Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, March 30, 2017

శ్రీసాయి లీలా తరంగిణి –8 వ.భాగమ్

Posted by tyagaraju on 5:58 AM
                                  Image result for images of rose hd

30.03.2017 గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి –8 .భాగమ్
రచనః  శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
     Image result for images of bharam mani
(మూల రచనతెలుగు.   ఆంగ్లంలోకి అనుబదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త మాత్రుడుః  ఆత్రేయపురపు త్యాగరాజు
ఆల్ ఖైల్ గేట్దుబాయి

శ్రీ సాయినాధుని ఏకాదశ సూత్రాలు -  ప్రాముఖ్యత

‘సాయిప్రభ’ మాసపత్రికలో ప్రతినెల క్రమం తప్పకుండా బాబారు చెప్పిన పదకొండు ఏకాదశ సూత్రాలను ప్రచురిస్తూ ఉన్నాము.  ఆ విధంగా కొన్ని నెలలు ప్రచురించాము.  ప్రతినెల ప్రచురిస్తున్నాము  కదా ఇంక ఈ ఏకాదశ సూత్రాలను ఇంకెవరూ చదవరులే అనుకున్నాము. 

 ప్రతినెల ప్రచురిస్తున్నదే మరలా మరలా ప్రచురిస్తూ ఒక పేజీ వృధా చేయడమెందుకు దాని బదులు ఇంకేదయినా ప్రచురిస్తే బాగుంటుందనునుకున్నాము.  ఈ విధంగా ఆలోచించి నాభర్త శ్రీ బి.ఉమామహేశ్వరరావు గారు (ఎడిటర్), శ్రీ వి.నారాయణరావు గారు (ఎగ్జిక్యూటివ్ ఎడిటర్)  ఇద్దరూ ప్రెస్ కి వెళ్ళారు.  ప్రతినెల ప్రచురిస్తున్న ఏకాదశ సూత్రాలను  ఇకనుంచి ప్రచురించవద్దు ఆపేయమని చెప్పారు.

ఆరోజు సాయంత్రం మూడు గంటలకు మాయింటిలో నాభర్త, శ్రీనారాయణరావు గారు ఇద్దరు కాస్త పని చేసుకుందామని వారు పనిచేసుకునే ఆఫీసు టేబుల్ వద్దకు వెళ్ళారు.  అక్కడ వారి టేబుల్ మీద ఒక పాత ప్రింటేడ్ కాగితం కనిపించింది. దాని మీద   బాబావారి ఏకాదశ సూత్రాలు, బాబా అభయ హస్తంతో ఉన్న చిత్రం ఉన్నాయి.  ఆకాగితం వెనుకవైపున ఆంగ్లంలో ఈ సందేశం ప్రచురింపబడి ఉంది.

“Please note Umaaji and Narayana Rao jI, if any assistance is required from Tirupati contact this gentleman”

(ఉమాజీరావు మరియు నారాయణరావు గారికి, మీకు తిరుపతినుంచి ఏవిధమయిన సహాయం కావాలన్న ఈ వ్యక్తిని సంప్రదించండి)

ఈ కాగితం క్రింద ఒక కవరు ఉంది.  ఆ కవరులో ఒక కాగితం పొట్లం ఉంది.  ఆ కాగితం పొట్లం మీద తమిళంలో కొన్ని అక్షరాలున్నాయి  మేమా పొట్లాన్ని విప్పి చూశాము.  అందులో ఊదీ, ఒక వెండి లాకెట్ ఉన్నాయి.  లాకెట్ కి ఒకవైపు సాయిబాబా, రెండవవైపున శ్రీసీతారామ లక్ష్మణ, హనుమంతుల వారి బొమ్మలు ఉన్నాయి.  ఆ పొట్లంలో ఊదీ, లాకెట్ లు ఉండటం మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.  మేమంతా ఊదీని నుదుటకి రాసుకుని కొన్ని సాయిలీలలను చెప్పుకోవడం మొదలుపెట్టాము. 

ఈలోగా మాఅబ్బాయి కిషోర్ తన కజిన్ ఆనంద్ తో వచ్చాడు.  జరిగినదంతా వాళ్ళిద్దరికీ వివరంగా చెప్పాము.  ఏకాదశ సూత్రాలు ప్రింట్ చేయబడి ఉన్న కాగితాన్ని మా అబ్బాయికి చూపించాము.  మా అబ్బాయి ఆ కాగితాన్ని తన చేతుల్లోకి తీసుకోగానే దానినుంచి మధురమయిన పరిమళం రావడం మొదలయింది.  నేను మా అబ్బాయికి ఊదీ ఉన్న పొట్లాన్ని ఇచ్చాను.  నుదుటకి ఊదీ రాసుకోమన్నాను.  మా అబ్బాయి ఊదీపొట్లాన్ని విప్పాడు.  అందులో కుంకుమ నుంది.  “ఇందులో కుంకం ఉంది.  ఊదీ ఉందని చెప్పావేమిటి” అన్నాడు మా అబ్బాయి.  చాలా ఆశ్ఛర్యపోతూ మేమా పొట్లాన్ని మళ్ళీ పరీక్షగా చూశాము.  కుంకం ఉన్న పలుచటి కాగితం క్రింద మరొక పలుచని కాగితపు పొర ఉంది.  అందులో ఊదీ ఉంది.  మేమంతా అక్కడ ఉండగానే మా సమక్షంలో ఊదీ ఉన్న కాగితంపైన కుంకుమ ఉన్న పలుచని కాగితం ఎలా వచ్చింది?  తను చూపించే అధ్భుతమయిన లీల ఏవిధంగా ఉంటుందో మాకు తెలియచేయడానికే బాబా ప్రత్యక్షంగా చూపించారు.  సాయిప్రభలో సాయిచెప్పిన ఏకాదశ సూత్రాల ప్రచురణను ఆపివేద్దామనుకున్నాము. అది తనకు   ఇష్టం లేదనే విషయం బాబా  ఈ అధ్భుతమైన లీల ద్వారా తెలియచేసారని   మేమర్ధం చేసుకున్నాము.

వెంటనే నాభర్త, నారాయణరావుగారు ఇద్దరూ ప్రెస్ కి వెళ్ళారు.  మరలా యధాతధంగా ప్రతినెల ఏకాదశ సూత్రాలను ప్రచురించమని ప్రెస్ వారికి చెప్పారు.  ఆ తరువాత పొట్లం కట్టబడ్ద కాగితం మీద ఉన్న తమిళ అక్షరాలు అర్ధం తెలుసుకోవడానికి తమిళ భాష తెలుసున్నతనికి చూపించాము.  అది తమిళంలో రాయబడ్డ “ఓమ్ సాయిరామ్’.  కాగితానికి రెండువైపులా రామకోటి రాసట్లుగా  ఓమ్ సాయిరామ్ అని తమిళంలో రాయబడి ఉంది.  ‘ఓమ్ సాయిరామ్’ ఎల్లప్పుడు ఈ నామాన్ని స్మరిస్తూ ఉండమని బాబా ఆజ్ఞగా భావించాము.  వెండి లాకెట్ ను బాబా ఇచ్చిన బహుమానంగా నాభర్త దానిని తన రుద్రాక్ష మాలలో ధరించారు.

సాయిప్రభలో ప్రచురింపబడ్డ ఏకాదశ సూత్రాలు:
(ఆయన చెప్పిన ఏకాదశ సూత్రాలను మన బ్లాగులో కూడా ప్రచురిద్దాము  ---  ఓమ్ సాయిరామ్)

1.  Whoever puts his feet on Shirdi soil his sufferings would come to an end.

2.  The wretched and miserable would rise to plenty of joy and happiness as soon as they climb the steps of mosque.

3.  I shall be ever active and vigorous even after leaving this earthly body.

4.  My tomb shall bless and speak to the needs of my devotees.

5.  I shall be active and vigorous even from my tomb.

6.  My mortal remains would speak from my tomb.

7.  I am ever living to help and guide to all who come to me, who surrender to me and who seek refuge to me.

8.  If you look to me, I look to you.

9.  If you cast your burden on me, I shall surely bear it.

10.  If you seek my advice and help it shall be given to you at once.

11.  There shall be no want in the house of my devotee.

(రేపటి సంచికలో విజయవాడ సప్త సప్తాహంలో
బాబా చూపించిన లీలలు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List