Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, August 23, 2020

మద్రాసు భజనసమాజమ్

Posted by tyagaraju on 9:19 AM

      HOW AND WHY MAZAAR(TOMB) OF A MUSLIM FAQIR PIR SHIRDI SAIBABA WAS ...
            Flower Wallpapers | Flower Pictures | Red Rose | Flowers Gifts ...

23.08.2020  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మీకొక అధ్భుతమయిన లీలను అందచేస్తున్నాను.  నేటికి సరిగ్గా 105 సంవత్సరాల క్రితం బాబా జీవించి ఉన్న రోజులలొ జరిగిన వృత్తాంతాన్ని ప్రచురిస్తున్నాను.  శ్రీ సాయి సత్ చరిత్ర పారాయణ చేసినవారికి 29 వ.అద్యాయంలో మద్రాసు భజన సమాజం గురించి గుర్తుండే ఉంటుంది.  ఆ భజన సమాజం లోని స్త్రీ స్వయంగా వ్రాసి పంపించిన వృత్తాంతం శ్రీ సాయిలీల పత్రిక 1931 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది. 

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
మద్రాసు భజనసమాజమ్
భావూస్వామి భార్య శ్రీమతి ఆదిలక్ష్మి అమ్మ, వయసు 50 సం. 95, అన్నపిళ్ళై స్ట్రీట్, మద్రాసు
తెలుగు - సాయి దర్బార్

నేను నాభర్త, మా ఇద్దరు అమ్మాయిలతో కలిసి 23, ఆగష్టు, 1915 వ.సంవత్సరంలో షిరిడీ వెళ్ళాము.
మొదటగా మేము నాసిక్ వెళ్ళి అక్కడ లాలారామ ఆలయంలో నర్శింగ్ బువాను సేవించుకొన్నాము.  ఆయన మమ్మల్ని షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకోమని చెప్పారు.


          Shirdi Sai Baba - Shraddha Saburi: Nine Modes of Devotion-Singing ...
షిరిడీలో బాబా వారి దర్బారు చాలా వైభవంగా ఉండటం చూసాము.  నర్తకీమణులు ఎందరో ఆయన సమక్షంలో నాట్యం చేసారు.  హరికధా శ్రవణం కూడా జరిగింది.  కుస్తీపోటీలు మల్లయుధ్ధాలు మొదలయినవన్నీ అక్కడ ప్రదర్శింబడ్డాయి. మసీదు దగ్గర ఎంతోమంది భక్తులు ఎప్పుడూ గుమిగూడుతూ ఉంటారు.  బాబా చావడికి వెళ్ళే సమయంలో వారంతా ఆయనను అనుసరిస్తూ కూడా వెడుతూ ఉంటారు.  మేమక్కడ ఒక నెల, నెలన్నరపాటు ఉన్నాము.

నా భర్తకు మొట్టమొదట్లో బాబా మీద అంతగా నమ్మకం లేదు.  ఆయనకు స్వప్నంలో తాను కాళ్ళు చేతులూ బంధింపబడి ఉన్నట్లు, బాబా తనని ఆ బంధనాలనుండి విడుదల చేసినట్లు కనిపించింది.  అప్పటినుండి నా భర్తకు బాబామీద నమ్మకం ఏర్పడింది.  షిరిడీలో దుకాణదారుడు పంపించిన బర్ఫీని మాకు, అక్కడున్న భక్తులకి బాబా పంచిపెడుతూ ఉండేవారు.  రెండురూపాయల విలువగల బర్ఫీ ప్రతిరోజూ మాకు లభించేది.  మాకు అది అవసరం లేదనిపిస్తూ ఉండేది.  ఒకరోజున బాబా మాకు నాలుగు రూపాయలిచ్చారు.

ఒక్కసారి మాత్రం ఆగష్టు, 30వ.తేదీ, 1915 వ.సంవత్సరంలో నేను బాబాకి నైవేద్యం తయారు చేసి సమర్పించాను. నేను ఎంతో భక్తి, శ్రధ్ధలతో దానిని తయారు చేసాను.  (బాబా నేను తయారు చేసిన వంటకాన్ని స్వీకరిస్తారో లేదో అనే భయం కూడా నామనసులో ఉంది).  ఆభయం వల్ల ప్రసాదం తయారు చేస్తున్నంతసేపూ ఆయన నామాన్నే జపిస్తూ బజ్జి, పాయసం తయారు చేసాను. నేను వాటిని తీసుకువెళ్ళి బాబా ముందర పెట్టాను.  కాని అక్కడే ఉన్న దుర్గాబాయి (బ్రాహ్మణ వితంతువు) నేను పెట్టిన పళ్ళాన్ని బాబాకి దూరంగా ఎక్కడో చివరి వరసలో  పెట్టింది.  

బాబా నెమ్మదిగా నేను తయారుచేసిన వంటకాల దగ్గరకు జరిగి వాటిని తీసుకుని తినసాగారు.  ఎంతో బాగున్నాయని మెచ్చుకుంటూ ఇష్టంగా తిన్నారు.  శ్యామా మొదలయిన వాళ్ళకి కూడా పంచారు.  అందరూ మొత్తం తినేసారు.  నాభక్తిని ఆయన స్వీకరించినందుకు నాకెంతో సంతోషమనిపించింది.  బాబాకి మన మసులో ఉన్న ప్రేమకి స్పందిస్తారు.  మేము షిరిడీనుంచి తిరిగి కాశీకి బయలుదేరేముందు బాబా మాకు రూ.200 – 300 వరకు రైలు చార్జీలు ఇస్తామని చెప్పారు.  కాని మాకు ఆడబ్బు ఇవ్వలేదు.  కాని మా కాశీప్రయాణంలో మేము హార్దా ఘాట్ మీదుగా వెళ్ళాము.  అక్కడ మా యాత్రా ఖర్చులన్నీ భక్తుల ద్వారా లభించాయి.

నా భర్త మా అనుభవాలన్నిటినీ వ్రాసి షిరిడీకి పంపించారు.  వారు నన్ను బౌమాయి అని నా భర్తను బువా అని పిలిచేవారు.  అక్కడ నేను శ్రీమతి తారాబాయి తార్ఖడ్ తో, "నేను ఏదో తప్పుచేసాననే భావంతో బాబా దగ్గరకు వెళ్ళానని" చెప్పాను. “ నేను ఏదో తప్పు చేసాను, ఈ రోజు బాబా నన్ను కొడతారు” అని మనసులో అనుకుంటూ బాబా దగ్గరకు వెళ్లాను.  నేను బాబా పాదాల దగ్గరకు వెళ్లగానే ఆయన నన్ను తిట్టి కాలితో తన్నారు.  మరలా ఆయన నా మసుసును తెలుసుకుని, న్యాయబధ్ధంగానే నేను ఊహించినట్లుగా ఆయన నన్ను శిక్షించారు.

భావూస్వామి (గోవిందస్వామి) మద్రాసు

నేను ఇంకా నేను మద్రాసు ఎలక్ట్రికల్ ట్రామ్ వేస్ లోనే పనిచేస్తున్నాను.  1915వ.సంవత్సరంలో నేను సెలవు పెట్టి నా భార్యా పిల్లలతో కలిసి అన్ని యాత్రా స్థలాలని దర్శించడానికి వెళ్ళాను. 

దక్షిణ కర్నాటకలో ఉన్న రామ్ భువాగారు నాకు గురువుగారు.  అందువల్లనే నన్ను అందరూ భావూస్వామీ అని పిలుస్తారు.

ఆగస్టు, 23వ. తారీకు, 1915 రాక్షస నామ సంవత్సరం 6వ.తారీకు ఆదివారమునాడు మేము ఉదయం 10.30 కి షిరిడీ చేరుకొన్నాము.  మేము బాబా ఎదుట భజన చేసాము.  బాబా మాకు 8 అణాలు ఇచ్చారు.  మాకు ప్రతిరోజు రెండురూపాయల బర్ఫీ, డబ్బు రెండు రూపాయలు లభిస్తూ ఉండేది.  సాధారణంగా మేము బర్ఫీని దుకాణదారునికి రూ.1- 12  అణాలకు అమ్మేస్తూ ఉండేవాళ్ళం.

నేను ఈ విషయాలన్నిటినీ ఒక డైరీలో రాసి ఉంచాను.  సెప్టెంబరు 3వ.తేదీ 1915 లో నేను వ్రాసుకున్న డైరీలోని విషయం… నాకు అధ్భుతమయిన కల వచ్చింది."  ఆకలయొక్క మొత్తం వివరాలన్నీ వ్రాసి ఇమ్మని డా.పిళ్ళేకి ఇచ్చాను.  మేము ప్రతిరోజు బాబా ఎదుట భజన చేసేవాళ్ళము.  ఒక్కొక్కసారి ఆయి ఎదుట భజన చేసేవారము.  మమ్మల్ని అందరూ ఎంతో ప్రశంసించేవారు.  ఆయి మాకు మరాఠీలో వ్రాయబడ్డ బాబా జీవిత చరిత్ర పుస్తకాన్ని ఇచ్చింది.
(సమాప్తం)
(రేపు మరికొన్ని విషయాలు)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
(శ్రీ సాయి సాగరంనుండి వెలికితీసిన ఆణిముత్యాలు 15 వ.భాగం ఈ లింక్
ద్వారా చదవండి.)




Kindly Bookmark and Share it:

2 comments:

Madhavi on August 23, 2020 at 9:40 AM said...

Chala manchi artical.manchi and rare collection.sir

S.V.Swamy on August 23, 2020 at 9:25 PM said...

Sai Ram. Very happy to read the experiences of the devotees who saw Baba and were blessed (being kicked is a great blessing)...

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List