17.05.2020 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయిభక్తులలో ఒకరయిన శ్రీ ఉద్ధవేష్ బువా అనబడే శ్యామ్ దాస్ బాబా గురించి మీకు అందిస్తున్నాను. ఆయనయొక్క
సమాచారం shridisaitrust.org – Chennai వారి నుండి గ్రహింపబడింది.
తెలుగు అనువాదమ్
: ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్ నం.
9440375411 & 8143626744
ఉధ్ధవేష్ బువా - 1వ.భాగమ్
సాయిమహాభక్త ఉధ్ధవేష్ బువా అనబడే శ్యామ్ దాస్ బాబా గారు 1865వ.సంవత్సరం జూన్
9వ.తారీకున జన్మించారు. ఆయన
పూర్వీకులు మహారాష్ట్రలోని కొంకణప్రాంతం అయిన రత్నగిరి జిల్లా, దేవగడ్ గావ్ గ్రామంనుంచి వచ్చారు.
ఆతరువాత
వారి కుటుంబం మహారాష్ట్రలోని థానేకు మరారు.
అక్కడే
ఉధ్ధవేష్ బువా పెరిగి పద్దవారయ్యారు.
బాల్యంనుండే ఆయనలో సహజంగానే యోగిలక్షణాలు కనిపించేవి. అందువల్లనే
ఆయన సాధువులను, యోగీశ్వరులను దర్శించుకోవడం కోసం తీర్ధయాత్రలకు వెడుతూ ఉండేవారు.
ఆయన
మొట్టమొదటిసారిగా 1904వ.సంవత్సరంలో షిరిడీ వెళ్ళారు. బాబా అనుగ్రహం ఆయనమీద ఉండటం వల్లనే ఆయన షిరిడీకి రావడం తటస్థించింది. ఆయన
కాలినడకన వార్ధానుండి రామేశ్వరం వరకు యాత్ర చేసారు.
ఆయన
గజానన్ మహరాజ్ గారి దర్శనం చేసుకున్నపుడు ఆ యోగీశ్వరుడు ఉధ్ధవ్ గారిని షెగావ్ కి దక్షిణదిక్కుకు వెళ్ళమని అక్కడ నీ గురువును కలుసుకుంటావు అని చెప్పారు.
ఆ తరువాత
మరొక యోగీశ్వరుడయిన హరిహర్ బాబాను కలుసుకున్నారు. షివాలీలో
ఉండే హరిహర్
బాబా ‘హరిహర్’ అనే మాట తప్ప మరొక మాట మాట్లాడరు. ఆయన
ఉధ్ధవేష్ కి ఒక సూచన చేసారు.
పశ్చిమదిక్కున
షివాలి లాగానే
ఉచ్చరింపబడే (శిలధి) గ్రామంలో నీ మోక్షగురువును కలుసుకుంటావనే విషయాన్ని తెలియచేసారు.
షివాలిలో ఒక యాత్రాబృందం వారు ఆయన ప్రయాణించడానికి ఒక అడవి గుఱ్ఱాన్ని ఇచ్చారు.
అది
చాలా పెంకి గుఱ్ఱం.
ఆ గుఱ్ఱం ఎవరయినా తన ముందు నిలబడితే వాళ్ళని కొరకడం, వెనుక నిలబడితే వెనక కాళ్ళతో తన్నడం చేసేది.
అయినాగాని
ఉధ్ధవేష్ ఆ గుఱ్ఱంతో యోగీశ్వరులు నివసించే ప్రదేశమయిన అహ్మద్ నగర్ జిల్లాకు చేరుకున్నాడు. బేలాపూర్లో
కేశవ్ గోవింద్ గారి సమాధిని దర్శించుకుని కోపర్ గావ్ చేరుకున్నాడు. గోదావరి
నదిలో పుణ్యస్నానమాచరించి, నామజపం చేసుకున్న తరవాత ఆఖరికి షిరిడి చేరుకున్నాడు.
ఆ రోజుల్లో షిరిడీ గ్రామంలో జనాభా చాలా తక్కువగా ఉండేది. రహదారి
ప్రక్కన అంతా తుమ్మచెట్లు విస్తరించి ఉన్నాయి. షిరిడీలోకి ప్రవేశించిన తరువాత ఉధ్ధవేష్ తన గుఱ్ఱాన్ని ఒక తుమ్మ చెట్టుకు
కట్టేసాడు.
ఆ గుఱ్ఱం దారినపోయేవాళ్లని కరవకుండా, తన్నకుండా దాని మూతిని, వెనుక కాళ్ళను తాడుతో కట్టేసాడు.
ఆసమయంలో
ఉధ్ధవేష్ కి ఒక ఫకిరు కనిపించాడు. ఆ ఫకీరు
చిరిగిన కఫనీ ధరించి ఉన్నాడు. చేతిలో ఒక రేకు డబ్బా ఉంది. ఎక్కడికో వెడుతున్నట్లుగా ఉన్నాడు.
ఉధ్ధవేష్
ఆ ఫకీరు దగ్గరకు వెళ్ళి ఎంతో వినయంగా షిరిడీలో నివసించే సాధువు ఎక్కడ ఉంటాడని అడిగాడు.
వెంటనే
ఆఫకీరు తిట్లవర్షం కురిపించాడు. ఆఫకీరు
తిట్టిన తిట్లకి ఉధ్ధవేష్ మనస్సు బాగా గాయపడింది.
మరొకమాట
మాట్లాడకుండా షిరిడీ గ్రామంవైపు నడక ప్రారంభించాడు. ఉధ్ధవేష్ కొంతసేపు తనలో తనే ఈవిధంగా ఆలోచించాడు.”ఆముసలివాడికి బాగా కోపం ఎక్కువగా ఉన్నట్లుంది. నేనెంతో
మర్యాదగా అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పడానికి బదులు నన్ను, నావాళ్ళని అనరాని మాటలన్నాడు” చివరికి
ఎలాగయితేనేమి షిరిడీలోని ద్వారకామాయి దగ్గరకు చేరుకున్నాడు. ద్వారకామాయికి
ప్రక్కనే ఒక గుడిసె ఉంది.
అందులో
ఒక ముసలామె రొట్టె, కూర (భక్రి, పిట్లా) తయారుచేస్తూ ఉంది. ఉధ్ధవేష్ ఆమెని షిరిడీలో నివసించే సాధువు గురించిన వివరాలనడిగాడు. ఆమె
సాయిబాబా బయటకు వెళ్ళారని చెప్పింది గాని తిరిగి ఎప్పుడు వచ్చేది చెప్పలేదు.
అందుచేత
ఆయన తిరిగివచ్చేసమయానికి ఆయనకోసం తను రొట్టెలు, కూర (భక్రి, పిట్లా) తయారుచేస్తున్నానని చెప్పింది.
(భక్రి, పిట్లా)
ఆయన రూపురేఖలు ఏవిధంగా ఉంటాయని ఆముసలామెని అడిగాడు. బాబా చిరిగిన కఫనీ ధరించి, తలకు గుడ్డచుట్టుకుని ఉంటారని మొత్తం వర్ణించి చెప్పింది.
ఆయన రూపురేఖలు ఏవిధంగా ఉంటాయని ఆముసలామెని అడిగాడు. బాబా చిరిగిన కఫనీ ధరించి, తలకు గుడ్డచుట్టుకుని ఉంటారని మొత్తం వర్ణించి చెప్పింది.
మసీదు ముందర చెత్త పారబోసి ఉంది.
కాని
ద్వారకామాయి లోపల అంతా పరిశుభ్రంగా ఉంది.
ఒక
మూలగా నాలుగు దీపాలు వెలుగుతూ ఉన్నాయి.
దానిప్రక్కన
ఒక తిరగలి, కొన్ని వాడిపోయిన బంతిపూలదండలు ఉన్నాయి.
మరికొన్ని
దండలు అప్పుడే తయారుచేసినట్లుగా తాజాగా ఉన్నాయి.
స్థంభం
ముందు ధుని వెలుగుతూ ఉంది.
మసీదులో
దీపాలు వెలుగుతూ ఉండటం ఆ ఏర్పాట్లు అన్నీ అతనికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఇక
వెనుకకు తిరిగివెళ్ళిపోతూ వాటి గురించే ఆలోచిస్తూ ఉన్నాడు.
అతని
మనసులో కొన్ని ప్రశ్నలుదయించాయి. రొట్టెలు
తయారుచేస్తున్న ముసలామె హిందూ స్త్రీ.
సాధువుని
వర్ణించిన తీరును బట్టిచూస్తే ఆయన ఒక ముస్లిం అయి ఉండవచ్చని అనిపిస్తోంది. ఈ
ఆలోచనలతో అతని మనసంతా గందరగోళంగా తయారయింది. “మసీదులో అగ్నిహోత్రం ఎందుకని ఉంది? “ ఇటువంటి ఎన్నో ఆలోచనలు అతని మనసుని ఉక్కిరిబిక్కిరి చేసాయి.
అలా
ఆలోచిస్తూ నడచుకుంటూ వెడుతున్న అతనికి దారిలో తన గుఱ్ఱం శరీరాన్ని నిమురుతూ ఉన్న బాబా కనిపించారు. ఒక
ఒక చేతిని గుఱ్ఱం నోటిలో పెట్టి మరొక చేతితో దాని తలను నిమురుతూ ఉన్నారు.
ఆదృశ్యాన్ని
చూడగానే ఉధ్ధవేష్ కంగారుగా “మహరాజ్, జాగ్రత్త, అది అసలే అడవి గుఱ్ఱం.
దానిష్టం
వచ్చినట్లుగా కొరికేస్తుంది” అన్నాడు.
ఆతరువాత
ముందుకు వెళ్ళి బాబాపాదాల మీద తన శిరసునుంఛాడు. ఆవెంటనే
అతనికి ఎంతో ప్రశాంతత కలిగింది. వెంటనే
తనలో రగులుతున్న ప్రశ్నని అడిగాడు.
“మహరాజ్! నేను నాగురువుని ఎప్పుడు కలుసుకుంటాను?” గుఱ్ఱాన్ని
ఇంకా నిమురుతూనే బాబా ఇలా సమాధానమిచ్చారు “నువ్వు ఎక్కడినుంచి వచ్చావో భవిష్యత్తులో
నీకే తెలుస్తుంది. నేనొక
పిచ్చిఫకీరుని మాత్రమే”
బాబా
ఇంకా ఇలా అన్నారు “అయిదు సంవత్సరాల తరువాత పూర్తిగా ప్రతి విషయం నీకే అర్ధమవుతుంది సరేనా, ఇక వెళ్ళు”
ఈరోజే
వెళ్ళు,
వెళ్ళి
సాధన చెయ్యి అన్నారు.
ఆ తరువాత
బాబా, ఉధ్ధవ్ ఇద్దరూ ద్వారకామాయి మసీదుకు వచ్చారు.
అక్కడ
ఒక భక్తుడు బాబాకు సమర్పించడానికి ఇచ్చిన కొబ్బరికాయ ఉంది.
బాబా
ఆకొబ్బరికాయను కొట్టి సగం చెక్క ఉధ్ధవేష్ కి ఇచ్చారు. “రొట్టె
మొత్తం ఒక్కసారే కడుపులోకి వెడుతుందా?
అయిదు
సంవత్సరాల తరువాత నీకే అర్ధమవుతుంది. అపుడు చూద్దాం” అన్నారు బాబా.
ఆతరువాత ఉధ్ధవేష్ బాబాకు నమస్కరించి కోపర్ గావ్ కి బయలుదేరాడు. మిగతా
యాత్రికుల బృందంతో కలిసి తన తీర్ధయాత్రను కొనసాగించాడు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment