని ప్రసాదించడం.(25) (1995 సంవత్సరంలోనే) బాబా నాకు పరిచయం కాగానే, మేము అద్దెకు ఉంటున్న మా చుట్టాల ఇంటి (మా కజిన్) వాళ్ళ కొడుకు, మాకు (ముఖ్యంగా మా పిల్లలకు) బాగా దగ్గరయ్యేడు. మా కొడుకులాగే అయిపోయాడు. సాధారణంగా ఏ కొడుకూ చేయలేని విధంగా మాకు సహాయం చేస్తున్నాడు. ముఖ్యంగా మా పిల్లలకు సొంత అన్నయ్యే అయ్యాడు. వాళ్ళకు కావలసిన ఏ సహాయం అయినా చేస్తాడు. వాడు 1996 లో అమెరికా వెళ్ళాడు. వాడే 1998 లో నేను అమెరికా వెళ్ళినప్పుడు నాకు సహాయం చేసాడు.(26) వాడే మా చిన్న అమ్మాయికి 2005 లో అమెరికాలో job రావడానికి సహాయం చేసాడు.(27) వాడే మా పెద్ద అమ్మాయికి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ధన సహాయం చేసాడు. (28) నిజంగా ఏ కొడుకూ చేయనటువంటి సహాయం చేసాడు / చేస్తున్నాడు. దాని పెళ్ళికి వాడు, వాళ్ళ అన్నదమ్ములు కలిసి ఎంతో సహాయం చేసారు.(29) ఇప్పుడు మా చిన్న అమ్మాయి వాడి దగ్గరే ఉంటోంది.
ఇంక మా అమ్మ సంగతి .....
నాకు, మా చెల్లెళ్ళు, తమ్ముడు అందరకీ మా అమ్మ అంటే ఎంతో ఇష్టం, ప్రేమ. నా భార్యకు కూడా. ఆమె మాకు ఎప్పుడూ ఆరాధ్యురాలే. ఆమె కూడా బాబా భక్తురాలే. [బాబా పరిచయం కాక మునుపే మా నాన్నగారు దివంగతులైనారు]. నేను చేసే పూజలు, జపాలు, భజనలు ఆమె కూడా చేస్తుంటుంది, లేదా వాటిల్లో పాలు పంచుకుంటుంది. బాబా ఆమెను కూడా (నా కోసం) సాధ్యమైనంత వరకు ఆరోగ్యంగానే ఉంచుతున్నాడు, ఆమె ప్రారబ్ధాన్ని కూడా చాల తక్కువ పాళ్ళలో అనుభవింప చేస్తున్నాడు.(30) ఆమె తనకు వయసు అయిపోయినా ఎంతో కొంత ఏదో విధంగా సహాయం చేస్తూనే ఉంటుంది. సరే ఇంక ఆవిడ వెళిపోయే సమయం వచ్చింది (2009 చివరలో). వెళిపోయే ముందు ఆమె ప్రారబ్ధాన్నంతనూ (సుమారు ఒక నెల రోజుల పాటు) ఆస్పత్రి లో తీవ్ర వ్యాధి రూపంలో అనుభవింప చేసేసాడు.(31) ఆ వ్యాధి తీవ్రతను తగ్గించి ఆమెకు కొంత ఉపశమనం కలిగించడానికి నాకు (నా తపః ఫలితానికి) శక్తిపాతాన్ని ప్రసాదించి ఆమెకు మాత్రమే చేసేలా నన్ను ఉపయోగించు కున్నాడు.(32) నా ప్రార్ధన అవసరం లేకుండానే ఆమెకు (ఆమె కూడా తన భక్తురాలే కాబట్టి) "సద్గతిని" (ఊర్ధ్వలోకాన్ని) ప్రసాదించేడు.(33) (అలాగ నాకు దివ్య దర్శనం కలిగించేడు).
ఇవండీ నాకు నా కుటుంబ సభ్యులకూ బాబా చేసిన లీలలు, మహిమలు. ఇంత చేసిన బాబాకు నేనేమి ఇవ్వగలను - నా ప్రేమ తప్ప. అందుకే ఆయనకు త్రికరణ శుద్ధిగా "సర్వస్య శరణాగతి" చేసుకున్నాను.
ఇంక బాబా ఎప్పుడు అనుమతి నిస్తే అప్పుడు మీకు "శ్రీ RM గారితో నా జీవిత గమనం" భాగాన్ని వినిపిస్తాను/ తెలియపరుస్తాను. ప్రస్తుతానికి ఇంతే సంగతులు.
నా కథని మీకు ఎందుకు తెలియ పరిచానంటే - నా జీవితంలో జరిగిన బాబా చేసిన లీలలు, మహిమల నుంచి మీరు కూడా స్ఫూర్తిని పొంది మీరు కూడా నా లాగే బాబా అనుగ్రహాన్ని పొందాలని. ఇదే నా ఆశ.
[గత కొన్ని (2,3) సంవత్సరాలనుంచి వైరాగ్యం ఎక్కువై బాబా ధ్యానంలోనూ, ఆయన సేవలలోను, ఆయన స్మరణంలోనూ జీవితాన్ని వెళ్ళ దీస్తున్నాను. ఈ దశలో బాబా నాకొక కొత్త సేవను (తన సందేశాలను తన భక్తులకు వినిపించడం కోసం, వారిని ఉద్ధరించడం కోసం SAI DARBAR ను స్థాపింపచేసి , వాటి ద్వారా రోజుకొక సందేశాన్ని తెలియ పరుస్తూంటాడు. నా సేవలకు ఆయన పొంగిపోయి నాకు "నా (సాయి) పాదరేణువు" అన్న బిరుదుని ముద్దుగా నాకు ప్రసాదించేడు.]
ఓం శ్రీ సాయిరాం
!!! జై శ్రీ సాయిరాం !!!
(సమాప్తం)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment