Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, August 17, 2019

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 18 వ.భాగమ్

Posted by tyagaraju on 10:34 PM
Image result for images of shirdi sainadh

Image result for images of rose bunch

శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు

18.08.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 18 .భాగమ్

సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న    
అమూల్యమయిన సాయి సందేశాలు
Image result for images of sai banisa
సంకలనమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,  హైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

ఫోన్స్ & వాట్స్ ఆప్  :  9440375411  &  8143626744

శ్రీ సాయితో ముఖాముఖీ 17వ.భాగముపై పాఠకు స్పందన...
శ్రీమతి కృష్ణవేణి చెన్నై చాలా బాగుంది.  బాబా వారు సాయిబానిస గారిని దక్షిణ మొదటిసారి దుర్గా అమ్మవారి దగ్గరనుండి వచ్చానని చెప్పి అడిగారు కదా,  రెండో సారి అంటే సాయిబానిస గారు గుడిలో పూజ చేయించుకుని కిందకు వచ్చేసరికి తాను గురుద్వారా నుండి వస్తున్నాను అన్నారు కదా, కాస్త సమయంలోనే బాబా వారు రెండు ప్రదేశాలకి చేరగలరా?

 బాబా వారు వద్దు అని చెప్పినా కూడా సాయిబానిస గారు వెళ్ళినా బాబా కోపగించుకోకుండా, సాయిబానిసగారు బాబా గారిని తలచుకోగానే వచ్చి కాపాడారు.  ఇలాంటి లీలలు చదువుతున్నపుడు బాబా పై నమ్మకం మరింతగా పెరుగుతుంది.  బాబా వారు ఎంతటి దయమయులో కదా!

 శ్రీమతి సుమలలిత,  అట్లాంటా,  అమెరికా  -  చాలా బాగుంది.
 శ్రీమతి జానకి,  దుబాయి -  సాయిరాం అండి,  మంచి అనుభూతులు, మిరకిల్స్ బై బాబా.  సాయిబానిస గారికి, మీకు మా పాదాభివందనలు.
సాయి భక్తులందరికి ఒక ముఖ్య విషయం ప్రస్తావిస్తున్నాను.
వచ్చే వారంతో శ్రీ షిరిడి సాయితో ముఖాముఖి, బాబా వారి ఆదేశానుసారమ్ ముగింపబడుతోంది.
వివరాలు వచ్చే ఆదివారం ప్రచురిస్తాను.

శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి పుస్తకంగా ప్రచురించడానికి కూడా సన్నాహాలు చేస్తున్నాము. పుస్తక ప్రచురణకి కూడా బాబా వారు షిరిడీలో తమ అనుమతిని ప్రసాదించారని తెలియచేయడానికి ఎంతగానో సంతోషిస్తున్నాము వివరాలు….


మా మేనల్లుడు, అతని భార్య మొదటిసారిగా షిరిడీ వెడుతున్నామని చెప్పి మమ్మల్ని కూడా రమ్మని కోరడం జరిగింది విధంగా అనుకోకుండా క్రిందటి నెలలో షిరిడీ ప్రయాణానికి నేను, నా భార్య టికెట్స్ బుక్ చేసుకున్నాముఅప్పటికి షిరిడీ సాయితో ముఖాముఖి ఆగస్టు నెలలో ముగుస్తుందనే విషయం సాయిబానిస గారు కూడా ఊహించలేదు.  53 అధ్యాయాలుగా తయారవుతుందని ఊహించాముకాని బాబా ఆలోచన ఏవిధంగా ఉన్నదో మాకు తెలియదుశ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి ఇక పూర్తిగా టైపు చేయడం అయిన తరువాత ప్రింట్ తీసి షిరిడీలో బాబా పాదాల ముందు పెడదామనుకున్నాను కాని కుదరలేదు. సాయిబానిస గారికి షిరిడీ వెడుతున్నానని చెప్పగానే ఆయన ఫోన్ లో చెపుతుండగా నేను వ్రాసిన వ్రాత ప్రతి పుస్తకాలని షిరిడీ తీసుకునివెళ్ళి ఆయన పాదాల ముందు పెట్టి పుస్తకంగా ప్రచురించడానికి ఆయన అనుమతి తీసుకోమని చెప్పారు. అంతకు ముందు ఆయన రచనలు ఏవీ షిరిడీలో బాబా పాదాల వద్ద పెట్టలేదు.  కనీసం ఈ వ్రాతప్రతినయినా ఆయన పాదాలవద్ద పెట్టి ఆయన అనుమతి తీసుకోవాలని సాయిబానిస గారి కోరిక. అందువల్ల వ్రాత ప్రతిని షిరిడీ తీసుకుని వెళ్ళి,  “ బుక్ ప్రింట్ కర్నేకా బాబా కి అనుమతి చాహియేఅని బాబాగారి పాదాలముందు పెట్టి ఇమ్మని చెప్పమని పూజారిగారితో చెప్పమన్నారు సాయిబానిస గారు.  బాబా పాదాల వద్ద వీలు కాని పక్షంలో వెండి పాదాల వద్ద పెట్టమని చెప్పమన్నారు, సాయిబానిస గారు.  ఆవిధంగా వ్రాతప్రతి రెండు పుస్తకాలను షిరిడీకి పట్టుకుని వెళ్ళానుఆగస్టు 13 .తారీకున బయలుదేరి 14 ఉదయానికి షిరిడీ చేరుకున్నాముఆన్ లైన్ లో బాబా వారి ఆరతికి టిక్కెట్స్ దొరకని కారణంగా మధ్యాహ్నం ఒంటిగంటకు దర్శనం, 15 .తారీకున ఉదయం 9 గంటలకి అభిషేకం, పూజ టిక్కెట్స్ బుక్ చేసుకున్నాముమేము బస చేసిన గెస్ట్ హౌస్ వద్ద ఒక ఆటో ఉందిగెస్టు హౌస్ లో దిగినవాళ్లని బాబా మందిరానికి ఆటోలో తీసుకుని వెడుతుంటాడుఅతను సీనియర్ సిటిజెన్స్ కి దర్శనం ప్రత్యేకంగా ఉంటుందని చెప్పడంతో వ్రాతప్రతి పుస్తకాలను రెండిటినీ తీసుకుని ఉదయం 9 గంటలకు మందిరానికి వెళ్లాము. 10 గంటలకి సీనియర్ సిటిజెన్స్ కౌంటర్ లో మా ఆధార్ కార్దులు చూపించి, (భర్త సీనియర్ సిటిజన్ అయితే కూడా ఉన్న భార్యను కూడా దర్శనానికి అనుమతిస్తారు) వేరే దారినుంచి మందిరంలోకి ప్రవేశించాముభక్తులు వరసలో చాలామంది ఉన్నారుఅందరినీ పదండి పదండి అంటూ కాసేపయినా నిలబడనీయకుండా ముందుకు వెళ్ళండి అంటూ భక్తులను పంపిస్తున్నారు.  సందర్భంలో భక్తులందరూ ముందుకు జరుగుతూ ఉంటే పుస్తకాలు పూజారిగారికి ఇచ్చినా ఆయన బాబా విగ్రహానికి తాకీ తాకకుండా ఇస్తారుఅటువంటి పరిస్థితి అక్కడ ఉంది.   సరిగా సమయంలోనే బాబా వారు తమ అనుగ్రహాన్ని చూపించారుసరిగ్గా మేము బాబా సమాధి దగ్గరకు చేరుకోగానే అక్కడ ఉన్న సెక్యూరిటి స్త్రీ, చెయ్యి అడ్డుపెట్టి మమ్మల్ని ఆపేసిందిమా వెనక ఇంకా భక్తుల వరస ఉంది వరుసలో నేను, నాభార్య మాత్రమే ముందు ఉన్నాము. ఇక మాముందు ఎవరూ లేరుమమ్మల్ని ఆపడానికి కారణం ఆసమయంలో ఎవరో ప్రముఖ వ్యక్తులు అయిదుగురు వచ్చారువారు బాబా వారిని దర్శించుకోవడానికి వీలుగా మమ్మల్ని ఆపేశారుఆవిధంగా ఒక 5 నిమిషాలసేపు తదేకంగా బాబా వారి విగ్రహాన్ని చూసే భాగ్యం కలిగిందిఅంతే కాదు ప్రముఖులు వెళ్ళిపోయిన తరువాత అక్కడ క్రిందపడివున్న గులాబీ రేకులను పూర్తిగా శుభ్రం చేసిన తరువాతనే మమ్మల్ని వదిలారు. కాని ప్రముఖ వ్యక్తులు వెళ్ళిపోగానే వెండిపాదాలను కూడా స్పృశించడానికి వీలుకాకుండా అడ్డుగా గాజు పలకను పెట్టేశారు.
  ఆవిధంగా వరుసలో ముందుగా మేము ఉన్న కారణంగా, పుస్తకాలను పూజారిగారికి ఇచ్చి, “ బుక్ ప్రింట్ కర్నేకె లియే బాబా కి అనుమతి చాహియేఅని చెప్పి పూజారిగారికి ఇచ్చానుపూజారి గారు పుస్తకాలను తీసుకుని బాబా విగ్రహమ్ పాదాలవద్ద కొద్ది సేపు పెట్టిన తరువాత ఇచ్చారు.  
Image result for images of Shirdi saibaba preaching.
నా భార్య ఇచ్చిన గులాబీ దండను సమాధి మీద పెట్టారు విధంగా బాబా పుస్తక ప్రచురణకి తమ అనుమతిని అత్యద్భుతంగా ఇచ్చి ఆశీర్వదించారు. మేము వరుసలో ఉన్నపుడె ప్రముఖ వ్యక్తులు రావడం, అదే సమయంలో మేము సరిగ్గా బాబా సమాధి దగ్గరే ఉండటం, అంతే కాకుండా బాబా పాదాలను తాకే వరుసలోనే ఉండటం, వ్యక్తులు వెళ్ళిన తరువాత కూడా క్రింద నేల శుభ్రం చేయడం, మరికాస్త సమయం మాకోసం బాబా ఇవ్వడం అంతా బాబా అనుగ్రహం కాక మరేమీ కాదుబాబా మనం ఊహించని అధ్భుతాలను చూపిస్తారు విషయం ఆరోజూ సాయిబానిసగారికి ఫోన్ చేసి చెప్పగానే, ఆయన కూడా ఇక్కడ బాబా గారిని వేడుకొన్నారుటషిరిడీలో నాకు ఏదయినా మహిమ చూపించమనిఆవిధంగా సాయిబానిస గారి కోరిక ప్రకారం బాబా వారు షిరిడీలో తమ అనుగ్రహాన్ని తమ అనుమతిని ప్రసాదించారు.
ఓమ్ సాయిరామ్ 

31.07.2019  -  శ్రీమతి లక్ష్మీఖాపర్దే కుమారుని ప్లేగు వ్యాధిని బాబా స్వీకరించుట  (శ్రీ సాయి సత్ చరిత్ర 7 ..)
నా భక్తులు అనారోగ్యంతో బాధపడుతూ తమ బాధను తొలగించమని వేడుకొన్న సమయంలో నేనే వారి శారీరక బాధను అనుభవించి వారికి ఆరోగ్యము ప్రసాదిస్తాను.  నీవు (సాయిబానిస) చెప్పినట్లుగానే నా అంకిత భక్తురాలు లక్ష్మీ ఖాపర్డే తన చిన్న కుమారుని ప్లేగు వ్యాధినుండి రక్షించమని వేర్డుకొన్నది.  మాతృప్రేమకు నా మనస్సు చలించిపోయింది.  నేను బాలుని ప్లేగువ్యాధిని నా శరీరముపై తీసుకొని బాలునికి ఆరోగ్యాన్ని ప్రసాదించి, లక్ష్మికి సంతోషమును ప్రసాదించాను. 

నీకు (సాయిబానిస) జ్ఞాపకము ఉందా?  నీవు నీ కుడికాలి మడమ ఎముక చిట్లి బాధ పడుతుంటే నేను నీబాధ చూడలేక నీయింట ఉన్న పెంపుడు పిల్లి రూపములో నీబాధను నేను అనుభవించాను.
నా (సాయిబానిస) నిజ జీవితములో శ్రీసాయి నా కాలినొప్పిని తగ్గించుట --

అది 1993 జనవరి నెల 12 .తారీకు సాయంత్రము స్కూటర్ ప్రమాదములో నా కుడికాలి మడమఎముకకు దెబ్బ తగిలి కాలు బాగా వాచిపోయింది.  మరుసటిరోజున డాక్టర్ దగ్గరకు వెళ్ళవచ్చని అశ్రధ్ధ చేసాను.  కాని, రాత్రి భరింపరాని నొప్పితో బాపడసాగాను.  సమయములో బాబాను కన్నీరుతో వేడుకొన్నాను.  నా కాలినొప్పిని తగ్గించమని ప్రాధేయపడ్డాను.  నొప్పి తగ్గడానికి ఒక మాత్ర వేసుకొన్నాను.  తెల్లవారుజామున 5 గంటలకు నా ఇంట పెంపుడు పిల్లి నా పడకగది వద్దకు వచ్చి ఏడవసాగింది.  నేను, నా భార్య లేచి, పిల్లి ఎందుకు ఏడుస్తున్నది అని చూసాము.
Image result for images of cat with broken leg
ఆరాత్రి మాపిల్లి బయటకు వెళ్ళి ఒక కాలు విరగగొట్టుకుని తెల్లవారేసరికి కాలికి గాయముతో నా ఇంటికి తిరిగి వచ్చింది.  నేను రాత్రి విపరీతమయిన కాలినొప్పితో బాఢపడుతూ బాబాను నా కాలినొప్పిని తగ్గించమని వేడుకొన్నాను.  బహుశ బాబా నాకాలినొప్పి తగ్గించటానికి తన కాలుని విరగగొట్టుకున్నారు అనే భావన కలిగింది.  బాబా శరీరంతో ఉన్న రోజులలో తన భక్తులు హంసరాజు ఉబ్బసవ్యాధి నివారణకోసం వాని ఇంటికి పిల్లిరూపములో వెళ్ళి పెరుగు త్రాగుతుంటే హంసరాజు ఆపిల్లిని బెత్తముతో కొట్టిన సంఘటన నాకు గుర్తుకు వచ్చింది.  24 గంటలలో నాకాలునొప్పి తగ్గిపోయింది.  కాని, నా పెంపుడు పిల్లి (బాబా) 10 రోజులు కుంటుతూ నాఇంట తిరిగింది.
( శ్రీ సాయి సత్ చరిత్ర 7 .ధ్యాయములో ఖాపర్డే కుమారుని ప్లేగు వ్యాధిని బాబా తను స్వీకరించి ఆమెతో అన్నమాటలునా భక్తుల కొరకు నేనెట్లు బాధపడెదనో చూడుము!  వారి కష్టములన్నియు నావే  బాబా అన్న మాటలు ఈ సందర్భంలో నాకు గుర్తుకు వచ్చాయి….  త్యాగరాజు)

01.08.2019  -  యోగులు భౌతికంగా దూరదూర ప్రాంతాలలో ఉన్నా వారు చేసేపనులు ఒకరికి కరు తెలియచేసుకునేవారు   (శ్రీ సాయి సత్ చరిత్ర 21 ..)
ప్రపంచములో అనేక జాతులవారు, అనేక మతాలవారు ఉన్నా వారు అందరికీ భగవంతుడు ఒక్కడే.  మనమధ్య ఉన్న యోగులు భగవంతుని ఆజ్ఞ ప్రకారము మానవాళిని సరియైన మార్గంలో నడిపిస్తారు.  ఈనాడు నీపంజాబీ స్నేహితుడు చిబ్బర్ మరియు తెలుగు స్నేహితుడు ఆదినారాయణ ఇద్దరూ క్రిందటి జన్మలో మంచి స్నేహితులు.  జన్మలో వారు దూరప్రాంతాలలో న్మించి పెరిగి పెద్దవారయ్యారు.  నా సంకల్పంతో మీరు ముగ్గురూ మంచి స్నేహితులయ్యారు.  అలాగే భగవంతుని సంకల్పముతో ప్రపంచంలోని యోగులము స్నేహపూర్వకముగా జీవించుతాము.  మరియు భగవంతుని ఆదేశానుసారము మా కర్తవ్యమును మేము నిర్వహించుతాము.  నీవు ఒకనాడు *టి.వి. లో నా సోదరుడు మంత్రాలయ రాఘవేంద్రస్వామిని చూసి ఆదే సమయములో నన్ను చూడాలని కోరుకొన్నావు.  నేను నీకోరికను నెరవేర్చాను.  అది నీకు గుర్తుందా?
Image result for images of Sri shiridisaibaba and raghavendraswamy
*నా  (సాయిబానిస) నిజ జీవితంలో జరిగిన ఒక శ్చర్యకరమయిన సంఘటన.  అది 16.09.1993 సాయంత్రము గం.6.30 ని.లకు దూరదర్శన్ లో మంత్రాలయ శ్రీరాఘవేంద్రస్వామి జీవితముపై తెలుగు భాషలో చక్కటి కార్యక్రమము రాసాగింది.  నేను చాలా ఆసక్తిగా ఆకార్యక్రమమును చూడసాగాను.  సమయంలో నా మనసులో ఒక విచిత్రమయిన కోరిక కలిగింది.  శ్రీసాయి చెప్పిన మాటల ప్రకారము ప్రపంచములోని యోగులందరూ భగవంతుని సేవకులే.  వారు ఒకరికి ఒకరు తమ పనులు తెలియచేసుకుంటారు.  మాటలు నిజమయితే శ్రీరాఘవేంద్రస్వామి మీద కార్యక్రమములో శ్రీషిరిడీ సాయినాధులవారిని చూపాలి.  లేదా నేను టి.వి. ని కట్టివేసేలోపల శ్రీ షిరిడీసాయి మీద కార్యక్రమము లేదా శ్రీషిరిడీసాయి పటము దూరదర్శన్ వారు చూపాలి.  ఇది చాలా విచిత్రమయిన కోరిక.  ఇది నాకు పరీక్ష కాదు.  యోగులందరికీ పరీక్ష అని టి.వి. ముందు కుర్చీలో కూర్చుని టి.వి. ని చూడసాగాను.  సమయము 7 గంటలు.  శ్రీరాఘవేంద్రస్వామిపై కార్యక్రమము పూర్తయినది.  నాకు బాబా దర్శనము జరగలేదు అని కొంచెము నిరుత్సాహము పడ్డాను.  కాని, టి.వి. లో 7 గంటలకు తెలుగులో వార్తలు ప్రసారం ప్రారంభమయింది.  వార్తలలో మొదటి వార్త ఆంద్రప్రదేశ్ లో రోజున లారీల సమ్మె జరుగుతున్నది లారీలన్ని రోడ్డుమీద ఆగిపోయాయి అని చెప్పి లారీలలో మొదటి లారీని టి.వి. తెరమీద పెద్దగా చూపించారు.  నా కళ్ళను నేను నమ్మలేకపోయాను.  లారీ మీద శ్రీషిరిడీసాయిబాబా లారీ సర్వీసు అని పెద్ద అక్షరాలతో వ్రాయబడి ఉంది.  ఆలారీ మీద శ్రీషిరిడీసాయిబాబా తన భక్తులను ఆశీర్వదిస్తున్న పటము ఉంది.  శ్రీసాయి నాకోరిక నెరవేర్చటానికి ఆలారీమీద ము రూపములో దర్శనమిచ్చి ప్రపంచములోని యోగులందరమూ ఒక్కటే అనే సందేశమును ఇచ్చారు.  యోగిరాజ్ శ్రీసాయి పటానికి నమస్కరించాను.

02.08.2019  -  ఇక నీ (సాయిబానిస) సంగతి.  నీతల్లి 2015 లో మరణించినది.  ఆమె నీతండ్రి మరణానంతరము జీవించినంత కాలము తన పెద్ద కుమార్తె మరియు చిన్న కుమారుని వద్ద జీవించింది.  ఆమె జీవిత ఆఖరి దినాలలో ఆమెకు నీవు ఆర్ధిక సహాయము కూడా చేయలేదు.  ఇపుడు చూడు నీతల్లి నీదగ్గరకు వచ్చి తనకు ధనసహాయము చేయమని యాచించుతున్నది.  నీవు ఆమె బ్రతికి ఉండగా ఆమెకు ధనసహాయము చేసి ఉన్న, ఈనాడు ఆమె ఆత్మ ప్రశాంతముగా పునర్జన్మ ఎత్తి ఉండేది.  కనీసము వచ్చేజన్మలో అయినా ఆమె ఋణము తీర్చుకో.

ఇపుడు నిన్ను (సాయిబానిస) చైనా దేశములోని ఓపెద్ద పట్టణములో ప్రదర్శించబడుతున్న నాటకమును చూడటానికి తీసుకుని వెడతాను రా

అది చేనా దేశములోని ఓపెద్ద నగరము.  అక్కడ ఒక పెద్ద భవనంలో నాటక ప్రదర్శన జరుగుతున్నది.  వనము వృత్తాకారముగా ఉన్నది.  
Image result for images of theatre in china
Image result for images of theatre in china

ఆభవనము మధ్య భాగంలో రంగస్థలం (స్టేజీ) ఉన్నది.  ఆరంగస్థలము చుట్టూ ప్రేక్షకులు కూర్చుని ఉన్నారు.  బాబా నన్ను ఆమందిరంలో ఒక కుర్చీలో కూర్చుండబెట్టి తాను బయట నిలబడతాను, నాటకము పూర్తయిన తరువాత బయటకు రమ్మని చెప్పారు.

నేను ఆనాటకము చూస్తున్న సమయంలో ఒక స్త్రీ వచ్చి, గ్రీన్ తేనీరు ఇచ్చినది.  నేను తేనీరు త్రాగాను.  ఆనాటకము ఒక తల్లి తన కుమారుని కాపాడుట గురించిన కధ.  ఆకధ నాకు కన్నీరు తెప్పించింది.  ఆకధ ఏమిటంటే తన కుమారుడిని హత్య చేయడానికి కొందరు దుండగులు కత్తితో వచ్చారు.  తల్లి తన కుమారుని కాపాడుకోవటం కోసం దుండగులకు ఎదురుగా నిలబడింది.  దుండగులు తల్లిని కత్తితో పొడిచి హత్య చేసారు.  ఆమె కుమారుడు తన తల్లి మరణమును చూసి ఏడవసాగాడు.  తన తల్లి త్యాగాన్ని మర్చిపోలేకపోసాగాడు.  యువకుడు వివాహము చేసుకుని సంసార జీవితంలో ఒక ఆడపిల్లకు జన్మ ఇచ్చాడు.  తన కుమార్తెలో తన తల్లిని చూసుకుని తన శేష జీవితాన్ని తన భార్యాకుమార్తెలతో సంతోషముగా గడిపాడు.  నాటకము పూర్తయింది.  బాబా వచ్చి నన్ను పలకరించారు.

03.08.2019  -  సపత్నేకర్ తన కుమారుని మరణానికి నన్ను బాధ్యుడిగా చేసి ఏడవసాగాడు.  నేను అటువంటి పనులు చేయను.  చనిపోయిన వాని కుమారుని ఆత్మను తిరిగి సపత్నేకర్ భార్య గర్బములో ప్రవేశపెట్టి వానికి తిరిగి కుమారుని ప్రసాదించెదను. (శ్రీసాయి సత్ చరిత్ర 48 ..)

సపత్నేకర్ ధనికుడు.  అతని ఒక్కగానొక్క కుమారుడు గొంతువాపు వ్యాధితో మరణించినది వాస్తవము.  నేను వాని కుమారుడిని చంపలేదు.  అతను అందరివద్ద అసత్యము మాట్లాడుతూ నన్ను నిందించుతున్నాడు.  సపత్నేకర్ భార్య తన కుమారునిపై ప్రేమతో విలపించసాగింది.  ఆమె బాధను నేను అర్ధము చేసుకోగలను.  చనిపోయిన పిల్లవాని ఆత్మను తిరిగి సపత్నేకర్ భార్య గర్బములో ప్రవేశపెట్టి మరలా ఒక కుమారుడిని వారికి ప్రసాదించాను.  ఆపిల్లవాని పేరే మురళీధరుడు.  సపత్నేకర్ కన్నీరుతో నాపాదాలు కడిగి నాకు అంకిత భక్తుడయ్యాడు.

నా భక్తులలో అనేకమంది ధనికులున్నారు.  అలాగే అనేకమంది బీదవారూ ఉన్నారు.  ఈరోజున నేను నిన్ను హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ (టాంక్ బండ్) వద్ద ఉన్న ఒక బీదల బస్తీలోకి తీసుకుని వెడతాను రా అని నన్ను టాంక్ బండ్ వద్ద వదిలివేసారు.  టాంక్ బండ్ నుండి నేను రాణీగంజ్ వైపు నడవసాగాను.  ఒకచోట బీదముస్లిమ్ లు ఒక దర్గా దగ్గర వారి సాంప్రదాయము ప్రకారము భక్తిపాటలు పాడసాగారు.  అక్కడినుండి కొంతదూరము నడిచివెళ్ళాను.  అక్కడ బీద హిందువులు గుడిసెలలోను, మరియు రేకుల షెడ్డులలోను నివసించుతున్నారు.  వారందరూ నన్ను వింతగా చూడసాగారు.  నేను బాబా మందిరం కోసం ఆప్రాంతమంతా వెదకసాగాను.  నాకు ఒక చిన్న మారుతి మందిరము కనిపించింది.  మందిరములో పూజారి ఒక్కడే ఉన్నాడు.  పూజారి నా కంటికి శ్రీషిరిడీ సాయిబాబాగా దర్శనమిచ్చారు.  మందిరములోని బాబాను చూసిజై సాయిరామ్  జై సాయిరామ్అని గట్టిగా అంటూ నిద్రనుండి లేచాను.

04.08.2019  -  గౌరి కళ్యాణముమేఘశ్యాముని మరణము

మానవుని జీవిత చక్రములో రెండు సంఘటనలు మరచిపోలేనివి.  నేను షిరిడీలో శరీరముతో ఉన్న రోజులలో పూజారి కుమార్తెయిన గౌరిని వీరభద్రప్పకు ఇచ్చి, కళ్యాణము జరిపించి వారికి ఉన్న ఋణానుబంధాన్ని కొనసాగించటానికి వారికి సహాయము చేసాను.  అదే నా అంకిత భక్తుడు మేఘశ్యాముడు తన చిన్నతనంలోనే మరణించడము నాకు, వానికి ఉన్న ఋణానుబంధము తీరిపోయనదని ఒకసారి బాధ పడ్డాను.  అందుచేత వివాహానికి సంబరాలు చేసుకున్నా, మరణానికి శోకదినాలు పాటించినా అది జీవిత చక్రములో ఒక భాగముగా భావించినవాడే జ్ఞాని.

05.08.2019  -  ప్రశ్న -  బాబా, స్నేహమును ఎదుటివారిలోని ధనసంపాదనను చూసి చేయాలా?  లేక వారి గుణమును చూసి చేయాలా?  తెలియజేయి.

స్నేహము అనేది సమ ఉజ్జీగలవారితో చేయాలి.  ధనవంతులను చూసి వారిని ద్వేషించకు.  అలాగే బీదవారిని చూసి వారిని అసహ్యించుకోకు.  నేను నాకు సమాధిమందిరము నిర్మించిన గోపాల్ ముకుందబూటీని దాని నిర్మాణములో సలహాలు సూచనలు ఇచ్చిన బీద బడిపంతులయిన శ్యామాను సమదృష్టితో చూసాను.

నీజీవితంలో నీవు ధనవంతులతో స్నేహము పేరిట వారి చుట్టూ తిరిగావు.  రాణిగంజ్ లోని నీ మితృడు జీవన్ సింగ్ ధనవంతుడు.  వారి ఇంట నీకు జరిగిన పరాభవమును గుర్తు చేసుకో.  అదే మౌలాలీలోని రజకుల కులములో పుట్టిన నీస్నేహితుడు రాఘవులు ఇంటిలో నీకు జరిగిన మర్యాదను గుర్తు చేసుకో.  స్నేహానికి ధనము ప్రాధాన్యత కాదు.  వ్యక్తిలోని గుణము ముఖ్యమని గుర్తించు.

06.08.2019  -  గతమువర్తమానముభవిష్యత్తు

చిన్న పిల్లవానికి అర్ధమయే భాషలో నీకు వివరణ ఇస్తాను.  నీ బాల్యములో నీవు చేసిన అల్లరి పనులు, ప్రక్కింటివాని పెరటిలోని జామచెట్టునుండి జామపళ్ళు దొంగతనము, రోజున నీవు చేయలేవు.  కారణము నీ వృధ్ధాప్యము.  అందుచేత నీవు నీగత జీవితాన్ని గతం గతః అని అంటావు.
నీవు వృధ్ధాప్యములోనికి రాగానే నీ కంపెనీనుండి పదవీ విరమణ చేసావు.  ఈరోజున నీవు భవిష్యత్తులో (కలలలో) నీవు నీ పాత కంపెనీ జనరల్ మానేజర్ గా భావించి నీవు చేయదలచిన గొప్ప పనులను ఆలోచించుతున్నా అవి జరిగే పనులు కావు.  కారణము ఇపుడు నీవు పదవిలో లేవు.  నీకు నీ వృధ్ధాప్యము సహకరించదు.  అందుచేత వర్తమానము నీ వృధ్ధాప్యము.  నీ వృధ్ధాప్యమును అంగీకరించి ప్రశాంతముగా జీవించు.
(మరికొన్ని సంభాషణలు వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)




Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List