Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, November 8, 2017

శ్రీ రాధాకృష్ణ స్వామీజీ – 3 వ.భాగమ్

Posted by tyagaraju on 8:18 AM
       Image result for images of shirdisaibaba
     Image result for images of beautiful flowers hd

08.11.2017 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీరాధాకృష్ణ స్వామీజీ గారి   గురించిన సంపూర్ణ సమాచారం శ్రీ బొండాడ జనార్ధనరావుగారి బ్లాగునుండి, మరియు సాయిఅమృతాధార నుండి గ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్ఆత్రేయపురపు త్యాగరాజు


శ్రీ రాధాకృష్ణ స్వామీజీ – 3 .భాగమ్
(సాయిపదానంద)
   Image result for images of sri radhakrishna swamiji

శ్రీ నరసింహస్వామీజీ గారి శతజయంతి సందర్భంగా ఆల్ ఇండియా సాయి సమాజ్ ఆవరణలో నరసింహస్వామీజీ కుటీరాన్ని నిర్మించడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు.


నామజపం విష్ణుసహస్రనామ పారాయణ అన్నిటికీ సర్వరోగ నివారిణి అని రాధాకృష్ణస్వామీజీ గారు ఉధ్భోధించారు.  ప్రతిరోజు ఎన్నిసార్లయినా పఠించమని, ఆవిధంగా జపించడంవలన మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పారు.  రోజూ భగవద్గీతలోని ఒక అధ్యాయాన్ని చదివే అలవాటు చేసుకొమ్మని భక్తులకు ఉపదేశించారు స్వామీజీ.  ఆయన గొప్ప రచయిత కూడా. శ్రీనరసింహస్వామీజీ గారి గురించి ఒక పుస్తకాన్ని కూడా వ్రాశారు.  శ్రీనరసింహస్వామీజీ గారు 1936 వ.సంవత్సరంలో అప్పటికి జీవించిఉన్న సాయిబాబావారితొ సన్నిహితంగాఉన్న ఆయన అంకిత భక్తులను ప్రత్యక్షంగా కలుసుకుని వారితో మాట్లాడి, బాబాతో ఆ భక్తులకు కలిగిన అనుభవాలన్నిటిని సేకరించారు.  ఆవిధంగా వారు చెప్పిన అనుభవాలన్నిటినీ సేకరించి ఎన్నో పుస్తకాలు ప్రచురించారు.  ఆవిధంగా దేశవ్యాప్తంగా ఎంతోమందికి బాబా జీవితం గురించి, ఆయన లక్ష్యాలను గురించి మహిమల గురించి తెలిచేయడంలో ఎంతో కీలకపాత్ర పోషించారు.  నరసింహస్వామీజీ గారు చేసిన బాబా సేవ మరువలేనిది.  ఆయన రచనల వల్లనే ఈ నాడు మనకందరికీ బాబాతత్వం, ఆయన మహిమల గురించి తెలుసుకునే అదృష్టం కలిగింది.  బాబా గురించి సమగ్ర సమాచారం మొట్టమొదటగా మరాఠీ భాషలోనే ప్రచురింపబడ్డాయి.  అందువల్ల బాబా గురించి సంపూర్ణంగా చదివి తెలుసుకోవడానికి శ్రీ నరసింహస్వామిగారు మరాఠీ భాషను  కూడా నేర్చుకున్నారు. ఆవిధంగా మరాఠీ భాషలో ప్రచురింపబడ్డ మూలగ్రంధాలనుండి సమాచారాన్నంతా సేకరించారు.

మందిరంలో సహస్రనామ పారాయణ పూర్తయిన తరువాత ప్రతిరోజు రాత్రి స్వస్తి వాచకాలు పలుకుతూ ఉండేవారు.  శ్రీస్వామీజీ గుజరాత్ లో ద్వారక సందర్శించినపుడు భగవత్ ప్రేరణతో ఆయన స్వరపరచిన స్వస్తి వాచకాలు :

దుర్మార్గులు సన్మార్గులుగా మారుగాక
సజ్జనులకందరికీ సుఖశాంతులు లభించుగాక
శాంతికాముకులందరికీ అన్ని బంధనాలనుండి విముక్తి లబించుగాక
విముక్తి పొందినవారు యితరులకు కూడా విముక్తి పొందేందుకు సహాయ పడెదరు గాక
ప్రతివారు సుఖసంతోషాలతో వర్ధిల్లు గాక
ప్రతివారు ఆరోగ్యంతో వర్ధిల్లెదరు గాక
ప్రతివారికి అదృష్టము లభించుగాక
ప్రతివారికి మంచిరోజులు లభించుగాక
ప్రతివారు కష్టాలనధిగమించెదరు గాక
ప్రతివారికి శ్రేయస్సు లభించుగాక
ప్రతివారు తమ లక్ష్యాలను నెరవేర్చుకొనెదరు గాక
ప్రతివారికి ప్రతిచోట సుఖసంతోషాలు లభించుగాక

పైన చెప్పెన విధంగా స్వామీజీ అందరి శ్రేయస్సుకోసం ఆవిధంగా స్వస్తి వాచకాలు పలుకుతూ ఉండేవారు.

స్వామీజీ సంపూర్ణ ఆరోగ్యంతో మంచి ఉత్సాహవంతమయిన జీవితాన్ని గడిపారు.  బాబా తత్వ ప్రచార నిమిత్తం ఎల్లప్పుడూ ప్రయాణాలు చేస్తూనే ఉండేవారు.  ఆయన నిరంతరం బాబాతో సంబంధం కలిగి ఉండేవారు.  అందువల్ల ఆయన చర్యలన్నీ కూడా బాబాయొక్క ప్రేరణతో బాబా చర్యలకు కొనసాగింపుగా ఉండేవి.  ఒకసారి ఆయన షిరిడీ వెళ్ళినపుడు బాబా ఆయనను ఇంకా మరికొన్ని సంవత్సరాలపాటు జీవించి మానవాళి సంక్షేమం కోసం పూర్తి చేయవలసిన మిగిలిన లక్ష్యాని పూర్తి గావించమని చెప్పారు.
      Image result for images of sai spiritual centre bangalore
(సాయి స్పిరిట్యువల్ సెంటర్, బెంగళూరు)

బెంగళూరులోని సాయి స్పిరిట్యువల్ సెంటర్ లో ప్రతిరోజూ జరిగే గీతా పారాయణంలో స్వామీజీ సత్సంగాన్ని నిర్వహించేవారు.  భగవద్గీతలోని శ్లోకాలను చదవడమంటే ఆయనకు ఎంతో ప్రీతి.  భక్తులందరికీ ఆ శ్లోకాలయొక్క అర్ధాన్ని తెలియచెప్పేవారు.  భక్తులందరికీ రామమంత్రం యొక్క శక్తి ఎటువంటిదో విశదీకరించి చెప్పేవారు.  రామమంత్రమే ‘తారకమంత్ర’మని దానిని పఠించడంవల్ల సంసారసాగరాన్ని దాటడానికి వారధిలా ఉపయోగపడుతుందని చెప్పేవారు.  

స్వామీజీ తన భక్తులపై ఎంత దయను ప్రసరింప చేసేవారో దానికి ఉదాహరణగా ఎన్నో సంఘటనలు ఉన్నాయి.  ఆయన వ్యక్తిగత వివరాలు తక్కువే కావచ్చు, కాని ఆయన భక్తుల మీద కురిపించే దయ చాలా ప్రభావం చూపేదిగాను, శక్తివంతంగాను ఉండేది.

స్వామీజీ బాబాలో ఐక్యమవడానికి ‘ఉత్తరాయణ’ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.  బాబాలో ఐక్యమవడానికి ఆయన జనవరి, 14, 1980 వ.సంవత్సరాన్ని ఎంచుకున్నారు.  ఆరోజున భక్తులందరితో “శ్రీవిష్ణుసహస్రనామ పారాయణ’ “ఓమ్ నమోనారాయణాయ’ నామ జపాలు చేయించారు.  అఖరిక్షణాల వరకు ఆయన స్పృహలోనే ఉండి, 1980, జనవరి 14 న  దేహాన్ని చాలించారు.  వేదమంత్రాలమధ్య ఆయనకు మరుసటిరోజు దహన కార్యక్రామాలు పూర్తయ్యాయి.

స్వామీజీ గారి భక్తులు ఆసమయంలో ఆధ్యాత్మికంగా ఆయన అనుగ్రహాన్ని పొందారు.  స్వామీజీ తన భౌతిక దేహాన్ని విడిచిన తరువాత కూడా ఆయన భక్తులందరూ ఆయన కటాక్షాన్ని పొందుతూనే ఉన్నారు.  ఆయన సశరీరంతో లేకపోయినా గాని ఆయన భక్తులు కష్టసమయాలలోను అవసరంలో ఉన్నపుడు, ఆధ్యాత్మికంగా ఆయన ఉనికిని, ఉపదేశాలను అనుభూతి చెందుతున్నారు.  స్వామీజీ తన భక్తులకు ఎందరికో స్వప్నంలో దర్శనమిచ్చి, వారి సమస్యలకు తగిన సలహాలను యిస్తూ వారిలోని ఆధ్యాత్మికతను పెంపొందింపఛేసారు.

ఆయన ఆపన్న హస్తం, కరుణాదృక్కులు ప్రతిభక్తుని గృహంలోను పరిభ్రమిస్తూ “నేనుండ భయమేల" అన్న బాబా  మాటలను గుర్తు చేస్తూ ఉంటాయి.
Image result for images of shirdisai


సాయి స్పిరిట్యువల్ సెంటర్ మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని, మనశ్శాంతిని కలిగించే పవిత్రమయిన ప్రదేశం.  సందర్శకులందరికీ గర్భ గుడిలో ఉన్న శ్రీసాయిబాబా, శ్రీనరసింహస్వామీజీ, శ్రీరాధాకృష్ణస్వామీజీల మూర్తి త్రయం మనశ్శాంతిని,  ధైర్యాన్ని, పరమసుఖాన్ని కలిగిస్తాయి.

బాబా అంకిత భక్తులతోపాటు ఆయన చిత్రపటం కూడా సమాధిమందిరంలో ఏర్పాటు చేసారు.

(అయిపోయింది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)




Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List