Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, August 10, 2019

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 17వ.భాగమ్

Posted by tyagaraju on 10:35 PM
Image result for images of shirdi sai
Image result for images of rose hd

శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు

11.08.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 17.భాగమ్

సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న    
అమూల్యమయిన సాయి సందేశాలు
Image result for images of saibanisa ravada
సంకలనమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,  హైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

ఫోన్స్ & వాట్స్ ఆప్  :  9440375411  &  8143626744


శ్రీ సాయితో ముఖాముఖీ 16 వ.భాగముపై పాఠకుల స్పందన...
శ్రీ సాయితో ముఖాముఖీ 16 వ.భాగముపై పాఠకుల స్పందన...
శ్రీమతి కృష్ణవేణి,  చెన్నై  ... పిచ్చుకమెల్లె దారమ్ కట్టి లగడమన్టే థన భక్తులను ఎక్కడ ఉన్న బాబా షిరిడీ రప్పిమ్చుకున్టారు అనుకున్నాము ఇన్నాళ్ళుగా.  కాని బాబా వారు గూఢార్ధాన్ని ఎంతో చక్కగా వివరించి చెప్పారు.      మనం ఎంతో అదృష్టవంతులం.    వారి పాదాల చెంత మనం ఉండేందుకు అవకాశం ఇచ్చారు...  ఓమ్ సాయిరామ్

శ్రీమతి శారద, నెదర్లాండ్స్ --- చాలా బాగుంది.  పచ్చి కుండల అంతరార్ధం తెలియచేసారు.  ధన్యవాదాలు.
ఈ వారం నుండి  సాయిబానిస గారి అనుభవాలు కూడా కొన్నింటిని ప్రచురించడం జరుగుతుంది.   
శ్రీ సాయి సత్ చరిత్రలో బాబా చెప్పిన విషయాలకు దానికి అనుగుణంగా సాయిబానిస గారికి కలిగిన అనుభవాలు చదివిన వారికి బాబా తన భక్తులు పిలిచిన వెంటనే స్పందిస్తారనే విషయాన్ని మనం అర్ధం చేసుకోవచ్చు.

వారి అనుభవాలను చదివిన తరువాత, బాబా సశరీరంతో లేకపోయినా ఆయన ఇప్పటికీ సజీవంగానే ఉండి తన భక్తులకు సలహాలను ఇస్తారని, వారిని ఆపదలనుంచి కాపాడతారని  సాయి భక్తులందరూ గ్రహించుకుంటారు.


24.07.2019  -  శ్రీ సాయి కష్టాలలో ఉన్న తన భక్తులను తక్షణమే ఆదుకొనుట
కష్టాలలో ఉన్న నా భక్తులు భక్తితో నన్ను పిలిచినా నేను తక్షణమే వారి వద్దకు వెళ్ళి వారిని రక్షిస్తాను.  ఇది ఎలాగ సాధ్యము అని అడుగుతున్నావు కదూ?  ఒక చిన్న ఉదాహరణ చెబుతాను విను ---
Image result for images of ants eating jaggery piece


నీవు నీ ఇంటిలో గాని ఇంటి బయట గాని చిన్న బెల్లము ముక్కను పడవేయి.  క్షణాలలో అక్కడికి చీమలు చేరి బెల్లమును ఆరగిస్తాయి.  చీమలకు ముందుగా తెలియదు కదా నీవు వాటికి బెల్లము పెడతావని, * అలాగే నాకు నా భక్తుల కష్టాలు ముందుగా తెలియవు.  వారు కష్టాలు పడుతున్న సమయములో నన్ను ప్రేమతో పిలిచినా వారిని రక్షించడానికి క్షణాలలో వారి వద్దకు వెడతాను.

*నా విశ్లేషణ ---  గజేంద్రుడు వేయి సంవత్సరాలు మొసలితో యుధ్ధము చేసినా ఓడిపోతున్న సమయంలో శ్రీహరిని ప్రార్ధించినపుడు శ్రీహరి పరిగెత్తుకుని వచ్చి గజేంద్రుడిని రక్షించాడు.
అలాగే ద్రౌపదీదేవి దుశ్శాసనుడు తన చీరను లాగి వేయుచున్నపుడు ఆఖరిలో దిక్కుతోచక కృష్ణా! నా హృదయనివాసీ నన్ను కాపాడుఅన్న తరవాతనే శ్రీకృష్ణుడు ఆమెకు తరగని చీరలను ప్రసాదించి కాపాడెను.  అదే విధముగా సాయి భక్తులు కష్టాలలో ఉన్నపుడు సాయిని భక్తితో పిలిచిన ఆయన తప్పక వచ్చి కాపాడుతారని నేను నమ్ముతున్నాను.  
                                     ---  త్యాగరాజు

ఒక నెలరోజుల క్రితము ఢిల్లీలోని నీపాత మిత్రుడు ఛిబ్బర్ కారు ప్రమాదములో ఇరుక్కున్నపుడు అతనిని సురక్షితముగా కారునుండి బయటకు లాగినది నేనే.  అతడు రోజున నా అంకిత భక్తుడు.

నీకు మరు జన్మలో తండ్రి కాబోతున్న ఆవ్యక్తి ఇపుడు ఆర్ధికపరమయిన కష్టాలలో ఉన్నాడు.  అతనికి మంచి సలహా ఇచ్చి అతనిని ఆర్ధికపరమయిన సమస్యలనుండి బయటకు లాగింది నేనే. 

25.07.2019  -  శ్రీ సాయి అనుమతి లేనిదే షిరిడీ వదిలి వెళ్ళేవారు తమ తిరుగు ప్రయాణంలో కష్టాలను ఎదుర్కొనేవారు.

నేను ద్వారకామాయిలో ఉన్న సమయంలో నా దర్శనము చేసుకొని షిరిడీ వదిలి వెడుతున్న నా భక్తులలో కొందరిని ఆరోజున వెళ్ళవద్దని సలహా ఇచ్చేవాడిని.  కొందరు నా మాటను వినకుండా షిరిడీ వదిలి మార్గమధ్యంలో కష్టాలుపడేవారు, తిరిగి షిరిడీకి చేరుకొని నా ఆశీర్వచనాలు తీసుకునివెళ్ళేవారు.  ఇక నీవు కూడా 2006 .సం.లో నా అనుమతి లేకుండా భీమవరములోని సాయి మందిరములో ఉపన్యాసము ఇవ్వడానికి వెళ్ళావు.  నీవు మంచిగానే నా తత్త్వప్రచారములో ఉపన్యాసము ఇస్తున్న సమయంలో మందిర ధర్మకర్తలు తమ స్వంత కార్యక్రమాల కోసము నీఉపన్యాసమును మధ్యలో ఆపివేసి, నీ మనసుకు బాధ కలిగించారే * నీవు అతి ఉత్సాహముతో నా అనుమతి లేకుండా భీమవరం వెళ్ళి మానసిక  బాధ పడ్డావు గుర్తుందా?  నేను ఎల్లప్పుడూ నా భక్తులమేలు ఆలోచించి వారికి సలహాలు ఇస్తూ ఉంటాను.

*నా (సాయిబానిస) నిజ జీవితములో జరిగిన మరొక సంఘటన
   అది 1992.సంవత్సరము, ఏప్రిల్ నెల.  నా భార్య బలవంతముపై నంద్యాల పట్టణములో నాకు కాబోయే అల్లుని గురించి, వివరాలు సేకరించడానికి వెళ్ళాలని నిశ్చయించుకొన్నాను.  రాత్రి బస్సుకు నంద్యాలకు బయలుదేరాను.  శ్రీసాయి ఆశీర్వచనాల కోసం బాబా పటము ముందు నిలబడి ఆయనను ప్రార్ధించి కళ్ళు మూసుకొని శ్రీసాయి సత్ చరిత్రనుండి ఒక పేజీ తీశాను,  పేజీ 9 .ధ్యాయములోని 84 .పేజీ వచ్చింది.  అందులో సందేశముపల్లె విడిచి వెళ్లవద్దు” --  నేను నంద్యాలకు వెళ్ళకూడదని నిర్ణయించుకొన్నాను.  కాని, నా భార్య, నా కుమార్తెల మాట కాదనలేక రాత్రి బస్సుకు నంద్యాల బయలుదేరాను.

ఉదయం నంద్యాల పట్టణములో నా కాబోయే అల్లుని ఇంటికి చేరుకొన్నాను.  నన్ను చూసి నా కాబోయే అల్లుడు చాలా చికాకు పడ్డాడు.  నేను, ఈరోజు మహాశివరాత్రి మహానందిలో పరమశివుని దర్శనానికి వచ్చాను, మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను అని అబధ్ధము చెప్పాను.  ఆయన ఈరోజు మా బ్యాంకుకు సెలవు, నేను నామిత్రులతో కలిసి అహోబిలము వెడుతున్నాను.  మీకు ఇష్టము ఉన్న మాతో రండి అని ఆహ్వానించారు.  నేను సంతోషముగా అంగీకరించాను. 

నేను, నా కాబోయే అల్లుడు, వారి మిత్రులము బస్సులో మధ్యాహ్నము 12 గంటలకు అహోబిలం శ్రీనరసింహస్వామి దర్శనం చేసుకొన్నాము.  
Image result for images of ahobilam narasimha swamy
దర్శనం అనంతరం తిరిగు బస్సు కోసం బస్ స్టాండుకు వచ్చాము.  అప్పుడే నంద్యాలకు బస్సు వెళ్ళిపోయిందని అక్కడివారు చెప్పారు.  అక్కడివారి సలహాపై దగ్గరలో ఉన్న దిగువ అహోబిలానికి (8 కి.మీ.దూరం) కాలినడకన ఎండలో బయలుదేరాము.  సమయము మధ్యాహ్నం గం.1.30 ని.  ఎండతీవ్రత ఎక్కువగా ఉంది.  త్రాగడానికి ఎక్కడా మంచినీరు లేదు.  సేద తీర్చుకుందామంటే చెట్లకు ఉన్న ఆకులు రాలిపోయాయి.  రహదారిపై నిలబడి ఎంత ప్రాధేయపడినా, ఎవరూ తమ వాహనాలను ఆపటంలేదు.  నా ప్రాణము పోతున్నదేమో అని అనిపించింది.
Image result for images of shirdi sai baba with quotes

ధైర్యము చేసుకొని రోడ్డుమధ్యన నిలబడి కళ్ళుమూసుకుని శ్రీసాయినామస్మరణ చేయసాగాను.  ఇంతలో నా ఎదురుగా ఒక లారీ ఆగింది.  లారీ మీద ' ‘శ్రీ షిరిడీసాయిబాబాలారీ సర్వీసు అని పెద్ద అక్షరాలతో వ్రాయవడి ఉంది.  లారీమీద శ్రీసాయి నన్ను ఆశీర్వదిస్తున్న పటం ఉంది.  నా కళ్లను నేను నమ్మలేకపోయాను.  కళ్ళు తిరిగి రోడ్దుమీద పడిపోయాను.
Image result for images of shirdi sai

ఆలారీ డ్రైవరు మరియు లారీ క్లీనరు కలిసి నన్ను ఎత్తుకొని లారీలో పడుకోబెట్టారు.  నా కాబోయే అల్లుడు మరియు వారి స్నేహితులు లారీ వెనక భాగములో ఎక్కారు.  లారీ డ్రైవరు నన్ను దిగువ అహోబిలం గ్రామంలో ఒక పాక దగ్గిర ఆపి, అక్కడ దుకాణమునుండి ఒక షోడా కొని తన సంచీనుండి ఒక గజనిమ్మపండును తీసి దానిని కోసి, షోడాలో కలిపి నాకు త్రాగడానికి ఇచ్చాడు.  నాకు దాహం తీరింది.  లారీడ్రైవరుకు రెండు చేతులు జోడించి నమస్కరించాను.  లారీ డ్రైవరు తిరిగి తన లారీ వద్దకు వెడుతూ నా దగ్గరకు వచ్చి, “నీ గురువు మాటను జవదాటవద్దువారి ఆశీర్వచనాలు లేకుండా ఎక్కడికీ వెళ్లవద్దుఅన్నారు.  లారీడ్రైవరులో నా సాయిని చూడగలిగాను.
                                           ----సాయిబానిస

26.07.2019  -  భగవంతుడుభక్తురాలును ఒకరికొకరు సేవచేసుకొనుట మిగుల వింతగానున్నది అని శ్యామా పలికెను.

1.  శ్యామా అన్నమాటలు నిజమే.  నా అంకిత భక్తురాలు లక్ష్మీఖాపర్డే నాకు కడుపునిండా భోజనము పెట్టి తరువాత ఆమె నా పాదములను చేతులతో పిసుకుతున్న సమయములో నేను ఆమె భక్తికి మరియు ప్రేమకు పరవశుడినై ఆమె చేతులను నేను మెల్లగా తోమసాగాను.  దృశ్యము మిగుల వింతగా ఉన్నదని అక్కడ ఉన్న నా భక్తులు అన్నారు.  ఇపుడు నీవు నీ ఇంటికి వెళ్ళు.  నేను నీకు (సాయిబానిస) అక్కడ దర్శనమిస్తాను.

2.  నేను (సాయిబానిస) ఇంటికి చేరుకొన్నాను.  నా ఇంటి వరండాలో కుర్చీలో రాష్ట్రముఖ్యమంత్రివర్యులు నా గురించి ఎదురు చూస్తూ ఉన్నారు.  వారు పట్టువస్త్రములు ధరించి, నుదుట త్రిపుండ్రము, కుంకుమ బొట్టు, మెడలో రుద్రాక్షలు వేసుకొని ఉన్నారు.
నేను చాలా సేపటినుండి నీగురించి ఇక్కడ వేచి ఉన్నాను అని లేచి వచ్చి నా (సాయిబానిస) పాదాలకు నమస్కరించారు.  నేను వారిపై గౌరవంతో వారి పాదాలను వత్తసాగాను.  ఆయన నన్ను లేవదీసి కౌగలించుకొని నాతో అన్న మాటలు

పంతులుగారూ! మీరు ప్రతి సోమవారం నాకు పూజ చేస్తూ ఉపవాసము చేస్తున్నారు.  ఇక మీదట ఉపవాసము చేసినా పరవాలేదు కాని, నేను ప్రతి సోమవారము  మీకు (సాయిబానిస) తినడానికి ఫలాలు పంపుతాను.  మీరు ఖాళికడుపుతో నాపూజ చేయకండి అని చెప్పి శీర్వదించి, వెళ్ళిపోయారు.
నాకు మెలకువ వచ్చింది.  వచ్చిన అతిధి రాజాధిరాజు యోగిరాజు అయిన నా సాయినాధుడిగా భావించి ఆయనకు మనసులో శతకోటి నమస్కారాలు తెలియజేసుకొన్నాను.

27.07.2019  -  భక్తుడు తన ఇష్టము వచ్చి చోటకు పోనిమ్ము -  బాబా అచటకు భక్తునికంటె ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపములో అక్కడ దర్శనమిచ్చును (శ్రీ సాయి సత్ చరిత్ర 46వ.అ.)

నీవు (సాయిబానిస) అడిగిన ఈ మాటలు అక్షర సత్యాలు.  నేను ద్వారకామాయిలో కూర్చుండి ఏనాడూ అసత్యము పలకలేదు.
నానా సాహెబ్ చందోర్కర్, కాకా సాహెబ్ దీక్షిత్ లు తమతో కలిసి నాగపూర్, గ్వాలియర్ లోని శుభకార్యాలకు రమ్మని కోరిన సందర్భములో నేను వారితో “నా తరఫున మీరు శ్యామాను తీసుకుని వెళ్ళండి.  కాశీ ప్రయాగ యాత్రలు ముగిసేసరికి నేను శ్యామాకంటె ముందుగానే అతనిని గయలో కలుసుకుంటాను.”
నేను ఇచ్చిన మాట ప్రకారము శ్యామా గయకు చేరుకునే సమయానికి నేను గయలో నా భక్తుడు మరియు అక్కడి పాండా ఇంట శ్యామాకు నా పటము రూపములో దర్శనమిచ్చాను.

*నా (సాయిబానిస) నిజ జీవితంలో జరిగిన సంఘటన –
నేను నా ఆఫీసు పనిమీద 06.05.1991 నాడు మధ్యాహ్నము దక్షిణ కొరియాలోని సియోల్ పట్టణానికి చేరుకొన్నాను.  అక్కడినుండి చాంగ్ వాన్ పట్టణానికి వెళ్లవలసి యున్నది.  సియోల్ నుండి పూసాన్ పట్టణము వరకు మరల విమాన ప్రయాణము చేయసాగాను.  ఆ సమయంలో నేను బాబాను ఒక విచిత్రమయిన కోరిక కోరాను.

“నేను సాయంత్రానికి చాంగ్వాన్ చేరుకుంటాను.  నీవు నాకంటె ముందుగా చాంగ్ వాన్ కు వెళ్ళి నాకు అక్కడ దర్శనమివ్వాలి”
శ్రీసాయి సర్వవ్యాపి అయితే నా కోరిక తప్పక నెరవేరుతుంది.  నేను సాయంత్రము 6 గంటలకు చాంగ్ వాన్ పట్టణములోని నా హోటల్ గది తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాను.
నేను గదిలో లైటు వేయగానే ఒక పెద్ద పరిమాణము గల కందిరీగ నా శిరస్సు చుట్టూ రెండు సార్లు ప్రదక్షిణలు చేసి నేను వచ్చిన ద్వారమునుండి బయటకు వెళ్ళిపోయింది.  నా ఆశ్చర్యానికి అవధులు లేవు.  బాబా ఈ కందిరీగ రూపములో నాకంటె ముందుగా ఈ హోటల్ గదిలోనికి వచ్చినారని భావించాను.
నేను నా  ఆఫీసు పని పూర్తిచేసుకుని 16.05.1991 నాడు ఉదయము భారతదేశానికి తిరుగు ప్రయాణము ప్రారంభించాను.  16.05.1991 ఉదయము 5 గంటలకు లేచి హోటల్ గదిలో కాకడ హారతిని చదవసాగాను.  ఆ సమయంలో 06.05.1991 నాడు నాకు హోటల్ గదిలో స్వాగతం పలికిన ఆ  కందిరీగ మరలా వచ్చి నా శిరస్సు చుట్టూ రెండు సార్లు ప్రదక్షిణలు చేసి నా గదిలోని తెరచి ఉంచబడిన కిటికీనుండి బయటకు వెళ్లిపోయింది.  నా భావనలో బాబా తిరిగి, నా కంటే ముందుగా భారతదేశానికి వెళ్ళినారని భావించాను.

28.07.2019 -  హోలీ పండుగనాడు హేమాద్రిపంతుకు స్వప్నదర్శనము – పటము రూపములో ఆయన ఇంటికి భోజన సమయానికి వెళ్ళుట … 
(శ్రీ సాయి సత్ చరిత్ర 40 వ.అ.)

నిజమే – నేను హేమాద్రిపంతుకు స్వప్నములో సన్యాసి రూపములో దర్శనమిచ్చి మధ్యాహ్నము వాని ఇంటికి భోజనము చేయడానికి వస్తానని మాట ఇచ్చాను.  నా మాట నిలబెట్టుకోవడానికి నేను నా పటము రూపములో మధ్యాహ్న భోజన సమయానికి వాని ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించాను.  నాకు రూపము లేదు.  నేను ఏరూపములోనయినా నామాట నిలబెట్టుకుంటాను.  * నేను 1996 మార్చి నెల ఆదివారమునాడు నీకు (సాయిబానిస) స్వప్నంలో నీకంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ కె. కె. సిన్హా రూపములో భోజనానికి వస్తానని చెప్పి నీ ఇంట భోజనానికి నీదగ్గర పని చేస్తున్న ఓ కార్మికుని రూపములో వచ్చి, జంతికలు తిని నిన్ను, నీభార్యను సంతోషపెట్టాను.  ఆ సంగతి మర్చిపోయావా?  నాకు నా భక్తులందరూ సమానమే.  నన్ను ప్రేమతో పిలవగానే నేను ఏదో ఒక రూపములో వారి ఇంటికి వెళ్ళి వారిని ఆశీర్వదిస్తాను.

*నా (సాయిబానిస) నిజ జీవితంలో జరిగిన సంఘటన….
అది 1996 వ.సంవత్సరము మార్చి నెల ఆదివారము తెల్లవారుజామున శ్రీ సాయి నేను పని చేస్తున్న కంపెనీ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ కె.కె.సిన్హా గారి రూపములో దర్శనమిచ్చి ఈ రోజు మధ్యాహ్నము నీ ఇంటికి భోజనానికి వస్తాను అని మాట ఇచ్చారు.  నేను ఉదయము నిద్రనుండి లేచి, ఈ విషయాన్ని నా భార్యకు చెప్పాను.  నా భార్య నామాటలకు నవ్వి శ్రీ సిన్హా గారికి మీకు ఎక్కువ పరిచయము లేదు కదా వారు ఎలాగ మన ఇంటికి భోజనానికి వస్తారని ప్రశ్నించింది.  ఆమె ప్రశ్న కూడా నాకు సరియైనదేనని అన్పించింది.  అయినా నాకు శ్రీసాయిపై నమ్మకము ఉంది.  హోళి పండగనాడు హేమాద్రిపంత్ ఇంటికి సన్యాసి రూపములో భోజనానికి వస్తానని చెప్పి శ్రీసాయి తన పటము రూపములో భోజన సమయానికి రాలేదా!  అలాగే నా ఇంటికి ఏదో ఒక రూపములో భోజనానికి వస్తారు అని నేను నమ్మి, ఒక మనిషికి కావలసిన భోజనము ఎక్కువ తయారు చేయమని నా భార్యని కోరాను.  నా భార్య నా మాట కాదనలేక ఎక్కువ వంట చేసింది.

మధ్యాహ్నము ఒంటిగంట అయింది.  ఎవరూ నా ఇంటికి రాలేదు.  నాభార్య ఎవరూ ఈవేళ భోజనానికి రారు అని తాను  గం. 1.30 ని. లకు భోజనం చేసింది.  నేను బాబాపై నమ్మకముతో భోజనము చేయకుండా అతిధికోసం వేచి చూడసాగాను.  మధ్యాహ్నము 2  గంటలయింది.  ఎవరూ నా ఇంటికి భోజనానికి రాలేదు.  నా భార్య మాట కాదనలేక గం. 2.15 ని.లకు నేను భోజనానికి కూర్చున్నాను.  బాబాపై నాకు కోపము వచ్చింది.  బాబా తన మాట తప్పారు అనే భావనతో భోజనము చేయసాగాను.  నేను భోజనంలో ఆఖరిగా పెరుగు అన్నము తినుచుంటే నా ఇంట గుమ్మములోని కాలింగ్ బెల్ మ్రోగింది.  నా భార్య వెళ్ళి తలుపు తీసింది.  ఆ వచ్చిన వ్యక్తి నా ఆఫీసులో పని చేస్తున్న కార్మికుడు శ్రీ సత్తెయ్య.
నేను భోజనము పూర్తి చేసుకుని వాని వద్దకు వచ్చి, “ఏమిటి సత్తెయ్యా వేళకాని వేళలో నా ఇంటికి వచ్చావు? అని అడిగాను.  అతను ఇచ్చిన సమాధానానికి నేను నా భార్య ఆశ్చర్య పడ్డాము.  అతను అన్న మాటలు “సారూ, ఈ రోజున రెండుగంటలకు నాడ్యూటి పూర్తి చేసుకుని నా ఇంటికి బయలుదేరాను.  బస్సు మీవీధిలోనుండి వెడుతుంటే నాకు ఆకలి అనిపించింది.  బస్సు దిగి మీఇంటికి వస్తే నాకు, తినడానికి ఏదయినా పెడతారు అనే నమ్మకంతో వచ్చాను.” నా మనసులో, బాబా! నీవు కొంచెం ముందుగా వచ్చి ఉంటే నాతోపాటు భోజనం చేసేవాడివి.  ఇపుడు నీకు ఎంగిలి భోజనం పెట్టలేను ఏమి చేయాలి అని నా భార్యనడిగాను.
నా భార్య వెంటనే సంతోషముతో ఉదయం చేసిన జంతికలను ఒక ప్లేటునిండా తెచ్చి శ్రీ సత్తెయ్యకు పెట్తింది.  శ్రీ సత్తెయ్య కడుపునిండా జంతికలు తిని గ్లాసెడు మంచినీరు త్రాగి చిరునవ్వుతో వెళ్ళివస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు.
నేను నా భార్యను పిలిచి, “చూడు, బాబా ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ కె.కె. సిన్హా గారి రూపములో భోజనానికి వస్తానని చెప్పి మా కంపెనీలో నాదగ్గర పనిచేస్తున్న నా ప్రియ కార్మికుడు శ్రీ సత్తెయ్య రూపములో వచ్చి మన ఇంట జంతికలు తిని వెళ్ళారు” అని అన్నాను.  నా భార్య నా మాటలకు అంగీకరించింది.  మేము ఇద్దరము శ్రీసాయి పటానికి నమస్కరించాము.

29.07.2019  -  సకల జీవరాశిలో భగవంతుని చూసి ఎవరయితే వాటి ఆకలి తీరుస్తారో వారు నాకు నిజమయిన భక్తులు – 
   (శ్రీ సాయి సత్ చరిత్ర 42 వ. అ.)

నా అంకిత భక్తురాలు లక్ష్మీబాయి షిండే నాకోసం తినడానికి రొట్టె తెచ్చినది.  నేను ఆ రొట్టెను ద్వారకామాయిలో ఆకలితో నాకేసి చూస్తున్న ఓ కుక్కకు పెట్టాను.  ఆ కుక్క ఆ రొట్టెను తిన్నది.  నాలోని ఆకలి తీరింది.  ఆ కుక్కలోని ఆత్మ నాలోని ఆత్మ ఒక్కటే.  నాకు ఆకలి ఉన్నపుడు నేను చెప్పగలను, కాని, ఆ కుక్కకు ఆకలి ఉన్నా నోరు లేని జీవి.  తన ఆకలి గురించి చెప్పలేదు.  నేను బక్రీదు పండగ రోజున మధ్యాహ్నము నీ (సాయిబానిస) ఇంటికి తెల్లటి పోతుమేక రూపంలో వచ్చాను.  నీ భార్య రాత్రి మిగిలిపోయిన నాలుగు రొట్టెలు నాకు పెట్టింది.  నా ఆకలి తీరింది.

నా (సాయిబానిస) నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన ---
అది 1991 బక్రీద్ పండగ.  నా ఆఫీసుకు సెలవు దినము.  నేను మధ్యాహ్నము భోజనము చేసి ఎదురింటివారితో మాట్లాడటానికి నా ఇంటి గేటువద్దకు వచ్చాను.  ఆ సమయంలో నా ఇంటిగేటు ముందునాలుగు అడుగుల ఎత్తుగల ఓ తెల్లటి రంగులో ఉన్న ఒక పోతు మేక నిలబడి ఉంది.  ఆ మేకకు తెల్లని గడ్డము కూడా ఉంది.  
Image result for images of white goat with beard

ఆమేక నాకేసి జాలిగా తనకి ఆకలి వేస్తున్నదనే భావనతో చూడసాగింది.  శ్రీసాయి సత్ చరిత్ర 9 వ.ధ్యాయంలో బాబా అన్న మాటలు “భగవంతుని జీవులన్నిటియందు కనుము”.  నా మనసులో బాబా ఈ బక్రీదు పండగరోజున పోతుమేక రూపములో నా ఇంటికి భోజనానికి వచ్చినారనే భావన కలిగింది.
వెంటనే నేను నా భార్యను పిలిచి,  బాబా, మేక రూపంలో వచ్చారు.  ఆయనకు ఏదయినా తినడానికి పెట్టమని కోరాను.  నా భార్య హేళనగా మీ బాబా రాత్రి మనం తినగా మిగిలిన నాలుగు గోధుమ రొట్టెలు ఉన్నాయి వాటిని తింటారా అని అడిగింది.  బాబాకు ప్రేమతో పెట్టినా తప్పక తింటారని అన్నాను.  నా భార్య ఒక కంచములో నాలుగు రొట్టెలను తెచ్చి ఆ పోతు మేకకు పెట్టింది.  నేను ఒక చిన్న బకెట్ లో మంచినీరు తెచ్చి బాబాకు త్రాగడానికి పెట్టాను.  ఆ మేక నాలుగు రొట్టెలు తిని చిన్న బకెట్ లోని నీరు త్రాగి సంతోషముగా నావైపు చూసి, నన్ను నా భార్యను ఆశీర్వదించి వెళ్ళిపోయింది.  శ్రీ సాయిభక్తులు ఈ అనుభవాన్ని నమ్ముతారు.  మిగతావారు కొట్టి పారేస్తారు.

30.07.2019  -  శ్రీ  అప్పాసాహెబ్ కులకర్ణి మరియు వాని భార్యనుండి శ్రీ సాయి ఒక ఫకీరు రూపములో వచ్చి దక్షిణ స్వీకరించుట – (శ్రీ సాయి సత్ చరిత్ర 33 వ. అ.)

నేను ఫకీరు రూపములో కులకర్ణి ఇంటికి వెళ్లాను.  వాని భార్య సంతోషముగా ఇచ్చిన ఒక రూపాయిని దక్షిణగా స్వీకరించాను.  ఆ తరవాత ఆమె భర్త నాకు రూ.10/- దక్షిణ ఇవ్వదలచి, నా గురించి ధానా పట్టణములో వెదకి నన్ను కలుసుకుని నాకు రూ.10/- దక్షిణ ఇచ్చాడు.

*ఇటువంటి అనుభవాన్ని నీకు నేను సికిందరాబాదులోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ మందిరములో ప్రసాదించాను గుర్తు చేసుకో.  నా భక్తుల మనోభావాలను ఎప్పటికప్పుడు గుర్తుంచుకొని వారి కోరికలకు అనుగుణముగా నేను ప్రవర్తిస్తాను.  నా భక్తులు నాకు ప్రేమతో ఒక రూపాయి లేదా పది రూపాయలు ఇచ్చినా దక్షిణగా స్వీకరిస్తాను.

*నా(సాయిబానిస) నిజ జీవితంలో 1991 వ.సం. హోళి పండగనాడు జరిగిన ఓ చిన్న సంఘటన.
నా వివాహము 1970 వ.సం. హోళీ పండగనాడు సికిందరాబాదులోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో జరిగింది.  నా వివాహము వేడుకను జ్ఞాపకము చేసుకునేందుకు నేను ప్రతి సంవత్సరము హోళి పండగనాడు శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో పూజలు చేయించుట ఒక ఆనవాయితీగా మార్చుకొన్నాను.

అది 1991 వ.సం. హోళీ పండగరోజు సాయంత్రము నేను నా భార్య పిల్లలు కలిసి శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి ఆలయానికి వెళ్ళాము.  మేము మందిరంలోకి వెడుతున్న సమయంలో ఒక సన్యాసి వచ్చి, తాను విజయవాడ శ్రీకనకదుర్గమ్మ ఆలయమునుండి వచ్చానని తనకు దక్షిణ ఇవ్వమని కోరాడు.  నేను, నా జేబునుండి ఒకరూపాయి నాణెము తీసి వానికి ఇచ్చి పంపేశాను.  నేను, నాభార్య శ్రీవాసవీకన్యకా పరమేశ్వరీదేవికి పూజలు పూర్తి చేసుకుని గుడి ప్రాంగణములో కూర్చుని మా వివాహ విషయాలు మాట్లాడుకోసాగాము.  కాని, నామనసులో బాబా విజయవాడ కనకదుర్గమ్మ గుడినుండి సన్యాసి రూపములో వచ్చారు, నేను వారికి ఒక రూపాయి దక్షిణ ఇచ్చాను నిజానికి రూ.10/- ఇచ్చి ఉండినా బాగుండేదని ఆలోచించసాగాను.  ఒకవేళ ఆ సన్యాసి, తిరిగి దర్శనము ఇచ్చినా నేను వారికి రూ.10/- దక్షిణ ఇస్తాను అని నిశ్చయించుకున్నాను.

నేను, నా భార్య పిల్లలం గుడిలోనుండి బయటకు వస్తున్న సమయంలో గుడి ముఖద్వారము దగ్గిర సిక్కు మతానికి చెందిన ఓ సన్యాసి వచ్చి తాను నాందేడు గురుద్వారానుండి వచ్చానని, తనకు రూ. 10/-  దక్షిణ కావాలని కోరాడు.  
   Image result for images of nanded gurudwara
       (నాందేడ్ గురుద్వారా)
నేను ఆశ్చర్యపోయాను.  కొద్ది నిమిషాల క్రిందట బాబా తిరిగి సన్యాసి రూపములో వచ్చినా రూ.10/- ల దక్షిణ ఇస్తానని బాబాకు మాట ఇచ్చాను.   ఇపుడు బాబా సిక్కు మతానికి చెందిన సన్యాసి రూపములో వచ్చి నానుండి రూ.10/- దక్షిణ కోరడం నా అదృష్టముగా భావించాను.  వారికి రూ.10/- ఇచ్చాను.  ఆ సంతోషముతో ఇంటికి చేరుకొన్నాను.  బాబా పటానికి నమస్కరించాను.  బాబా సిక్కు మత సన్యాసి రూపములో చిరునవ్వు చిందించారు.  
(మరికొన్ని సంభాషణలు వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)






Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List