Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, October 17, 2020

అజ్ఞానులకు కూడా జ్ఞానాన్ని ప్రసాదించగలరు బాబా

Posted by tyagaraju on 8:21 AM

 17.10.2020  శనివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

దసరా శుభాకాంక్షలు

అజ్ఞానులకు కూడా జ్ఞానాన్ని ప్రసాదించగలరు బాబా

జ్ఞాన శూన్యుని చేత కూడా బాబా గ్రంధాలను రాయించగలరు, అనువాదాలను కూడా చేయించగలరని నిరూపించే ఈ బాబా లీలను ఈ రోజు ప్రచురిస్తున్నాను.


శ్రీ సాయి లీల పత్రికలో ప్రచురింపబడిన మరొక లీలను తెలుగులోకి అనువాదం చేసి భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవి గారు పంపించారు.

నిజం చెప్పాలంటే నేను కవిని కాను, రచయితను అంతకన్నా కాను.  కాని మూలమరాఠీ గ్రంధమయిన శ్రీ సాయి సత్ చరిత్రను హిందీ భాషలోకి అనువాదం చెయ్యాలన్న ప్రేరణ నాలో ఎలా కలిగిందో తలచుకుంటే నాకే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

నా చదువు 10.తరగతి వరకే సాగింది.  నాకు 11 సంవత్సరాల వయసులో మానాన్నగారు కాలం చేసారు.  మా పెద్దన్నయ్య, మేము నలుగురం తమ్ముళ్ళం.  మా అన్నయ్య మమ్మల్ని తండ్రిలాగా చూసుకున్నాడు.  మా అన్నయ్య మాకు మంచి సంస్కారం నేర్పాడు.  1970 వ. సంవత్సరం వరకు మాకు సాయిబాబా గురించి తెలీదు.  


ఆయన గురించే తెలియనప్పుడు ఇక నమ్మడమనే ప్రసక్తే రాదు.  మేమంతా ఒకే కుటుంబంలా ఉండి వ్యవసాయం చేసుకునేవాళ్ళం.  మాకు ఒక పొగాకు దుకాణం ఉండేది.  ఆతరువాత మాకు కిరోసిన్ ఏజెన్సీ కూడా వచ్చింది.  వాళ్ళు మేము ఉంటున్న హింగన్ ఘాట్ నుంచి 13 కి.మీ. దూరంలో జాతీయ రహదారి చెక్ పోస్టు వద్ద పెట్రోల్ బంకు పెట్టుకోమని చెప్పారు.  కాని ఇంతలో మరొకరు వచ్చి మాకు కేటాయిస్తున్న ఖాళీ స్థలంలో తాము పెట్రోల్ బంకు పెట్టుకుంటామని మాకు అడ్డం పడ్దారు.  స్థలం తమకే ఇమ్మని అడిగారు.  ఇక బంకు పెట్టుకునే అవకాశం మాకు రాదనే అనుకున్నాము.

అంబాదాస్ అనే సాయి భక్తుడు మాదుకాణానికి వస్తూ ఉంటాడు.  ఒకరోజు అతను మా దుకాణానికి వచ్చినపుడుమీరు సాయిబాబాకు మొక్కుకోండి.  పెట్రోల్ బంకు పెట్టుకోవడానికి ఆస్థలం మీకే వస్తుందిఅని చెప్పాడు.  ముందు మాకు నమ్మకం కుదరలేదు.  కాని, అతను మమ్మల్ని బలవంత పెట్టాడు.  ఇక మేము ఆయన అంతగా చెబుతుంటే అతని మీద నమ్మకం కొద్దీ సాయి సత్ చరిత్ర పారాయణ చేసాము.  దాని ఫలితంగా ఖాళీ స్థలం ఎటువంటి కష్టం లేకుండా మాకే వచ్చింది.

కాలక్రమంలో మేము విడిపోయి ఎవరి వ్యాపారాలు వాళ్ళం పెట్టుకున్నాము.  నేను మోటార్ మెకానిక్ పని ప్రారంభించాను.  నాకు మెకానిక్ పని ఇష్టమే.  ఇపుడు అదే నాకు జీవనాధారమయింది.  అలా మెల్ల మెల్లగా చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేయడం మొదలుపెట్టి కాంటీన్ కుడా నడిపేవాడిని. నా పిల్లలు పెద్దవాళ్ళయారు.  అందరికీ వివాహాలు కూడా చేసాను.  నా భార్య స్వర్గస్థురాలయింది.  నా ఒంటరి జీవితానికి సాయిబాబాయే తోడు నీడగా నిలిచారు.  బాబా ప్రేరణవల్లనేధర్మ’, ‘శ్రీమద్భాగవతం’, పుస్తకాలను రాయగలిగాను.  బాబా గురించిన పుస్తకాలు మంచి సాహిత్య గ్రంధాలు హిందీ భాషలో లేవు.  అన్నీ మరాఠీ, గుజరాతీ భాషలలోనే ఉన్నాయి.  అందువల్లనే హిందీ మాట్లాడేవారి కోసం శ్రీసాయి సత్ చరిత్రను హిందీ భాషలోకి అనువదించాలనే ప్రేరణ బాబా దయవలన నాలో కలిగింది.  నేను శ్రీసాయి సత్ చరిత్ర గుజరాతీ భాషలో ఉన్న గ్రంధాన్ని పారాయణ చేసేవాడిని.  హేమాడ్ పంత్ వ్రాసిన పుస్తకాన్ని ఓవీ నుంచి ఓవీ హిందీలోకి అనువదిద్దామనే భావన కలిగింది.  వెంటనే అనువాదం మొదలుపెట్టాను.  శ్రీ సాయి సత్ చరిత్ర మరాఠీలో ఓవీ నుంచి ఓవీ ఆరంభంలోనే జ్ఞానేశ్వర్ మహరాజ్ ఓవీ ఉంది.  దానిని ఎలా అనువదించాలో నాకు అర్ధం కాలేదు. నాకు బాబా పెద్ద పరీక్ష పెట్టారనుకున్నాను.  అయినా బాబా స్మరణ చేస్తూ అనువాదం చేస్తున్నాను.  ఇంతలో నా కలం ఒక పదం దగ్గర ఆగిపోయింది.  ఆపదంజ్ఞానానలి’.  దానికి హిందీలో చూస్తేజ్ఞాన నలిదా’.  దీనికినలీఅనే పదం ఎలా కుదురుతుంది అని తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చున్నాను.  అలా ఆలోచిస్తూ కళ్ళుమూసుకుని 15 నిమిషాలపాటు ఉండిపోయాను.  ఇక ఏమీ తెలియటల్లేదని అంతటితో ఆపేద్దామనుకున్నాను.  తరవాత నా కంప్యూటర్ ను కట్టేద్దామనుకున్నాను.  కంప్యూటర్ ని కట్టేద్దామనుకునేటంతలో ఆశ్చర్యంగా ఓవి కి అనువాదం అయిపోయి నా కంప్యూటర్ తెర మీద వచ్చేసింది.  (పోతన భాగవతం రచిస్తున్నపుడు అల వైకుంఠపురములో అని ఆతరువాత ఏమని పూరించాలో అంతుపట్టక అక్కడితో ఆపేస్తాడు.  శ్రీరామచంద్రుడే పోతన రూపంలో వచ్చి అలవైకుంటపురంబులో ఆమూల సౌధంబులో అని రాయడం గుర్తుకు వచ్చింది).  మన బాబా కూడా శ్రీరామ చంద్రుడె.  హిందీలో జ్ఞానానలీ అంటే జ్ఞాన కి నలి కాని అది జ్ఞానానల్.  (ఇక్కడ జ్ఞానానల్ అనగా హిందీలొను, గుజరాతీ లోను, మరాఠీలోను మూడు భాషలలో దాని అర్ధం కోసం చాలా శోధించాను.  ఒక్క దీర్ఘం తేడా వచ్చినా, ఒక్క అక్షరం తేడా వచ్చినా వేరు వేరు అర్ధాలు వస్తున్నాయి.  జ్ఞానేశ్వర్ గారు ఏసందర్భంలో తమ ఓ వీ లో ఆపదాన్ని వాడారు, సందర్భం ఏమిటి అన్నది ఎంత వెతికినా కనపడలేదు. రచయిత శ్రీ సాయి సత్ చరిత్ర ఆరంభంలోనే శ్రీ జ్ఞానేశ్వర్ గారి ఓ వీ ఉందని వ్రాయడంతో శ్రీ సాయి సత్ చరిత్ర హిందీ, మరాఠీ, గుజరాతీ పి డి ఎఫ్ లను కూడా పరిశీలించాను.  ఆఖరికి గుజరాతీ లో జ్ఞానా నల్ అనే పదానికి తెలుగులో (గూగుల్ అనువాదం ద్వారా పరిశీలించాను) అనగా ‘జ్ఞాన శూన్యం’ అనే అర్ధం సరిపోతుందని భావిస్తున్నాను.  అనగా జ్ఞాన శూన్యుడినయిన నావంటి వానిచేత ఈ గ్రంధాన్ని హిందీలోకి బాబా అనువాదం చేయించారని రచయిత భావం అయి ఉండవచ్చు.  ఇక శ్రీ సాయి సత్ చరిత్ర మణెమ్మగారు వ్రాసిన పుస్తకం రెండవ అధ్యాయంలో హేమాడ్ పంత్ అన్న మాటలు…”బాబా నా అహంభావాన్ని అణచివేయాలని, నన్ను సన్మానించినట్లు హేమాడ్ పంతు అని పదవినిచ్చారు.  ఏ యోగ్యతా, ఏ జ్ఞానం లేని నాకు (అంజనం వేసి) నా కళ్ళు తెరిపించారు.”  ఏ జ్ఞానం లేని అన్న పదాన్ని శ్రీ హేమాడ్ పంత్ గారు వాడారు.  అనగా గుజరాతీ భాషలో జ్ఞానా నల్ కి ఈ పదం సరిపోతుంది.  కాని హేమాడ్ పంత్ గారు జ్ఞానేశ్వర్ గారి ఓ వీ నే తను రచించిన మరాఠీ గ్రంధంలో ఉపయోగించారని గ్రహించుకున్నాను.  నాకే కాకుండా పాఠకులకు కూడా ఎటువంటి సందేహాలు రాకూడదనే దీనిని నాలుగురోజులుగా ప్రచురించకుండా ఆపాను. కొన్ని కొన్ని పదాలకు నాకు అర్ధం తెలియకపోయినా తెలుసుకుని చదివేవారికి కూడా దాని పూర్తి అర్ధాన్ని చెప్పాలనే నా ఉద్దేశ్యం.   ఈ రోజు దీనికి బాబా కృప వల్ల సరియైన అర్ధం దొరికింది.  ఏ భాషలోనిదయినా సరే ప్రతి పదానికి తెలుగులో కూడా అర్ధం దొరుకుతుంది.  ---  త్యాగరాజు)

  బాబాయే ఆవిధంగా నాకు చూపించారని గ్రహించుకున్నాను.  బాబా కృపవల్ల గ్రంధం మొత్తం హిందీలోకి అనువాదం చేయడం పూర్తయింది.  నాకు వ్యాకరణం సరిగా రాదు.  అది కూడా బాబా తన చమత్కారం చూపించారు.  భావార్ధ శ్రీసాయి సత్ చరిత్రకు మరాఠీలో వ్రాసిన దిలీప్ పవార్ గారు ఒకరోజు నావద్దకు వచ్చారు.  ఆయన వ్రాసిన పుస్తకాన్ని హిందీలోకి ఎవరయినా రాసేవాళ్ళు ఉన్నారా అని అడగటానికి వచ్చారు.  మేమిద్దరం అపరిచితులమే.  నేను హిందీలోకి అనువాదం చేసిన శ్రీసాయి సత్ చరిత్రను పరిశీలించి వ్యాకరణం సరిచేసారు.  ఆయన చాలా సంతోషించారు, కాని ఓవీ లు మూడున్నర చరణాలు ఉంటాయి అని చెప్పి హిందీలో వాటిని సరిదిద్దారు.  శ్రీ దిలీప్ పవార్ సహాయంతో బాబా అనుగ్రహంతో శ్రీసాయి సత్ చరిత్ర హిందీ అనువాదం పూర్తయింది.  ముందుగా జ్ఞానేశ్వర్ మహరాజ్ ఓవీ నుంచి చివర మూడున్నర చరణాల ఓవీల వరకు వ్యాకరణంతో సహా మొత్తం బాబా నాచేత రాయించుకున్నారు.

నా జన్మ ధన్యం చేసారు.

రమేష్ హింగన్ ఘట్

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment