Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, August 30, 2020

బాబా నాజీవితంలోకి ఎలా ప్రవేశించారు - 2

Posted by tyagaraju on 9:08 AM

Mylapore Sai Baba Temple, Chennai | Page 2 | Indusladies
     Best HD Wallpaper Rose Images - Best Rose Images
30.08.2020  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీమతి మంజుభాషిణి గారు వివరించిన మరిలొన్ని అనుభవాలను ఈ రోజు ప్రచురిస్తున్నాను.


బాబా నాజీవితంలోకి ఎలా ప్రవేశించారు - 2
శ్రీమతి మంజుభాషిణిగారి అనుభవాలు
బాబా మంజుభాషిణి గారిని తన భక్తురాలిగా ఏవిధంగా స్వీకరించారో తెలిపే అధ్భుతమయిన లీలలను రోజు ప్రచురిస్తున్నాను.  24.08.2020 బాబా నాజీవితంలోకి ఎలా ప్రవేశించారు అన్న లీలని మీరు చదివే ఉంటారు.  ఇంకా మరికొన్ని లీలలు రోజు చదవండి.  తమిళంలో ఆవిడ చెప్పిన విషయాలన్నిటిని తెలుగులోకి అనువాదం చేసి పంపించినవారు శ్రీమతి కృష్ణవేణి,  చెన్నై.

24.08.2020 న మంజుభాషిణి గారి జీవితంలోకి బాబాగారు ఏవిధంగా ప్రవేశించారో తెలిపే సంఘటనని ప్రచురించాను.  కాని కొన్ని విషయాలు అందులోకి రాలేదు. శ్రీమతి మంజుభాషిణి గారు స్వయంగా చెప్పిన విషయాలను కొన్నిటిని మరలా తెలియ చేస్తున్నాను.

ప్రతినెల గుప్పెడు బియ్యం తీసి అన్నదానం చేసే లీలని చదివాము.
బాబా ఆమెను ఏవిధంగా ఆశీర్వదించారో చూద్దాము.  ఆమె పాప, అన్నదాన సమయంలో బాబా ఏరంగు దుస్తులలో వస్తారో ఎపుడూ చెబుతూ ఉండేది.  కాని ఈ సారి మాత్రం బాబా ఏరంగు దుస్తులలో వస్తారో నేను చెబుతాను అని మంజుభాషిణి గారు అనుకున్నారు. 


ఆమె అన్నదానం పొట్లాలను బీదలకు పంచడానికి బాబా మందిరానికి తీసుకుని వెళ్ళారు.  బాబా ఏరంగు దుస్తులలో రావాలని కోరుకొన్నారో అక్కడ అదే రంగు దుస్తులను ధరించిన ఒక ముసలామె ఒక బల్లలాంటిదాని మీద బయట పడుకుని ఉంది.  అప్పుడు మంజుభాషిణిగారు ఆమెను లేపి అన్నం పొట్లం ఇచ్చినపుడు ఆమె తీసుకుని వెంటనే లడ్డూలు ఉన్న ఒక కొత్త బాక్సుని మంజుభాషిణి గారికి ఇవ్వబోయింది.  మంజుభాషిణిగారు ఆమె ఇస్తున్న లడ్డూలని తీసుకోవడానికి కాస్త సంకోచించారు.  నాకెందుకు ఇస్తున్నారు వద్దు అన్నట్లుగా తీసుకోకుండా వెనక్కి జరిగారు.  ఆమె వెనక్కు వచ్చేసినా ఆ ముసలామె సరే నీకు వద్దు కదా నీ కుటుంబంలో ఎవరికయినా ఇస్తాను అని అంది.  ఆవిధంగా వద్దు అన్నా దానిని ఇస్తాను అని అంటుంటే ఈమె ఆలోచిస్తూ నిలబడిపోయింది.  అక్కడే నిలబడి చూస్తూ ఉన్న ఆమె భర్తకి ఎందుకనో ఒక్క క్షణం ఆముసలామె బాబాలాగే అనిపించి ఆమె అంత ప్రేమగా తీసుకోమని చెబుతోంది కదా తీసుకోఅన్నారు.  భర్త చెప్పడంతో ఆవిడ దానిని తీసుకుని కొంచెం తిన్నారు.   

అయితే ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఆరోజు బాబా ఏరంగు దుస్తులలో రావాలని కోరుకొన్నారో, అదే రంగు దుస్తులలో ఆముసలామె పడుకొని ఉండటం, మందిరంలోకి వెళ్ళిన తరువాత బాబా కూడా అదేరంగు శాలువాతో దర్శనమివ్వడం ఒక పెద్ద అనుభవం.  అక్కడ ఉన్న ముసలామెకు ఆ లడ్డూలను బాబా ఏవిధంగా ఇచ్చారో దాని గురించి కూడా చెప్పారు.  ఆమందిరం ఉన్న ప్రాంతంలో బాబాపేరుతో ఒక స్వీట్ షాపును ప్రారంభించడం జరిగింది.  అ షాపు యజమాని  మొట్టమొదటిసారిగా బాబాకోసమే ప్రత్యేకంగా ఆ లడ్డూలను తయారుచేసి బాబా ఆశీర్వాదం తీసుకోవడానికి బాబాకు సమర్పించాడు.   ఆ లడ్డూల బాక్సునే బాబా తనప్రియ భక్తురాలయిన మంజుభాషిణి గారికి ప్రసాదించారు.  ఆముసాలామె ఈవిషయం మంజుభాషిణిగారికి చెప్పింది.  ఆమె చేసే అన్నదానానికి బాబాగారు సంతోషించి ఈవిధంగా లడ్డూలను ఇప్పించి వారి కుటుంబాన్ని ఆశీర్వదించారు. 

వారు మందిరం దగ్గరే ఉన్న సమయంలో అక్కడ ఉన్న టేప్ రికార్డులో బాబా మందిరంనుండి ఒక పాట తమిళంలో ఇన్ని జన్మలనుంచి నీతో నాకున్న పరిచయం నీకు ఈ రోజు తెలుస్తుందిఅని వినిపించింది.  ఈ పాట విన్న మంజుభాషిణి గారికి అది ఏదో ఎవరిగురించో పాటలే అనుకుని దానికంతగా ప్రాధాన్యమివ్వలేదు.  కాని ఆరోజు సాయంత్రం ఆమె తన పిన్నిగారితో తాను బాబా మందిరానికి వెళ్ళిన విషయం చెప్పింది.  ఆమె ఆ సంగతి చెప్పగానే ఆవిడ పిన్నిగారు  మీ అమ్మకి పిల్లలు లేకపోతే బాబాగారికి వడమాల, పొంగలి సమర్పిస్తానని మొక్కుకొంది.  ఆవిధంగా మొక్కుకోవడం వల్లనే నువ్వు జన్మించావు”. అని ఒక ఆశ్చర్యకరమయిన విషయం మంజుభాషిణి గారికి చెప్పారు. ఆవిధంగా మంజుభాషిణి గారికి బాబాతో బంధం తను జన్మించినప్పటినుండి ఏర్పడిందన్న విషయం అర్ధమయింది.  కాని 20 సంవత్సరాలుగా అప్పటివరకు తెలియని ఈ విషయం ఆరోజు మందిరంలో వినిపించిన పాటకు సాక్ష్యమన్నట్లుగా ఆరోజే తెలిసింది. బాబా ఆవిధంగా తనకు బాబాకు మధ్య జన్మజన్మల సంబంధం ఉన్నదని ఆవిధంగా తెలియచేసారు.  ఆ తరువాతనుంచి బాబా అనుగ్రహంతోనే తాము ఈరోజు మంచి ఉన్నత స్థితిలో ఉన్నామని చెప్పారు.

బాబా అనుగ్రహంతో వారు మంచి అభివృధ్ధిలోకి వచ్చారు.  ఒకప్పుడు ఏమీ లేకుండా ఉన్నటువంటి కుటుంబాన్ని బాబాగారు ఆశీర్వదించి సమాజంలో వారికి మంచి గౌరవమర్యాదలు కలిగేలా ఆశీర్వదించారు. వారికి ఉన్నత స్థితిని ప్రసాదించారు.  ఆయన లీలలు అనుభవాలు ఎవరిని ఎప్పుడు వరిస్తాయో చెప్పలేము.  పరిచయం లేకపోయినా బాబా ఒక మహానుభావుడు మాత్రమే అంతకన్నా ఆయనేమీ భగవంతుడు కాదనే ఉద్దేశ్యంతో తన మందిరానికి వచ్చిన మంజుభాషిణి గారిని బాబా గొప్ప సాయిభక్తురాలిగా మార్చారు.

అసలు ఆమెకి బాబా గారితో ఏవిధంగా బంధం ఏర్పడిందో చెప్పారు.  ఒకరోజు ఆమె మైలాపూర్ లో ఉన్న బాబా మందిరానికి వెళ్ళారు.  అప్పట్లో బాబా అంటే ఎవరో కూడా వారికి తెలియదు.  ఒక ఏకాదశిరోజున బాబా మందిరంలో పంచుతున్న పొంగలి తిని వెడదామనే ఉద్దేశ్యంతో వెళ్ళడం జరిగింది.  బాబా అంటే ఒక గొప్ప వ్యక్తి అనే భావమే తప్ప ఆయన భగవంతునితో సమానుడు అని అనుకోలేదు.  ఆయినా బాబా ఆమెను ఎలా అనుగ్రహించారో వివరించారు.
(రేపటి సంచికలో మంజుభాషిణి గారి ఇంటిలో కొలువై ఉన్న బాబా విగ్రహాలు, ఫోటోలు చూడండి.)
(రేపటి సంచికలో మిగిలిన భాగమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
(శ్రీ సాయిసాగరంలోనుండి వెలికితీసిన ఆణిముత్యాలు 17వ.భాగం ఈ క్రింది లింకు ద్వారా చదవండి)




Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List