Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, September 10, 2020

ఎండిపోయిన తమలపాకులు – 2 వ.భాగమ్

Posted by tyagaraju on 8:05 AM
       Original Photos of Shirdi Sai BabaZeven dagen Shirdi Sai
                 HD wallpaper: white rose, Flowers, rose - flower, petal, flower head,  nature | Wallpaper Flare

10.09.2020  గురువారమ్
ఓమ్ సాయి  శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబా గారు జీవించి ఉన్నరోజులలో జరిగిన అత్యధ్బుతమయిన లీలను రోజు ప్రచురిస్తున్నాను.  ఇది శ్రీ సాయి లీల ద్వైమాసపత్రిక మేజూన్ 2016 .సంవత్సరంలో ప్రచురింపబడింది.  ఊహించని విధంగా జరిగిన లీలను ఇప్పుడు మనందరం చదివి బాబావారు తన ప్రేమ దయను తన భక్తులపై ఏవిధంగా ప్రసరిస్తూ ఉంటారో గ్రహించుకుందాము.
BABA’S HEMAD గారు వ్రాసిన అనుభవం శ్రీ సాయి లీల 5.సంవత్సరం సంచిక 9 -10 లో ప్రచురితమయింది.  మరాఠీనుండి ఆంగ్లంలోనికి అనువదించిన వారు మీనల్ వినాయక్ దాల్వీ గారు.

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,  హైదరాబాద్
ఎండిపోయిన తమలపాకులు – 2 వ.భాగమ్
నాకు వచ్చిన కల, ఆతరువాత జరిగిన సంఘటనలు, ఏకనాధభాగవతం వినడం, ఇవన్నీ గమనిస్తే ఒకదానికొకటి సంబంధం లేదు.  కాని, ఖచ్చితంగా ఒక సంబంధం మాత్రం ఉంది.  ఎండిపోయిన ఆకుల గురించిన ప్రస్తావన రావడం. దాని గురించే మేమిద్దరం చర్చించుకున్నాము.  సాయిబాబా వాటిని స్వీకరించారన్నదానికి తగిన సమాధానం వేరే రీతిలో వేరే సందర్భంలో రావడం చాలా అధ్బుతమయిన విషయం. 



జరిగిన సంఘటనలన్నీ క్రోడీకరించి గమనించినట్లయితే నాకు వచ్చిన కల, వంద తమలపాకులు అవసరమవడం, అదే సమయంలో అణ్ణాచించనీకర్ గారు రావడం, బాలాసాహెబ్ దేవ్ గారు షిరిడి వెళ్ళి ఎండిన ఆకులను బాబాకు సమర్పించడం, సాయిబాబాగారు వాటిని స్వీకరించడం, తిరిగి వచ్చిన తరువాత మాధవరావుని కలుసుకోవడం, గజ – గౌరీ వ్రతానికి వెళ్ళడం, ప్రసంగంలో ఆకుల గురించిన ప్రస్తావన రావడం, ఈ సంఘటనలన్ని ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి.  ఇవన్నీ తలుచుకోగానే నాకు ఆశ్చర్యంతోపాటు ఎంతో ఆనందం కలిగింది.  బాబా మీద అమితమయిన ప్రేమ జనించింది.  దీని ద్వారా భగవంతుడు తన భక్తులను వారి వయసుతో గాని, వారు సమర్పించేవాటితో గాని నిమిత్తం లేకుండా ప్రేమ కనబరుస్తాడనే సందేశం మనకి బోధించదలచుకున్నాడు.

శ్రీమద్ పరమహంస పరివ్రజాకాచార్య, శ్రీమద్ శంకరాచార్య గారు వ్రాసిన కౌపీన పంచకాన్ని చదువుతున్నపుడు నాకు శ్రీసాయిబాబా వారు తన విధేయ భక్తులకి చేసిన బోధ గుర్తుకు వచ్చింది.

శ్రీ సాయిలీల (4 వ.సం.సంచికలు 11 -12) పత్రికలలో కీ.శే.సఖారామ్ హరి అనబడే బాపూ సాహెబ్ జోగ్ గురించి చదివే ఉంటారు.  కాని ప్రతి విషయాన్ని రాసుకోవడానికి ఏవిధంగాను సాధ్యంకాని ఎన్నో విషయాలను సాయిబాబా వారు చెప్పారు.  అయినప్పటికీ ఆయన చెప్పిన ఉపదేశాలను ఏవయితే మేము రాసుకుని ఉంచుకున్నామో వాటిని మీకందరికీ తెలియచేయాలనే మాప్రయత్నం.
   Bapu Saheb Jog
   (బాపూ సాహెబ్ జోగ్)
ఒకసారి బాబా మసీదులో విశ్రాంతి తీసుకుంటున్నారు.  ఆయన వద్ద భక్తులందరూ కూర్చుని ఉన్నారు.  బాబావారు మంచి ఉల్లాసంగా ఉన్నారు.  అపుడు బాపూసాహెబ్ జోగ్, “బాబా ఇన్ని సంవత్సరాలుగా నేను మీకు ఎంతో భక్తితో సేవ చేసుకుంటున్నాను.  నా ప్రయత్నాలన్నీ ఫలించాయని నాకెపుడు తెలుస్తుంది?  నా సేవకు ప్రతిఫలాన్ని నేనెప్పుడు రుచిచూడగలను?”  అని బాబాని ప్రశ్నించాడు.
సాయిబాబా సమాధానం ---
“నువ్వు కూడా నాలాగే కఫినీ ధరించి ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుతూ ఉండటం నేను చూసినప్పుడు నీ అదృష్టం వైభవంగా వెలుగొందుతుంది.  నీ సేవకు తగ్గ ప్రతిఫలాన్ని నువ్వు రుచి చూడగలవు.  నువ్వు సన్యాసివి అవుతావు.  ఇదే కనక జరిగినపుడు మనమిద్దరం ఆనందంగా ఉంటాము.”

కొన్ని సంవత్సరాల తరువాత బాపూ సాహెబ్ జోగ్ భార్య మరణించింది.  ఆయనకు సంతానం లేదు.  శ్రీసాయిబాబా కూడా మహాసమాధి చెందారు.  ఆ తరువాత బాపూ సాహెబ్ గారికి  ఇక సంసారం గాని, కుటుంబ బరువు బాధ్యతలు  ఏమీ లేకపోవడం వల్ల ఆయన సన్యాసం స్వీకరించారు. ఆయన జబ్బుపడినప్పుడు దానినుంచి ఇక కోలుకునే అవకాశం ఏమీ లేకపోవడం వల్ల సన్యాసి జీవితమే ఆయనకు దిక్కయింది.  ఆయన అంత్యక్రియలు ఒక సన్యాసికి జరిగినట్లుగానే జరిగాయి.  పూర్తి గౌరవలాంఛనాలతో ఆయనను ఖననం చేసారు.  ఒక ఆశ్రమానికి తగిన విధంగా ఆయన సమాధిని నిర్మించారు.

ఇక ముగించేముందుగా చెప్పవలసినది ఏమిటంటే బాబా ఆయన గురించి ఏమని చెప్పారో అది నిజమయింది.  సన్యాసుల జీవిత తత్త్వశాస్త్రంలో చెప్పబడిన విధంగా మోక్షాన్ని పొందిన సన్యాసి వాస్తవంగా అదృష్టవంతుడనే భావించాలి.  సాయిబాబా అసలయిన ఫకీరు.  ఆయనకు ఈ ప్రాపంచిక విషయాలతోను, భౌతిక జీవనంతోను ఎటువంటి బంధమూ లేదు.  షిరిడీలో సాయిబాబాకు సేవ చేసుకుంటున్నపుడు బాపూ సాహెబ్ కు సాయిబాబా స్వయంగా, సన్యాసివేషానికి తగిన కఫనీని ఇచ్చి అనుగ్రహించారు.  బాపూసాహెబ్ ఆ కఫనీని ధరించి సాకోరీకి వచ్చిన తరువాత ఆయన  తన జీవితాంతము ఒక సన్యాసిగానే జీవించారు. ప్రాపంచిక కోరికలన్నిటికీ అతీతంగా జీవించారు.  దేనితోను బంధం పెట్టుకోకుండా జీవించిన వ్యక్తి నిజంగా ఎంతో అదృష్టవంతుడు.
(సమాప్తం)
శ్రీ సాయి సాగరంనుండి వెలికితీసిన ఆణిముత్యాలు 20వ.భాగమ్ ఈ క్రింది లింక్ ద్వారా చదవండి.
http://teluguvarisaidarbar.blogspot.com/2020/09/20.html#more
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List